Sunday 30 June 2019

మీకు ఏ సమస్య ఉన్న ఒకే ఒక పరిష్కారం మాస శివరాత్రి శివాభిషేకం

మీకు ఏ సమస్య ఉన్న ఒకే ఒక పరిష్కారం మాస శివరాత్రి శివాభిషేకం 


మీకు ఏ సమస్య ఉన్న తక్షణమే పరిష్కారం కొరకు ఈ పరిహారం మీకోసమే , మాస శివరాత్రి రోజు  సూర్యోదయం మేల్కొని తల స్నానం చేసుకొనిమాస శివరాత్రి రోజు ఉపవాసం వుండి " ఓం నమశివాయ " అనే శివ పంచాక్షరి మంత్రం జపించి సూర్య అస్తమం పిదప మీ సమస్యను బట్టి ఈ క్రింది ద్రవ్యములలో మహా శివుని అభిషేకం చేసుకున్నయెడల ఏ సమస్య వున్నా సిగ్రమే పరిష్కారం లభించును.
మాస శివరాత్రి రోజు శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు వచ్చునో తెలుసుకుందాము..
Image result for lord siva abhishekam ANIMATED IMAGES

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు
లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు
లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత
కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది
(మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము
ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది
అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19.ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20.నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22.నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23.మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24.పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు
జరుగ గలవు.

ఆస్సలు మాస శివరాత్రి అంటే ఏమిటి  ?

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
మనోభీష్టాలు నెరవేర్చే మాస శివరాత్రి
పరమ శివుడికి ‘మాసశివరాత్రి’ అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, కోరిక కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి … పూజా మందిరాన్ని అలంకరించి … సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఉపవాస దీక్షను స్వీకరించి ‘ప్రదోష కాలం’లో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అభిషేకం అనంతరం స్వామివారిని బిల్వదళాలతో అర్చించాలి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీ మంచిది. ప్రదోష కాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట.
ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది. లక్ష్మీదేవి పాటపాడుతూ వుండగా, పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా, సరస్వతీదేవి వీణను మీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ వుంటారు.
ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా … ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ … మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందువలన మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలను పాటిస్తూ, ప్రదోష కాలంలో సదాశివుడిని ఆరాధించాలి. అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి.

Monday 17 June 2019

Astrology Remedy's for Getting Own House

female mature stars along with astrology result ( ఆడపిల్ల ఏ ఏ నక్షత్రములలో పుష్పవతి అయితే ఎటువంటి ఫలితములు ఉండును పుష్పవతి


 ఆడపిల్ల ఏ ఏ నక్షత్రములలో పుష్పవతి అయితే ఎటువంటి ఫలితములు ఉండును  పుష్పవతి :
               female mature stars along with astrology result :



ఆడపిల్ల పుష్పవతి అవ్వగానే నక్షత్రం చూసుకుంటారు. ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో మంచి చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. నక్షత్రం మంచిది కాకపోయినా, ఆశుభామైనా చింతించాల్సిన పనిలేదు. తగు విధంగా పూజలు చేయిస్తే గ్రహణం విడిచినట్లు దోషం పోతుంది. 


అశ్విని నక్షత్రం - అపారమైన దు:ఖాలు
భరణి నక్షత్రం - సంతానమంతా ఆడపిల్లలే 
కృతిక నక్షత్రం - మహా దరిద్రము 
రోహిణి నక్షత్రం - చక్కటి దంపత్యము 
మృగశిర నక్షత్రం - అన్యోన్యమైన సుఖసంసారం
అర్ర్ధ నక్సత్రం - పుత్ర సంతానం 
పునర్వసు నక్షత్రం - దుఖమైన జీవితము 
పుష్యమీ నక్సత్రం - కుటుంబానికి వేదన 
ఆశ్లేష నక్షత్రం - సకల శుభములు 
మఘ నక్షత్రం - భర్తకి దూరమవ్వటము 
పుబ్బ నక్షత్రం - మగ సంతానం 
ఉత్తర పల్గుని నక్షత్రం - బాగా చూసుకునే పుత్రుడు
హస్త నక్షత్రం - అఖండ అదృష్టము 
చిత్త నక్షత్రము - చక్కటి జీవితము
స్వాతి నక్షత్రం - భర్త ప్రేమ అపారంగా పొందుతుంది.
విశాఖ నక్షత్రము - నలుగురు ఈర్ష్య పడే దాంపత్యము
అనురాధ నక్షత్రం - రోగాలమయము 
జ్యేష్ఠ నక్షత్రము - ధన నష్టం, చపల చిత్తము 
మూల నక్షత్రం - ఈతి బాధలు , ఆరోగ్య బాధ 
పూర్వాషాడ నక్షత్రం - కుటుంబానికి ఆవేదన 
ఉత్తరాషాడ నక్షత్రం - సంతోషకర జీవితము
శ్రవణా నక్షత్రం - అధ్కర ఆనందము 
ధనిష్ఠ నక్షత్రము - ఆయురారోగ్యములు 
శతబిషం- ఆకలి భాధలు
పూర్వాబాద్రపదం - శక్తి లేకపోవటము 
ఉత్తర భాద్రపదం - పదిమంది మెచ్చుకునే జీవితము 
రేవతి నక్షత్రం - సకల్ శుభములు.

