Friday, 29 November 2019
మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి/స్కంద షష్ఠి అనగా ఏమి?: ఆరోజు ఏం చేస్తారు,ఏం చేస్తే శుభం కలుగుతుంది?
.png)
మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి/స్కంద షష్ఠి అనగా ఏమి?: ఆరోజు ఏం చేస్తారు,ఏం చేస్తే శుభం కలుగుతుంది?
శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి,కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్,గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి..........సర్వేజాన:సుఖినోభవంతు
కార్తిక అమావాస్య -పోలి స్వర్గం పూజ విధానం -poli swargam
కార్తిక అమావాస్య -పోలి స్వర్గం పూజ విధానం :
కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. 
ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం గృహంలో పడక గదులు ఏవిదంగా ఏర్పాటు చేసుకోవాలి ? పాటించే పదహారు సూత్రాలు ఏమిటి ?
వాస్తు శాస్త్రం ప్రకారం గృహంలో పడక గదులు ఏవిదంగా ఏర్పాటు చేసుకోవాలి ? పాటించే పదహారు సూత్రాలు ఏమిటి ?
1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)
2పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. ( *విష్ణుస్మృతి*)
3. *విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.( *దేవీ భాగవతము*).పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( *పద్మ పురాణము*)
5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)
విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( *మహాభారతం*)
విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( *మహాభారతం*)
6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో *ధనము,ఆయువు* ప్రాప్తిస్తుంది.( *ఆచార మయూఖ్*)
8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)
10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*
11.ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.
12.దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.
13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.
15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)
*ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*
ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరవేయండి......మీతో పాటు అందరికీ లాభాన్ని చేకూర్చాలి..
vastu-vaastu-వాస్తు దిశ -అధిపతులు - అష్ట దిక్పాలకులు
vastu-vaastu-వాస్తు దిశ -అధిపతులు - అష్ట దిక్పాలకులు
1.ఇంద్రుడు - తూర్పు దిక్కు:
ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.
2.అగ్ని - ఆగ్నేయ మూల :
ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.
3.యముడు - దక్షిణ దిక్కు :
ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.
4.నైఋతి - నైఋతి మూల :
ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.
5.వరుణుడు - పడమర దిక్కు :
ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.
6.వాయువు - వాయువ్య మూల :
ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.
ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.
7.కుబేరుడు - ఉత్తర దిక్కు:
ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.
8.ఈశాన్యుడు - ఈశాన్య మూల:
ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.
హిందు సనాతన ధర్మిక నీయములు ,గృహస్థులు- విధి విధానాలు :
హిందు సనాతన ధర్మిక నీయములు ,గృహస్థులు- విధి విధానాలు :
1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.
2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.
3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు..
5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.
6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.
7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు...
8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..
9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది..
10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి..
11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి.
12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది..
13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.
14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.
15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.
16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.
17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు.
18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు...
19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు,
20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..
21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.
22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...
23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు..
24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..
25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో
కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి..
26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు..
27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....
28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..
30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.
31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి....
32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది...
Sunday, 10 November 2019
కార్తీక పౌర్ణమి దీపారాధన విశిష్టత :KARTIKA POURNAMI
KARTIKA POURNAMI :
దీపారాధనలో దివ్య మహిమ :
కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి , విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున , కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ప్రత్యేకం గా కార్తిక పౌర్ణమి రోజు చెయ్యవలిసిన విషయములు :
దైవ దర్శనం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడినది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి హారులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.
మరింత సమాచారం :
కార్తికేతు కృతదీక్షా నృణాం జన్మవిమోచనీ కార్తీకమాసంలో ముఖ్యమైన పండుగలు రెండున్నాయి. ఒకటి క్షీరాబ్ధి ద్వాదశి కాగా రెండవది కార్తీక పౌర్ణమి. కార్తీకమాసంలో దీపాలు వెలిగించటం, దీపదానం చేయడం శ్రేష్ఠం. సాయంకాల వేళల్లో శివాలయం లేదా విష్ణువ్ఞ ఆలయంలో దీపాలు పెడితే పుణ్యం. మిగతా రోజుల్లో చేయకపోయినా, కార్తీకపౌర్ణమి నాడు తప్పక దీపాలు వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులను పెట్టి దీపాలు పెడతారు. నదుల్లో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయటం మంచిది.
