Wednesday, 29 May 2019

గోచార రిత్య రవి ని అనుసరిస్తూ వాస్తు కర్తరీ పరిశీలించుట ఎలా ? కర్తరీ సమయంలో ఏం చేయాలి ?

 గోచార రిత్య రవి ని అనుసరిస్తూ వాస్తు కర్తరీ పరిశీలించుట ఎలా ?  కర్తరీ సమయంలో ఏం చేయాలి ?
Image result for sun with stars


గోచార రిత్య కర్తరీ నిర్ణయం సూర్యుడు భరణీ నక్షత్రం మూడవ పాదము నందు ప్రవేశించు కాలమే డోల్లుకర్తరీ ప్రారంభమగును.దీనినే చిన్న కర్తరీ అని కుడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం నందు ప్రవేశించు కాలమే నిజ కర్తరీ ప్రారంభం అవుతుంది.సూర్యుడు రోహిణీ నక్షత్రం రెండవ పాదం నందు ప్రవేశించు కాలమే కర్తరీ త్యాగం జరుగుతుంది. ఈ కర్తరీ దినములలో వాస్తు సంబంధమైన నూతన గృహా ఆరంభ ,గ్రహ ప్రవేశాదులు చేయరాదు.అందుకే కొందరు పెద్దలు దీనిని వాస్తు కర్తరీ అని కుడా అంటారు.


గోచారిత్య కర్తరీ సమయంలో చేయదగిన కార్యములు :- సూర్యుడు భరణి ,కృత్తిక నక్షత్రము నందు ఉండు కాలంలో వివాహాలు ,యజ్ఞము,మందపాదులు కట్టుట మున్నగునవి చేయవచ్చును. 

గోచారిత్య కర్తరీ సమయంలో కర్తరీలో చేయకూడని కార్యములు :- 
కర్తరీలో శంఖుస్థాపన,ద్వారములు పెట్టుకునుట,ఇంటి పై కప్పులు స్లాబ్లు వేయుట చేయరాదు,వీటితో పాటు చెట్లు నరుకుట ,విత్తనములు వేయుట ,భూమిని తవ్వుట,కొత్త గ్రామములు కట్టుట,క్షౌరం (కటింగ్ ) చేయించుకునుట,తోటలు వేయుట ,చెరువులు,బావులు తవ్వుట ,కొత్త బండి ఎక్కుట మొదలగు కార్యములు చేయరాదు. 
2019 శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్తరీ నిర్ణయం సూర్యుడు

5-మే -2019 ఉదయం 5 :10 నిమిషాలకు వికారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం రోజు డొల్లు కర్తరీ ప్రారంభం అవుతుంది. 11 మే 2019 రాత్రి 3 :15 నిమిషాలకు వికారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శనివారం సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించుట చేత నిజ కర్తరీ ప్రారంభం అవుతుంది.శనివారం 25 మే 2019 రోజున నిజకర్తరీ త్యాగం జరుగుతుంది. 29 మే 2019 బుధవారం కృష్ణపక్ష దశమి రోజు పగలు 12 :15 నిమిషాలకు సూర్యుడు రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించుట ద్వారా కర్తరీ త్యాగం జరుగుతుంది.

No comments:

Post a Comment