Saturday, 30 November 2019

త్రికరణశుద్ధి అనగా ఏమిటి ?


Related image

త్రికరణశుద్ధి అనగా ఏమిటి ? 


1. మనసా ( మన ఆలోచన, సంకల్పం )
2. వాచా ( వాక్కు ద్వారా )
3. కర్మణా ( కర్మ, చేతల ద్వారా )

మనలో చాలామందికి మనస్సులో
ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటి వారి మెప్పు కోసమో, లేక
మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక, చెప్పిన పని చెయ్యలేము. మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము. అది ఏది పడితే అది ఆలోచించి మాట్లాడి చేసెయ్యడం కాదు. ధార్మికమైన, శాస్త్ర ఆమోద యోగ్యమైన, అందరికీ ఉపయోగి పడే కర్మ ఉండాలని శాస్త్రం చెబుతుంది. అదే త్రికరణశుద్ధి.
త్రికరణశుద్దిగా చేసిన పనులకు..
దేవుడు మెచ్చును, లోకము మెచ్చును
అని హెచ్చరిస్తాడు అన్నమాచార్యుడు.
ఎవరు చూసినా, చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి. మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి ఇది తెలిసి ఉండదా..
ఒకసారి పురందరదాసుల వారిని ఎవరికీ తెలియకుండా అరటిపండు తినమని వారి గురువుగారు చెప్పగా, ఆయన దేవుడు లేని ప్రదేశం కానీ, అంతరాత్మ చూడని చోటు కానీ తనకు కనబడలేదని అందుకే అరటిపండు తినలేదు అని చెప్పగా, గురువుగారు ఎంతో సంతోషించి ఆశీర్వదించారు.
ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే కర్మ. అది మనకోసమే కదా. అనుకున్నది చేప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం అభ్యాసం మీద కానీ రాదు.
అన్నీ మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం.
ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం...
చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు అని చిన్న బొమ్మలను అందరూ చూసి ఉంటారు. ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు మూడు ఉంటాయి. సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు. పైన ఒక చిన్న రంధ్రం నుండి మనం పైసలు లోపలకు వేస్తాము. చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి వీలు ఉంటుంది. మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము. దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకున్టున్నట్టు మనం ప్రోది చేసుకుంటూ ఉంటాము. అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక, ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు. ఎప్పుడైతే ఈ మూడు సరిగ్గా సరిపోతాయో అప్పుడు ఆ గని తెరువబడి దైవానుగ్రహం అనే సుధాధార మనమీద వర్షిస్తుంది.
మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం, చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం.
ఇంతేకాదు ఆది కాయిక మరియు మానసిక సంఘర్షణకు లోను చేసి ప్రశాంతతను ఇవ్వదు సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది. కానీ ఇవి హాని కలిగించే పాపాలు కావున వీటిని త్యజించి మనలో ఎల్లప్పుడూ కేవలం సుకర్మలు మాత్రమె శుద్ధిగా జరిపించాలని త్రికరణశుద్ధిగా ఆ భగవంతుని వేడుకుంటూ ఉండాలి

ధ్వజస్థంభం పుట్టుక- HISTORY OF DWAJASTAMBAM IN FRONT OF ANY TEMPLE

ధ్వజస్థంభం పుట్టుక:

Image result for DWAJASTAMBHAM
మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.
భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.
ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.
శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.
మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

Friday, 29 November 2019

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు :

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు :

Image result for guruvu images 
*1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?*
జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను.*2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?*
జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.
*6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.*
*3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?*
జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.
*4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?*
జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
*5. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?*
జ. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.
*6. తీర్థ మంత్రం*
జ. అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
*7. స్నానము ఎలా చేయ వలెను?*
జ. నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.
*8. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?*
జ. గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
*9. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?*
జ. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
*10. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?*
జ. సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి.
ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ.
ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.
మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు.
రాహువునకు
సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది.
సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.
రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.
తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.
( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )
*11. హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?*
జ. కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి.
సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు.
ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది.
విషయం తెలిసిన సూర్యుడు
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు.
హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు.
కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు.
ఇచ్చిన మాట ప్రకారం,
సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.
*12. ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?*
జ. మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది.
అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.
*13. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?*
జ. పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి,
మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం
సృష్టించినవి.
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది.
తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే.
ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
*14. మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?*
జ. వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. బధ్రినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది.

మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి/స్కంద షష్ఠి అనగా ఏమి?: ఆరోజు ఏం చేస్తారు,ఏం చేస్తే శుభం కలుగుతుంది?


Image result for సుబ్రమణ్య స్వామి


Details Subramanya Sashti (also known as Subrahmanya Shashti) is observed on Margashira Shashti in southern pars of India.

మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి/స్కంద షష్ఠి అనగా ఏమి?: ఆరోజు ఏం చేస్తారు,ఏం చేస్తే శుభం కలుగుతుంది?

శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి,కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్,గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.
అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి..........సర్వేజాన:సుఖినోభవంతు


కార్తిక అమావాస్య -పోలి స్వర్గం పూజ విధానం -poli swargam

కార్తిక అమావాస్య -పోలి స్వర్గం పూజ విధానం :

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. 


Image may contain: text

ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం గృహంలో పడక గదులు ఏవిదంగా ఏర్పాటు చేసుకోవాలి ? పాటించే పదహారు సూత్రాలు ఏమిటి ?

వాస్తు శాస్త్రం ప్రకారం గృహంలో పడక గదులు ఏవిదంగా  ఏర్పాటు చేసుకోవాలి ? పాటించే పదహారు సూత్రాలు ఏమిటి ?
Image result for బెడ్ రూమ్ వాస్తు
1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)
2పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. ( *విష్ణుస్మృతి*)
3. *విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.( *దేవీ భాగవతము*).పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( *పద్మ పురాణము*)
5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)
విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( *మహాభారతం*)
6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో *ధనము,ఆయువు* ప్రాప్తిస్తుంది.( *ఆచార మయూఖ్*)
8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)
10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*
11.ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.
12.దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.
13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.
15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)
*ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*
ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరవేయండి......మీతో పాటు అందరికీ లాభాన్ని చేకూర్చాలి..

vastu-vaastu-వాస్తు దిశ -అధిపతులు - అష్ట దిక్పాలకులు

vastu-vaastu-వాస్తు దిశ -అధిపతులు  - అష్ట దిక్పాలకులు




1.ఇంద్రుడు - తూర్పు దిక్కు:

ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

2.అగ్ని - ఆగ్నేయ మూల :

ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.

3.యముడు - దక్షిణ దిక్కు :

ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

4.నైఋతి - నైఋతి మూల :

ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

5.వరుణుడు - పడమర దిక్కు :

ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.
6.వాయువు - వాయువ్య మూల :

ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

7.కుబేరుడు - ఉత్తర దిక్కు:


ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

8.ఈశాన్యుడు - ఈశాన్య మూల:


ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.

హిందు సనాతన ధర్మిక నీయములు ,గృహస్థులు- విధి విధానాలు :

హిందు సనాతన ధర్మిక నీయములు ,గృహస్థులు- విధి విధానాలు :

1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు..

Image result for hindu puja

4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.
6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.
7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు...
8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..
9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది..
10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి..
11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి.
12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది..
13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.
14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.
15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.
16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.
17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు.
18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు...
19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు,
20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..
21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.
22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...
23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు..
24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..
25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో
కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి..
26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు..
27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....
28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..
30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.
31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి....
32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది...

Sunday, 10 November 2019

కార్తీక పౌర్ణమి దీపారాధన విశిష్టత :KARTIKA POURNAMI

KARTIKA POURNAMI : 

దీపారాధనలో దివ్య మహిమ :

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
Image result for కార్తిక పౌర్ణమి
 ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున , కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.

ప్రత్యేకం గా కార్తిక పౌర్ణమి రోజు చెయ్యవలిసిన విషయములు : 

దైవ దర్శనం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.


