వాస్తు శాస్త్రం : వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. వాస్తు శాస్త్రం లో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.
భూమి వాస్తు.
హర్మ్య వాస్తు
శయనాసన వాస్తు.
యాన వాస్తు.
వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలు
మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),
మాయామతం (రచన : మాయా),
విశ్వకర్మ వాస్తుశాస్త్రము (రచన : విశ్వకర్మ),
అర్ధ శాస్త్రం
సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),
అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)
మానుషాలయ చంద్రిక
శిల్పరత్నం
పురాణాలలొ-మత్స్య ,అగ్ని,విష్ణు ధర్మొత్తరం,భవిష్య పురాణాలలొ వాస్తు ప్రకరణలు ఉన్నయి.
సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు
ప్రధాన వస్తువులు
వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన
భూమి
జలం
అగ్ని
వాయు
ఆకాశం
వాస్తు పురుష మండలాలు
ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:
ఈశాన్యము – Ruled by lord of all quarters- Ishvara (Religions,Luck and Faith)
తూర్పు – ఇంద్రుడు– Ruled by the solar deity- Aditya (Seeing the world)
ఆగ్నేయము – అగ్ని– Ruled by the fire deity – Agni (Energy Generating)
దక్షిణ – యముడు– Ruled by lord of death – Yama (Damaging)
నైఋతి – పిత్రు/నైరుత్య, – Ruled by ancestors (History)
పడమర – వరుణుడు– Ruled by lord of water (Physical)
వాయువ్యము – వాయు– ruled by the god of winds (Advertisement)
ఉత్తరము – కుబేరుడు– Ruled by lord of wealth (Finance)
కేంద్రము – బ్రహ్మ– Ruled by the creator of the universe (Desire
పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు
వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు సైతం తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
పంచ భూతాలుగా మనం పేర్కొనే ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సఖల బోగాలతో వర్ధిల్లుతారని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్నిబట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.
సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.
భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే …
తూర్పు- గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
పడమర- సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం- వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం- అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం- తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి- తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
ఈశాన్యం- వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం-అదృష్టం,
వాస్తు ప్రకారం గృహంలో ద్వారాల అమరిక
గృహ నిర్మాణంలో ద్వారాల అమరికకు సంబంధించి వాస్తు కొన్ని సూచనలు చేస్తోంది. గృహంలో నడిచేటప్పుడు కొన్ని దిశలవైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుందన్న కోణంలో వాస్తుశాస్తం ద్వారాల అమరిక ఎలా ఉండాలన్న విషయాన్ని సూచిస్తోంది.
గృహంలో ఉత్తర ఈశాన్యం నుండి, దక్షిణం వైపుకు, దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుందని వాస్తు ఉవాచ. అలాగే తూర్పు ఈశాన్యం నుండి పడమర వాయువ్యం, పడమర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వైపుకు కూడా నడక సాగించడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు పేర్కొంటోంది.
దీనిప్రకారం అనుకూలమైన దిశల వారీగా ద్వారాలను అమర్చుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పై నియమాలనుబట్టి వాస్తు ప్రకారం ఉత్తర, దక్షిణ భాగాల మధ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తూర్పు, పడమర భాగాల మధ్యలో కూడా ద్వారాలను ఏర్పాటు చేయవచ్చు. పశ్చిమ, దక్షిణాలలో కూడా ఉచ్చ స్థానాలయిన పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయాలలో కూడా ద్వారాలను అమర్చవచ్చు. దీనివల్ల ఏ దోషం రాదని వాస్తు చెబుతోంది.
అదేసమయంలో ఒక చిన్న ఇంటికి ఒకే ద్వారాన్ని అమర్చవలసి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలోగానీ, ఉత్తర ఈశాన్యంలోగానీ నిర్మించాలి. ఉత్తర, దక్షిణ భాగాలలో మాత్రం అమర్చకూడదని వాస్తు చెబుతోంది. గృహానికి రెండు ద్వారాలు మాత్రమే ఏర్పాటు చేయవలసి వస్తే వాటిని తూర్పు ఈశాన్యంలో ఒకటి, ఉత్తర ఈశాన్యంలో మరొకటి నిర్మించుకోవాలి. అంతేగానీ ఒకటి తూర్పు, ఉత్తరాల్లో అమర్చి, రెండోదాన్ని పడమర, దక్షిణం భాగంలో అమర్చకూడదని వాస్తు పేర్కొంటోంది.
వాస్తు ప్రకారం స్థలాన్ని కొనటం ఎలా?
ఇంటి నిర్మాణంలో స్థల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపముండినట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు.
ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదని పరిశీలిస్తే…
ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.
స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు.
రెండు విశాలమైన స్థలముల మధ్య నున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.
ఇలాంటి స్థలాల్నికొనాలి:
ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనటం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు.
ఉత్తర- ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగ జేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. తూర్పు- ఈశాన్యం, ఉత్తరం-ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనటం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.
వాస్తు ప్రకారం సింహద్వార గేట్ల అమరిక
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిదని వారు పేర్కొంటున్నారు. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి.
ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు
వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.
ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.
దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.
గృహంపై వీధి పోటు… వాస్తు ప్రభావం
ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వీధి పోటు వల్ల కలిగే ఫలితాలు కింది విధంగా ఉంటాయి.
గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.
నివశించే ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది.
ఇంటికి ఉత్తర – వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.
ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.
ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు.
ఇంటికి దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.
ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పైన పేర్కొన్నవాటితోపాటు ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశముందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
ఇంటి నిర్మాణంలో దిక్కులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దిక్కులను అనుసరించే ఆ ఇంటి నిర్మాణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాన్ని ఒక్కో దేవత పాలిస్తుందన్నది నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.
తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
పడమర: పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కుకంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
ఉత్తరం: ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
దక్షిణం: దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
ఆగ్నేయం: ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.
వాయవ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉడడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
గృహం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్క అంశాన్ని వాస్తుశాస్త్రం క్షణ్ణంగా వివరించింది. ఇందులో గృహాన్ని నిర్మించే స్థలం నుంచి గృహానికి సంబంధించి ఎలా నిర్మించాలి, ఏ దిశల్లో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలిలాంటి ఎన్నో అంశాలను వాస్తుశాస్త్రం వివరించింది.
వీటితోపాటు గృహానికి పైన వేసే కప్పుకు సంబంధించి కూడా వాస్తుశాస్త్రం వివిధ రకాలైన జాగ్రత్తలను సూచించింది. వాస్తుశాస్త్రం ప్రకారం గృహానికి వేసే కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆ గృహం అన్ని రకాల సంతోషాలతో విలసిల్లుతుంది. గృహానికి వేసే కప్పుకు సంబంధించి వాస్తుశాస్త్రం ప్రకారం క్రింది జాగ్రత్తలు పాటించాలి.
ఇంటి ముఖద్వారానికి ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవడం. అలాగే మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండటం వంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది.అలాగే ఓ ఖాళీ స్థలంలో గృహం నిర్మించినా, నిర్మించక పోయినా తూర్పు గోడను ఆనుకుని తూర్పు భాగంలో ఎలాంటి కట్టడమైనా నిర్మించి, దానిపై కప్పు వేయకూడదు. దీనివల్ల ఆ ఇంటిలో ఉండే పురుష సంతానం వక్ర మార్గంలో నడుచుకుంటారు.
అలాగే పశ్చిమ గోడను ఆనుకుని ఎలాంటి కట్టడం గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ దిశను వరుణ దేవుని స్థానంగా పేర్కొంటారు. అందువల్ల పాడి పంటలకు మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ఈ భాగంలో పశువుల పాకను గానీ, ధాన్యపు గదులను గానీ నిర్మించుకోవడంవల్ల కలిసివస్తుంది. దీనివల్ల మంచి ధనాదాయం సమకూరుతుంది. అయితే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పు వాలుగా ఉండేలా జాగ్రత్తవహించాలి. లేకుంటే స్త్రీలకు అనారోగ్య, ఇతర సమస్యలు కలిగే అవకాశముంది.
వీటితోపాటు ఉత్తర భాగంలో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై కప్పు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కుబేర స్థానం కాబట్టి దీనిని కప్పి ఉంచడం వల్ల వచ్చే సిరి సంపదలు కోల్పోతామని వాస్తుశాస్త్రం చెపుతోంది. దీనివల్ల ధనరాబడి తగ్గి అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దక్షిణభాగంలో ఏదో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై మూత వేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది యమధర్మరాజు స్థానంగా పేర్కొంటారు.
దీనివల్ల ఇంటిలో నివశించే వారికి ఆయురారోగ్యాలు కలుగడమే కాకుండా ఆ కుటుంబం సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. ఈ కట్టడంపై వేసే కప్పు తప్పనిసరింగా తూర్పు లేదా ఉత్తరం వైపు వాలుగా ఉండే విధంగా చూసుకోవాలి. పైన చెప్పిన విధంగా గృహానికి సంబంధించిన కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సదరు గృహంలో ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా నిత్యం సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.
ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
ఇంటిలోనే వంటగది తప్పనిసరిగా ఉండాలని వాస్తురీత్యా నియమం లేదు. వాస్తుశాస్త్రాల ప్రకారం.. అగ్ని స్థానమైన ఆగ్నేయంలో వంటగది ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫామ్ కింద మెట్టు పెట్టకూడదు.
దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చు. ఫ్లాట్‌ఫాణ్‌తో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.
ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు ఇరుకైన చిన్న స్థలాల్లో ఇల్లు కట్టే వారు పాటించవలిసిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సూచిస్తున్నాయి. విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వాస్తు ప్రకారం జాగ్రత్తలు పాటించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది… బాల్కనీలో అది ఎలా ఉందీ అన్న అంశాలను ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం మంచిది. గోడలు నిర్మించి అటకలు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.
ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి.
పూజ గది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిలో పూజ గది ఎక్కడ ఉండాలనే విషయాన్ని కూడా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భగవంతుడిని పూజించేందుకు గది ప్రత్యేకంగా ఉండాలా లేదా ఒక అలమరాలో పెట్టుకుంటే సరిపోతుందా అనే విషయాన్ని వారివారి అభిప్రాయాలను బట్టి మారుతుంటుంది. గృహ వైశాల్యం మీద కూడా పూజ గది నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగది నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది.
పూజ చేసే గదిలో పెద్దసైజు రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఇటువంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు ఆ విగ్రహాలను పూజ గదిలో ఉంచుకోకపోవడం మంచిది. పూజలు జరగని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారి గృహస్తులకు హాని కలుగజేస్తాయి.
ఇదిలా ఉంటే పూజ గది వల్ల ఈశాన్యం మూతపడుకూడదు. మన రాష్ట్రంలో పూజగదులను వాయవ్యంలో నిర్మించే సంప్రదాయం ఉంది. పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేసే విషయానికి వస్తే, తూర్పు దిశకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఇంటి మెట్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటికి మెట్లను నిర్మించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు వివరించాయి. వాస్తు శాస్త్రాల ప్రకారం మెట్లను మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒకే వరుస మెట్లు అయితే వాటిని, తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించుకోవాలి.
రెండు వరుసలుగా మెట్ల నిర్మాణం చేపట్టేటట్టు అయితే మొదటి వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు ఎక్కే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకు తిరిగివున్నా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుసను ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుసను ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగానూ నిర్మించుకోవచ్చు. మెట్లను “ఎల్” ఆకారంలో నిర్మించాలనుకునే వారు తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి నిర్మించుకోవచ్చు.
స్నానపు గదులకు పాటించాల్సిన వాస్తు సూత్రాలు ఇంటిలో పడకగదులనుబట్టి అటాచ్డ్ బాత్రూమ్స్, లెట్రిన్స్ వాస్తు రీత్యా ఏర్పాటు చేసుకోవాల్సివుంది. వాస్తు రీత్యా కాకుండా ఎలా పడితే అలా నిర్మంచుకోవడం వలన చెడు ఫలితాలు ఉంటాయి. ఇంటినంతా వాస్తు రీత్యా నిర్మించి వీటి విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే చెడు ఫలితాలే కలుగుతాయి. నైరుతీ మూలలో పడక గది, దానికి తూర్పువైపున దక్షిణపు గోడకు ఆనుకొని బాత్రూమ్ ఉండేటట్లుగా నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇందులో లెట్రిన్ పాట్‌ను దక్షిణగోడకు ఆనించి కనీసం ఒక అడుగైనా ఎత్తు ఉండేలా నిర్మించాలి. దక్షిణంవైపు గోడకే వెంటిలేటర్‌ను కూడా అమర్చుకోవాలి. బాత్‌రూమ్ తలుపును బాత్రూమ్ పశ్చిమ లేదా వాయువ్యంలో ఉంచాలి. నైరుతీ మూలన రెండు పడకగదులు, వాటికి ఆనుకొని బాత్రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు… నైరుతిలో ఒక పడక గదిని కట్టి, దాని తూర్పు వైపున రెండు బాత్రూమ్స్ నిర్మించుకోవాలి. రెండోవ బాత్రూమ్‌ను ఆనుకొని తూర్పు వైపున మరొక పడకగదిని నిర్మించుకోవచ్చు.
పడకగది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇళ్లు, అందులో గదుల నిర్మాణానికి వాస్తు సూత్రాలు ఉన్నట్టే, పడక గది విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని భారతీయు వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. పడక గది విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకోకూడదు. ఇది శారీరక, మానసిక సమస్యలుకు దారి తీయవచ్చు.
పడకగది తలుపుకు ఎదురుగా మంచం ఉండకుండా చూసుకోవాలి. మంచం తలుపులతోపాటు, కిటికీలకు కూడా ఎదురుగా ఉండరాదు. అద్దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్ మంచానికి తలపైపు లేదా కాళ్లవైపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలను కూడా పడకగదిలో ఉండకుండా చూసుకోవాలి.
ఇంటికి వెలుపలి భాగంలో మెట్లు నిర్మించాలనుకునేవారు ఈశాన్య, వాయవ్య, నైరుతి, ఆగ్నేయాల్లో ఏ భాగంలోనైనా వీటి నిర్మాణం చేపట్టవచ్చు. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు. ఈశాన్యంవైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.
నిద్ర లేవగానే ఎటువైపు నడవాలి? భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ఆదాయార్జన మెరుగుపడుతుంది.
ఇంటిలో తూర్పు దిశగా ఉండే గోడలో దేవుని గూడు ఉండేలా చూసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు లేకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్య దిశలో ప్రారంభించి నైరుతీ వైపున చెత్తను ప్రోగు చేయండి. ఈశాన్య దిశలో చెత్త తీసుకురాకూడదు.
దిశల ఆధారంగా గృహ నిర్మాణము ఇంటిని నిర్మించే సమయంలో దిశలు, వాటి ఫలితాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్ర ప్రకారం దిశల ఫలితాలను తెలుసుకుని ఇళ్లను నిర్మిస్తే విజయాలు వెన్నంటే ఉంటాయి. ఏయే దిశలలో ఇళ్లను నిర్మిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
తూర్పు దిశలో ధ్వజాయమునకు సంబంధించిన ఇళ్లను నిర్మించవచ్చు. అ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వారికి ఈ ధ్వజాయము చాలా మంచిది. తూర్పులో సింహద్వారము ఏర్పాటు చేసుకోవడం కూడా శుభప్రదమే. అలాగే ధ్వజాయము కలిగిన ఇళ్లకు దక్షిణ – పశ్చిమ, ఉత్తర దిశలలో తూర్పువైపు సింహద్వారమును ఏర్పాటు చేసుకుని నిర్మించుకోవచ్చు.
ఈ ఆయమునకు పశ్చిమ దిశ శత్రువైనప్పటికీ, దోషము ఉండదని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ధ్వజాయ ఇళ్లలో నివసించే వారికి ఆయువు, ధనము, కీర్తి, వంశవృద్ధి తదితరాలు కలుగుతాయి. అలాగే ఆగ్నేయ దిశలో ఏ ఆయములు కలిగిన ఇళ్లను నిర్మించకూడదు.
క అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వారు ధ్వజ, గజాయ ఇళ్లను కట్టుకోవడం మంచిది. అలాగే వీళ్లకు తూర్పు, ఉత్తర దిశలు శుభదిశలుగా ఉన్నాయని వాస్తు పరిశీలకులు అంటున్నారు.
గృహ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గృహ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సవివరంగా తెలియపరుస్తున్నాయి. ఇంటి నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే, నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది.
తాపీ మేస్త్రి నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతీ దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే, ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే కట్టడాన్ని మాత్రం నైరుతీ దిశ నుంచి ప్రారంభించాలి. హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతీ దిశలో కొంత ఎత్తైన గోడ నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి.
ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తు సామాగ్రిని నైరుతీ, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు. గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు దక్షిణ-పశ్చిమ గోడలను తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి.
గృహ నిర్మాణానికి ఎటువంటి స్థలాలు పనికిరావు?
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం నాలుగు భుజముల్లో హెచ్చుతగ్గులు ఉన్న స్థలాలను ఇంటి నిర్మాణానికి ఎంచుకోకూడదు. నాలుగు భుజాల కంటే ఎక్కువ భుజాలు కలిగివున్న స్థలంలో ఇంటి నిర్మాణం చెపట్టడం వలన అశుభాలు కలుగుతాయని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. చేట ఆకారంలో ఉన్న స్థలాలు కూడా ఇళ్ల నిర్మాణానికి మంచివి కాదు.
ఇటువంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం వలన ఆర్జించిన సంపద చేతిలో నిలవదు. ఈ పరిస్థితి క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తుంది. నిరంతరం మానసిక అశాంతికి గురవుతారు. స్థలం పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చుతగ్గులుగా ఉండే స్థలం కూడా గృహ నిర్మాణానికి అననుకూలం. ఇటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని జరగడంతోపాటు, అనారోగ్యం బారిన పడుతుంటారు.
