Wednesday, 14 July 2021

ఆలస్య వివాహం-సంతానం -ఉద్యోగం-కుజ దోషం -సర్ప దోషం -ఆర్దిక సమస్యలు నుండి బయటపడుటకు స్కంద షష్టి (సుబ్రహ్మణ్య స్వామి) పూజా విధానం:

 

ఆషాడ మాసం స్కంద షష్టి (సుబ్రహ్మణ్య స్వామి) పూజా విధానం:

ఆలస్య వివాహం-సంతానం -కుజ దోషం -సర్ప దోషం-ఉద్యోగం-ఆర్దిక సమస్యలు  నుండి బయటపడుటకు ఈ రోజు  స్కంద   షష్టి (సుబ్రహ్మణ్య స్వామి) పూజా విధానం ఆచారించుట ద్వార వివిధ సమస్యల నుండి బయట పడవచ్చు ::షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం  చెబుతున్నది.

పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. సులభంగా ఇంటివద్ద సుబ్రహ్మణ్య పూజా చేసుకొనుట కొరకు పూర్తీ విధానం క్రింద ఇవ్వబడినది.

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||

ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.

శ్రీ పసుపు గణపతి పూజ:

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

  • ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
  • మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
  • వామనాయ నమః, శ్రీధరాయ నమః,
  • ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
  • దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
  • వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
  • అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
  • అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
  • అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
  • ఉపేంద్రాయ నమః, హరయే నమః,
  • శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

  • శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
  • వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
  • అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
  • నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
  • అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్  వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ముద్దిశ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూర్వక అష్టోత్తర పూజాం కరిష్యే…

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

సుబ్రహ్మణ్య పూజ విధానము:

ప్రాణప్రతిష్ఠపన

శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం |
రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||

షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ||
కుమారేశసూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తి హారిన్ ప్రభో తారకారే సదారక్షమాంత్వం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి

ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి

రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)

పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)

శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)

వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి
(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)

అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షంతలు చల్లాలి)

ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి
(పూలు, అక్షంతలు చల్లాలి)

పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
(పూలు వేయాలి)

అథాంగ పూజ:

  • ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
  • ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
  • ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
  • ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
  • ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
  • ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
  • ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
  • ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
  • ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
  • ఓం తారకారి నమః కంఠం పూజయామి
  • ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
  • ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
  • ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
  • ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
  • ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
  • ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ పూజ
(ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)

  • ఓం స్కందాయ నమః
  • ఓం గుహాయ నమః
  • ఓం షణ్ముఖాయ నమః
  • ఓం ఫాలనేత్రాయ నమః
  • ఓం ప్రభవే నమః
  • ఓం పింగళాయ నమః
  • ఓం కృత్తికాసూనవే నమః
  • ఓం శిఖివాహాయ నమః
  • ఓం ద్విషడ్భుజాయ నమః
  • ఓం శక్తిధరాయ నమః
  • ఓం పిశితాశప్రభంజనాయ నమః
  • ఓంతారకాసురసంహర్త్రే నమః
  • ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
  • ఓం మత్తాయ నమః
  • ఓం ప్రమత్తాయ నమః
  • ఓం ఉన్మాత్తాయ నమః
  • ఓంసురసైన్యసురక్షకాయ నమః
  • ఓం దేవసేనాపతయే నమః
  • ఓంపాప్రాజ్ఞాయ నమః
  • ఓం కృపాళవే నమః
  • ఓంభక్తవత్సలాయ నమః
  • ఓంఉమాసుతాయ నమః
  • ఓం శక్తి ధరాయ నమః
  • ఓం కుమారాయ నమః
  • ఓం క్రౌంచదారణాయ నమః
  • ఓం సేనానియే నమః
  • ఓం అగ్నిజన్మనే నమః
  • ఓం విశాఖాయ నమః
  • ఓంశకరాత్మజాయనమః
  • ఓంశివస్వామినే నమః
  • ఓం గుణస్వామినే నమః
  • ఓం సర్వ స్వామినే నమః
  • ఓం సనాతనాయ నమః
  • ఓం అనంతశక్తియే నమః
  • ఓం అక్షోభ్యాయ నమః
  • ఓం పార్వతీ ప్రియనందనాయ నమః
  • ఓం గంగాసుతాయ నమః
  • ఓం శరోద్భూతాయ నమః
  • ఓం ఆహుతాయ నమః
  • ఓం పావకాత్మజాయ నమః
  • ఓం జృంభాయ నమః
  • ఓంప్రజృంభాయ నమః
  • ఓం ఉజృంభాయ నమః
  • ఓం కమలాసనసంస్తుతాయ నమః
  • ఓంఏకవర్ణాయ నమః
  • ఓం ద్వివర్ణాయ నమః
  • ఓం త్రివర్ణాయ నమః
  • ఓం సుమనోహరాయ నమః
  • ఓం చతుర్వర్ణాయ నమః
  • ఓం పంచవర్ణాయ నమః
  • ఓం సుమనోహరాయ నమః
  • ఓం ప్రజాపతయే నమః
  • ఓం అహర్పతయే నమః
  • ఓం అగ్నిగర్భాయ నమః
  • ఓం శమీగర్భాయ నమః
  • ఓం విశ్వరేతసే నమః
  • ఓం సురారిఘ్నే నమః
  • ఓం హరిద్వర్ణాయ నమః
  • ఓం శుభకరాయ నమః
  • ఓం వటవే నమః
  • ఓం వటువేషభృతే నమః
  • ఓం పూషాయ నమః
  • ఓంగభస్తియే మః
  • ఓంగహనాయ నమః
  • ఓం చంద్రవర్ణాయ నమః
  • ఓం కళాధరాయ నమః
  • ఓం మాయాధరాయ నమః
  • ఓం మహామాయినే నమః
  • ఓం కైవల్యాయ నమః
  • శంకరాత్మజాయ నమః
  • ఓం విశ్వయోనియే నమః
  • ఓం అమేయాత్మాయ నమః
  • ఓం తేజోనుథయే నమః
  • ఓం అనామయాయ నమః
  • ఓం పరమేష్ఠినే నమః
  • ఓం పరబ్రహాయ నమః
  • ఓంవేదగర్భాయ నమః
  • ఓం విరాట్పతయే నమః
  • ఓంపుళిందకన్యాభర్తాయ నమః
  • ఓం మహాసారస్వతావృతాయ నమః
  • ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
  • ఓం చోరఘ్నాయనమః
  • ఓం రోగనాశనాయ నమః
  • ఓం అనంతమూర్తయే నమః
  • ఓం ఆనందాయ నమః
  • ఓంశిఖండీకృతకేతనాయ నమః
  • ఓం డంభాయ నమః
  • ఓం పరమఢంభాయ నమః
  • ఓం మహాడంభాయ నమః
  • ఓం వృషాకపయే నమః
  • ఓం కారణోపాత్తదేహాయ నమః
  • ఓం కారనాతీత విగ్రహాయ నమః
  • ఓం అనీశ్వరాయ నమః
  • ఓంఅమృతాయ నమః
  • ఓం ప్రాణాయ నమః
  • ఓం ప్రాణాయామపరాయణాయ నమః
  • ఓం విరుద్ధహంత్రే నమః
  • ఓం వీరఘ్నాయ నమః
  • ఓం రకావతస్యాయ నమః
  • ఓం శామకందరాయ నమః
  • ఓం సుబ్రహ్మణ్యాయ నమః
  • ఓం గుహాయ నమః
  • ఓం ప్రీతాయ నమః
  • ఓం బ్రహ్మణ్యాయ నమః
  • ఓం బ్రాహ్మణప్రియాయ నమః
  • ఓం వేదవేద్యాయ నమః
  • ఓం అక్షయఫలదాయ నమః
  • ఓంవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామనే నమః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్ఠోత్తర శతనామావళిః

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపం సమర్పయామి
(అగరవత్తులు వెలిగించండి)

దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి
(దీపం చూపించాలి)

నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)

తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం చూపాలి)

నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి
(కర్పూరం వెలిగించాలి)

మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం:
(చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి

పునః పూజ:

  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః చామరం వీజయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నృత్యం దర్శయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గీతం శ్రావయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గజాన్ ఆరోహయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆందోళికాం ఆరోహయామి
  • ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక |
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.