మీ పిల్లలు చదువు పట్ల ఏకాగ్రత పెరగాలంటే ఏమి చెయ్యాలి ?

Tuesday 11 June 2019

దశపాపహర దశమి అనగా ఏమిటి ఆ రోజు రోజున ఏం చేయాలి ?

దశపాపహర దశమి అనగా ఏమిటి ఆ రోజు రోజున ఏం చేయాలి ?

Image result for దశపాపహర దశమి

దశపాపహర దశమి శ్లోకం :

" జ్యేష్టమాసి, సితేపక్షే,
దశమ్యాం, బుధ హస్తయో,
వ్యతీపాతే, గరానందే,
కన్యాచంద్రే, వృషౌరవౌ|| "


జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము,హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని జ్యోతిష్యా  శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు.
ఇక దశవిధ పాపములు :-
1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,

2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,

3. పర స్త్రీని కలవడం - ఇవి మూడు శరీరం తో చేసేవి.

4. పరుషము, 5. అసత్యము, 6.కొండెములు, 7. అసంబద్దమైన మాటలు - ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.

8. ఇతరుల ధనములందు కోరిక,

9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,

10. వ్యర్ధమైన అహంకారము - ఇవి మూడూ మానసికంగా చేసేవి.ఇవే 

పదిరకాలైన పాపాలు.

      ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.
      ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.
       అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు చెప్పారు. వాటిని ఆచరించడమూ, ఆచరించకపోవడమూ మాత్రం మన చేతిలో వుంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో, వద్దంటుందో ఆ సింగినాదం అంటూ వదిలివేస్తుందో చూడాలి, ఏది ఎలా వున్నా దశాపాపహర దశమి మాత్రం మంచి పర్వదినమే .
      శరీరానింకి అంటిన ఎలాంటి మురికైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలూ పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి, గంగాదేవిని ఆరాధించి సేవించవలసిందే.
      మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయుటకు సృష్టికర్త అయిన బ్రహ్మ చేతి కమందలమునండు మాత్రమె వుండేది. గంగ, వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి మూడడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగటానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణుపాదోదకమై ఆ తరువాత కైలాస వాసి శంభుని జటయందు చేరి ఓ అలంకరణగా మిగిలివుంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నముతో భూమిపైకి దిగి " భాగీరథి " అను పేరుతొ వందల కొద్దీ యోజనముల మేర ప్రవహించుచూ మనకు కనిపిస్తూవున్నది. 
       అదే పరమపావని గంగ. లోపలి, బయటి పాపములను కడిగివేసే ఆ తల్లే సర్వ భూతములనూ రక్షిస్తూవున్నది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలూ చెప్పారు. కల్మష నాశిని, కలుష హారిణి అయిన గంగను ' ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయన్యై, రేవత్యై, శివాయై, దక్షయై, అమృతాయై, విశ్వరూపిన్యై, నందిన్యైతే నమో నమః " అంటూ  జ్ఞాన ఐశ్యర్యాది షడ్గుణవతియు, దశవిధ పాపముల హరిన్చునదియు, నారాయణ మూర్తి పాదముల నుండి పుట్టినదియు, రేవతియు, శివయు, దక్షయు, అమ్రుతయు, విశ్వరూపిణియు, నందినియూ, అగు గంగాదేవికి నమస్కారము. అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పధ్ధతి. 
   జీవనాధారమూ, ప్రాణాధారమూ, అయిన గంగ లేకుండా ఏదీ జరగదూ,ఉండదూ.
    అందుకే దశయోగ పర్వదినాన దశపాపహరయైన గంగను ఆరాధించడం ఆచారం.ఓ చిన్నప్రతి మయందు గానీ చెంబులోని తీర్ధమందు( కలశమందు గానీ ) గంగాదేవిని ఆవాహనము చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్టశుక్ల దశమి, ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యధావిధిగా స్తోత్రం చేసినవారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములూ ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది.
నందినీ నళినీ
సీతామాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ త్రిపధగామినీ
భాగీరథీ భోగవతీ
జాహ్నవీ త్రిదశేశ్వరీ
అంటూ గంగమ్మతల్లి పన్నెండు పేర్లనూ తలుస్తూ పదిమార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే  పదిమార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్లనూవులు, పేలాలపిండి, బెల్లము చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలూ మూడూ విదాలైనవీ, శరీరంతో చేసిన మూడూ విధాలైన పాపాలూ, నోటి మాటతో చేసిన మూడూ రకాలైన పాపాలూ ( మొత్తం పది ) నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. 
     అలాగే పదిమంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ తాంబూలాలతో దానం చేయడం, గోదానం చేయలేక పోయినా చిన్న చిన్న ఆవు బొమ్మ దానం అయినా చేయాలి.
మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాలవిశేషం దశపాపహర  పర్వదినం.