విసన కర్ర ఆకారం, లాగుడు బండి ఆకారం, డమరుకం, కుంభాకార, మద్దెలు, అర్ధ చంద్రాకారంలో ఉండే స్థలాలు కూడా ఇళ్లు నిర్మాణానికి పనికిరావని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణం వలన ఆర్థిక పతనం, సుఖశాంతులు లోపించడం, భాగస్వాముల మధ్య వివాదాలు, దోపీడీలు వంటి దుష్పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో చెట్ల పెంపకం సాధారణంగా ఇంటి ఆవరణలో పచ్చదనం, అందం కోసం చెట్లను పెంచుకుంటాం. గృహానికి చెట్లు అందంతో పాటు చల్లని గాలిని కూడా ఇస్తాయి. అయితే వృక్షాలను పెంచే సమయంలో కొన్ని కట్టుబాట్లను పాటిస్తే సంతోషమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
గృహానికి తూర్పు వైపున రావిచెట్టు, దక్షిణ దిశలో జువ్వి చెట్టు, పశ్చిమ దిశలో మర్రిచెట్టు, ఉత్తర దిశలో మేడి చెట్లు ఉండకూడదు. అలా ఉన్న పక్షంలో ఆ చెట్ల భారం ఇంటిమీద పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పైన చెప్పిన విధంగా నాలుగు దిశలలో వరుసగా వేప, మామిడి, అరటి చెట్లు కూడా ఉండరాదని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇంటికి వాయువ్య దిశలో ముళ్ల చెట్లు, ఈశాన్య దిశలో అరటిచెట్లు ఉండరాదు. అలాగే దక్షిణ దిశలో మందిరాలు, మఠాలు, పశ్చిమ దిశలో జలాశయాలు, ఉత్తర దిశలో పెద్ద చెరువులు ఉండరాదు. ఇవి ఉన్నచో గృహములో ఎల్లప్పుడూ బాధలు, కష్టనష్టాలు ఏర్పడతాయని వాస్తు పరిశీలకులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం గృహములో ద్వారముల నిర్మాణం
గృహాన్ని నిర్మించే సమయంలో సింహద్వారాన్ని ఏ విధంగా వాస్తు ప్రకారం నిర్మిస్తామో, అదే విధంగా ఇతర ద్వారాలను కూడా నిర్మించాలి. దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.
గృహానికి ముందు భాగంలో ఉన్న పశ్చిమనైరుతి గదికి పైభాగంలో ద్వారము కలిగి ఉండుట ద్వారా ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి. క్రింద భాగములో ద్వారములను నిర్మించుట ద్వారా రోగము- మరణములు సంభవించును. గృహములోని ముందుభాగములో దక్షిణ ఆగ్నేయ గదికి ఎగువ భాగములో ద్వారం నిర్మించి ఉన్నట్టయితే ఇంట్లోని పిల్లలకు అశుభం.
గృహానికి బైట ఉండే ఉత్తర వాయువ్య గదికి పైభాగమున ద్వారము నిర్మించినచో ఆ ఇంట్లోని వారు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు లభించును. గృహమునకు ముందుభాగములో తూర్పు- ఈశాన్య గదికి పైభాగములో ద్వారమును నిర్మిస్తే సద్గుణాలు లభించడమే కాక భోగభాగ్యాలు కూడా కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు ప్రకారం గోడల నిర్మాణం
కొత్తగా నిర్మించిన గృహములలో దిక్కులు, మూలలను సరిచూసుకోవడంతో బాటు గోడలు వాటి ఆకృతులను కూడా పరీక్షించుకోవాలి. గృహం నిర్మించే క్రమంలో గోడల స్థానములను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఇంటికి సంబంధించిన దక్షిణ దిశయందలి గోడ వెలుపలికి వంగిపోయి ఉంటే వ్యాధులు, మృత్యువు వెన్నంటి ఉంటుంది. అలాగే పై విధంగా పశ్చమదిశలో గోట బయటకు వంగి ఉంటే ధనహాని కలుగుతుంది. తూర్పు గోడ బయటకు వంగి ఉంటే అరెస్టులు తదితర భయాలు ఉంటాయి.
ఇంటిలోని ఆగ్నేయ మూలలో తూర్పు గోడ వెలుపలకు వంగి ఉంటే అగ్నిభయము, దక్షిణమునకు వంగితే ప్రాణభయము సంభవించే అవకాశం ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం గోడలను నిర్మిస్తే గృహంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
వాస్తు ప్రకారం స్టడీ రూమ్ నిర్మాణం
మన జీవితంలో ముఖ్యమైనది విద్య. ఈ విద్యనభ్యసించడానికి అందరూ ఎంతో కష్టపడుతుంటారు. విజయం లాగానే ఇది అందరినీ వరించదన్న విషయం మనకు కూడా తెలుసు. ఏ దిశలో కూర్చుని చదివితే చదువు బాగా వస్తుంది? ఎటు వైపు స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేయాలో వంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం.
స్టడీ రూమ్‌లో ముఖాన్ని చూసే అద్దాలు, అక్వారియం వంటి వాటిని పెట్టకూడదు. దీని ద్వారా మనసు వాటిపైకి మళ్లి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ గదిలో సూర్యకాంతి నేరుగా వచ్చి పడేలాగా ఉండకూడదు. ఎందుకంటే అధికంగా సూర్యకాంతి రావడం వల్ల కూడా మనసు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు మదిలో చికాకులు ఏర్పడతాయి. చదువుకోవడానికి సరిపడినంత కాంతి ఉండేలా చూసుకోవాలి.
తూర్పు వైపు ముఖం పెట్టి చదివితే, చదివిన విషయం మనసులో అలానే హత్తుకుపోతుంది. దీనితో పాటు కాసేపు అలా పచ్చదనాన్ని ఆస్వాదించే విధంగా గదిలో పచ్చని చెట్లను అమర్చుకోవాలి. అలసిన కళ్లను పచ్చదనం సేదదీరుస్తుంది. స్టడీ రూమ్‌ను ఈ తరహాలో రూపొందిస్తే చదివిన ఏ విషయమైనా చక్కగా అర్థమయి చక్కని ఫలితాలు సాధించవచ్చని వాస్తు శాస్త్రజ్ఞులు తెలిపారు.
కిటికీల అమరిక కోసం వాస్తు విజ్ఞానం
కొత్తగా నిర్మించే గృహంలో బావులు త్రవ్వడం, గదులు నిర్మించడం, ద్వారాలను అమర్చడం తదితర అంశాలతో పాటు కిటికీల అమరిక కూడా ఓ ప్రధానాంశం. ఎందుకంటే కిటికీల ద్వారానే గృహంలోకి గాలి వెలుతురులు ప్రవేశిస్తాయి కాబట్టి. ఈ కిటికీల అమరికలో కూడా వాస్తు పరిజ్ఞానం చాలా అవసరం.
వాస్తు రీత్యా కిటికీలను ఎలా అమర్చాలో తెలుసుకుందాం. ఉత్తరం వైపు ముఖం ఈశాన్య ద్వారం ఉన్నట్టైతే, దానికి పడమర దిశగా కిటికీలను అమర్చాలి. అలాగే గృహంలో తూర్పు వైపు ముఖం ఉన్న ఈశాన్య ద్వారమో, పడమర వైపు ముఖం ఉన్న వాయువ్య ద్వారమో ఉన్నట్లైతే వాటికి దక్షిణం వైపు కిటికీలను అమర్చాలి.
అలాగే దక్షిణం వైపు ముఖం ఉన్న ఆగ్నేయ ద్వారం ఉన్నట్లైతే కూడా ఆ ద్వారానికి దక్షిణం వైపున కిటికీలను అమర్చుకోవాలని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.
ఇంటి నిర్మాణంలో బావి త్రవ్వకం
ప్రస్తుత ఉరుకుల, పరుగుల కాలంలో బావితో కూడిన ఇళ్లు వెతికి చూసినా కరువే. అయితే ఇంటి నిర్మాణంలో బావులు ఓ ముఖ్యాంశం. గృహంలో బావి త్రవ్వించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే సుఖసంతోషాలు మీ సొంతమవుతాయి.
మీ గృహం నిర్మించే స్థలములో బావిని ముందుగానే త్రవ్వుకోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణానికి కావలసిన నీటిని ఇందులోంచే వాడుకోవచ్చు. అలాగే ఎక్కడంటే అక్కడ కాకుండా ఈశాన్యంలో బావి ఉండడం చాలా మంచిదని వాస్తు విజ్ఞానులు చెప్తున్నారు. మీ స్థలములో తూర్పు-ఈశాన్యములో బావిని త్రవ్వడంచే గృహంలో సకల శుభాలు కలుగుతాయి.
అలాగే ఉత్తర-ఈశాన్యంలో బావిని త్రవ్వడం ద్వారా ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో ఎటువంటి చికాకులు ఉండవు. సుఖసంతోషాలతో పాటు పిల్లలు కూడా ప్రయోజకులవుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు మెరుగుపడతాయి. కనుక ప్రస్తుత కాలంలో బావులతో కూడిన ఇళ్లు నిర్మించడం కష్టమైనప్పటికీ, వీలైనంత వరకు బావులను త్రవ్వించేందుకు ప్రయత్నించాలి.
