Tuesday 15 May 2018

అదిక మాసం ఎలా ఏర్పడును, సాయన నిరాయన వ్యత్యాసం ఎలా ఉండును

అదిక మాసం ఎలా ఏర్పడును, సాయన నిరాయన వ్యత్యాసం ఎలా ఉండును  :

సౌర, చాంద్రమానాలెందుకు?



మనం ఉగాది పండగను చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. తమిళులూ మలయాళీలూ సౌరమానం ప్రకారం మనకన్నా ఆలస్యంగా ఏప్రిల్‌ నెలలో చేసుకుంటారు. సంక్రాంతి పండగను మాత్రం సౌరమానం ప్రకారమే చేసుకుంటాం. అయితే ఇలా రెండు రకాల మానాలను ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నాం, అసలు కాలాన్ని రెండు పద్ధతుల్లో ఎందుకు లెక్కిస్తున్నాం, అన్న సందేహాలకు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ జనయిత్రి జ్యోతిష్యాచారులు శ్రీ డబ్బిరు వెంకటేశ్వర రావు గారు సమాధానమిస్తున్నారిలా...
Image result for sun and moon moving around the earth      Image result for sun and moon moving around the earth
‘కాలః కాలయితా మహం’ అంటాడు గీతాచార్యుడు. అంటే కంటికి కనిపించని ఆ కాల స్వరూపం నేనే అని అర్థం. మరి అలాంటి కాలాన్ని లెక్కించడం అంటే సామాన్యమా... గ్రహాలూ నక్షత్ర సంచారం గురించి ఎంతటి అవగాహన ఉండాలి! దానికి మరెంతటి పరిశీలన ఉండాలి! అయితే ప్రత్యక్షంగా కనిపించే కాలస్వరూప దైవం ఆదిత్యుడే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ సూర్యుడి గమనాన్ని మాత్రమే లెక్కించారు. కానీ భారతీయ ఖగోళనిపుణులు సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల ప్రభావాన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అదే జ్యోతిషశాస్త్రం. అందులో భాగంగానే సూర్యుడితోపాటూ చంద్రుడూ, బృహస్పతి గమనాలనూ లెక్కించారు. మనం సూర్య, చంద్ర గమనాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే యజ్ఞయాగాదులు నిర్వహించాలంటే ఒక్క సౌరమానం సరిపోదు, చాంద్రమానంలోని తిథి, నక్షత్రాలు కూడా తెలియాలి. అంతేకాదు, ఒక పగలుతోబాటు రాత్రి కలిస్తేనే రోజు పూర్తవుతుంది. ఆ రాత్రిని ప్రభావితం చేసేది చంద్రుడే. మనమీద ఆ ప్రభావం తెలుసుకోవాలంటే చంద్రగమనాన్నీ లెక్కించాల్సిందే. అందుకే మనవాళ్లు రెండింటినీ తీసుకుని సమన్వయం చేస్తున్నారు.

సౌరమానమంటే...
Image result for sun and moon moving around the earth
సూర్యగమన గణనమే సౌరమానం. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో సంచరిస్తుంటాడు (నిజానికి ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడని కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యనే సూర్యగమనంగా లెక్కించారు నాటి నిపుణులు). అలా సంచరించే కక్ష్యనే పన్నెండు భాగాలుగా విభజించారు. అవే మేషం, వృషభం, కుంభం... వంటి రాశులు. దీన్నే రాశి వృత్తం అంటారు. ఈ పన్నెండు రాశుల్లో సూర్యుడు సంచరించడానికి ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలోనూ ఒక్కో నెల ఉంటాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే రాశి సంక్రమణం. అందుకే సంక్రాంతి అనేది ప్రతీ రాశికీ ఉంటుంది. కానీ ఈ రాశిచక్రం ద్వారా నెల మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు తిథి, నక్షత్రాల గురించి తెలియాలంటే మాత్రం చాంద్రమానాన్ని అనుసరించాల్సిందే.

చాంద్రమానమంటే...
 Image result for moon

చంద్రుడి గమనం ద్వారా తిథినీ నక్షత్రాన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజానికి చాంద్రమానానికీ సూర్య(భూ)గమనమే కీలకం. సూర్యుడు తిరిగే కక్ష్యను రాశి చక్రం మాదిరిగానే మరో 27 భాగాలుగా విభజించారు. అవే నక్షత్రాలు. ఆ వృత్తాన్ని నక్షత్ర వృత్తం అంటారు. అయితే సూర్యుడు ఉన్న సమయంలో నక్షత్రాలు కనిపించవు. కాబట్టి ఆ సమయంలో నక్షత్ర గమనాన్ని లెక్కించలేం. నక్షత్ర గమనంతో కాలాన్ని లెక్కిస్తే అది దోషరహితంగానూ, స్థిరంగానూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నాటి సంఘటనల సమయాన్ని తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయో చెబితే కచ్చితంగా లెక్కించగలగడానికి అదే కారణం. సూర్యుడికీ చంద్రుడికీ మధ్యలో భూమి అడ్డు రావడంవల్ల చంద్రుడి కళలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాటినే తిథులుగా లెక్కించారు. అలాగే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలలో 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే ఏడాదికి చాంద్రమానం ప్రకారం 354 రోజులే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకన్లు పడుతుంది. అదే చంద్రుడు తిరగడానికి 354 రోజులు పడుతుంది. అంటే... భూమి, చంద్రుడి గమనాల్లో 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. వాటిని సైతం ఒక పద్ధతిలో 34, 35, 34, 35, 28 నెలలకోసారి వచ్చేలా లెక్కించారు.

చాంద్రమానమే ప్రధానం
ఈ సౌర, చాంద్రమానాలకీ ఉగాదికీ సంబంధం ఏమిటీ అనుకోవచ్చు. ‘ఉ’ అంటే నక్షత్రం. ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టిన రోజనే అర్థం అని కొందరి అభిప్రాయం. చాంద్రమానాన్ని అనుసరించే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారితోబాటు కన్నడిగులు, మహారాష్ట్రీయులు కూడా ఆ రోజునే ఈ పండగ జరుపుకుంటారు. సంక్రాంతిని మినహాయిస్తే ఉగాది సహా మిగిలిన పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పండగలూ వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలోనే ఉండాలి. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజే ఉగాది. మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే శ్రీరామనవమి. అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉంటేనే శ్రీకృష్ణాష్టమి. మధ్యాహ్నానికి చవితి ఉంటే తప్ప అది వినాయకచవితి అనిపించుకోదు. ఇలా ప్రతీ పండగకీ నిర్ణీత సమయాలున్నాయి. అంతేకాదు, ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుంటారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ గల చాంద్రమాన పేర్లతోనే నెలలను లెక్కించడం విశేషం. అవన్నీ ఎలాగున్నా పంచాంగం చూసుకోవాలన్నా జాతకచక్రం తెలుసుకోవాలన్నా చాంద్రమానమే ప్రామాణికం!

Tuesday 1 May 2018

సంతాన ప్రాప్తి కొరకు పుత్ర గణపతి వ్రతం

సంతాన అనుగ్రహం కొరకు పుత్ర గణపతి వ్రతం : 
Image result for గణపతి ]
పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. సాధారణంగా ఏ రంగానికి సంబంధించినవాళ్లు ఆ రంగంలో ముందుకి వెళ్లడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలకి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడమని గణపతిని ప్రార్ధిస్తూ వుంటారు. తాము తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తికావాలని కోరుతుంటారు.

గణపతిని ఆరాధించి ఆయన ఆశీస్సులు అందుకుంటే మనోభీష్టం నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే గణపతి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఏడాదిపాటు తమ పనులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడమని ప్రార్ధిస్తూ వినాయక చవితి రోజున ఆ స్వామిని పూజిస్తూ వుంటారు. అదే విధంగా పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వారసుడు కావాలనే కోరిక ... తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి ... గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను ... పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.