Thursday, 11 July 2019

EKADASI - సర్వ ఏకాదశి-శయన ఏకాదశి-తొలిఏకాదశి విశిష్టత

TOLI -EKADASI సర్వ ఏకాదశి-శయన ఏకాదశి-తొలిఏకాదశి విశిష్టత :

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని TOLI -EKADASI శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి, పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు. 
నిజానికి పంభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతోపాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. 

ఆషాఢమాస తొలి ఏకాదశి TOLI -EKADASI రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. 

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు. 
ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు 

మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు, బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

TOLI -EKADASI తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి.
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి.
* దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.
* ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
* అసత్య మాడరాదు.
* స్త్రీ సాంగత్యం పనికి రాదు.
* కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
*ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
* మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు        సమర్పించి భోజనం చేయాలి.
* అన్నదానం చేయడం చాలా మంచిది.
*ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే "విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక" మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.




Tuesday, 2 July 2019

ఆషాఢ మాసం విశిష్టత : Ashadam Special ఆషాడంపెళ్లైన కొత్త జంటలు తెలుసుకోవలిసిన విషయములు

ఆషాఢ మాసం విశిష్టత : Ashadam Special ఆషాడంపెళ్లైన కొత్త జంటలు తెలుసుకోవలిసిన విషయములు 
ఆషాడ మాసం ఎప్పుడు వస్తుంది :
ఇది సంవత్సరంలో నాలుగో మాసం. పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసంగా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.ఆషాఢమాసంలో గృహనిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మత్స్య పురాణము. ఆషాఢమాసంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ములగ కూర బాగా తినాలి అంటారు. అనపపప్ప వాడాలంటారు.
ఆషాఢశుద్ద పంచమి "ఆషాఢశుద్ధ పంచమ్యాం వచ్చెనె వద్ద గౌతమీ అధవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు." అని గోదావరి తీరవాసుల్లో ఒక చాటూక్తి కలదు. ఆషాఢశుద్ధ పంచమిని తప్పితే ద్వాదశని గౌతమికి వరదనీరు వస్తుందని పై చాటూక్తి భావం.
'ఆడిపదినెటు' అని కావేరీతీరవాసులు ఒక పండుగ చేస్తారు. ఆడిపదినెటు అనగా ఆషాఢమాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయికంగా ఆనాటికి కావేరికి కొత్తనీళ్ళ వస్తాయి. వ్యవసాయపు పనులకు తరుణం అవుతుంది. ఆడి మాసం ఇంచుమించు మన ఆషాఢమాసం,
ఆషాఢశుద్ధ షష్టి స్కందవ్రతము -స్మృతికౌస్తుభం ఈ వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాల చేత పూజించాలి. ఉపవాసం ఉండాలి. జలమును మాత్రం పుచ్చుకోవచ్చు. మరునాడు కుమారస్వామిని దర్శించాలి. శరీరారోగ్యం కలుగుతుంది.
ఆషాఢ శుద్ద ఏకాదశి
ఆషాఢ శుక్ల ఏకాదశికి మహాఏకాదశి' అని పేరని వ్రతోత్సవ చంద్రిక అంటున్నది. గ్రంథాంతరాల్లో ప్రథమైకాదశి అనే నామం కనిపిస్తున్నది. ఏడాదికి ఇరవైనాలుగు, అధికమాసం వచ్చినప్పడు ఇరవై ఆరు ఏకాదశులు ఉంటుండగా ఈ ఒక్క ఏకాదశిని మహాఏకాదశి అనీ, ప్రథమైకాదశి అని గొప్పగా చెప్పడానికి కారణం అరయ తగింది.
తొలి ఏకాదశి ప్రథమైకాదశి అనుసంస్కత నామాన్నిపట్టి తెలుగువారు దీనిని ఆషాఢశుద్ధ అష్టమి, స్మృతికొస్తుభం దుర్గాష్టమీ, పరశురామియాష్ట్రమీ. గదాధరపద్దతి మహిషాసురమర్దనీపూజ, ఆషాఢశుద్ద నవమి ఐంద్రీ దుర్గా పూజా స్మృతి కౌస్తుభం
ఆషాఢ కృష్ణ అమావాస్య దీపపూజ
ఇంటిలో వున్న ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్యపలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీపస్తంభాలు ఆ పలకం మీద వుంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడూలు, మోరుండలు నైవేద్యం పెడతారు. బ్రాహ్మడికి, ముత్తైదువుకి పెట్టుకుంటారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.

ఆషాడంపెళ్లైన కొత్త జంటలు తెలుసుకోవలిసిన విషయములు
పెళ్లైన కొత్త జంటలు ఆషాడంలో ఎందుకు కలిసి ఉండరో తెలుసా?



కోడలు పుట్టింటికి ఎందుకు ?

కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.

ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే,

ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే, గర్భం ధరించి బిడ్డ పుట్టేసరికి చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. అంటే ఎండాకాలం ప్రారంభం.

 ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని

ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.

పుట్టబోయే బిడ్డ మీద వాతావరణ ప్రభావం

ఆషాడంలో మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్ద మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం.

 పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం

పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దల ఆచారంగా పెట్టారు

ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి.

అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.

ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు,

అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే- మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

ఇందులో మరో జిమ్మిక్కు ఏంటంటే ?

ఇంకా ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ మాసంలో పొలం పనులు అప్పుడప్పుడే ప్రారంభమౌతుంటాయి. కాబట్టి, ఈ సమంయలో కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు సరిగా చేయలేరోమోనన్న విషయాన్ని గ్రహించే ఆనాటి పెద్దలు అలా పెట్టుంటారంటారు.

పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి

పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి అర్థం అవుతుందనే అలా చేసుంటారు.

విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది.

జీవితంలో మళ్ళీ ఎప్పుడూ జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూదనే అభిప్రాయం వారికి కలుగజేస్తుంది.

గోరింటాకు

ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట


Monday, 1 July 2019

కోరిన కోరికలు తీర్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి నిజ రూప దర్శనం 01-07-2019 నుండి 17-08-2019

కోరిన  కోరికలు తీర్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి నిజ రూప దర్శనం 40 సంవత్సరములకు ఒక్కసారి దర్శించే అపురూప మహా బాగ్య దర్శనం 01-07-2019 నుండి 17-08-2019 వరుకు మాత్రమే.
కోరిన  కోరికలు తీర్చే 40  ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు
Image may contain: indoor
శ్రీ అత్తి వరదరాజ స్వామి విశేషం
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా ప్రసిద్ధి పొందింది.సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి).
కంచి లో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది.
(కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది)
ఈ ఆలయ౦లో ని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.
పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ గారు దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీవరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తి కి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమం లో తురుష్కులు కంచి పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తి కి హాని కలుగకుండా వుండేందుకై ఆలయం లో ని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట.లోపలికి నీళ్లు చేరని విధం గా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట.
తదనంత కాలం లో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు
అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు.
చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు.
మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమ లో ను దర్శనం ఇస్తారు.
ఉచిత దర్శనం తో పాటు 50రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ టికెట్ తీసుకోవలసి ఉంటుంది.
దర్శన సమయాలు...ఉదయం 6 గం నుండి మద్యాహ్నం 2 గం వరకు
తిరిగి మద్యాహ్నం 3 గ0 నుండి రాత్రి 9 గం వరకు ...
తమిళనాడు లో ని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాలనుండి తిరుపతి,చెన్నై లనుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి .
మీరు చూసి తరించండి.........
ఓం నమో భగవతే వాసుదేవాయ
అందరూ దర్శించుకునేందుకు దయచేసి షేర్ చేయండి
ఇట్లు
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యలం
విశాఖపట్నం -9704840400.

02-07-2019 సూర్య గ్రహణం ఏ ఏ దేశములలో ప్రభావం ఉండును?

02-07-2019 సూర్య గ్రహణం ఏ ఏ దేశములలో ప్రభావం ఉండును?

జూలై 2వ తేదీన ఏర్ప‌డ‌నున్న సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణం మ‌న దేశంలో మాత్రం కనిపించ‌దు. ఎందుకంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.25 గంట‌ల‌కు మ‌న దేశంలో సూర్య గ్ర‌హ‌ణం ప్రారంభ‌మ‌వుతుంది.
సూర్యునికి, భూమికి మ‌ధ్య‌లో చంద్రుడు అడ్డుగా వ‌చ్చిన‌ప్పుడు సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ గ్ర‌హ‌ణాలు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ వ‌చ్చేవి పాక్షిక గ్ర‌హణాలే. సంపూర్ణ గ్ర‌హణాలు చాలా సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి గానీ రావు. ఈ క్ర‌మంలోనే జూలై 2వ తేదీన సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంది. అయితే అది ప్ర‌పంచంలోని ఏయే దేశాల్లో క‌నిపిస్తుందంటే…


జూలై 2వ తేదీన ఏర్ప‌డ‌నున్న సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణం మ‌న దేశంలో మాత్రం కనిపించ‌దు. ఎందుకంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.25 గంట‌ల‌కు మ‌న దేశంలో సూర్య గ్ర‌హ‌ణం ప్రారంభ‌మ‌వుతుంది. ఆ స‌మ‌యంలో ఎలాగూ చీక‌టి ఉంటుంది క‌నుక‌.. మ‌నకు గ్ర‌హ‌ణం క‌నిపించ‌దు. కానీ మ‌న‌కు వ్య‌తిరేక దిశలో భూమిపై ఉన్న దేశాల్లో ఈ గ్ర‌హణాన్ని వీక్షించ‌వ‌చ్చు,

కాగా ఈ సంపూర్ణ సూర్య గ్ర‌హణాన్ని చిలీ, అర్జెంటీనాల్లోని కొన్ని ప్రాంతాల్లో, ప‌సిఫిక్, ద‌క్షిణ అమెరికా, ఈక్వెడార్‌, బ్రెజిల్‌, ఉరుగ్వే, ప‌రాగ్వేల‌లోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించ‌వ‌చ్చు. అయితే మ‌న దేశంలో డిసెంబ‌ర్ 2020న ఏర్ప‌డ‌నున్న సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణాన్ని మ‌నం వీక్షించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.