మరింత సమాచారం : 

కార్తికేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ కార్తీకమాసంలో ముఖ్యమైన పండుగలు రెండున్నాయి. ఒకటి క్షీరాబ్ధి ద్వాదశి కాగా రెండవది కార్తీక పౌర్ణమి. కార్తీకమాసంలో దీపాలు వెలిగించటం, దీపదానం చేయడం శ్రేష్ఠం. సాయంకాల వేళల్లో శివాలయం లేదా విష్ణువ్ఞ ఆలయంలో దీపాలు పెడితే పుణ్యం. మిగతా రోజుల్లో చేయకపోయినా, కార్తీకపౌర్ణమి నాడు తప్పక దీపాలు వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులను పెట్టి దీపాలు పెడతారు. నదుల్లో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయటం మంచిది.
ఏవిధంగా చూసినా కార్తీకమాస ఆరాధనలు శివ,కేశవ్ఞలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కార్తీకపౌర్ణమి నాడు కృత్తికా శివయోగం అనే పూజాపర్వాన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో శివాలయాల వద్ద జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటల్ని రక్షించమని కోరుకుంటారు. ఉదయం శ్రీహరిపూజ, సాయంత్రం సంధ్యవేళ శివారాధనం, దీపాలంకరణ, ఆకాశదీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీకమాసంలో ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం నిత్యవిధులుగా నిర్దేశించబడ్డాయి. కార్తీకపౌర్ణమినాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంటవేసి పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు ఆ మంటకిందుగా తిప్పుతారు. దీనిని జ్వాలాతోరణం అంటారు. హాలాహలం సముద్ర మధన సమయంలో వచ్చినపుడు పార్వతీదేవి పరమశివ్ఞని ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భరీత్యా ప్రజారక్షణ చేసిన సంకేతంగా ఈ జ్వాలాతోరణం జరుపుతారు.
ఈరోజంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శించుట వలన సర్వపాపాల ప్రక్షాళన జరుగుతుంది. కార్తీకమాసంలో ఏ మంత్రదీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కార్తీక ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5రోజులు -”భీష్మపంచకవ్రతం అంటారు. ఈ ఐదురోజులు శివమంత్రం గానీ, విష్ణుమంత్రం గానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే శివాలయంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరమంతా శివాలయంలో దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈరోజున తమ స్థోమతకు తగ్గట్టు వెండి, రాగి, కంచు, మట్టి ప్రమిదలలో దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. ఈరోజు విష్ణువ్ఞకు కూడా ఇష్టమైనది కనుక అన్ని శివాలయాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పౌర్ణమినాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వర్తించి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. తెల్లవారి నాలుగైదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. కనుక ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదమని, ఆరోగ్యదాయకమని పెద్దలు చెబుతారు. కార్తీకపౌర్ణమికో కథ ఉంది. కృతయుగంలో మాయా నగరంలో దేవశర్మ అనే వేదపండితుని కుమార్తె గుణవతి.
దేవశర్మ చంద్రుడు అనే యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకు వివాహం జరిపించాడు. ఒకనాడు మామా అల్లుళ్లిద్దరూ పళ్లు, పూలకోసం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుడి చేత సంహరింపబడ్డారు. గుణవతి తండ్రికి, భర్తకి ఉత్తమగతులకోసం ఆచరించాల్సిన కర్మలన్నీ ఆచరించింది. దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో హరిభక్తినీ, జితేంద్రియత్వాన్ని పాటించేది. తన చిన్ననాటి నుండి అలవాటైన కార్తీక వ్రతం ఆచరించి కార్తీకమాసం నెలరోజులూ అరటిడొప్పలో దీపం ఉంచి నదిలే వదిలేది. తర్వాత గుడికి వెళ్లి దీపం వెలిగించేది. ఇంటివద్ద తులసికి ప్రదక్షిణం చేసేది. కార్తీక ఏకాదశినాడు ఉపవాసం చేసేది. పౌర్ణమినాడు దీపదానాలు చేసేది. ఈ వ్రత పుణ్యఫలంగా ఆమె విష్ణుసాన్నిధ్యం పొందింది. గుణవతి సత్యభామగా పుట్టి శ్రీకృష్ణునికి ప్రియసఖి అయింది. కార్తీక మాసంలో ఏదీక్షను అనుసరించినా మోక్షదాయకం.