Friday, 9 April 2021

ఉగాది 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర 12 రాశుల రాశి ఫలాలు

 

ఉగాది 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర 12 రాశుల రాశి ఫలాలు

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి రాశీ ఫలాలు
అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.
May be an image of ‎text that says "‎మేషరాశి Aries ۔gn‎"‎
2020 - 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 14 , రాజపూజ్యం - 04 అవమానం - 03.
పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5" .ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీ ప్రమేయం లేకుండానే అపవాదులు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.
మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం 19-నవంబర్-2021 వరకు వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా పితృ వర్గం లోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పరచును. వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు. కుటుంబంలో తరచుగా శుభ కార్య సంబంధ వ్యయం అధికంగా ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రం లో ఉన్న వారు ఒక పర్యాయం 16 రోజుల గురు గ్రహ శాంతి జపము జరిపించు కొనుట మంచిది.. 20-నవంబర్-2021 నుంచి మేష రాశి వారికి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించుట ప్రారంభం అగును. మిక్కిలి న్యాయమైన ధన సంపాదన ఏర్పరచును. జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.
మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. శని మేష రాశి వారికి ఆశించిన విధంగా ధన సంపాదన లభింప చేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యముల, లోహముల వ్యాపారం చేసే వారికి మంచి లాభములు లభింపచేయును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించి సంతాన సౌఖ్యం కలుగచేయును. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. గడిచిన శ్రీ శార్వరి నామ సంవత్సరం వలెనే ఈ ప్లవ నామ సంవత్సరంలో కూడా పేర్కొనదగిన తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమియూ రాహు గ్రహం వలన మేష రాశి వారికి లేవు.
మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా కేతు గ్రహం వలన గడిచిన శార్వరి నామ సంవత్సరం వలననే అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించ వలెను. వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు కలిగిన వారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు. నూతనంగా దైవ ఉపాసన చేయదలచిన వారికి అనేక విఘ్నములు ఏర్పడును.
ఏప్రిల్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు పట్టుదల పెరుగుతుంది. న్యాయస్థాన సంబంధ విషయాలు చికాకులు ఏర్పడును. ద్వితీయ వారంలో సంతాన సంబంధ అనారోగ్యం అశాంతిని ఏర్పరచును. ఇష్టమైన వారి గురించి అశుభ వార్త వినుటకు అవకాశం ఉన్నది.. 18 వ తేదీ తదుపరి ఉద్యోగ ప్రయత్నాలలో కార్య సిద్ధి లభించును. నిరుద్యోగుల ప్రయత్న విజయములు చేకురును. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నెల మొత్తం ధనాదాయం సామాన్యం.
మే 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ నెలలో ప్రధమ , ద్వితీయ వారాలలో వృత్తి , ఉద్యోగ , వ్యాపార వ్యవహారములో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రత్యర్ధుల మీద పై చేయి సాధిస్తారు. స్థిరాస్థి సంబంధ అగ్రిమెంట్లకు అనుకూలం. అవివాహితులకు వివాహ సంబంధ సంతోషము లభించును. వాహన సౌఖ్యం పొందుతారు. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు ఎదురగును. కార్యక్రమాలలో శ్రమించవలెను. ప్రైవేట్ ఉద్యోగస్తులకు చికాకులు. కృత్తిక నక్షత్ర స్త్రీలకు అనారోగ్యం. స్టాక్ మార్కెట్ వ్యవహారములో అదృష్టం కలసిరాదు. 20, 21, 29 తేదీలలో సమస్యలు. కుటుంబ సంబంధ వ్యవహార చిక్కులు.
జూన్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు. సొంత గృహ సంబంధ సంతోషములు లభించును. వృధా ధన వ్యయం తగ్గించ గలుగుతారు. ఆభరణాలు కొనగలుగుతారు. పై అధికారులతో సంభాషనలందు మాట జాగ్రత్త అవసరం. 17, 18 తేదీలలో వ్యాపార రంగంలోని వారికి ప్రభుత్వ సంబంధ సహకారం లభించును. మానసిక ప్రశాంతత, మిత్రులతో కలయికలు, తలపెట్టిన పనులలో విజయం చేకురుట ఏర్పడును. ఈ నెలలో 9, 11,12 తేదీలు ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి.
జూలై 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం పెరుగును. చేయుచున్న వృత్తి వ్యాపారాలలో , ఉద్యోగ ప్రయత్నాలలో జయము ప్రాప్తించును. విధి నిర్వహణలో మార్పులకు సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మిక ధన ప్రాప్తి లభించును. వ్యాపార విస్తరణ పనులు చేపడతారు. భాత్రు వర్గం వారికి సహాయం చేయగలుగుతారు. మీ శ్రమ కు తగిన గుర్తింపు పొందగలుగుతారు. భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్ధిక పరమైన వ్యూహాలు రచించగాలుగుతారు. ఈ మాసంలో 13, 21 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు చేయకుండా ఉండుట మంచిది.
ఆగస్టు 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పనిచేయు స్థలంలో అధికారుల వలన లేదా కుటుంబంలో పెద్దల వలన మానసికంగా ఆందోళన కలుగు సూచన. వ్రుత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించ కలుగుతారు. న్యాయవాద రంగంలోని వారికి కొన్ని ఉన్నత అవకాశములు అప్రయత్నపుర్వకంగా లభిస్తాయి. బంధు వర్గం వలన అవమానాలు లేదా చికాకులు. ఆర్ధికంగా మోసానికి గురి అగుటకు అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం.18 నుండి 24 తేదీల మధ్య కాలంలో దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు.
సెప్టెంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిత్రుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొట్టిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు లభించును. రావలసిన ధనం చివరి నిమిషంలో లభించి పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన భాద్యతలు తీసుకోవలసి వస్తుంది. పుత్ర సంతాన సంబంధ శుభ వార్త పొందుటకు సూచనలు ఉన్నవి. మేష రాశికి చెందిన స్త్రీలకు ధనం వలన సౌఖ్యం లభిస్తుంది.ఆర్ధికంగా బలపడుదురు. మిత్రుల వద్ద ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. చివరి వారంలో మానసిక ఒత్తిడి , అంచనాలు తలక్రిందులు అవుట వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కొత్త ప్రాజెక్టులు చేపట్టుట లేదా ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉండుట మంచిది.
అక్టోబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గత కాలంలో పోగట్టుకున్న చక్కటి అవకాశములు తిరిగి పొందగలుగుతారు. స్త్రీలు అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు ఎదురగును.ప్రధమ మరియు ద్వితీయ వారాలలో వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. ముఖ్యంగా ద్వితీయ వారం అంత మంచిది కాదు. అననుకూలమైన ఫలితాలు, మిత్రులతో విభేదాలు. కార్యములలో చిక్కులు ఎదురగును. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అనుకూల పరిస్థితి ఏర్పడి సౌఖ్యం. చిరకాల కోరికలు తీర్చుకోగలుగుతారు. 5,8, 26, 27 తేదీలు వివాహ ప్రయత్నములకు మంచిది.
నవంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో నిదానంగా అలోచించి నిర్ణయాలు తీసుకొనుట అవసరం. విజయ అవకాశములు స్వల్పం. పనిభారం పెరిగి సతమతమవుతారు. నిరాశ కలిగించే సంఘటనలు ఎదురగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఆశించిన విధంగా ఉండదు. సొంత ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. ఉద్యోగం ఆశిస్తున్న వారికి కష్టం మీద శుభవార్త. తృతీయ వారం సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం. 10, 14, 29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారాలకు అనుకూలమైనవి కావు. రావలసిన ధనం ఆలస్యంగా లభిస్తుంది.ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం కాదు.
డిసెంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం ప్రారంభంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలు అధిగమించగలరు. దీర్ఘకాలిక సమస్యలను సొంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనలు కార్య రూపం దాల్చును. కుటుంబ వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు లభించును. దైవ సందర్శన భాగ్యం లభించును. కుటుంబంలోని వ్యక్తుల వలన వ్యయం. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7,9 ,16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. చివరి వారంలో మాత్రం దారి తప్పే ఆలోచనలతో మనశ్శాంతి లోపించును. అపార్ధాలు ఏర్పడును. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభించక నిరుత్సాహ పడతారు.
జనవరి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టం పొందుటకు అవకాశం ఉన్నది. ఆర్జించిన ధనం నిలువదు. ఉద్యోగ జీవనంలో అఖస్మిక ఉద్యోగ నష్టములు. పనిభారం కూడా పెరుగుతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అదుపు తప్పుతాయి. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్ర చికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన ఎదురగును. తదనుకూల ధన వ్యయం. శ్రమ అధికమగును.మిత్రుల సహకారం కొంత వరకు లభించుట వలన ఉపశమనం లభించును. ముఖ్యంగా 27, 28, 29 తేదీలు అనుకూలం కాదు.
ఫిబ్రవరి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సమస్యలు కొంత వరకు తగ్గును. నూతన గృహ సంబంధమైన లేదా గృహ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం మంచి సమయం. కొద్దిపాటి కష్టంతో చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్ధులకు మంచి కాలం. 9,10.16.25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, నూతన ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఋణాలు తొలగి ఊరట పొందుతారు. రావలసిన ధనం పొందుతారు.స్థిరాస్థి సంబంధ సమస్యలు తొలగుతాయి.
మార్చి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత విషయాలలో కొద్దిపాటి మానసిక ఆందోళన లేదా నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. ద్వితీయ మరియు తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు పొందుటకు సూచనలు ఉన్నవి. 22 వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ముఖ్యంగా26, 27, 28 మరియు 29 తేదీలలో శుభ ఫలితాలు లభించుటకు అవకాశం ఉన్నది.
 