ఏవిధంగా చూసినా కార్తీకమాస ఆరాధనలు శివ,కేశవ్ఞలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కార్తీకపౌర్ణమి నాడు కృత్తికా శివయోగం అనే పూజాపర్వాన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో శివాలయాల వద్ద జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటల్ని రక్షించమని కోరుకుంటారు. ఉదయం శ్రీహరిపూజ, సాయంత్రం సంధ్యవేళ శివారాధనం, దీపాలంకరణ, ఆకాశదీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీకమాసంలో ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం నిత్యవిధులుగా నిర్దేశించబడ్డాయి. కార్తీకపౌర్ణమినాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంటవేసి పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు ఆ మంటకిందుగా తిప్పుతారు. దీనిని జ్వాలాతోరణం అంటారు. హాలాహలం సముద్ర మధన సమయంలో వచ్చినపుడు పార్వతీదేవి పరమశివ్ఞని ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భరీత్యా ప్రజారక్షణ చేసిన సంకేతంగా ఈ జ్వాలాతోరణం జరుపుతారు.
ఈరోజంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శించుట వలన సర్వపాపాల ప్రక్షాళన జరుగుతుంది. కార్తీకమాసంలో ఏ మంత్రదీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కార్తీక ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5రోజులు -”భీష్మపంచకవ్రతం అంటారు. ఈ ఐదురోజులు శివమంత్రం గానీ, విష్ణుమంత్రం గానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే శివాలయంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరమంతా శివాలయంలో దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈరోజున తమ స్థోమతకు తగ్గట్టు వెండి, రాగి, కంచు, మట్టి ప్రమిదలలో దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తారు. ఈరోజు విష్ణువ్ఞకు కూడా ఇష్టమైనది కనుక అన్ని శివాలయాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పౌర్ణమినాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వర్తించి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. తెల్లవారి నాలుగైదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. కనుక ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదమని, ఆరోగ్యదాయకమని పెద్దలు చెబుతారు. కార్తీకపౌర్ణమికో కథ ఉంది. కృతయుగంలో మాయా నగరంలో దేవశర్మ అనే వేదపండితుని కుమార్తె గుణవతి.
దేవశర్మ చంద్రుడు అనే యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకు వివాహం జరిపించాడు. ఒకనాడు మామా అల్లుళ్లిద్దరూ పళ్లు, పూలకోసం అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుడి చేత సంహరింపబడ్డారు. గుణవతి తండ్రికి, భర్తకి ఉత్తమగతులకోసం ఆచరించాల్సిన కర్మలన్నీ ఆచరించింది. దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో హరిభక్తినీ, జితేంద్రియత్వాన్ని పాటించేది. తన చిన్ననాటి నుండి అలవాటైన కార్తీక వ్రతం ఆచరించి కార్తీకమాసం నెలరోజులూ అరటిడొప్పలో దీపం ఉంచి నదిలే వదిలేది. తర్వాత గుడికి వెళ్లి దీపం వెలిగించేది. ఇంటివద్ద తులసికి ప్రదక్షిణం చేసేది. కార్తీక ఏకాదశినాడు ఉపవాసం చేసేది. పౌర్ణమినాడు దీపదానాలు చేసేది. ఈ వ్రత పుణ్యఫలంగా ఆమె విష్ణుసాన్నిధ్యం పొందింది. గుణవతి సత్యభామగా పుట్టి శ్రీకృష్ణునికి ప్రియసఖి అయింది. కార్తీక మాసంలో ఏదీక్షను అనుసరించినా మోక్షదాయకం.