దుకాణాలకు వాస్తు విజ్ఞానం
ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం బాగా జరిగి లాభాలు వస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
ఈ ప్రకారంగా చూస్తే తూర్పు వైపు ముఖం ఉన్న దుకాణంలో నేలమట్టం పడమర వైపు కాస్త ఎక్కువగానూ, తూర్పు వైపు కాస్త తక్కువగానూ ఉండాలి. అలాగే గల్లా పెట్టె వద్ద కూర్చునే వారు ఆగ్నేయ దిశలో ఉత్తరం వైపు కూర్చోవాలి. ఆ వ్యక్తి ఎడమ చేతి వైపున గల్లా పెట్టే ఉండేటట్టు చూసుకోవాలి.
అలాగే ఆగ్నేయ దిశలో గల్లా పెట్టె వద్ద కూర్చునే వారు తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చునట్లైతే, పెట్టెను ఆ వ్యక్తి కుడివైపుగా ఉండేటట్టు చూసుకోవాలి. పైన చెప్పిన దిశలలో దుకాణాల్లోని వ్యక్తులు కూర్చునట్లైతే ఆ వ్యాపారం వాడీవేడీగా సాగుతుందని, చక్కని లాభాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఉత్తర దిశ నిద్రతో పీడకలలు ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఒక్కరోజు నిద్ర కరువైనా మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత చికాకుకు గురవుతాడో అందరికి అనుభవమే. అందుకే సుఖమైన నిద్రకు అనువైన ప్రదేశం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదేసమయంలో నిద్రపోతున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకూడదని కూడా అందురూ కోరుకునేదే.
అయితే కొన్ని దిశల్లో తలపెట్టి పడుకుంటే మంచి నిద్ర మాట అటుంచి చెడ్డ కలలు వచ్చే అవకాశముందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. వాస్తుశాస్త్రం వద్దని చెప్పే దిశల్లో ఉత్తరదిశ ముఖ్యమైనది. ఉత్తరదిశలో తల పెట్టి నిద్రిస్తే పీడకలలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
వాస్తుశాస్త్రం ఇంకా ఏం చెబుతోందంటే ఉత్తరదిశలో తలపెట్టి నిద్రిస్తే రోగాలు భాదించే అవకాశముందని కూడా చెబుతోంది. అలాగే మనస్సులోని నిమ్మతి, నమ్మకం లాంటివి పోయి వాటి స్థానంలో భయం, అభద్రతాబావం చోటు చేసుకుంటుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఉత్తరదిశలో తలపెట్టి నిద్రించే అలవాటుకు స్వస్తి చెప్పాలని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు
తూర్పు దిశలో నిద్ర జ్ఞానానికి మార్గం
ఇంటి నిర్మాణంలో గదుల నిర్మాణాన్ని ఏ దిక్కులో నిర్మించాలో తెలిపే వాస్తు శాస్త్రం పడకగదిని ఏ దిశలో నిర్మించాలో కూడా చెప్పిన విషయం గురించి తెలుసుకున్నాం. అయితే ఆయా గదుల్లో నిద్రించే సమయంలో ఏ వైపుగా తలపెట్టి నిద్రించాలో కూడా వాస్తు శాస్త్రం చేబుతోంది.
వాస్తు శాస్త్రం ప్రకారం నిర్ధేశిత దిశల్లో నిద్రించడం ద్వారా సుఖప్రదమైన నిద్ర లభిస్తుంది. అలాగే జీవితంలో కొన్ని అధ్బుత సంఘటనలు సైతం జరిగే అవకాశమున్నట్టు వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. వీరి సలహా ప్రకారం గదిలోని తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే అట్టి వారిలో జ్ఞానసంపద వికసిస్తుందని తెలుస్తోంది.
అలాగే వీరిలో ఆధ్యాత్మిక చింతన సైతం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు దిశగా తలపెట్టి నిద్రించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగుతుందని వారు అంటున్నారు. ఇట్టి పిల్లలు వారి చదువులో అందరికన్నా ముందుండడం జరుగుతుందని కూడా వారు చెబుతున్నారు.
తూర్పు దిశగా తలపెట్టి నిద్రించే వారికి ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరవని వాస్తు విజ్ఞానుల ఉవాచ. తద్వారా వీరు మంచి ఆరోగ్యంతో కులాసాగా ఉంటారని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర
–
నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు.
వాస్తు శాస్త్ర రీత్యా మనం నిద్రకు ఉపక్రమించే సమయంలో మన తల దక్షిణ దిశగా ఉండాలని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. ఎందుకంటే మిగిలిన దిశల కన్నా దక్షిణ దిశలో తల ఉంచి నిద్రించడం వల్ల అనేక రకాలుగా మనకు మంచి జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.
దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో సంతోషకరమైన సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగి అతని జీవితం సంతోషమయంగా ఉంటుదని వారు చెబుతున్నారు. అలాగే దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం సైతం చక్కగా ఉండి ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.
దక్షిణ దిశగా నిద్రించడం వల్ల అనేక లాభాలు చేకూరడమే గాక చక్కటి నిద్ర సైతం మనకు లభిస్తుందని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.
తూర్పు దిశలో నిద్రిస్తే ధనలక్ష్మి దూరమైనట్టే…..!
ఇంటి నిర్మాణంలో గదులు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆ ఇంటిలో నివశించే వారికి అన్ని రకాల సౌఖ్యాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అలా కాక మన ఇష్టం వచ్చినట్టు నిర్మాణాన్ని చేపట్టడం, అలాంటి ఇంటిలో గదులను వాస్తు నిపుణులు ఆలోచన లేకుండా ఉపయోగించడం వల్ల కష్టాలను కోరి తెచ్చుకున్నట్టేనని వాస్తులో తల పండిన వారు చెబుతున్నారు.
వీరి సలహా ప్రకారం నివశించే ఇంటిలో పడకగదిని కొన్ని దిశల్లో ఏర్పాటు చేయరాదని చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది తూర్పు దిశ. ఈ దిశలో ఏర్పాటు చేసిన పడకగదిలో నిద్రిస్తే ఆ కుటుంబంలో వారి ఆర్ధిక పరిస్థితి క్రమేపీ క్షీణిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అలాగే కుటుంబ యజమాని ఆరోగ్యం సైతం దెబ్బతినే అవకాశముందని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. అందువల్ల తూర్పు దిశలో ఉన్న గదులను పడకగదులుగా ఉపయోగించకపోవడమే మేలని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.
గృహ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మాణం
గృహ ఆవరణలో మరుగుదొడ్లు పైకప్పు శ్లాబుతో లేదా వేరే విధంగా అంటే సిమ్మెంటు రేకులు వంటి వాటిని ఉపయోగించి వాలుగా కూడా వేసుకోవచ్చు. శ్లాబు వేసినట్లయితే, నైరుతి నుంచి ఈశాన్యానికి వాటంవచ్చేటట్లు పెట్టాలి. వాలుపైకప్పు వేసినట్లయితే తూర్పు లేదా ఉత్తరం దిశన వాలు వచ్చేటట్లు వేయాలి.
టాయ్‌లెట్ పైకప్పు ప్రధాన గృహానికి కానీ, మెట్లకు గానీ తగలకూడదు. లెట్రిన్, బాత్‌రూము కలిపి ఒక గదిలో పెట్టవలసి వచ్చినట్లయితే, ఆ గదిలో లెట్రిన్‌బేసిన్‌ను పశ్చిమ లేదా దక్షిణానికి ఉంచి, తూర్పు లేదా ఉత్తరంలో బాత్‌రూం కట్టాలి.
టాయ్‌లెట్‌కి ద్వారాలు పైభాగంలో వచ్చేటట్లు బిగించాలి. గృహానికి ద్వారాలు, కిటికీలు పెట్టటానికి పాటించే నియమాలే ఇక్కడ కూడా పాటించాలి. లెట్రిన్‌బేసిన్‌ను ఉత్తర లేదా దక్షిణ ముఖం వచ్చే విధంగా అమర్చుకోవాలి. లెట్రిన్ నుంచి గొట్టాల సాయంతో సెప్టిక్ ట్యాంకుకు కలపాలి.
చిక్కులు తెచ్చి పెట్టే వాయువ్యంలో పడకగది
ప్రతి ఇంటికి పడకగది ఎంతో ప్రధానమైంది. ఎందుకంటే అలిసిన మనిషికి సేదతీర్చే ప్రదేశం అదే కాబట్టి. కానీ పడకగదిని వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోకపోతే చిక్కులు కొనితెచ్చుకున్నట్టేనని వాస్తుశాస్త్ర ప్రముఖులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని దిక్కుల్లో పడకగదిని ఏర్పాటు చేయరాదని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది. ఇందులో వాయువ్య దిశ అతి ముఖ్యమైనది. ఈ దిశలో నిద్రిస్తే అనవసరమైన చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదముందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాయువ్యంలో ఏర్పాటు చేసిన పడకగదిలో కుటుంబంలోని దంపతులు నిద్రించినట్టయితే వారి మధ్య లేనిపోని గొడవలు వచ్చి చేరుతాయని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.