వృషభరాశి రాశీ ఫలాలు:
May be an image of text that says "వృషభరాశి Taurus Sign"
మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 07 అవమానం - 03.
పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.
వృషభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచు కొందురు. ఏ ప్రయత్నం కూడా మానసికంగా సంతృప్తిని కలుగ చేయదు. నూతన భారీ పెట్టుబడులు 19-నవంబర్-2021 వరకు పెట్టకుండా ఉండటం మంచిది. 20-నవంబర్-2021 నుంచి వృషభ రాశి వారికి గురు గ్రహం యోగించును. ముఖ్యంగా వ్రుత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కటి ఉద్యోగ అవకాశములు, స్వయం ఉపాధి చేయు వారికి విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభ పూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్ధ యాత్రలు 20-నవంబర్-2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు. ఆచార వంతమైన జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు.
వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం గడిచిన శార్వరి నామ సంవత్సరం వలెనే మంచి ఫలితాలను కలుగచేయును. నూతన వాహన కోరిక నెరవేరును. వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగములలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలరు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభించును. ఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చ స్థితి లేదా మూల త్రికోణము లో ఉన్న వారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు. ఇటువంటి జాతకులు తమ వంశానికి పేరు ప్రఖ్యాతలు వచ్చు సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ల వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవనంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.
ఏప్రిల్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అని తెలుసుకుంటారు.సొంత మనుష్యులతో విరోధములు చికాకులు ఏర్పరచును. సహాయం ఆశించి పొందక నిరాశ చెందుతారు. 17 వ తేదీ వరకు గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. వ్యవహార చిక్కులు లేదా ప్రయత్నాలలో ఆటంకములతో విజయం పొందుతారు.. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయవలసి వచ్చును. జూదం వలన నష్టం. ఎదుర్కొందురు. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత లభించును. కుటుంబ సభ్యుల మధ్య బంధాలపై దృష్టి పెట్టవలెను. నూతన ఆదాయ మార్గములు లభించును. మాసాంతంలో వాహన సౌఖ్యం అనుభవిస్తారు
మే 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కూడా అంతగా అనుకూల ఫలితాలు ఉండవు. వాదనలకు ఈ మాసం అనుకూలమైనది కాదు. అయితే ధనాదాయం సామాన్యం గా ఉండును. వ్రుత్తి జీవనంలో వేధింపులు కొనసాగుతాయి. వ్యవహార నష్టములు. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు , ఉద్యోగ జీవనంలో మార్పులకు ఈ మాసం మంచిది కాదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదరగుట వలన ధన వ్యయం ఎదుర్కొందురు. పితృ వర్గీయుల వలన సహాయం పొందుతారు. ఈ మాసంలో 11,12,15 మరియు 16 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆర్ధిక సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. ఆదాయం ఆశించిన విధంగా లభిస్తుంది. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. నూతన పరిచయాలు జీవన ఉన్నతికి దారితీస్తాయి.లౌఖ్యంతో పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రుత్వములు తొలగును. మానసిక ప్రశాంతత, వృత్తిలో ప్రోత్సాహకర వాతావరణం లభిస్తుంది. ద్వితియ వారం మరియు తృతీయ వారములలో ఆశించిన చక్కటి పురోగతి లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు , సంతాన ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇచ్చును. నాల్గవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత.తొలగి ప్రయత్న పూర్వక విజయాలు లభిస్తాయి. ఒక వేడుకకు సంబంధించిన సన్నాహాలు చేస్తారు
జూలై 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం యోగదాయకంగా ఉండే కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు. మిత్రుల వలన లాభం పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధమ ద్వితియ వారాలలో కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సదావకాశం పొందుతారు. తల్లి గారి ఆరోగ్య సమస్యల వలన మాత్రం ఆందోళన ఏర్పడుతుంది. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ రంగంలో వ్యాపార పెట్టుబడులు చేయు వారు లాభం పొందుతారు. తృతీయ వారం నుండి ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 15, 24, 30 మరియు 31 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో తలపెట్టిన నూతన కార్యములు విజయం పొందును. వ్యక్త్రిగత జీవితానికి సబందించిన సముచిత నిర్ణయాలు తీసుకో గలుగుతారు. సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈ మాసం సంతాన ప్రయత్నములకు మంచి అనుకూలమైన కాలం. ధనాదాయం బాగుండును. పొదుపు పధకాలలో పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ముఖ్యమైన పత్రాలకు సంబందించిన విషయాలలో జాగ్రత్త ఉండాలి. 19, 20 తేదీలలో వ్రుత్తి జీవనంలో ఉన్నతి లభించును. చివరి వారంలో ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నములు చేయుటకు అనుకూల కాలం. ప్రశంసలు లభించును, ధనాదాయంలో వృద్ది.
సెప్టెంబర్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వారసత్వ సంబంధమైన లేదా కళత్ర మూలక ధన సంపదల వలన ఆర్ధిక సౌఖ్యం పొందుతారు. వ్యాపారములు బాగా నడుస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో ఉండును.వివాహ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. సోదర వర్గీయులతో మాట తగాదాలు ఏర్పడు అవకాశం ఉన్నది. మీ శ్రమ ఫలించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆద్యాత్మిక భావాలూ పెంపొందుతాయి. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి సంబందించిన అనారోగ్య సమస్యలు ఆందోళన ఏర్పడును. చివరి వారం గత కాలంలో నిలిపి వేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు అనుకూల కాలం.
అక్టోబర్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం భవిష్యత్ కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు మంచి కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు.పై అధికారుల సహకారంతో స్థాన చలన లేదా ప్రమోషన్ సంబంధ విషయాల్లో విజయం పొందుతారు. విమర్శలకు ధీటుగా బదులిస్తారు. 13 వ తేదీ తదుపరి చేపట్టిన పనులు అసంపూర్తిగా ముగించాల్సి వస్తుంది. మీ భాద్యతలు ఇతరులకు అప్పచెప్పడం వలన ఇబ్బందులు ఎదురగును. ఆశించిన విధంగా విశ్రాంతి లభించదు. వైవాహిక జీవన సుఖరాహిత్యత ఎదురగును. చివరి వారంలో ఒక ప్రమాదము నుండి త్రుటిలో తప్పించుకొనే సూచనలు ఉన్నవి.
నవంబర్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు కూడా ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ప్రతికూలతలు ఎదురగును. కుటుంబ వ్యయం అదుపు తప్పుతుంది. తలపెట్టిన పనులలో దైవ ఆశీస్శులు అవసరం. అనుభవజ్ఞుల సలహాలు కోరుట మంచిది. ప్రభుత్వ సంబంధ పెద్దల వలన సమస్యలు ఎదుర్కొందురు. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు పొందుతారు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్య రూపం దాల్చవు. అవకాశములు చేజారినా మంచిదే అనే భావన పెమ్పొందిన్చుకోనుట అవసరం. సంతాన విద్యాభ్యాసం మాత్రం సంతృప్తిని కలుగ చేస్తుంది. ఈ మాసంలో 5,9,10,26 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2021 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగుటకు , గౌరవ హాని సంఘటనలకు, ఆకస్మిక నష్టములు పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. నూతన కార్యములు ప్రారంభించుట మంచిది కాదు. ప్రధమ వారంలో రోహిణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఆరోగ్య ఆపదలు ఏర్పడు అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయాల్లో మొండితనం మంచిది కాదు. ద్వితియ వారంలో ధనానికి ఇబ్బంది లేకున్నా మానసిక సంతృప్తి ఉండదు. మిత్రులే శత్రువులగును. బందువుల మాటతీరు పట్టించుకోనుట మంచిది కాదు. తృతీయ మరియు చివరి వారములు వివాహ ప్రయత్నములకు అనుకూలం. గృహంలో మార్పులు చేపడతారు. మాసాంతంలో వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
జనవరి 2022 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం మంచి ఫలితాలను కలిగించును. తలపెట్టిన కార్యములందు జయం వరించును. తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమాజహితమైన పనులు తలపెడతారు. కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం గడిపెదురు. అవకాశములు తక్షణం వినియోగించుకోనుట అవసరం. నిర్దిష్టమైన ఇష్ట అయిష్టాలను ప్రదర్శించుట వలన మాట పడతారు. మాసాంతంలో ఉద్యోగులకు పై అధికారుల సహకారం వలన ఆశించిన వృద్ధి లభించును.వ్యాపారములలో చక్కటి ధనప్రాప్తి లభించును. స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యం పొందేదురు
ఫిబ్రవరి 2022 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. శరీర ఆరోగ్యం కూడా సహకరించును. ద్వితీయ వారం వరకూ వృత్తి వ్యాపార విషయాల్లో మంచి లాభములు లభిస్తాయి. తృతీయ వారం ప్రారంభం నుండి పట్టుదలకు పోవడం వలన చక్కటి అవకాశములు కొల్పోవుదురు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఎదురగును. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసిక ఆలోచనలు అధికం అగును.
మార్చి 2022 వృషభ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఉద్యోగ జీవన పరంగా ఆందోళన కలిగించు వాతావరణం ఏర్పడును. ఆకస్మిక వివాదాలు భాదించును మరియు ధనాదాయం తగ్గును. బంధు వర్గం వలన వ్యక్తిగత జీవనంలో ఒత్తిడులు ఎదురగును. ఆశించిన విధంగా సహకారం లభించదు. చివరి వారంలో చికాకులు అధికం అగును. గృహ నిర్మాణ విషయాలలో వ్యయం అధికం అగును. ఈ మాసంలో 3,16,17,25 తేదీలు అనుకూలమైనవి కావు.
 
శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు :

పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 06, అవమానం - 06
పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వ్రుత్తి వ్యాపారాలలో , కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.
కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20-నవంబర్-2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్ర లేదా శత్రు స్థానాలలో కలిగి ఉన్న కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.
కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.
కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి విజయం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.
ఏప్రిల్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు లభించును. వ్యక్త్రిగత సమస్యల నుండి బయట పడతారు. ఉద్యోగ వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. పుష్యమి నక్షత్ర జాతకులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు ఏర్పడును, కుటుంబంతో సంతోష సమయం గడిపెదరు . 9వ తేదీ నుండి ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం - తన్మూలక లాభం పొందేదురు. ఇతరులకు మీ మీద ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.
మే 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. స్వశక్తితో అన్ని కార్యములు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ప్రయత్నములకు , వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చక్కటి ఉత్సాహం ఏర్పరచును. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారముల వలన ఒక నష్టం ఎదుర్కోను సూచన.
జూన్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొద్దిపాటి చికాకులను ఏర్పరచును. సమస్యల పరిష్కారానికి చాకచక్యత అవసరం. ధనాదాయం సామాన్యం. భాత్రువర్గం వారితో విరోధములు నష్టములు ఏర్పరచును. మానసిక చాంచల్యత సంబంధ అనారోగ్యం వలన 18, 19 తేదీలలో ఇబ్బందులు ఎదుర్కొందురు. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంత అనుకూలత మరియు జయం ఏర్పడును. ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాలకు ధనం అనుకోని విధంగా ఖర్చు పెట్టవలసి వచ్చును.
జూలై 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆలోచనలు ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి కారణం లేకుండా కోపం, చిరాకు ఏర్పడుచుండును. ఆచార సంప్రదాయములను విడిచి వ్యవహరించేదురు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత ఆశించిన విధంగా ఉండదు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. వినోద సంబంధ వ్యయం చేయుదురు. ఈ మాసంలో 3,8,11,13,17 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి ప్రారంభమగును. కొన్ని వివాదాల నుండి ఉహించని విధంగా బయట పడతారు.ఈ మాసంలో 14, 15, 16 మరియు 17 తేదీలలో కార్యానుకులత లభించును. ప్రభుత్వ రంగంలోని వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి , కార్య భారం పెరుగుతుంది. ఔషధ సంబంధ వ్యాపార రంగం లోని వారికి చక్కటి అభివృద్ధి లభించును. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో ఉండును. చిన్న పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయుట అంతగా కలసిరాదు.
సెప్టెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ప్రయత్న ఆటంకములు ఎదురైనా అంతిమంగా విజయం లభించును. ధనాదాయం సామాన్యం గా ఉండును. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.యుక్తితో సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ , తృతీయ వారములు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం పొందును. ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. 23 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య కాలంలో కుటుంబ పెద్దలతో గొడవల వలన మానసిక అశాంతి ఎదురగు సూచన ఉన్నది.
అక్టోబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడవు. ఇతరుల సహకారము ఆశించిన విధంగా ఉండదు. ధనాదాయం తగ్గును. ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం ఎదుర్కొందురు. మాసం మధ్యలో దైవదర్శన లేదా పుణ్య క్షేత్ర సందర్శన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. 18 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. మాసాంతానికి ప్రశాంతత లభించును. ఈ మాసంలో 5,14,20,29 తేదీలు అంత అనుకూలమైనవి కాదు.
నవంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. అయితే ఆశించిన విధంగా ధనాదాయం ఉండదు. సంతానం వలన సౌఖ్యత అనుభవిస్తారు. నిర్ణయాలలో జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం పొందుటకు సూచనలు ఉన్నవి. నూతన వ్యవహారాలు ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. 16,17,18 తేదీలలో గౌరవ హాని సూచన. మాసాంతంలో ప్రయాణ మూలక వ్యయం అధికమగుట మరియు ఆరోగ్య భంగములకు కూడా సూచనలు ఉన్నవి.
డిసెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆశించిన రుణాలు పొందగలుగుతారు.శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అగును. 10 వ తేదీ తదుపరి వ్యాపార విస్తరణ కు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములు విజయవంతం అగును. కోర్టు వ్యవహారములకు కూడా ఈ మాసం అనుకూలం . గృహ వాతావరణంలో సంతోషములు మధ్యమ ఆనందములు ఇచ్చును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి కావు. 15,16 తేదీలు వివాహ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును.
జనవరి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో నూతన పనులు ఆరంభించకూడదు.భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ చికాకులు ఎదుర్కొందురు. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం పొందేదురు. ధనదాయంలో కూడా కొంత పెరుగుదల లభించును. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడును. చివరి వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు. చికాకులు కలిగించే మరియు ప్రయోజనం లేని ఫలించని ప్రయాణములు చేయవలసి వచ్చును.
ఫిబ్రవరి 2022 కర్కాటకకర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20-నవంబర్-2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్ర లేదా శత్రు స్థానాలలో కలిగి ఉన్న కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.
కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.
కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి విజయం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.
