Thursday 21 May 2020

ఉపనయనం-యజ్ఞోపవీత మహిమ :

ఉపనయనం-యజ్ఞోపవీత మహిమ : 

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జెందెం’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.
Image may contain: 1 person
యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరి6చాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ!

Saturday 9 May 2020

సకల కార్య సిద్ధి కొరకు సంకష్టహర చతుర్థీ వ్రతము

పసుపు గణపతి పూజ :
శ్రీ గురుభ్యోనమః
ఏపూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.
పూజా ప్రారంభం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)
శ్లో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో – ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)
దీపం
ఓం గురుభ్యో నమః
దీపమును వెలిగించి – గంధ పుష్పాదులతో అలంకరించి – దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
ఆచమన కేశవ నామములు
ఓం కేశవాయ స్వాహా (అనుచు – జలపానము చేయవలెను)
ఓం నారాయణాయ స్వాహా (అనుచు – జలపానము చేయవలెను)
ఓం మాధవాయ స్వాహా (అనుచు – జలపానము చేయవలెను)
ఓం గోవిందాయ నమః (అనుచు – ఎడమ చేతిని కుడి అరచేతితోను)
ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం హ్ఋషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)<
ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
ఓం శ్రీకృష్ణాయ నమః.
భూతోచ్చాటనము
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివి – అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.
అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః , ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను
సంకల్పము
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన, యావచ్చక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే…
అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశపూజ
ప్రధాన వ్యాసము: కలశపూజ
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని
తదంగ కలశ పూజాం కరిష్యే…
శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.
శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ధ్యాయామి – ధ్యానం సమర్పయామి. (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు సమర్పించవలెను)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి – కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి – కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి – వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- శ్రీ గంధాం ధారయామి – (గంధం సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీ మహా గణాధిపతి యై నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు – బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా– ఓం అపానాయ స్వాహా — ఓం వ్యానాయ స్వాహా — ఓం ఉదానాయ స్వాహా — ఓం సమానాయ స్వాహా –ఓం పరబ్రహ్మణే నమః — అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- తాంబూలం సమర్పయామి – తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).
అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ – శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.
ఓం శ్రీమహా గణాధిపతి యై నమః :- (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ ) కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి
ఉద్వాసన
‘ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి , ప్రధ మాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః
శ్లో॥ యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ భగవా న్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు.
శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి. నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును (అనగా అక్షతలు మాత్రమే) స్వీకరించ వలెను.
ఆతరువాత మరల ఆచమనం చేసి చేయదలుచుకున్న వ్రతం గాని, పూజ కానీ ప్రారంభించ వలెను.
సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :
సంకటాలు ఉన్నపుడు , వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తేలవరుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటె అభిషేకం చేసుకోవచు (గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం ).
గుడిలో పూజ చేసుకోవచు . లేదా ఇంట్లో నే గణపతి పటానికి గణపతి స్తోత్రాలు , గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం , వీలయితె గణపతి మంత్రాని “ఓం గం గణపతయే నమః” అనే నామని జపించుకోవాచు.
చవితి రోజు చంద్రుడు కనిపించక పోతే?
గరిక , ఎర్రని గన్నేరు పూలు , ఎర్రని మంధర పూలు , ఎర్రని గులాబీలు , ఎర్రని రక్త చందనం పెట్టి గణపతి కి పూజ చేయాలి . తెల్ల జిలెడు పూలతో పూజ చేస్తే మహా విశేషం. మోదకం , లడ్లు నైవేద్యం చేసి చద్రుడికి కూడా నివేదన చేసి , చంద్రుడికి కూడా నమస్కారం పెట్టి , ఎవరికైనా నైవేద్యం లేదా భోజనం పెట్టి వాలు తినాలి . నిష్ఠ గ చేయాలి అనుకునే వారు ఇంకా అ రోజు కి ఉపహారం చేసి మర్నాడు దీపం పెట్టి అప్పుడు తినాలి . ఉండలేని వాలు ఇంకా చవితి రోజే చంద్రోదయం పూజ అయిన తరువాత తినే య వచ్చు. ఆకాశం వంక చూసి చంద్రుడిని , విగ్నేస్వరుడ్ని తలచుకుని నమస్కరించి వ్రతం నిష్క్రమించవచ్చు.
సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

Monday 4 May 2020

జాతక చక్రంలో ప్రేమ వివాహ సూచనలు ( LOVE MARRIAGE IN ASTROLOGY )

జాతక చక్రంలో ప్రేమ వివాహ సూచనలు ( LOVE MARRIAGE IN ASTROLOGY )

      జాతక చక్రంలో ప్రేమను ఐదవభావం, వివాహన్ని ఏడవ భావం సూచిస్తాయి. ఈ రెండు భావాధిపతుల పరివర్తన, లేదా పరస్పర వీక్షణ లేద ఇద్దరూ ఒకే భావంలో కలిసి ఉన్నా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తింది.

