జూన్ 5 చంద్ర గ్రహణం :
జ్యేష్ట మాసంలోని పూర్ణిమ రోజైన జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు గ్రహణం అర్థరాత్రి 11.16 గంటలకు ప్రారంభమవుతంది. జూన్ 6న తెల్లవారు జామున 2.34 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. మొత్తం గ్రహణ సమయం మూడు గంటల 19 నిమిషాలు.. అయితే, 12.54 నిమిషాలకు పూర్తిగా చంద్రుడు కనిపించని స్థితి వస్తుంది.ఈ చంద్రగ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉన్నవారు వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడి ఆకారంలో ఎలాంటి హెచ్చుతగ్గుల సంభవించవు. ఆకారంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే గ్రహణం సమయంలో చంద్రుడు కాంతి కొంచెం క్షీణిస్తుంది.
శాస్త్రీయంగా ఏడాదిలో ఆరు నుంచి ఏడు గ్రహణాలు సంభవిస్తాయి. ఈ క్రమంలోనే 2020లో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో నాలుగు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికే తొలి చంద్రగ్రహణం జనవరి 10న ఏర్పడింది. రెండో చంద్రగ్రహణం జూన్ 5న ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. తర్వాత పదిహేను రోజులకు జూన్ 21 సూర్యగ్రహణం.. అనంతరం రెండు వారాలకు జులై 5న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడతాయి. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖ ఉండి చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ గ్రహణాలు ఏర్పడవు. సూర్యుడు, భూమి, చంద్రుడు సంపూర్ణంగా ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. భూమి యొక్క నీడ బయటి భాగం ద్వారా చంద్రుడు కదులుతున్నప్పుడు ఒక పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ అని పిలువబడే నీడ బయటి భాగంతో భూమి సూర్యుని కాంతిని నేరుగా చంద్రుడికి చేరుకోకుండా అడ్డుకుంటుంది. పెనుంబ్రల్ నీడ భూమి చీకటి కంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి, నీడను గుర్తించడం చాలా కష్టం. అందువల్ల ఒక పెనుంబ్రల్ గ్రహణం దాదాపు సాధారణ పౌర్ణమిలా కనిపిస్తుంది. రాబోయే పౌర్ణమి రోజున చంద్రుడు స్ట్రాబెర్రీ ఆకారంలో ఉంటారు.
తాజా చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికాలో కనువిందుచేయనుంది. జూన్ 5 రాత్రి, జూన్ 6 మధ్య గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి 11.15 గంటలకు ప్రారంభమైన గ్రహణం శుక్రవారం తెల్లవారుజామున 2.34 గంటలకు ముగుస్తుంది. జూన్ 5న గురువారం రాత్రి 10.30 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తర్వాత 11.15 గంటలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి 12.54 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వాత మెల్లగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామున 2.34 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పరిసమాప్తవుతుంది. ఉదయం 3.30 గంటలకు భూమి ఉపచ్ఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తాడు
అందరూ క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.
ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .
పాటించవలసిన నియమాలు
గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.
No comments:
Post a Comment