ఒకవేళ వాయువ్యంలో పడకగది ఉన్నట్టైతే దానిని పిల్లల కోసం ఉపయోగించడమో లేక గెస్ట్ రూంగా ఉపయోగించడమో మంచిదని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు.
నివశించే గృహంలో తలుపుల సంఖ్య: సంభవించే ఫలితాలు
మనం నివశించే గృహంలో తలుపులు ప్రధానమైనవి. తలుపులన్నవి కేవలం గదులకు రక్షణ ఇచ్చేవి మాత్రమే కాదని, గృహంలో నివశించే వారి వివిధ స్థితిగతులు తలుపుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
నివాసముంటున్న గృహానికి కనీసం రెండు తలుపులుంటే అట్టి ఇంటిలో నివశించే వారికి అన్ని రకాలుగాను మంచి ఫలితాలు సంభవించగలదని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. అలాగే నాలుగు తలుపులు ఉన్న ఇంటిలో నివశించే కుటుంబంలోని సభ్యలకు ఆయుష్షు పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
కానీ మూడు తలుపులున్న ఇంటిలో మాత్రం ఎప్పుడూ గొడవలు సాగుతూ కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది. ఐదు తలుపులున్న ఇంటిలో ఉండేవారు నిత్యం ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమౌతుంటారని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇక ఆరు తలుపులున్న ఇంటిలో కాపురముండే వారికి సంతాన సాఫల్యం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఏడు తలుపులున్న ఇంటివారికి అపాయాలు వెతుక్కుంటూ వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎనిమిది తలుపులున్న ఇంటివారికి పట్టిందల్లా బంగారమేనట, వీరికి సౌభాగ్యం వెతుక్కుంటూ వస్తుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.
తొమ్మిది తలుపులుంటే రోగాలు పీడిస్తాయని, పది తలుపులుంటే ఇంటిలో దొంగలు పడే అవకాశముందని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.
గృహ ఆవరణలో మట్టి నింపవచ్చా?
గృహం బయట, కాంపౌండు లోపల గల భాగాన్ని గృహావరణం అంటాం. గృహ ఆవరణలో మట్టి నింపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. నింపే మట్టి లేదా కంకరు శ్రేష్టమైనదై ఉండాలి. పాడుమట్టి, పాత ఇళ్ళ మట్టి, డెబ్రనిస్ వేయకూడదు.
గృహ ఆవరణలో మట్టి నైరుతి నుంచి ఆగ్నేయం వరకు మరియు నైరుతి నుంచి వాయువ్యం వరకు నింపి ఆ తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు నింపి, ఆ తర్వాత బాగా నీరు పెట్టి నైరుతిలో మొదలుపెట్టి ఇదే క్రమంలో గలాయింపు చేయవలెను. మట్టి లూజు లేకుండా బాగా దిగటం, గట్టి పడటం వాస్తురీత్యా చాలా మంచిది.
గృహ నిర్మాణ పర్యవేక్షణలో జాగ్రతలు
నూతన గృహ నిర్మాణ సమయంలో పర్యవేక్షణ తప్పనిసరి. ఎందుకంటే కాంట్రాక్టర్ మనకు బాగా కావలసినతను అయినప్పటికీ సూపర్‌వైరజర్, తాపీ మేస్త్రీ, పని చేసే కూలీలు తెలిసో, తెలియకో కొన్ని అవకతవకలకు పాల్పడవచ్చు. వీటి నుంచి నష్టపోకుండా జాగ్రతలు పాటించడం ఎంతైనా అవసరం. అయితే ఈ విధంగా పర్యవేక్షించదలచిన యజమాని కొన్ని జాగ్రత్తలు పాటిండం మంచిది.
గృహ నిర్మణ సమయంలో అక్కడ జరుగుతున్న పనిని బట్టి యజమాని కొన్ని నిమిషాల నుంచి రోజంతా ఆ స్థలంలో గడపవలసి వస్తుంది. గృహపర్యవేక్షణకు సంబంధించి రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అందులో మొదటిది ఎక్కడ ఉండాలి రెండవది ఎటు చూస్తూ ఉండాలి.
గృహ నిర్మాణ స్థలం ఏ సింహద్వారం అయినా, ఎటుప్రక్క రోడ్డు ఉన్నా, గృహ నిర్మాణ స్థలానికి దక్షిణం, నైరుతి, పశ్చిమం ఈ మూడు దిశలలో అక్కడ అవసరాన్ని బట్టి ఏదో ఒక దిశన ఉంటూ తూర్పు, ఈశాన్యం, ఉత్తరం ఈ మూడింటిలో ఏదో ఒక దిశను చూస్తూ పర్యవేక్షించాలి.
గృహ నిర్మాణం: భూమి పూజ ప్రాముఖ్యం
గృహ నిర్మాణం సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. దీనినే కొందరు శంకుస్థాపన అని కూడా అంటారు. మన పంచభూతాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ.
ఈ గృహారంభ పూజా కార్యక్రమం జరపటానికి ముందుగా ఈశాన్యం దిశలో గుంతని త్రవ్వించాలి. శంఖుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు, నవధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి.
అంటే ఆ తీసిన గుంత మధ్యలో లేదా ఇంకొంచెం లోపలకు ఉండే విధంగా పాతి పెట్టాలి. గృహారంభం ఈశాన్యంలోనే చెయ్యాలని, వేరే చోట్ల చెయ్యకూడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గృహ నిర్మాణం సమయంలో వాయిదా వేయరాని పనులు?
ఇల్లు కట్టిచూడు… పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎంతటి ధనవంతుడైనా ఇల్లు కట్టే సమయంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కాదు. అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఇంటి నిర్మాణాన్ని సవ్యంగా సాగించినా. చివరికి కొన్ని పనులను అలానే వెనుకబడిపోతాయి. దీంతో కొన్ని పనులను వాయిదా వేస్తాము. అలా కాక ఎటువంటి పనులకు వాయిదా వేయవచ్చు, ఏఏ పనులను వాయిదా వేయకూడదు అనే విషయం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకు కొన్ని చిట్కాలు…
గృహం నిర్మించి కాంపౌండు గోడలు కట్టకుండా ఆపకూడదు. గృహ ఆవరణలో మట్టి నింపేపని అసంపూర్ణముగా వదలరాదు. గృహం లోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నపుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలలో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించ కూడదు. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత గృహ ప్రవేశం చెయ్యకుండా ఉంచకూడదు. ఎత్తుపల్లాలుగా తాత్కాలిక గచ్చులువేసి ఫ్లోరింగువాయిదా వేయకూడదు.
మేడ మీద మరియు మెట్లకు పిట్టగోడలు కట్టకుండా ఆపకూడదు. గృహం లోపల గోడలకు కనీసం ఒక కోటింగు తెల్లసున్నం లేదా తెల్ల సిమ్మెంటు వేయించాలి. బయట గోడలకు ఆపవచ్చు. బయట ద్వారాలకు అలుపులు పెట్టకుండా ఆపకూడదు. శ్లాబు వాస్తు రీత్యా వాటం సరిగా లేనపుడు శ్లాబుపై ప్లాస్టరింగులు/ఫినిషింగులు తప్పనిసరిగా చేయాలి.
ఇళ్లు కట్టుకునే స్థలానికి ఏ దిశలో నివాసం ఉండాలి…
చాలా మంది ఇంటి స్థలం కొన్న తర్వాత ఎప్పటికైనా ఇల్లు కట్టిస్తాం కదా అని స్థలం దగ్గరలో అద్దె ఇల్లు తీసుకొంటారు. కొంత మంది గృహ నిర్మాణానికి ముందుగా ఆ స్థలం దగ్గరలో అద్దె ఇల్లు తీసుకొని అక్కడికి నివాసం మార్చడం చేస్తుంటారు. అటువంటివారు వాస్తురీత్యా కొన్ని సూచనలు పాటించవలసిన అవసరం ఉంది.
అద్దెకు తీసుకొన్న ఇల్లు మన స్థలానికి నైరుతి, పశ్చిమం, దక్షిణాల్లో ఏదో ఒక దిక్కున ఉండాలి. ఇక్కడ నైరుతి అంటే స్థలం పక్కనే నైరుతిలోనే గృహం ఉండాలని కాదు, కొంచెం దూరం అయినా పర్వాలేదు.
మనం అద్దెకు ఉన్న ఇంట్లో నుంచి కట్టబోయే ఇల్లు ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలలో ఏదో ఒక దిశకు ఉండాలి. దానివల్ల గృహ నిర్మాణం సకాలంలో పూర్తి కాగలదు. వాస్తులో ఇది సామాన్య విషయం. గృహం రిపేర్లు చేయించేవారు, మార్పులు చేయించేవారు ఇల్లు మారదలచినవారు కూడా ఈ విధంగా జాగ్రత్త పడడం మంచిది.
కుటుంబ సభ్యులు నిద్రించే అనువైన దిశలు
మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన గలిగే శారీరక, మానసిక సమస్యలను గురించి అందరికీ తెలిసిందే. సరైన నిద్రకు అనువైన ప్రదేశం చాలా అవసరం. వాస్తు రీత్యా కుంటుంబ సభ్యులు నిర్ణీత దిశల్లో నిద్రించడం వలన అనేక లాభాలు చేకూరుతాయి.