ఏప్రిల్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు లభించును. వ్యక్త్రిగత సమస్యల నుండి బయట పడతారు. ఉద్యోగ వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. పుష్యమి నక్షత్ర జాతకులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు ఏర్పడును, కుటుంబంతో సంతోష సమయం గడిపెదరు . 9వ తేదీ నుండి ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం - తన్మూలక లాభం పొందేదురు. ఇతరులకు మీ మీద ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.
మే 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. స్వశక్తితో అన్ని కార్యములు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ప్రయత్నములకు , వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చక్కటి ఉత్సాహం ఏర్పరచును. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారముల వలన ఒక నష్టం ఎదుర్కోను సూచన.
జూన్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొద్దిపాటి చికాకులను ఏర్పరచును. సమస్యల పరిష్కారానికి చాకచక్యత అవసరం. ధనాదాయం సామాన్యం. భాత్రువర్గం వారితో విరోధములు నష్టములు ఏర్పరచును. మానసిక చాంచల్యత సంబంధ అనారోగ్యం వలన 18, 19 తేదీలలో ఇబ్బందులు ఎదుర్కొందురు. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంత అనుకూలత మరియు జయం ఏర్పడును. ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాలకు ధనం అనుకోని విధంగా ఖర్చు పెట్టవలసి వచ్చును.
జూలై 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆలోచనలు ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి కారణం లేకుండా కోపం, చిరాకు ఏర్పడుచుండును. ఆచార సంప్రదాయములను విడిచి వ్యవహరించేదురు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత ఆశించిన విధంగా ఉండదు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. వినోద సంబంధ వ్యయం చేయుదురు. ఈ మాసంలో 3,8,11,13,17 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి ప్రారంభమగును. కొన్ని వివాదాల నుండి ఉహించని విధంగా బయట పడతారు.ఈ మాసంలో 14, 15, 16 మరియు 17 తేదీలలో కార్యానుకులత లభించును. ప్రభుత్వ రంగంలోని వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి , కార్య భారం పెరుగుతుంది. ఔషధ సంబంధ వ్యాపార రంగం లోని వారికి చక్కటి అభివృద్ధి లభించును. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో ఉండును. చిన్న పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయుట అంతగా కలసిరాదు.
సెప్టెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ప్రయత్న ఆటంకములు ఎదురైనా అంతిమంగా విజయం లభించును. ధనాదాయం సామాన్యం గా ఉండును. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.యుక్తితో సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ , తృతీయ వారములు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం పొందును. ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. 23 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య కాలంలో కుటుంబ పెద్దలతో గొడవల వలన మానసిక అశాంతి ఎదురగు సూచన ఉన్నది.
అక్టోబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడవు. ఇతరుల సహకారము ఆశించిన విధంగా ఉండదు. ధనాదాయం తగ్గును. ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం ఎదుర్కొందురు. మాసం మధ్యలో దైవదర్శన లేదా పుణ్య క్షేత్ర సందర్శన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. 18 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. మాసాంతానికి ప్రశాంతత లభించును. ఈ మాసంలో 5,14,20,29 తేదీలు అంత అనుకూలమైనవి కాదు.
నవంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. అయితే ఆశించిన విధంగా ధనాదాయం ఉండదు. సంతానం వలన సౌఖ్యత అనుభవిస్తారు. నిర్ణయాలలో జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం పొందుటకు సూచనలు ఉన్నవి. నూతన వ్యవహారాలు ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. 16,17,18 తేదీలలో గౌరవ హాని సూచన. మాసాంతంలో ప్రయాణ మూలక వ్యయం అధికమగుట మరియు ఆరోగ్య భంగములకు కూడా సూచనలు ఉన్నవి.
డిసెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆశించిన రుణాలు పొందగలుగుతారు.శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అగును. 10 వ తేదీ తదుపరి వ్యాపార విస్తరణ కు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములు విజయవంతం అగును. కోర్టు వ్యవహారములకు కూడా ఈ మాసం అనుకూలం . గృహ వాతావరణంలో సంతోషములు మధ్యమ ఆనందములు ఇచ్చును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి కావు. 15,16 తేదీలు వివాహ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును.
జనవరి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో నూతన పనులు ఆరంభించకూడదు.భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ చికాకులు ఎదుర్కొందురు. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం పొందేదురు. ధనదాయంలో కూడా కొంత పెరుగుదల లభించును. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడును. చివరి వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు. చికాకులు కలిగించే మరియు ప్రయోజనం లేని ఫలించని ప్రయాణములు చేయవలసి వచ్చును.
ఫిబ్రవరి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గృహంలో విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య సంబంధ వ్యయం ఎదుర్కొందురు. గృహంలో వాస్తు మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూల కాలం. సంతానం తో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు.
మార్చి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. పోటీ దారులు తొలగును. ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం అనుభవిస్తారు. మిత్రుల సహకారంతో కెరీర్ పరంగా వృద్ధి లభించును. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు , విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును. రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గృహంలో విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య సంబంధ వ్యయం ఎదుర్కొందురు. గృహంలో వాస్తు మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూల కాలం. సంతానం తో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు.
మార్చి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. పోటీ దారులు తొలగును. ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం అనుభవిస్తారు. మిత్రుల సహకారంతో కెరీర్ పరంగా వృద్ధి లభించును. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు , విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును.
 
