Wednesday, 18 December 2019

కాలభైరవ అష్టమి విశిష్టత: kalabhairava ashtami

కాలభైరవ అష్టమి విశిష్టత

కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగివున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఆయన రూపం భయంకరంగా కనిపించినా, తనని ఆరాధించిన వారిపట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్లు ఆయనకి కాస్త దూరంగా వుంటారు. నిజానికి ఆయన మహశివుడి మరో రూపంగానే చెప్పాలి. సమస్త ప్రాణులను పరమశివుడు ... భైరవుడి రూపంలోనే తనలో 'లయం' చేసుకుంటూ వుంటాడు.Image result for కాలభైరవ అష్టమి

భైరవుడి వాహనం పేరు 'కాలము' అనే కుక్క. ఈ కారణంగానే ఆయనని అంతా కాలభైరవుడిగా పిలుస్తూ వుంటారు. ఇక శివుడికి 'కాలుడు' అనే పేరు కూడా వుంది. కాలుడి నుంచి ఉద్భవించిన భైరవుడు కనుక కాలభైరవుడుగా ప్రసిద్ధి చెందాడు. నుదుటున విభూతి రేఖలు ధరించి ... నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని కనిపిస్తాడు. గద .. త్రిశూలం .. సర్పం .. పాత్ర చేతబట్టి దర్శనమిస్తుంటాడు. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

కాలభైరవుడికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా శైవ పుణ్య క్షేత్రాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు కనిపిస్తూ వుంటాడు.ముఖ్యంగా తూర్పు చాళుక్యులు నిర్మించిన శివాలయాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడే దర్శనమిస్తుంటాడు. కాలభైరవ రూపాలు అనేకంగా ఉన్నప్పటికీ వారిలో అష్టభైరవులను విశిష్ఠమైన వారిగా చెబుతుంటారు.

'అరసవిల్లి' వంటి పుణ్య క్షేత్రాల్లో ముందుగా కాలభైరవుడిని దర్శించిన తరువాతనే ప్రధాన దైవాన్ని దర్శిస్తూ వుంటారు. అంతటి శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన(మార్గశిర బహుళ అష్టమి) రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.

ఆలయంలో పూజను పూర్తిచేసి గంట ధ్వని చేస్తూ శంఖం పూరిస్తారు. భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం ... తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ఇక కొంతమంది ఇదే రోజున పితృకార్యాలను కూడా నిర్వహిస్తుంటారు. కాలభైరవుడి ఆగ్రహానికి దూరంగా ... ఆయన అనుగ్రహానికి దగ్గరగా వుండటం వలన విష బాధలు ... అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ రోజు సాయంత్రం భైరవ స్వామివారికి గారెలు-వడ మాలతో అలంకరించి, పెరుగు అన్నం , కొబ్బరి బెల్లం తో చేసిన నివేదన స్వామివారికి సమర్పించి కాలభైరవ కథ లేదా అష్టకం పారాయణం చేసుకొని, దూప దీప ,నైవ్యద్యములు సమర్పించవలెను, పిదప స్వామి వారి ప్రసాదం అందరికి పంచవలెను , రోజంతా ఉపవాసం చేసి ,కాలభైరవ అష్టకం రోజంతా పారాయణంచేసుకొని చంద్రోదయం పిదప కుక్కలకు పెరుగు అన్నం నివేదన పెట్టి ఉపవాసం విరామించుకోవాలి,ఇలా చేసిన యెడల ఋణ సమస్యలు , అనారోగ్య సమస్యలు,కోర్ట్ కేసులో న్యాయం పొందవచ్చును,
కాలభైరవాష్టకమ్ Kalabhairava Ashtakam :
శివాయ నమః ||
కాలభైరవ అష్టకమ్
దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||
శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||
భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||
కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||
ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||


1 comment:


  1. Contact Sri Sai Balaji Anugraha astrologer who is located in Bangalore. To get 100% guaranteed solutions in all problems. Visit Today: Srisaibalajiastrocentre In Bangalore.

    ReplyDelete