పున్నమి వెలుగుల పుణ్యమాసమైన కార్తీకమాసంలో భక్తులంతా ఎదురుచూసే పరమ పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజునే కార్తీకపౌర్ణమి అంటారు. కార్తీకపౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినది. ఈ పౌర్ణమి శివ,పార్వతులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. సాధారణంగా కార్తీకమాసం నెలరోజులు పూజలు, వ్రతాలు చేయలేనివారు ఒక సోమవారమైనా, కార్తీకపౌర్ణమి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యమొస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రతిఒక్కరూ కఠోర ఉపవాసదీక్షలతో కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరనోము )చేయడం ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమిరోజు సూర్యోదయానికి ముందే చెరువులు, నదులు అవి అందుబాటులో లేకపోతే బావులు,
ఇంటివద్దయినా శీతలస్నానం చేసి కార్తీకపౌర్ణమి వ్రతాన్ని ప్రారంభించాలి. మహిళలు అరటిడొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదలాలి. భక్తిపూర్వకంగా పవిత్రమనస్సుతో ఇలా చేయడం వలన వారికి మనస్సులో వున్న కోరికలు సిద్ధిస్తాయి. వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను నదిలో వదిలితే ఎంతో ఫలం లభిస్తుంది. పౌర్ణమినాడు బ్రహ్మి సమయంలోనే తులసిని పూజించాలి. ఆవునేతితో తడిపిన దారపు వత్తుల దీపాలు వెలిగించి, తులసికోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పాయసం (పరమాన్నం) నైవేద్యంగా పెట్టి, 365 వత్తుల కట్టతో దీపారాధన చేయాలి. పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి శివునికి బిల్వపత్రాలు, భస్మలేపనం, అవిసెపూలతో పూజచేయడం వలన కైలాసప్రాప్తి లభిస్తుంది. శివాలయాల్లో మహాన్యాసక రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమౌతాడని శాస్త్రవచనం
. పౌర్ణమిరోజు శివాలయాలు, విష్ణాలయాల్లో దీపారాధన చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఆరిపోయిన జ్యోతిని వెలిగించినా పుణ్యం కలుగుతుంది. అదే విధంగా దీపదానం చేయడం వలన శివసాన్నిధ్యం కలుగుతుంది. దీపదానం చేయలేనివారు సర్వజ్ఞాన ప్రదం సర్వ సంపత్పుఖావనం దీపదానం ప్రదాస్మావి శాంతిరసుసదామమ! అనే మంత్రాన్ని పఠించాలి. వీలైతే శ్రీలలితాదేవిని సహస్ర నామాలతో పూజించాలి. దీనివల్ల ఆ దేవి సకల ఐశ్వర్యాలను కల్గిస్తుంది. పౌర్ణమిరోజు రాత్రి 12గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను ఇంటిలో వున్న వారంతా తాగితే ఏడాది పొడవునా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో విశేషంగా వుంది. కేదారేశ్వరుని వ్రతం !: కార్తీకపౌర్ణమి రోజు మహిళలంతా నోచుకునే నోముకు సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో వుంది.
పౌర్ణమి రోజంతా కఠోర ఉపవాసముండి సాయంత్రం వేళగౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు సంబంధించి గ్రామాల్లో పెద్దలు ఎంతో వినసొంపుగా వుండే కేదారేశ్వర నోముకు సంబంధించిన కథను కుటుంబ సభ్యులకు విన్పిస్తుంటారు. కార్తీకపౌర్ణమి వ్రతం (కేదారేశ్వరుని నోము) చేసుకోలేని భక్తులు ఈ కథ చెప్పే ఇంటికి వెళ్లి భక్తితో కథ వినడం ఎంతో మంచిది. పట్టణాల్లోను, మరికొన్ని ప్రాంతాల్లోను కేదారేశ్వర వ్రతం పేరుతో ప్రచురితమైన పుస్తకాల్లో వున్న కధను చెబుతున్నారు. అది చదివినా, విన్నా ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి (శివపార్వతులకు)మర్రిచెట్టు ఊడలను తోరణాలుగాను, మర్రిపండ్లను బూరెలు గాను, మర్రి ఆకులును విస్తర్లుగాను పెట్టి పూజలు చేయాలి.