శ్రీ ప్లవ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు:
May be a cartoon of text
మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం 02, వ్యయం - 14, రాజ పూజ్యం - 02, అవమానం - 02.
పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి అన్ని వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.
సింహరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు కలిసి రాదు. గత శార్వరి నామ సంవత్సరపు సమస్యలు కొనసాగును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం యోగించును. ఆర్ధికంగా నూతన అవకాశములు కలుగ చేయును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. వైవాహిక జీవన సుఖసౌఖ్యాలు పొందుదురు. దీర్ఘకాలికంగా కళత్ర జీవనంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పరచును.
సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు లభించును. కుటుంబ మరియు వ్రుత్తి సంబంధ శత్రువులపై విజయం పొందుదురు. తగాదాలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు సింహ రాశి వారికి అనుకూలంగా ముగియు సూచనలు అధికంగా ఉన్నవి. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్ భాగ్యములు లభించును. విశేషమైన ధనార్జన ఏర్పరచును. మాత్రు వర్గం వలన లాభాపడుడురు. భూ లేదా గృహ సౌఖ్య ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం. రాహు- కేతువుల వలన విద్యా పరంగా విద్యార్థులకు అతి చక్కటి ఫలితాలు ఏర్పరచును.
ఏప్రిల్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
మాస ప్రారంభంలో సొంత మనుష్యులతో వివాదములు, రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోను సూచన ఉన్నది. ప్రారంభించిన కార్యములు అటంకములను ఎదురైనా చివరికి పూర్తి అగును. చేతిపై వృధా వ్యయము అధికంగా ఏర్పడును. 14వ తేదీ నుండి పరిస్థితి కొంత అనుకులించును. ఆర్ధిక పరిస్థితి మరింత సానుకూలమగును. విద్యార్ధులకు ముఖ్యంగా వ్రుత్తి విద్య కొరకు ప్రయత్నించు వారికి మంచి కాలం ప్రారంభం అగును. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. మాసాంతంలో బాల్య మిత్రులను కలువుట వలన లేదా ఆప్తుల తో కలయిక వలన ఆనందమయ సమయం.
మే 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అతి చక్కటి ఫలితాలు ఎదురగును. ధనాదాయం పెరుగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆశించిన లాభములు లభించును. వివాహ పరంగా దూర ప్రాంతము నుండి వచ్చిన ఎదురుచూస్తున్న శుభ వార్త ఆనంద పరుస్తుంది. గృహ వాతావరణం శాంతిని కలిగి ఉంటుంది. మాస మధ్యలో వ్యక్తిగత ఖర్చులు ముఖ్యంగా వాహనాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయుట వలన అధికంగా ఏర్పడును. కోర్తువ్యవహరములలో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చివరి వారంలో ఒంటరితనం అనుభవిస్తారు. కళాకారులకు చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో 2,6,7,15,16,29 తేదీలు ఉద్యోగ జీవనములో మార్పులకు అనుకూలమైనవి. నూతన ప్రణాళికలు రచించడానికి కూడా అనుకూలమైనవి.
జూన్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలు ఎదురగును. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించును. ప్రవర్తనలోని పొరపాట్లను సరిదిద్దుకొని వ్యవహారములను పూర్తి చేయగలుగుతారు. తృతీయ వారంలో ప్రత్యర్ధుల నుండి సానుకూల సందేశాలు అందుకుంటారు. వివాదాలు కొలిక్కి వచ్చును. ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా సాగుతాయి. ఈ మాసంలో 23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును.
జూలై 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారములు ఉత్సాహ పూరితంగా , లాభపూరితముగా కొనసాగుతాయి. పనిచేయు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మూలకంగా కూడా ఆశించిన సౌఖ్యం ఉండును. ప్రధమ వారంలో గృహంలో కోరుకున్న మార్పులు, పుణ్యక్షేత్ర సందర్శన వంటి అనుకూల ఫలితాలు, ద్వితియ మరియు తృతీయ వారంలో ఆకస్మిక వివాదములు, సమయం వృధా అగుట , ఖర్చులు పరిమితి మించుట వంటి కొద్దిపాటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొందురు. అయితే వృత్తి వ్యాపారాలలో మాత్రం ఆదాయం సామాన్యం గానే ఉండును. ఉద్యోగ జీవనం సామాన్యం. ఈ నెలలో 19,22,23 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
ఆగస్టు 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కూడా ధనాదాయం సామాన్యం. గృహంలో స్త్రీల ఆర్ధిక పరిస్థితి గతం కన్నా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో సంతోషములు, బంధువులు మిత్రుల నుండి ఆశించిన సహకారములు పొందుదురు. సంతాన ప్రయత్నాలలో విజయం లభించును.ఈ మాసంలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2,11,19, 21, 29 తేదీలు మంచివి కావు. కష్టంతో కార్యములు పూర్తి లేదా మానసిక అశాంతిని ఏర్పరచును
సెప్టెంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ఆధ్యాత్మిక జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. ముఖ్యంగా అర్చకత్వం వంటి పవిత్ర సేవలో ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడును. కుటుంబ విషయాల్లో సభ్యుల మధ్య మాట కలవదు. స్త్రీ సంబంధ వివాదాములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు మందకొడిగా కొనసాగును. దూరప్రాంత ప్రయాణములు. కోర్టు వ్యవహారములలో అననుకూలత ఎదుర్కొందురు. నిరుద్యుగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. జీవన మార్గం శ్రమతో కూడి ఉండును. ఈ మాసంలో 13 నుండి 19వ తేదీ మధ్య ప్రయాణములు చేయుట మంచిది కాదు.
అక్టోబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నములు లాభించును. స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థల సందర్శన చేయుదురు. ద్వితియ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేయుదురు.మీపై ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గును. తృతీయ వారంలో మాతృ వర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు విజయవంతం అగును. చివరి వారం సాధారణ ఫలితాలు కలుగచేయును.
నవంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం ఆశించిన విధంగా ఉండును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి. పితృ వర్గీయుల ఆదరణ మరియు ప్రేమ పొందుదురు. మిత్రుల వలన ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు లభించును. అవివాహితులకు కూడా శుభవార్త లభించును. తృతీయ వారంలో ధైర్య సాహసములు పనికిరావు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కష్టానికి తగిన ఫలితం లభించదు. ఈ వారంలో ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం అగును. ఈ మాసంలో 4, 9, 17, 20, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో వ్యాపారాదులలో జయం , ఆఖస్మిక ధన ప్రాప్తి యోగం ఉన్నవి. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు పొందుతారు. వృత్తి వర్గం వారికి చక్కటి ధన లాభములు లభించును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు కలుగచేయును. తృతీయ వారంలో కుటుంబంలో అనారోగ్య కారణాల వలన కొద్దిపాటి మానసిక అశాంతి ఎదురగును. జీవిత భాగస్వామితో మద్యమ సంతోషాలు. దూరప్రాంత లేదా విదేశీ జీవన ప్రయత్నములు ఆటంకములతో ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ నెలలో ప్రధమ ద్వితియ వారములు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి.
జనవరి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆదాయం లో కొద్దిపాటి తగ్గుదల ఎదుర్కొందురు. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో ధన లాభం ఏర్పడదు. వడ్డీ వ్యాపార రంగంలో ధననష్టములకు అవకాశములు కలవు. మిత్ర వర్గమునకు సంభందిచిన ఒక అశుభ వార్త వినుటకు కూడా సూచన ఉన్నది. చక్కటి స్త్రీ సంతాన ప్రాప్తి. 11వ తేదీ తదుపరి నూతన పరిజ్ఞానంలో శిక్షణ లు పొందు అవకాశం ఉన్నది. ఉద్యోగ జీవనంలో చిక్కులు తొలగుతాయి. మాసాంతంలో నూతన వ్యవహారములు ప్రారంభించుట వాయిదా వేసుకొనుట మంచిది.
ఫిబ్రవరి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య బాధలు తొలగును. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. ప్రధమ మరియు ద్వితియ వారములలో శత్రువిజయం, ఆదాయ పెరుగుదల మరియు జీవన హోదాలో ఉన్నతిని ఆశించవచ్చు. పురుష సంతాన వలన చికాకులు ఎదుర్కొందురు.సర్వ శుభకార్య ప్రయత్నాలు లాభించును. మిత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టముగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేది మధ్య కాలం అనుకూలంగా లేదు. 23వ తేదీ నుండి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు పొందుదురు.
మార్చి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కళత్ర మూలకంగా సంతోషకరమైన వాతావరణం అనుభవిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. లేదా నూతన వస్తువల అమరిక లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలలో కదలిక ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. రాజకీయవర్గంలోని వారికి అవమానములు లేదా అప్రతిష్టలు ఏర్పడును. భూ సంబంధ లావాదేవీలు ఆశించిన విధంగా ముగియవు. ఆశలకు భిన్నంగా ఉండును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంభదమైన వ్యయం. వ్యయములకు అవసరమగు ధనం సకాలంలో లభించును. ఈ మాసంలో 5,7,14,20,21,25 తేదీలు వ్యక్తిగత వ్యవహారాలకు అనుకూలమైనవి.
 
శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు :
May be an image of ‎text that says "‎ﷺ కన్యారాశి Virgo Sign‎"‎
ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 05, అవమానం - 02.
పూర్వ పద్దతిలో కన్యా రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చక్కటి విజయాన్ని సూచించుచున్నది.
కన్యారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు.తరచుగా గురు గ్రహం అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు ఏర్పరచును. వారసత్వ సంబంధ స్థిరాస్తులు నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన కన్యా రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్త వహించాలి.
కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి సుందరమైన పుత్రికా సంతానం లభించును. పుత్ర సంతానమునకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. లోహ సంబంధ వ్యాపారాలు చేసే వారు విశేషమైన లాభములు పొందుతారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.
కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు- కేతువు ఇరువురూ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. భూ సంబంధ వ్యాపారాలు చేయు వారికి విశేష ధనార్జన కలుగ చేయును. అయితే పితృ వర్గం వారికి సంవత్సరం మధ్య మధ్య తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును.
ఏప్రిల్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మొదటి వారం తదుపరి నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది. వ్యాపారములో అభివృద్ధి. పిత్రువర్గీయులతో విరోధములు పొందుతారు. తృతీయ వారంలో మిత్రుల వలన ఇష్ట కార్యం పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నములలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. నూతనంగా ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో హామీలు ఇచ్చుట మంచిది కాదు.మాత్రు వర్గీయులతో వివాదాలకు అవకాశం ఉన్నది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును.
మే 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సమస్యలు తగ్గును.పరిస్థితులు మెరుగు పడును. ఆదాయం లో పెరుగుదల లభించును శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సమయం ప్రాధాన్యత గుర్తించాలి. ఒత్తిడి ని తట్టుకొని పని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బంధువుల కలయికతో సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలరు.22 వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు వింటారు. ఇష్ట దైవ ఆరాధన కలసి వస్తుంది.జీవనంలోఉన్నతి మరియు సంతాన పరంగా శుభం ఏర్పరుస్తుంది.
జూన్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన విషయాలు ఆందోళన కలుగచేయును. ధన ఆదాయం ఆశించిన విధంగా బాగుండును. ఋణ సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. జీవన ప్రమాణం పెరుగును. స్థిరమైన జీవనం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన మానసిక ప్రశాంతత పొందుతారు. పుత్ర పౌత్రాభివృద్ధి అనుభవిస్తారు.సంకల్ప సిద్ధి లభిస్తుంది.
జూలై 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో చక్కటి సుఖసంతోషాలు ఉండును. భూ లేదా గృహ లాభం ఏర్పడును. వ్యాపార జీవనంలోని వారికి ఆశించిన లాభములు లభించును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి లోపించును. ప్రధమ ద్వితియ వారములలో నూతన పరిచయాల వలన లాభం, సంఘంలో మంచి గుర్తింపు మరియు ఆశించిన ధనాదాయం పొందుదురు. 18 వ తేదీ తదుపరి మొహమాటంతో సమస్యలు జటిలం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. సొంత గృహ నిర్మాణ సంబంధ ప్రయత్నాలు చేయవచ్చు.
ఆగస్టు 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. అయితే మాస ప్రారంభంలో జ్వరతత్వం వలన బాధపడు సూచనలు ఉన్నవి. నిల్వ ఉంచుకున్న ధనము కొంత వృధా వ్యయం అగును. నమ్మిన వ్యక్తులే ఇబ్బంది పెడతారు. సొంత నిర్ణయాలే మంచివి. మాస మధ్యమం నుండి లాభకరమైన పరిస్థితి ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగును. ప్రతీ వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును.కొద్దిగా శ్రమ అధికమగును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు.
సెప్టెంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు లభించవు. ఒక చిన్న శస్త్రచికిత్స , గృహంలో చొర నష్టం వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కార్యభారం పెరుగును. దూరప్రాంత ప్రయాణములు నష్ట పరచును. ప్రయాణాలు వాయిదా వేయండి. మనోవేదన ఎదుర్కొందురు. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. పెట్టుబడులు కొరకు చేయు ప్రయత్నాలు ఫలించవు. బాగా ఎదిగిన సంతానముతో కొద్దిపాటి విరోధములు ఏర్పడును. ఉద్యోగ జీవనం సామాన్యం గ కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. ఈ మాసంలో ప్రతీ సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించుట మంచిది.
అక్టోబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సంకల్ప సిద్ధి , అంతా ఆశించిన విధంగానే జరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. గత కాలపు ఇబ్బందుల నుండి బయటపడతారు.వ్యక్తిగత జీవనంలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది. సేవకులపై అతిగా ఆధారపడకుండా ఉండుట మంచిది. ప్రధమ వారమలో వృధా వ్యయం తగ్గించ గలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. విద్యార్ధులకు ఆసక్తి కొరవడుతుంది. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం లభిస్తుంది. ఈ మాసంలో 2,12,17, 23 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసం కూడా అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును.వినోద కార్యక్రమాలలో పాల్గోనేదురు.అయితే కుటుంబ సభ్యులతో అపార్ధాలకు సూచనలు ఉన్నవి. మీ భావాలూ స్పష్టంగా ప్రకటించడం మంచిది. వస్త్ర, గృహ, ధన లాభములు పొందుతారు. ఋణ బాధలు తొలగి మానసికంగా ఆనందకరమైన వాతావరణం. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన మంచి బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం పై అనుమానాలు ఏర్పడతాయి. 21 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును.
డిసెంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. సంతాన ప్రాప్తి వలన ఆనందకరమైన కాలం పొందుదురు. కార్యానుకులాత లభించును.పరుష వాక్కుల వలన ఇబ్బందులు ఉన్నవి. వృత్తి వ్యాపారములు నిదానంగా కొనసాగును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు ఆర్జించేదురు. నిల్వ ధనం ఏర్పర్చుకోగలరు. ఈ మాసంలో 8,16,24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు.
జనవరి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ప్రేమ వ్యవహారములందు మానసిక వ్యధ ఎదుర్కొందురు. అకాల భోజనములు, శిరో బాధ మరియు నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కష్టం మీద కార్య జయం లభించును. చివరి వారంలో విరామం లేకుండా పనులు కొనసాగును. మొత్తం మీద ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోనిన మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు ఉన్నవి. మీ వలన ఇతరులకు ఉపకారం జరుగుతుంది. ఈ మాసంలో 13,14,15 తేదీలు అనుకూలమైనవి కావు.
ఫిబ్రవరి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో చికాకులు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులలో చివరకు జయం లభించును. వివాహ సంబంధ సంతోషం పొందుతారు. శత్రు జయం లభిస్తుంది. చేయు పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పురాణ శ్రవణ కాలక్షేపం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఈ మాసం విదేశీ ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారములు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండవు. చివరి వారంలో శ్రమ అధికం, అనిశ్చిత వాతావరణం ఎదుర్కొందురు.
మార్చి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు. రావలసిన ధనం సమయానికి అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభం అగును. సంతాన ప్రయత్నములు దైవ ఆశీస్శులతో విజయం పొందును. ఆర్ధిక విషయాలలో అనుకూలత ఏర్పడును స్థానచలన ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలం అగును. కుటుంబ భవిష్యనిధి ఏర్పాటు కు ఈ మాసం మంచి కాలం.
 