దశపాపహర దశమి రోజున ఏం చేయాలి ?
నిత్య జీవితంలో తెలిసీ తెలియక చేసిన కొన్ని పాపాలు, భవిష్యత్తులో తగిన ఫలితాలను ఇవ్వడం కోసం ఖాతాలో చేరిపోతుంటాయి. పాపల భారాన్ని మోయడం ... వాటి ఫలితాలను అనుభవించడం సామాన్యమైన విషయం కాదు. కొత్తగా పుణ్యకార్యాలను ప్రారంభించినంత మాత్రాన, అంతకు పూర్వం చేసిన పాపాలు చెరిగిపోవు ... తరిగిపోవు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా ? తప్పని సరిగా వాటి ఫలితాలను అనుభవించవలసిందేనా ? అనే సందేహంతో పాటు ఆవేదన కూడా కలుగుతుంటుంది. అలాంటి వారికి దైవం ప్రసాదించిన వరంగా 'దశపాపహర దశమి' కనిపిస్తుంది. 'జ్యేష్ఠ శుద్ధ దశమి' రోజునే, 'దశాపాపహర దశమి'గా చెబుతుంటారు. భూమిపై జలదేవతగా గంగావతరణ జరిగింది ఈ రోజునే.
ఈ శుభదినాన గంగానదిలో స్నానమాచరించి గంగాదేవిని పూజించడం వలన, పదిరకాల పాపాలను హరిస్తుందని అంటారు. ఈ కారణంగానే దీనికి దశపాపహర దశమి అనే పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని 'గంగోత్పత్తి' అనీ ... 'గంగోత్సవం' అని పిలుస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే గంగానదిలో స్నానం చేయాలి. లేదంటే చెరువు నీటిని ... బావి నీటిని గంగ నీరుగా భావన చేసుకుని స్నానం చేయాలి.
ఈ సమయంలో ''మమ ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే'' అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత గంగాదేవి ప్రతిమను గానీ ... చిత్రపటాన్ని గాని అలంకరించి షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ పూజలో పది రకాల పూలను ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే పది రకాల ఫలాలను ... పది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవలసి వుంటుంది.
గంగాదేవికి పేలాల పిండితో చేసిన వంటకాలు చాలా ఇష్టమని అంటారు. అందువలన ఈ రోజున పేలాలతో చేసిన పదార్థాలను ప్రవాహంలో వదులుతుంటారు. ఈ విధంగా గంగాదేవిని ఆమె అవతరణ సందర్భంగా పూజించడం వలన, పదిరకాల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Sunday 9 June 2019

అశ్వత్ధ వృక్షం -రావి చెట్టు పూజ విధానం

  అశ్వత్ధ వృక్ష పూజ విశిష్టత : 

(అశ్వత్ధ వృక్షం / రావి చెట్టు) : 
Image may contain: one or more people


అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:

మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.