*****

జాతక చక్రంలో ప్రేమను సూచించే గ్రహం శుక్రుడు. పంచమభావం జాతకుని యొక్క ప్రేమను, సరదాను ( Fun ) సూచిస్తుంది. శుక్రుడు ప్రథానంగా పంచమ గృహంలో ఉంటే ప్రేమ వివాహం అనిచెప్పవచ్చు. ఐదు, రెండు, ఏడు, పదకొండు గృహాలలో శుక్ర స్థితి ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. శుక్రుడు ఏ భావంలో ఉన్నాడన్నది ప్రథానం కాదు. ఏభావంలో ఉన్నా కుజ సంబంధం ఉంటె ప్రేమకు ఆస్కారం ఉంది.

కుజుడు అంటే కోరిక ( Passion ), శుక్రుడు అంటే ప్రేమ. ఈరెండిటి కలయిక కాముకతను సూచిస్తుంది. కుజుడు శుక్రునితో కలిసి ఉన్నా ( conjunction ) , కుజుని 4, 7 వ దృష్టి ( aspect ) శుక్రుని పై పడి వీరిద్దరిలో ఒకరికి సప్తమ భావంతో గానీ, భావాధిపతితోగానీ సంబంధం ఉంటే ప్రేమ వివాహం ఉందని చెప్పవచ్చు. కుజుని 8వ దృష్టి పనికిరాదు. ప్రేమ లో విడిపోవడాన్ని సూచిస్తుంది.

శుక్రునితో చంద్రుడు కలిసి ఉన్నా కూడా ప్రెమ వ్యవహారం ఉందని గుర్తించాలి. ముఖ్యంగా ఐదు, పదకొండు భావాలలో కనుక వీరిద్దరూ కలిసి ఉంటే అది తప్పక ప్రేమవివాహానికి దారితీస్తుంది. పదకొండభావం మీపరిచయాలు, స్నేహితులు, సరదా మొదలైనవాటిని గురించి తెలుపుతుంది. కనుక ఇందులో శుక్ర, చంద్ర కలయిక ద్వారా మీ స్నేహితులలోనే ఒకరు జీవితభాగస్వామి కావడాన్ని కూడా సూచించ వచ్చు.జాతక చక్రంలో చంద్రుని నుండి ఐదు, ఏడు భావలలో శుక్రుడు ఉన్నాకూడా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.


కుజ, శుక్ర కలయిక అంశచక్రంలో (D-9 చార్ట్ లో) ఉన్నదేమో కూడా పరిశీలించాలి. ఇదికూడా ప్రేమవివాహాన్ని తెలుపుతుంది. కుజ, శుక్ర కలయిక విడాకులకు దారితీస్తుంది అనుకుంటే అది పొరపాటు. అటువంటి పనిచేసేది శుక్ర, రవి గ్రహాల కలయిక


*****

పై గ్రహస్థితులు ఉన్నప్పటికీ శని దృష్టి ఆయా భావాలకు, గ్రహాలకు కలిగినచో అది వివాహం వరకు దారితీయదు.అలాగే ష్టష్టమ స్థానాధిపతి సంబంధం ఉన్నా, షష్టమంలో ఆయా గ్రహాలు పడినా అది ప్రెమికులిద్దరూ విడిపోవడాన్ని, గొడవలు పడడాన్ని సూచిస్తుంది. ఆరవ భావంలో ఉన్న గ్రహం దృష్టి సోకినా కూడా అది సంభవిస్తుంది. ఇదేవిధంగా అష్టమ, వ్యయ స్థానాల నుండి గూడా గ్రహించాలి. ఆయా స్థాలతో, స్థానాధిపతులతో, ఆస్థానాలలో ఉన్నగ్రహాలతో శుక్ర,కుజులకు, పంచమ,సప్తమాలకు ఉన్న సంబంధంకూడా ప్రేమ వ్యవహారంలో విభేధాలను సూచిస్తాయి. శుక్ర శని గ్రహాల కలయిక ఒకటికంటె ఎక్కువ ప్రెమ వ్యవహారాలను, సంబంధం బెడిసికొట్టడాన్ని కూడా తెలుపుతుంది.  రాహు, శుక్రుల కలయిక ప్రేమవ్యవహారాన్ని సూచిస్తుంది కానీ, రాహు మహర్దశా అంతర్దశలలో ఈ వ్యవహారం బెడిసి కొట్టే ప్రమాదముంది.

*****

ప్రేమ, వివాహం, ధైర్యం అనే మూడు విషయాల కలయికతో ప్రేమ వివాహం ఏర్పడుతున్నది.


జాతకంలో
వివాహం (7 వ భావం, 7 వ స్థానాధిపతి, శుక్ర/గురు గ్రహాలు ) నకు ఈక్రింది వాటి సంయోగం ఉంటే ప్రేమ వివాహం సూచితమవుతుంది.


ప్రేమ మరియు భావుకత (5 వ భావం, 5 వ భావాధిపతి, చంద్రుడు, శుక్ర గ్రహాలు)

నిర్ణయింతీసుకునే ధైర్యం (3 వ భావం, 3 వ స్థానాధిపతి, కుజుడు, రాహు గ్రహాలు)


ఈ మూడిటి సంయోగంచే ప్రేమ+వివాహం సంభవిస్తుంది. ముఖ్యంగా మొదటి దైన వివాహ కారకత్వానికి రెండు,మూడు ల సంబంధం కలగాలి. వివాహకారక భావాలతో గానీ గ్రహాలతొ గానీ  సంబంధం కలగనట్లైతే అది వివాహం వరకు వెళ్లకపోవచ్చు.