Tuesday, 4 June 2019

ఆలస్య వివాహం ,వివాహ - దాపత్య - జీవితంలో సమస్యల నివారణకు - కుజదోష నివారణ - సంతాన యోగ్యత కొరకు కాత్యాయని మాత మంత్ర ఆరాధనా విధానం :


ఆలస్య వివాహం ,వివాహ -దాపత్య -  జీవితంలో సమస్యల నివారణకు - కుజదోష నివారణ - సంతాన యోగ్యత కొరకు కాత్యాయని మాత మంత్ర ఆరాధనా విధానం 
  Worship Goddess Katyayani For Marriage-related Problems

జాతకునికి సప్తమ స్థానం లో చెడు గ్రహములు ఉన్న లేక  ద్వికాళాత్ర యోగం వున్నా , లేక భార్య భర్తల ఇరువురి జాతకములలో ఎవరో ఒకరికి కుజ దోషం ఉన్న ,లేక సప్తమ ఆదిపతి బలహీన పడిన వివాహ జీవితం లో సమస్యలు ఎదురు అవ్వును,వివాహ జీవితం లో దోషాలు తొలగిపోవాలంటే కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠిoచిన యెడల దాంపత్య దోషాలు పఠించాలని విష్ణు పురాణo చెప్పుతున్నది. వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని ఈ మంత్రాన్ని జపించుట ద్వార సమస్యలు  తొలగిపోవును, వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 41 రోజుల పాటు నిష్ఠతో పఠించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దాంపత్యం పండుతుంది.

దంపతుల మధ్య అన్యోన్యత కు  కాత్యాయని మంత్రాన్ని పఠించిన వారికి సకల భోగభాగ్యాలు చేకూరుతాయి. వివాహ అడ్డంకులను తొలగించేందుకు కాత్యాయని మంత్ర పఠనం చేయాలని భాగవతం చెప్తోంది. 

కాత్యాయని దేవి నిష్ఠతో పూజించి విష్ణువును భర్తగా పొందింది. అందుకే ఆ అమ్మవారినికి పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి. నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. అలాగే సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది. 
Image result for కాత్యాయని మంత్రం

''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి 
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః 
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర 
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే 
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 
       41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

నవగ్రహ దోష నివారణకు - వివిధ సమస్యలకు పరిష్కార మార్గం గా చూపబడే కాత్యాయనీ మాత మంత్రములు 

* 1. ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం : 

ఓం కాత్యాయనీ మహామయే,                 
మహాయోగిన్యాధీశ్వరీ ! నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!

* 2. వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం : 

హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా ! 
తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!

*3. వివాహ సమస్యల నుండి బయట పడేందుకు : 

హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ ! 
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!

* 4. ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :

 ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
 వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

* 5. కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం : 

ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని ! 
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!

*6. మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం : 

ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ ! 
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!







No comments:

Post a Comment