వాస్తు ప్రకారం కుంటుంబంలోని వయస్సులో పెద్దవారు నైరుతి గదిలో పడుకోవాలి. మిగిలిన వారు వయస్సుల ప్రకారం వరుసగా దక్షిణ, పశ్చిమ, వాయువ్య గదుల్లో అవకాశాన్నిబట్టి నిద్రించడం మంచిది.
అలాగే ఒకే గదిలో కుటుంబ సభ్యులు అందరూ పడుకోవాల్సి వస్తే ఇంటికి పెద్దవారు నైరుతి దిశలోనే పడుకోవాలి. ఒక వేళ ఇంటికి పెద్దవారు క్రియాశీలక పాత్ర పోషించని వారుగా ఉన్నప్పుడు వారు నైరుతి దిశలో పడుకోవాల్సిన అవసరం లేదు.
అటువంటి వారి చిన్న పిల్లలతో సమానం కాబట్టి వారు వేరే గదుల్లో పడుకోవచ్చు. ఉమ్మడి కుంటుబం అయినపుడు పెద్దవారు నైరుతి గదిలోను, ఆ తర్వాత వారు పశ్చిమ, వాయవ్య లేదా దక్షిణ గదుల్లో నిద్రించడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంటిలో ఏ గదులు ఎక్కడ ఉండాలి?
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం, తూర్పుకు పెంచుకోవచ్చు. అయితే పూజ గది మాత్రం ప్రత్యేకంగానో లేక ఒక అలమారగా పెట్టుకుంటే సరిపోతుందా అనే విషయం గృహ యజమానుల ఇష్టాన్ని బట్టి మరియు గృహ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది.
విద్యార్థులకు సూచనలు:
తూర్పును చూస్తూ చదువుకోవటం లేదా వ్రాసుకోవడం చెయ్యాలి. ఇలా కుదరని పక్షంలో ఉత్తరం వైపు చూస్తూ చదువుకోవచ్చు. అలాఅని ఉత్తరం చూస్తూ అదేవైపు తల దించుకుని చదవకూడదు. దక్షిణ దిక్కు, నైరుతీని చూడడం మంచిది కాదు.
వివిధ గృహాలు, వాటి అమరికలు
గృహ ఆవరణలో మరో పోర్షన్లను కట్టుకోవచ్చు. కాని ఒక భవంతి వెనకాల ఇంకో భవంతిని కట్టకూడదు. ఉదాహరణకు ప్రధాన భవనంకు పశ్చిమం, దక్షిణంలో ఇంకో భవనం కట్టినపుడు అది గిడ్డంగిగానో లేక స్టోర్ రూంగానో వాడవచ్చును. కానీ కుటుంబ నివాసానికి పనికిరాదు.
పశ్చిమంలో ఉన్న భవంతికి తూర్పులో ఉన్న భవంతి భారమౌతుంది. కాబట్టి పశ్చిమంలో ఉన్న భవనం నివాసానికి పనికిరాదు. అదేవిధంగా దక్షిణంలో ఉన్న భవనానికి ఉత్తరంలో ఉన్న భవనం భారమౌతుంది కాబట్టి దక్షిణం భవనంలో నివాసాం కూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
రెండు భవనాల మధ్య కాంపౌండ్ గోడ కట్టి విడదీసినట్లైతే రెండు భవనాలను కూడా నివాస యోగ్యం అవుతాయి. విశాలమైన స్థలంలో దక్షిణ, పశ్చిమాల్లో రెండు ప్రధాన గృహాలను కట్టుకోవచ్చు. తూర్పున ఖాళీ ఉంచి మిగిలిన మూడు దిశల్లోను కట్టుకోవచ్చు. ఉత్తరం ఖాళీ ఉంచి మిగిలిన మూడు దిశల్లో గృహాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
గృహంలో మంచం వేసుకోవలసిన పద్దతి
గృహంలో మంచం మీద నిద్రించే అలవాటు ఉన్నవారు మంచాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసుకోరాదు. తద్వారా నిద్రను కోల్పోవడమే కాకుండా అనవసర ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
మంచం ఏ రూములో వేసినప్పటికీ మంచం చుట్టూ కనీసం మనిషి తిరగ గలిగినంత ఖాళీ స్థలం ఉంచడం మంచిది. మంచం కొలత, రూము కొలతలను బట్టి మంచం చుట్టూ ఉంచే ఖాళీని నిర్ణయించాలి.
మంచానికి తూర్పు, ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ, దక్షిణ పశ్చిమలలో తక్కువఖాళీ ఉండేలా చూసుకోవాలి. మంచాన్ని గోడకు అంటించి గదిలో మూలకు వేయకూడదు.
మరీ చిన్న గదుల్లో ఉండేవారు ఎంతో కొంత ఖాళీ పెట్టడానికి ప్రయత్నించాలి. గదిలో అటకలు, బీములు ఉన్నట్లయితే మంచం వాటి కిందకు రాకుండా చూసుకోవడం అవసరం. పిల్లర్లకు మరీ దగ్గరగా మంచం వేయకూడదు. ఎందుకంటే పిల్లర్లలోని ఇనుము రాత్రిల్లో అయస్కాంత శక్తిగా పని చేసి నిద్రపట్టకుండా చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా గదిలో అద్దం ఎదురుగా మంచం ఉండకూడదు. కుట్టుమిషన్లు, టీవీలు, కంప్యూటర్లు వగైరా మంచానికి మరీ దగ్గరగా ఉండరాదు. గుమ్మం ఎదురుగా మంచం వేయకపోవడం మంచిది. ఫ్యాన్ హుక్ సరిగ్గా అమరక పక్కకు జరిగినవారు సరైన విధంగా ఫ్యాన్ హుక్ వేయించుకోవాలి.
అద్దె ఇంటిలో చేరేవారు గమనికలు
సాధారణంగా సొంతఇల్లయినా, అద్దె ఇల్లయినా వాస్తురీత్యా ఉండాలి. సొంత ఇల్లు కలనెరవేరాలంటే అప్పటి వరకు అద్దెకుండే ఇల్లు కూడా వాస్తురీత్యా బాగుండాలి. మీరు ఉండే ఇల్లు గ్రామంలో అయినా, నగరంలో అయినా సరే వాస్తురీత్యా ఉండటం చాలా ముఖ్యం. అందుచేతనే అద్దె ఇంటిలో చేరేవారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. అద్దె ఇంటిలో చేరేముందు గమనికల్లో ముఖ్యమైంది నైరుతి, దక్షిణ, పశ్చిమాలలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి.
ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్యన ఖాళీ ఉండటం అవసరం. నైరుతిలో బాల్కనీ ఉండరాదు. ఇల్లు దిక్కులకు సరిగా ఉండాలి. ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండడం మంచింది. వృత్తాకారంలో మాత్రం ఉండకూడదు. అదేవిధంగా నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు.
ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి. చెడు వీధిపోట్లు, చీకటిగా ఉండి గాలి, వెలుతురు రానివి, రోడ్డు నుంచి బాగా పల్లంగా ఉన్న ఇళ్ళు మంచివికావు. టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.
ఇవి మాత్రమే కాక ఆ పోర్షన్ ఇంతకుముందు నుంచి అద్దెకు ఇస్తున్నదైతే ఇంతకుముందు అద్దెకున్న వారికి ఎలా ఉండేది, కలిసి వచ్చిందా లేక ఏవైనా ఇబ్బందులు పడ్డారా అన్నవిషయం తెలుసుకొని దాన్నిబట్టి అద్దెకు దిగాలి. పైకి బాగానే కనిపించినా గతంలో అద్దెకు ఉన్నవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు, నానా విధములైన ఇబ్బందులు కలిగించిన పోర్షనులు, తరచూ ఖాళీ అయ్యే పోర్షనులు మంచివికావని తెలుసుకోవాలి.
ప్రమాదాలు, అకాల మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగిన పోర్షనులు మంచివి కావని తెలుసుకోవాలి. అసలు వాస్తు బాగున్న ఇళ్ళు తరచూ ఖాళీ అవ్వవన్న విషయాన్ని గుర్తించడం ఎంతైనా అవసరమని వాస్తు శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.
ఇంటిలో వాహన పార్కింగ్ ఎక్కడ చేయాలి?
ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. దానికంటూ కొంత స్థలం కేటాయించి అక్కడ పార్కింగ్ చేస్తాము. అయితే ఆ స్థలం ఎక్కడ కేటాయించాలనే విషయమై వాస్తు శాస్త్రం కొన్ని సూచనలిస్తోంది.
ఇంటిబయట, ఉత్తరం, తూర్పు దిశలలో వాహనాలను పార్కింగ్ చేయరాదు. దీనిని అనుసరించనట్లైతే వాహనాలకు అప్పుడప్పుడు మరమ్మతులు చేయాల్సి వస్తుంది. వాహన పార్కింగ్ స్థలాన్ని వాయవ్య దిశగా (ఉత్తర ప్రహరీ గోడను తాకని విధంగా) కేటాయించవచ్చు.