గ్రామీణ ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి భక్తులు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం వారిలో భక్తిభావాన్ని చాటుతుంది. చాలామంది ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుంటారు. సాయంత్రం వేళ శివాలయాలకు వెళ్లి జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించిన పిమ్మట ఇళ్లవద్ద నోములు (వ్రతం) నోచుకోవాలి. ఎవరైతే కార్తీకపౌర్ణమి రోజు కేదారేశ్వరుని నోము నోచుకుంటారో వారికి ఏడాదిపాటు అన్న వస్త్రాదులు, సిరిసంపదలకు లోటుండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరకు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, తమలపాకులు, పువ్వులతో పూజచేసి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం (హారతి) ఇవ్వాలి. అనంతరం రాత్రికి నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి.
Saturday, 9 November 2019
కాలభైరవ అష్టకమ్ Kalabhairava Ashtakam
కాలభైరవాష్టకమ్
Kalabhairava Ashtakam
కోర్ట్ సమస్యలు - రోగ బయం - ఋణ బాధలు నుండి - నరదృష్టి - శత్రు బయం -నివారణకొరకు కాలభైరవస్వామి మంత్రం :
ఓం మహా గణపతియే నామః కాలభైరవ అష్టకమ్: దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| 1|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||2|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||3|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||4|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5|| రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||6|| అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||7|| భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||8|| కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||9|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్
కాలభైరవాష్టకమ్
Kalabhairava Ashtakam
శివాయ నమః || కాలభైరవ అష్టకమ్ దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||
Sunday, 3 November 2019
గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతం పరిపూర్ణ విధివిధానం :
గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’
ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4వర్ణాల వారూ ఇళ్ళను గోమయం(ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"మహనీయ, ఈ పూజను ఇంతక ముందు ఎవరినా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి "అనగా, పరాశరుడు కధ చెప్పడం మొదలుపెట్టాడు.

ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో "స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను "అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి. ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి "అవ్వా! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ "అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను" అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.

"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం". లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది."రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి ఈ వ్రతం చేయాలి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా, మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదొ, అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి ,సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను ధూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా, సంక్రాంతి(ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది)తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి(నరకానికి) పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధపదార్ధములను తినకుండా, నక్తం(ఒంటిపూట, ఒకపొద్దు) ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవంయందు, బ్రాహ్మాణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది"అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి లక్ష్మీ దేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.

ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి, ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీ దేవి పాదముద్రలను వేసి, లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవెధ్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. "ఓ భక్తురాలా! నీ భక్తి మెచ్చాను. వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాని చేరుతావు"అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగబాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది" అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీ చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కధను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.
నైవేద్యాలు :
1 వ గురువారం - పులగం
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు,
5 వ గురువారం - పూర్ణం బూరెలు
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు,
5 వ గురువారం - పూర్ణం బూరెలు
మార్గశిర లక్ష్మివార వ్రతం:
మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.
*మార్గశిర లక్ష్మివార వ్రత విధానం:*
మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీపూజ మరియు వరలక్ష్మి పూజ వలే ఉన్నప్పటికిని... అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది.
మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.
మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీపూజ మరియు వరలక్ష్మి పూజ వలే ఉన్నప్పటికిని... అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది.
మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.
'ఆదౌ పూజ్యో గణాధిపః' అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.
మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:
1 వ గురువారం - పులగం
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం,గారెలు
5 వ గురువారం - పూర్ణం బూరెలు
1 వ గురువారం - పులగం
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం,గారెలు
5 వ గురువారం - పూర్ణం బూరెలు
*మార్గశిర లక్ష్మివార వ్రత కధ:*
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.
ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.
ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.
ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.
అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.
అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.
తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.
మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి
ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెచ్చుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని, ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.
ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెచ్చుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని, ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.
పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి - చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయ్యినది మహాలక్ష్మి, సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.
Saturday, 2 November 2019
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం :
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 1 ||
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || 2 ||
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 4 ||
యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 5 ||
ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 6 ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 7 ||
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || 8 ||
జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || 9 ||
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || 1౦ ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 11 ||
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 12||
సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 1౩ ||
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || 14 ||
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || 15 ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || 16 ||
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || 17 ||
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || 18 ||
Subscribe to:
Posts (Atom)