 
శ్రీ ప్లవ నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు :
May be an image of text
మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 07, అవమానం - 05
పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైచరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనుర్ రాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శని కి శాంతి జపములు చేయించుకొనుట మంచిది.
ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర వహిస్తారు.
ఏప్రిల్ 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గృహం వాతావరణంలో వివాదాల వలన చికాకులు ఎదుర్కుంటారు. ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారములలో వాతావరణం ఆశించిన విధంగానే కొనసాగును. సంతాన పరంగా శుభకరమైన ఫలితాలు పొందుతారు. బహుమతులు పొందుతారు. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించడం చాలా ముఖ్యం. తృతీయ వారంలో శారీరక రుగ్మతలు , సమయ పాలన కోల్పోవుట వంటి చికాకులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి కొనసాగుతుంది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ఈ మాసంలో ధనానికి లోటు రాదు.
మే 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మానసిక ఒత్తిడి అధికం. కానీ ఆదాయం బాగుండును. రావలసిన ధనం చేతికి వచ్చును. ద్వితియ వారంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం అంతగా బాగుండదు. ముఖ్యంగా ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా అననుకూలత ఉన్నది. వ్యాపారులకు ఆశాభంగములు ఎదురగును. రాజకీయ పదవుల కోసం తీవ్రంగా శ్రమించవలెను. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం అగును. తలపెట్టిన పనులు హడావిడిగా సాగుతాయి. ఆగ్రహవేశాలు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 24,25 తేదీలలో ఉద్రేకం వలన నష్టం మరియు మిత్రు వర్గీయులతో శత్రుత్వములు ఏర్పడు సూచనలు ఉన్నవి.
జూన్ 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం బాగుండును. ఆశపెట్టుకున్న విధంగా ధనాదాయం పెరుగును. వృత్తి వ్యపారాదులలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనం లోని వారికి పై అధికారుల వలన కొద్దిగా ఒత్తిడి ఎదురగును. మూత్రపిండ లేదా కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు భాదించును. కానీ ఆయుర్ధాయ గండం ఉండదు విద్యార్ధులకు విద్యా అవకాశ సంబంధ వ్యవహారములు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించవలసి వచ్చును. కుటుంబంలో నడుస్తున్న ఆధిపత్య పోరు కొంత బాధించును.
జూలై 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కుటుంబం లోనూ , వృత్తి వ్యాపార జీవనంలోనూ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడును. ఆశించిన విధంగా లాభకరమైన వాతావరణం కలిగి ఉందురు. సంతాన ప్రయత్నాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. సొంత వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. గత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. చివరి నిమిషంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొందురు. 18 నుండి 23 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్య బాధించును. 25 వ తేదీ తదుపరి మాసాంతంలో అందరి మన్ననలు లభిస్తాయి.సంతోషకర రోజులు.
ఆగస్టు 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ద్రవ్య నష్టములు ఎదుర్కొందురు. సొంత మనుష్యుల గురించిన మీ అభిప్రాయాలు తలక్రిందులు అవుతాయి. వృత్తి జీవనంలోని వారికి అనుకోని రీతిలో ఖర్చులు ఎదురగును. కుటుంబంలో పితృ వర్గీయులకు ఆరోగ్య గండాలు ఉన్నవి. విదేశీ ఉద్యోగ జీవనం చేయువార్కి స్థిరాస్తి నష్టములు లేదా విసా సంబందిత ఇబ్బందులు ఏర్పడు అవకాశం ఉన్నది. స్త్రీలకు అపవాదులు మరియు మనశ్శాంతి లోపించుట వంటి సంఘటనలు ఉన్నవి. ఈ మాసంలో విలాసాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. గర్భిణి స్త్రీలు జాగ్రత్త వహించవలెను.
సెప్టెంబర్ 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ లేదా వస్తు మార్పిడి సంబంధమైన పనులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతి ని ఆశించవచ్చు.మీ పనుల పట్ల శ్రద్ధా శక్తుల వలన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం వలన మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వినుదురు.
అక్టోబర్ 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కొంత అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో మనసుకు నచ్చని స్థానభ్రంశం, విద్యార్ధులకు విద్యావిఘ్నత, మహిళలకు శరీర హాని వంటి ప్రతికూల ఇబ్బందులు ఏర్పడును.వ్యాపార రంగం వార్కి కూడా ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. ఇటువంటి వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి అనుభవించెదరు. అనవసర ఖర్చులు పెరుగును.తృతీయ వారము ఉద్యోగ జీవులకు శ్రమకరంగా ఉండును.ఈ మాసంలో 7, 9,12,13, 21, 27 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబర్ 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం కొంత అనుకూలంగానే ఉండును. ఆదాయం సామాన్యంగా ఉండును. ఆశించిన విధంగా నిల్వ ధనం ఏర్పరచుకోగలరు. పెట్టుబడులు, శ్రమ వృధా కావు. చాకచక్యత ప్రదర్శిస్తారు. మీ వ్యతిరేకులు మీకు సన్నిహితంగా నటించి ధన సహాయం అర్దిస్తారు.వారిని అతిగా నమ్మి హామీలు ఇవ్వకూడదు. ఈ మాసంలో 3,16,17,25,26 తేదీలు ఎదో తెలియని వెలితి వెన్నాడుతుంది.ఆందోళన చెందుతారు.
డిశంబరు 2021 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును. మహిళలు నిరాదరణ వలన భాదించబడతారు. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ఈ మాసం 12, 13 తేదీలలో శరీరమునకు అలసట మరియు 20 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనము లో ఒత్తిడి, నడుస్తూ ఉన్న పనులలో విఘ్నతలు కలిగి చికాకులు ఏర్పడును. ఈ మాసంలో తలపెట్టిన ఆలోచనలు సజావుగా కార్యరూపం దాల్చవు.
జనవరి 2022 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం. మీపై వచ్చిన అభియోగాలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వగలరు. ఈ మాసంలో వ్యవహార అనుకూలత ఉంది. సంస్థల సభ్యత్వాలు తీసుకొనుట కలసి వస్తుంది. మిత్రుత్వాలు బలపడతాయి. మాస మధ్యమంలో దైవ దర్శనం, పారమార్ధిక చింతన వంటి కార్యముల వలన ఆహ్లాదకరమైన కాలం ఏర్పడుతుంది. ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.వివాహ ప్రయత్నములకు మధ్యమ ఫలితాలు లభించును. పుత్ర సంతానమునకు అనుకూలమైన కాలం.
ఫిబ్రవరి 2022 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం అనుకూలమైన మాసం. నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. అవసరమైన ధనం సమయానికి చేతికి లభించును. ఇరుగుపొరుగు వారి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఆలోచనలు సక్రమంగా ఉండును. పనుల భారం వలన అలసట ఏర్పడును. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు బాధించును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగును. స్థిరాస్థి పత్రాలు మీ చేతికి వస్తాయి.
మార్చి 2022 ధనుర్ రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. బంధు మిత్రుల కలయిక వలన మానసిక ఉల్లాసం పొందుతారు. అతిధి సత్కారములకు ధన వ్యయం ఏర్పడుతుంది. స్థాన చలన ప్రయత్నములకు అనుకూలత ఉంది పనులలో ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు సద్దుమనుగుతాయి. ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 15, 22, 23, తేదీలు అంత అనుకూలమైనవి కావు.