ప్రదక్షణ మరియు పూజించు విధానము :
శనివారం మాత్రమే అశ్వర్ద్ వృక్షం తాకావలెను,ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి

అశ్వత్ధవృక్ష స్తోత్రం
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.

అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :
అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.

అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం
కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధనచేసిన ఫలితముంటుంది. గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడ లో స్నానమాచరించిన మహాపాపములు తొలగును. అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్నిఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.

భార్యభర్తల మద్య గొడవలు తొలగి ఇదివరకు లా తిరిగి సంతోషంగా జీవించుటకు ఈ పరి...

మీకు వెంటనే ఉద్యోగం కావాలనుకుంటే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ? job పక్క ...

వైద్యంతో తగ్గని ఎటువంటి మొండి రోగాములైన సరళంగా నయం చేసే జ్యోతిష్య రిత్య ...

వ్యాపారం లో నష్టాలు తొలగి లాభాలు పొందుటకు ఏ పరిహారం చెయ్యవలెను

వ్యవసాయం లో పంటలు బాగా పండి రైతు అన్నలకు అధిక ఫలసాయం లభించుటకు ఏమి చెయ్యాలి

ప్రేమ ఫలించుటకు ఏ పరిహారం చెయ్యవలెను ?

Tuesday 4 June 2019

ఆలస్య వివాహం ,వివాహ - దాపత్య - జీవితంలో సమస్యల నివారణకు - కుజదోష నివారణ - సంతాన యోగ్యత కొరకు కాత్యాయని మాత మంత్ర ఆరాధనా విధానం :


ఆలస్య వివాహం ,వివాహ -దాపత్య -  జీవితంలో సమస్యల నివారణకు - కుజదోష నివారణ - సంతాన యోగ్యత కొరకు కాత్యాయని మాత మంత్ర ఆరాధనా విధానం 
  Worship Goddess Katyayani For Marriage-related Problems

జాతకునికి సప్తమ స్థానం లో చెడు గ్రహములు ఉన్న లేక  ద్వికాళాత్ర యోగం వున్నా , లేక భార్య భర్తల ఇరువురి జాతకములలో ఎవరో ఒకరికి కుజ దోషం ఉన్న ,లేక సప్తమ ఆదిపతి బలహీన పడిన వివాహ జీవితం లో సమస్యలు ఎదురు అవ్వును,వివాహ జీవితం లో దోషాలు తొలగిపోవాలంటే కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠిoచిన యెడల దాంపత్య దోషాలు పఠించాలని విష్ణు పురాణo చెప్పుతున్నది. వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని ఈ మంత్రాన్ని జపించుట ద్వార సమస్యలు  తొలగిపోవును, వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 41 రోజుల పాటు నిష్ఠతో పఠించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దాంపత్యం పండుతుంది.

దంపతుల మధ్య అన్యోన్యత కు  కాత్యాయని మంత్రాన్ని పఠించిన వారికి సకల భోగభాగ్యాలు చేకూరుతాయి. వివాహ అడ్డంకులను తొలగించేందుకు కాత్యాయని మంత్ర పఠనం చేయాలని భాగవతం చెప్తోంది. 

కాత్యాయని దేవి నిష్ఠతో పూజించి విష్ణువును భర్తగా పొందింది. అందుకే ఆ అమ్మవారినికి పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి. నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. అలాగే సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది. 
Image result for కాత్యాయని మంత్రం

''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి 
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః 
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర 
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే 
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 
       41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

నవగ్రహ దోష నివారణకు - వివిధ సమస్యలకు పరిష్కార మార్గం గా చూపబడే కాత్యాయనీ మాత మంత్రములు 

* 1. ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం : 

ఓం కాత్యాయనీ మహామయే,                 
మహాయోగిన్యాధీశ్వరీ ! నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!

* 2. వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం : 

హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా ! 
తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!

*3. వివాహ సమస్యల నుండి బయట పడేందుకు : 

హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ ! 
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!

* 4. ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :

 ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
 వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

* 5. కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం : 

ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని ! 
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

*6. మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం : 

ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ ! 
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!