పున్నమి వెలుగుల పుణ్యమాసమైన కార్తీకమాసంలో భక్తులంతా ఎదురుచూసే పరమ పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజునే కార్తీకపౌర్ణమి అంటారు. కార్తీకపౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినది. ఈ పౌర్ణమి శివ,పార్వతులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. సాధారణంగా కార్తీకమాసం నెలరోజులు పూజలు, వ్రతాలు చేయలేనివారు ఒక సోమవారమైనా, కార్తీకపౌర్ణమి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యమొస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రతిఒక్కరూ కఠోర ఉపవాసదీక్షలతో కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరనోము )చేయడం ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమిరోజు సూర్యోదయానికి ముందే చెరువులు, నదులు అవి అందుబాటులో లేకపోతే బావులు,
ఇంటివద్దయినా శీతలస్నానం చేసి కార్తీకపౌర్ణమి వ్రతాన్ని ప్రారంభించాలి. మహిళలు అరటిడొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదలాలి. భక్తిపూర్వకంగా పవిత్రమనస్సుతో ఇలా చేయడం వలన వారికి మనస్సులో వున్న కోరికలు సిద్ధిస్తాయి. వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను నదిలో వదిలితే ఎంతో ఫలం లభిస్తుంది. పౌర్ణమినాడు బ్రహ్మి సమయంలోనే తులసిని పూజించాలి. ఆవునేతితో తడిపిన దారపు వత్తుల దీపాలు వెలిగించి, తులసికోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పాయసం (పరమాన్నం) నైవేద్యంగా పెట్టి, 365 వత్తుల కట్టతో దీపారాధన చేయాలి. పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి శివునికి బిల్వపత్రాలు, భస్మలేపనం, అవిసెపూలతో పూజచేయడం వలన కైలాసప్రాప్తి లభిస్తుంది. శివాలయాల్లో మహాన్యాసక రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమౌతాడని శాస్త్రవచనం
. పౌర్ణమిరోజు శివాలయాలు, విష్ణాలయాల్లో దీపారాధన చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఆరిపోయిన జ్యోతిని వెలిగించినా పుణ్యం కలుగుతుంది. అదే విధంగా దీపదానం చేయడం వలన శివసాన్నిధ్యం కలుగుతుంది. దీపదానం చేయలేనివారు సర్వజ్ఞాన ప్రదం సర్వ సంపత్పుఖావనం దీపదానం ప్రదాస్మావి శాంతిరసుసదామమ! అనే మంత్రాన్ని పఠించాలి. వీలైతే శ్రీలలితాదేవిని సహస్ర నామాలతో పూజించాలి. దీనివల్ల ఆ దేవి సకల ఐశ్వర్యాలను కల్గిస్తుంది. పౌర్ణమిరోజు రాత్రి 12గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను ఇంటిలో వున్న వారంతా తాగితే ఏడాది పొడవునా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో విశేషంగా వుంది. కేదారేశ్వరుని వ్రతం !: కార్తీకపౌర్ణమి రోజు మహిళలంతా నోచుకునే నోముకు సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో వుంది.
పౌర్ణమి రోజంతా కఠోర ఉపవాసముండి సాయంత్రం వేళగౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు సంబంధించి గ్రామాల్లో పెద్దలు ఎంతో వినసొంపుగా వుండే కేదారేశ్వర నోముకు సంబంధించిన కథను కుటుంబ సభ్యులకు విన్పిస్తుంటారు. కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరుని నోము) చేసుకోలేని భక్తులు ఈ కథ చెప్పే ఇంటికి వెళ్లి భక్తితో కథ వినడం ఎంతో మంచిది. పట్టణాల్లోను, మరికొన్ని ప్రాంతాల్లోను కేదారేశ్వర వ్రతం పేరుతో ప్రచురితమైన పుస్తకాల్లో వున్న కధను చెబుతున్నారు. అది చదివినా, విన్నా ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి (శివపార్వతులకు)మర్రిచెట్టు ఊడలను తోరణాలుగాను, మర్రిపండ్లను బూరెలు గాను, మర్రి ఆకులును విస్తర్లుగాను పెట్టి పూజలు చేయాలి.
గ్రామీణ ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి భక్తులు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం వారిలో భక్తిభావాన్ని చాటుతుంది. చాలామంది ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుంటారు. సాయంత్రం వేళ శివాలయాలకు వెళ్లి జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించిన పిమ్మట ఇళ్లవద్ద నోములు (వ్రతం) నోచుకోవాలి. ఎవరైతే కార్తీకపౌర్ణమి రోజు కేదారేశ్వరుని నోము నోచుకుంటారో వారికి ఏడాదిపాటు అన్న వస్త్రాదులు, సిరిసంపదలకు లోటుండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరకు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, తమలపాకులు, పువ్వులతో పూజచేసి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం (హారతి) ఇవ్వాలి. అనంతరం రాత్రికి నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి.