Thursday, 18 June 2020

సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు


🙏సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు🙏
1.సర్వ బాధ నివారణ మంత్రం.
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"
2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"
3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.
"అనసూయాత్రి స౦భూతో దత్తాత్రేయో దిగ౦బర: స్మర్తృగామీ స్వభక్తానా౦ ఉధ్ధర్తా భవ స౦కటాత్||
4.దరిద్ర నివారణ దత్త మంత్రం.
"దరిద్ర విప్రగ్రేహే య: శాక౦ భుక్త్వోత్తమ శ్రియ౦||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"
5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.
"దూరీకృత్య పిశాచార్తి౦ జీవయిత్వా మృత౦ సుత౦||
యో భూదభీష్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్||"
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.
"జీవయామాస భర్తార౦ మృత౦ సత్యాహి మృత్యుహా||
మృత్యు౦జయః స యోగీ౦ద్రః సౌభాగ్య౦ మే ప్రయచ్ఛతు||"
7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.
"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయ౦ తమీశాన౦ నమామి ఋణముక్తయే||"
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగ౦బర నమో నిత్య౦ తుభ్య౦ మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.
విద్వత్సుత మవిద్య౦ య అగత౦ లోక ని౦దిత౦|| భిన్న జిహ్వ౦ బుధ౦ చక్రే శ్రీ దత్తః శరణ౦ మమ||
11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే||
🌷🙏విధానం🙏🌷
ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..
🙏జై గురుదత్త🙏 

Sunday, 14 June 2020

సూర్య గ్రహణం - Eclipse June 2020: Sury grahanam

21-06-2020 చూడామణి నామక సూర్యగ్రహణం
తేదీ : 21-06-2020 ఉదయం 11:58 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది .

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.*
No photo description available.

గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55
గ్రహణ అంత్యకాలం : మ . 1.44
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు
*ఆంధ్ర రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23
గ్రహణ మధ్యకాలం : మ .12.05
గ్రహణ అంత్యకాలం : మ . 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
*గ్రహణ నియమాలు*
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు మృగశిర, ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

సూర్య గాయత్రి :
ఓం ఆదిత్యాయచ విద్మహే మహా శుభగాయచ ధీమహి, తన్నోఆదిత్య ప్రచోదయాత్.*

గ్రహణం రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,

ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి.

ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.

శుభఫలం : మేష , మకర , కన్య , సింహ రాశులకు
మధ్యమ ఫలం : వృషభ , కుంభ , ధనుస్సు , తుల రాశులకు
అధమ ఫలం : మిథున , మీన , వృశ్చిక , కర్కాటక రాశులకు వారికి అధమ ఫలం .

మిథునరాశివారు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవాలి .

గమనిక* పోయిన సంవత్సరం అనగా 26-12-2019 సూర్య గ్రహణం ధనస్సు రాశిలో ఏర్పడినప్పుడు షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం వాటికి తగిన శాంతుల చేయడం కూడా జరిగింది. దాని ప్రభావం వల్ల ఈ సమయంలో కరోనా అనీ రాక్షసి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో సూర్యభగవానుడు కి తగిన శాంతులు చేసి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం

Wednesday, 3 June 2020

చంద్ర గ్రహణం :

జూన్ 5 చంద్ర గ్రహణం :
జ్యేష్ట మాసంలోని పూర్ణిమ రోజైన జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు గ్రహణం అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతంది. జూన్ 6న తెల్లవారు జామున 2.34 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. మొత్తం గ్రహణ సమయం మూడు గంటల 19 నిమిషాలు.. అయితే, 12.54 నిమిషాలకు పూర్తిగా చంద్రుడు కనిపించని స్థితి వస్తుంది.ఈ చంద్రగ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉన్నవారు వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడి ఆకారంలో ఎలాంటి హెచ్చుతగ్గుల సంభవించవు. ఆకారంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే గ్రహణం సమయంలో చంద్రుడు కాంతి కొంచెం క్షీణిస్తుంది.


శాస్త్రీయంగా ఏడాదిలో ఆరు నుంచి ఏడు గ్రహణాలు సంభవిస్తాయి. ఈ క్రమంలోనే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో నాలుగు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికే తొలి చంద్రగ్రహణం జనవరి 10న ఏర్పడింది. రెండో చంద్రగ్రహణం జూన్‌ 5న ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. తర్వాత పదిహేను రోజులకు జూన్‌ 21 సూర్యగ్రహణం.. అనంతరం రెండు వారాలకు జులై 5న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడతాయి. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖ ఉండి చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ గ్రహణాలు ఏర్పడవు. సూర్యుడు, భూమి, చంద్రుడు సంపూర్ణంగా ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. భూమి యొక్క నీడ బయటి భాగం ద్వారా చంద్రుడు కదులుతున్నప్పుడు ఒక పెనుంబ్రల్‌ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్‌ అని పిలువబడే నీడ బయటి భాగంతో భూమి సూర్యుని కాంతిని నేరుగా చంద్రుడికి చేరుకోకుండా అడ్డుకుంటుంది. పెనుంబ్రల్‌ నీడ భూమి చీకటి కంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి, నీడను గుర్తించడం చాలా కష్టం. అందువల్ల ఒక పెనుంబ్రల్‌ గ్రహణం దాదాపు సాధారణ పౌర్ణమిలా కనిపిస్తుంది. రాబోయే పౌర్ణమి రోజున చంద్రుడు స్ట్రాబెర్రీ ఆకారంలో ఉంటారు.
తాజా చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికాలో కనువిందుచేయనుంది. జూన్‌ 5 రాత్రి, జూన్‌ 6 మధ్య గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి 11.15 గంటలకు ప్రారంభమైన గ్రహణం శుక్రవారం తెల్లవారుజామున 2.34 గంటలకు ముగుస్తుంది. జూన్‌ 5న గురువారం రాత్రి 10.30 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తర్వాత 11.15 గంటలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి 12.54 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వాత మెల్లగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 2.34 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పరిసమాప్తవుతుంది. ఉదయం 3.30 గంటలకు భూమి ఉపచ్ఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తాడు

అందరూ క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి


తన్నో చంద్ర ప్రచోదయాత్ .

పాటించవలసిన నియమాలు
చంద్రగ్రహణ సమయంలో ఈ నియమాలు ... గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.