ఇంటికి బయట నైరుతి దిశలో కూడా వాహన పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించవచ్చు. తద్వారా వాహన ప్రమాదాలను నివారించవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
మంచి, చెడు శకునాలు
–
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు, కుంకుమలతో, జడవేసుకుని కలకళలాడే ముత్తైదువు ఎదురైనట్లైతే అంతా శుభమే జరుగుతుంది. ఆ ముత్తైదువే వెంట్రుకలను విప్పుకుని రుద్రతాండవం వలే ఎదురైనట్టైతే కచ్చితంగా కీడే ఎదుర్కోవాల్సి వస్తుంది.
నీళ్ళ బిందె, పాల బిందె, పెరుగు బిందె, అన్నం వంటి వాటిని మోసుకున్నవారు, బట్టలు పులిమే చాకలి వాడు, చెఱకు కట్టలు మోసుకున్న వాడు, జత బ్రాహ్మణులు ఎదురైనట్లైతే మంచి శకునంగా భావించవచ్చు. ఇలా కాక ఒకే ఒక బ్రాహ్మణుడు ఎదురురావడం మంచిదికాదు.
ఇతర జీవరాశుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గాడిద, ఆవు, జింక, ఉడత వంటివి ఎడమ నుంచి కుడికి వెళ్ళినట్టైతే వాటిని కూడా మంచి శకునంగానే భావించవచ్చని వాస్తుశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి
జన జీవనానికి వాస్తు ఉపయోగాలు
– సంకలనం: వెంగళరావు
ఆది నుంచి వెలుగు చూస్తున్న శాస్త్రాల ప్రకారం మానవుడి కర్మఫలాల పరిశీలన మేరకే ఆయా రుతువుల ప్రకారం వాస్తును జీవనాన్ని విశదీకరించటం జరుగుతుందని ప్రతీక. హైందవ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. దానికి అనుగుణంగానే గృహం, వివాహం, సంతానం, ఉద్యోగం, ధనం, జీవితం అంటూ మానవుడికి పలు విధాలుగా శాస్త్రాల ఫలితాలను అందించటం జరుగుతుంది.
ఆయా జన్మ నక్షత్రాల మేరకు రాజు శనిగా, మంత్రి గురువుగా ఆర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు తదితర విభాగాల ద్వారా ఫలితాలను విశదీకరిస్తుంటారు. ప్రధానంగా జన్మ ఫలాలు, నక్షత్రాలు, జాతక చక్రాలకు అనుగుణంగానే జీవనం సాగుతుందని భారతీయుల నమ్మకం. ఇందులో భాగంగానే పురాణ పండితులు అనాదిగా చూపుతున్న శాస్త్రాలను పరిగణలోకి తీసుకుని, తమ జీవితాలకు తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు.
ఇందులో గృహం, వాహనంజీవనం అనే వాస్తు జీవిత గమనాన్ని కూడా మమేకం చేస్తూ ఆయా జన్మ నక్షత్రాల ప్రకారం ఫలితాలను అందిస్తుంటాయి. ప్రధానంగా గృహాల నిర్మాణం ద్వారానే జీవన గమనంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రాలు వెల్లడించటంతో భారతీయులు అధికంగా వాటినే అనుసరిస్తున్నారు.
గృహాలు – వీధి పోట్లు
గృహానికి ఎదురుగా, నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా – లేదా అక్కడ నుంచి ఏదో వైపుకు తిరిగినా, దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోట్లు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడుఫలితాలను కలిగిస్తాయి.
తూర్పు – ఈశాన్య వీధి పోటు
గృహానికి తూర్పు ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి. దీనివలన పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏరంగంలో కాలు పెట్టినా పైచేయిగా వుంటారు.
ఉత్తర – ఈశాన్య వీధి పోటు
గృహానికి ఉత్తర ఈశాన్యభాగంలో వీధి వున్నది. దీని వలన స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో వారికోర్కెలు తీర్చుకుంటూ ఆనందంగా వుంటారు. ఇంటియజమానికి మానసిక ప్రశాంతత, ధనాదాయం బావుంటుంది.
ఉత్తర – వాయవ్యవీధి పోటు
ఉత్తర – వాయవ్య భాగములో నిలువుగా వీధి వుండుట గమనించగలరు. ఈ వీధిపోటు వలన స్త్రీలు తీవ్రమైన దుష్ర్పభావానికి లోనవుతారు. పెండ్లి సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరిలో తప్పి పోవడం, ఇంకా అనేక సమస్యలను, చికాకులను కలిగిస్తాయి.
పశ్చిమ వాయవ్య వీధిపోటు
పశ్చిమ – వాయవ్యానికి ఎదురుగా వీధిని గమనిచగలరు. ఈ వీధి పోటు మంచి ఫలితాలను కలిగిస్తుంది. యజమాని సమాజ గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయనాయకులుగా కూడా రాణించగలరు. ధనాదాయం బాగుంటుంది.
పశ్చిమ – నైరుతి వీధిపోటు
గృహానికి పశ్చిమ నైరుతిభాగంలో ఎదురుగా వీధిని గమనించగలరు. దీని వలన శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందవలసిన డబ్బు కూడా చేజారిపోతుంది. ఆర్థిక కష్ట నష్టాలు తప్పవు.
దక్షిణ నైరుతి వీధిపోటు
గృహానికి దక్షిణ నైరుతిలో వీధిని గమనించగలరు. దీనివలన అనేక అశుభములు కలుగుతాయి. తరచుగా భార్య – భర్తల మధ్యన గొడవలతో సఖ్యతలేకుడా పోతుంది. ఆ ఇంట స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏకార్యం ప్రారంభించినా అవి ముందుకు సాగవు.
దక్షిణ – ఆగ్నేయ వీధిపోటు
గృహానికి దక్షిణ ఆగ్నేయంలో ఎదురుగా వీధిని గమనించగలరు. దీని వలన మంచి ఫలితములు కలుగుతాయి. కుటుంబ సుఖసంతోషాలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. బంధువుల ఆదరణ, శుభకార్య నిర్వహణలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
తూర్పు – ఆగ్నేయ వీధిపోటు
గృహానికి దక్షిణ – ఆగ్నేయములో ఎదురుగా వీధి వుండటాన్ని గమనించగలరు. దీనివలన అనేక కష్ట – నష్టాలు కలుగుతాయి. ఎన్ని రకాలుగా, ఎంత కష్టపడి సంపాదించినా అంతకుమించిన ఖర్చు ఏదోక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక వత్తిడితో శ్రమపడవలసి వుంటుంది. కుటుంబకలహాలు మరికొంత ఆవేదనకు గురిచేస్తాయి.
గృహ స్థలాలు- కలసి వచ్చే దిక్కులు
గృహ స్థలాలు, అది అమరిన దిశలకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇళ్లు కడుతున్న వారు ఏ వృత్తిలోనో లేక వ్యాపారంలో ఉంటారో దానికి తగ్గట్టు దిక్కులలో అమరిన ఇంటి స్థలాలను ఎంచుకోవడం గమనార్హం.
కొత్తగా మనం ఇళ్లు కట్టాలనుకుంటే అది అమరిన దిశనే పరిగణలోకి తొలుత తీసుకోవాలి. ఊరిలో ఆ స్థలం ఏ దిశగా ఉంటుందో దానినే ఆ సంథలం దిశగా పరిగణించాల్సి ఉంటుంది.
ఊరి దక్షిణ దిశ నుంచి ఉత్తర ముఖం చూసేలా ఉండే ఇంటి స్థలాన్నివిద్య, కళా రంగానికి చెందిన వారు కొంటే చాలా చక్కగా కలసి వస్తుంది. అలాగే తూర్పు వైపు పొడవుగా, పడమటి దిశ కొంత తగ్గినట్టు ఉన్న స్థలాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు ఇళ్లు నిర్మించవచ్చు.
అలాగే ఊరికి ఉత్తర దిశలో ఉన్న ఇంటి స్థలాన్ని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కొనవచ్చు. ఆ స్థలం దక్షిణ దిశలో కొంత పొడవుగా ఉండే పక్షంలో మరింత మంచిది.
దక్షిణ దిశ అన్నిటికన్నా ఉత్తమం
ఇంటి వాస్తు ఎలా ఉండాలనే అంశంపై మన పూర్వీకులు ఎన్నో సూచనలు అందించినప్పటికీ, వాటన్నిటినీ మనం వెంటనే అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అందువల్ల వెంటనే మనకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకపోయినప్పటికీ, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ప్రధానంగా దక్షిణ దిశకున్న ప్రాముఖ్యతను తప్పనిసరిగా గుర్తించాలి.
వందలాది సంవత్సరాలకు మునుపే దక్షిణ దిశ ప్రాశస్త్యం గురించి తాళ పత్ర గ్రంథాల ద్వారా మన పూర్వీకులు తెలిపి ఉన్నారు. ఇల్లు, భవనం, భవంతి, అంతఃపురంలలో దక్షిణ దిక్కును కొంత ఎత్తు చేసి, పెట్టుకోవాలి. దక్షిణ ముఖంగా ఇంటిలోకి వెళ్లే ప్రవేశ ద్వారం ఉంటే మరింత అదృష్టం అందుకోవచ్చు.
ఇంటిలో దక్షిణం వైపున బావి తవ్వడం అంత మంచిది కాదు. దక్షిణం వైపు లోతుగా ఉండే పక్షంలో ఓ అడుగు మేర దాని ఎత్తు పెంచుకుంటే సరిపోతుంది. దక్షిణ భాగంలో బావి ఉంటే దానిని మూసివేసి, ఉత్తరం వైపుగా బోర్ వెల్ ఏర్పాటు చేసుకోవచ్చు.
అలా చేయలేని పక్షంలో దక్షిణం వైపు ఉన్న బావిలో నీటిని నేరుగా వాడుకోక దానిని ఈశాన్యం లేక తూర్పు వైపుగా మోటార్ ద్వారా తీసుకువచ్చి ఉపయోగించవచ్చు.
ఇంటి ఎత్తు ఎంత ఉండాలి
ఇంటి నిర్మాణం చేసేవారిలో చాలామందికి తమ ఇల్లును ఎంత ఎత్తులో నిర్మించాలన్న సందేహాలు కలుగుతుంటాయి. ఇంటి ఎత్తు దాని వెడల్పులో పదహారో భాగానికి నాలుగు హస్తాలు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండాలని వాస్తు శాస్త్రం చెపుతోంది.
అంటే పైఅంతస్థులకు కింది అంతస్థు ఎత్తులో పన్నెండో వంతు తగ్గుతూ వస్తుంది. ఈ కొలత ప్రస్తుత కొలతలతో పోల్చి చూస్తే సుమారు 12 నుంచి 14 అడుగుల వరకూ వెడల్పును బట్టి ఉంటుంది.
ఇక ఇంటి ఎత్తును బట్టి ఇంటిలోపల ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. భవనానికి సంబంధించిన సీలింగ్ ఎత్తు 8 నుంచి 11 అడుగుల మధ్య ఎంత ఉన్నప్పటికీ గది ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు.
ఆ తరువాత ప్రతి ఒక అడుగు ఎత్తుకీ దాదాపు 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం భవన నిర్మాలు చేసే వారు ఇంటి ఎత్తును 10 అడుగులు ఉండే విధంగా చేయటం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
ఇక బహుళ అంతుస్థుల భవనాల విషయానికి వస్తే ప్రతి ఒక్క అంతస్థు ఎత్తుల్లో కొందరు తేడాలు కల్పించటం వల్ల అనవసర ఖర్చు పెరుగుతుంటుంది.
సహజంగా నివాసానికి ఉపయోగించే గృహాల ఎత్తు పది అడుగులు ఉండేవిధంగానూ, ఆఫీసులకు వినియోగించే భవనాల ఎత్తును పన్నెండు అడుగులు ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల అన్నివిధాలా సౌకర్యంగా ఉంటాయి.
భవనాల వయసు తెలిపే వాస్తు
భవన నిర్మాణ శాస్త్రం ప్రకారం…మనం నిర్మించుకునే మన ఇల్లు ఎంత కాలం వరకు ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఆ శాస్త్రంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్పష్టమైన రీతిలో అందుబాటులో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రాతిపదికన ఈ వివరాలను నిర్ణయించడంతో అవి చాలామందికి నమ్మకంగా ఉంటోంది.
ఇంటి యజమాని జన్మ లగ్నానికి నాలుగో పాదంలో చంద్రుడు, పదకొండో పాదంలో గురు, అంగారకుడు, శని ఉన్న సమయంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఆ భవనం వందేళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. అలాగే గురు ఏడో స్థానంలో ఉంటూ, పదిలో చంద్రుడు ఉన్న సమయంలో నిర్మాణం ప్రారంభించే భవనం వెయ్యేళ్లు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉండగలదు.
లగ్నంలో లేక పదో పాదంలో శుక్రుడు, మూడో పాదంలో బుధుడు ఉన్న సమయంలో గృహనిర్మాణం చేపడితే ఆ ఇళ్లు రెండు వందల ఏళ్ల పాటు నిలకడగా ఉంటుంది. జన్మ లగ్నంలో చంద్రుడు, నాలుగో స్థానంలో బుధుడు ఉండే సమయంలో ముహూర్తం నిర్ణయిస్తే ఆ ఇళ్లు వందేళ్లకు పైగా స్థిరంగా ఉంటుంది.
శుక్రుడు 4, 7 పాదాలలో, సూర్యుడు ఆరో పాదంలో, గురువు మూడో పాదంలో ఉన్న సమయంలో పెద్ద పెద్ద మంటపాలు, భవంతులు, గోపురాలు వంటి వాటిని నిర్మిస్తే అవి వెయ్యేళ్ల వరకు వాటి స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
గృహాలంకరణలో వాస్తు పాత్ర
గృహప్రవేశమైన తర్వాత ఇంట్లో ఎన్నో పనులు మిగిలి ఉంటాయి. వాటిలోనిదే ఇంటికి సున్నం వేయించడం. గృహప్రవేశానికి ముందు రంగు వేయించినా తర్వాత మళ్లీ సరిగ్గా వేయించుకుంటాం కొందరు ముందే సరిగా వేయిస్తారు. కొందరికి ఆ సమయం కూడా ఉండదు.
ఇలాంటి సమయాల్లో మళ్లీ సున్నం వేయాలి కనుక కొన్ని జాగ్రత్తలతో వేస్తే సరిపోతుంది. ఇంటికి తెల్ల సున్నం వేయించుటలో తప్పులేదు. కాని ఇంటి పెద్ద జాతక రీత్యా లగ్నాధిపతి ఏ గ్రహముతో కలసి ఉంటాడో చూసుకుని రంగు వేయించడం మంచిది.
తూర్పు వైపు గృహమునకు తెల్ల రంగు, దక్షిణ వైపున అయితే ఎరుపు రంగు, పశ్చిమ వైపున అయితే నీలి రంగు, ఉత్తరం వైపు ఆకుపచ్చని రంగులు వేస్తే మంచిది. ఇంటికి ఇష్ట దైవం పేరు పెట్టుకోవచ్చు. పేరు పక్కనపెట్టే భవనము అంటే బాలురు గలదని, నిలయము అంటే నిధులు కలదని అర్థము.
ఉత్తరమున తల పెట్టి పడుకోకూడదు. ముఖ ద్వారానికి ఎదురుగాను, దూలానికి వెన్ను కింద భాగంలోనూ తలపెట్టి పడుకోరాదు. తూర్పు వైపు తిరిగి భుజించే విధంగా డైనింగ్ టేబుల్ ఉండాలి. ఇంట్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉంచాలి.
ఏ వస్తువు అక్కడ పెట్టకూడదు, తగిలించకూడదు. ఇంటి ఆవరణలో చెట్లు పెంచేటట్టయితే వాటి నీడ ఇంటి మీద పడకుండా ఉండేట్టు చూడాలి.
ఇంటి స్థలం కోసం వెళ్లే సమయంలో శకునాల జాగ్రత్తలు
ఇంటిలో గది నిర్మాణాల విషయంలోనే కాక నిర్మాణ పనులు ప్రారంభించే ముందు కూడా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి స్థలం చూసేందుకు వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే శకునం కుడా ఆ ఇంటిలో మనకు ఎదురయ్యే అనుభవాలకు కారణంగా నిలుస్తుంది.
తాపీ మేస్త్రీని ఇంటి నిర్మాణ స్థలానికి తీసుకుని వెళ్లే సమయంలో నుదుట కుంకుమ తిలకం, జడ నిండా పువ్వులు, మెడలో మాంగల్య సూత్రం కలిగిన ఓ నిండు సుమంగళి ఎదురుగా వస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఈ రకమైన శకునంతో పనులు ప్రారంభిస్తే ఆ ఇంటిలో నివసించే వారు సకల సౌభాగ్యాలతో కలకాలం విలసిల్లతారని శాస్త్రంలో చెబుతున్నారు. అలాగే కొత్త ఇంటికి శంకు స్థాపన చేసే సమయంలో నీళ్లు లేక పాలతో నిండిన కుండ, అలాగే పెరుగు కుండను మోసుకొచ్చే మహిళలు (వాటిని తీసుకొచ్చే వాహనాలైనా సరే) కూడా మంచి శకునాలు కావచ్చు.
గృహంలో పెంచతగ్గ చెట్లు, మొక్కలు
గృహ నిర్మాణానికే కాకుండా, గృహంలో చెట్లను పెంచేందుకు కూడా శాస్త్రం చూడక తప్పదు. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో కొన్ని చెట్లను మాత్రమే పెంచుకోవచ్చు.
శాస్త్రీయంగా చూస్తే మునగ, ఉసిరి, చింత, నేరేడు, పనస వంటి చెట్లు, మిరియాలు వంటి మొక్కలను ఇంటిలో పెంచడం వలన ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది.
అలాగే అరటి, కొబ్బరి, మామిడి, వేప, ధానిమ్మ, నిమ్మ, ద్రాక్ష వంటి చెట్లను ఇళ్లలో పెంచినట్లైతే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని హిందూ సంప్రదాయ వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది.