Sunday, 21 August 2016

శ్రీ కృష్ణాష్టమి పూజ విధానము,sri krishanastami ,lard krishana birth day ,lard kriishna praying methods

శ్రీ కృష్ణాష్టమి  విశిష్టత  :

ద్వాపరి యుగం లో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు  కలియుగ సంధికాలమందు లో శ్రీ ముఖ నామ సంవత్సరం లో శ్రావణం మాసం లో బహుళ అష్టమి నాడు అర్దరాత్రి రోహిణి నక్షత్రం లో కంసుడు చెరసాలలో శ్రీ కృష్ణడు  జన్మించాడు.ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు.  శ్రీ కృష్ణుడు పరిపూర్ణుడు. అన్ని అవతారాలలో కృష్ణావతారమే పూర్ణావతారామని ప్రసిద్ది. అందుకే ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటారు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథె "కృష్ణాష్టమి". ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుని అర్చించాలి. పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయన లోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయం లోను స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి,మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి.
Image result for శ్రీ కృష్ణాష్టమి

 శ్రీ కృష్ణాష్టమి పూజ విధానము :

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

పూజ సామనులు : 

పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల ,శ్రీ కృష్ణుడి  చిత్రపటం  లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

పూజ విధానము: 

Image result for శ్రీ కృష్ణాష్టమి
తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి.

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి , అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి . పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు . పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమ తో బొట్టు పెట్టి , వరి పిండి , (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి . సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి . ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి ,పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడిది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను . దీపారాధనకు నువ్వులనూనె గాని ,కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు . పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోవలెగించను .
శ్రీ కృష్ణుని వ్రత పూజకు కావలసిన ముఖ్య వస్తువులు :
కృష్ణుని బొమ్మ (శక్తి కొలది బంగారం , వెండి లేదా మట్టి బొమ్మ ) లేదా చిత్ర పటము , పువ్వులు, కొబ్బరికాయలు , పళ్ళు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరు వత్తులు , వస్త్ర , యజ్ఞోపవీతములు , నివేదనకు అటుకులు ,బెల్లం ,వెన్న , ప్రత్యేకముగా చేసిన పిండి వంటలు ( కృష్ణునికి ఇష్టమైన పదార్దములు జంతికలు , బియ్యం పిండితో చేసిన పాలకాయలు మొ|| వి ) సిద్దము చేసుకొనవలెను..

సాయంత్ర సంధ్యాకాలంలో గృహమధ్యమున గోమయంతో ఆలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి ఒక మంటపాన్ని ఏర్పరుచుకుని నూతన కుంభం వుంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. తరువాత ఆ కలశం మీద బాలకృష్ణుని ప్రతిమను ప్రతిష్టించుకోవాలి. 


అయితే ముందుగా దేవకీదేవ ప్రార్థనను ముగించుకున్న తరువాత కృష్ణుని ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి, తరువాత దేవకీదేవకి నివేదనం చేయాలి. 
శ్రీకృష్ణుని పూజ అర్థరాత్రి వరకు నిర్వహించుకోవాల్సి వుంటుంది. పూజలో కృష్ణుడికి నైవేద్యంగా ముఖ్యమైన పాలు, పెరుగు, వెన్నలను సమర్పించుకోవాలి. చంద్రోదయ సమయంలో బయటకు వెళ్లి... అలంకృతమైన భూమిలో ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. 
ఈ పండుగనాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం. 
తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేసి, ఉపవాసాన్ని విరమించుకోవాలి. 
ఒకవేళ ఇదంతా చేయడం సాధ్యం కాకపోతే.. కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. 
పాపపుణ్యాల గురించి ఎటువంటి అనుభవాలు తెలయని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని బయటపెట్టే కార్యకలాపం గల పండుగ ఈ కృష్ణాష్టమి. 
ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి పూజలను నిర్వహించుకోవాలి. 

Thursday, 11 August 2016

About Us


Heartily welcome to Sri Janayitri Astrology Services, we provide online and off-line instant horoscope Reading past 15 years with effective home made remedy's with minimum cost based on Vedic astrology,Numerology,palmistry Face Reading Taro Astrology,and suggest best gemstones we provide horoscope and accurate result based on positions of planets with exact angles ,like Birth chart,Aruda,Navamsa ,Dasamsa,Gochara charts our services are ...

 Astrology  

Preparing individual horoscope marriage matching  planet japam and santhi germ stone suggestions and puja services   

Vastu 

Vastu planing and vastu inspection on site and provide guide lines as per vastu construction techniques for individual house and group houses and apartments, we offer services like vastu corrections and vastu planing and fengshui vastu and color therapy pyramid construction and vastu remedys are     1.Ashta dikh bandana  2.Sankhu Stapana 3.Yentra Pratishtana (machha yentram ,khubera yentram, kurmana yentram ,narayana yentram ,navaratna mandapam ) vastu plantation for home vastu garden ets... 

Numerology : 
we offer numerology services based on date of birth and vedic horoscope our services are 
1. Name Correction                          2. Positive vibrations on name stating later,
3. Name Starting later finding        4. Lucky number finding 
5. Lucky color finding                     6. Lucky days finding 
7. Lucky age                                     8.  Lucky Marriage Dates 
9. Lucky Color                               10. Un- lucky Color,Day,Number,
11. Lucky Rudraksha                    11. Lucky Germ Stone   
Palmistry : 
we offer palmistry services based on hand  lines readings concepts based on following deep analysis we given such as 
1. Carrier ( Business / job)                      2.health 
3.marriage (love /arrange)                      4. children's 
5.money ( loans and profits )                  6. assets  
7.human relations                                   8. luck and destiny 
Face Reading : 
Basically Face Reading astrology services people preferred those who are dont know there birth details, face reading indicate following facts such as ..,
health , illness, luck , and marriage time ,nature of job , human mentality and habits and strength and weakness , carriers focus goals and financial positions ets. we can find out basic problems with remedies based on face reading aspects like face shape , noise shape ,moles on face ,ears shape ,face color , forehead shape. 
This web site give information about daily Horoscope ,daily yoga kshamam, and nature and characteristic of planets, and planets positions like as 0wn houses and Enemy houses, Exaltation, Debilitation's, Nature of 27 Nakshatras, and there positions at 12 houses with respect to 12 Zodiac signs. and this web page share information about Hindu famous temples and sharing knowledge about spiritual and devotional concepts and Astrology and Baby Names and vaastu and latest job updates and  health tips.
we are providing online astrology services in telugu,english,hindi langues for any graha dosha's like as Seni Dosha remedy's like as yelinati Seni ,Ardastama Seni, Astama seni,And kuja dowsha Remedy's,Kalasarpa Dosham, matru Pitru Dosha remedy's,and also provide astro-solution for all human life cycle activity,like as late marriages,underemployment, health issues family disturbances,no pregnancy,fe-male gynecological health issues,sadness life, love marriage,arrange marriage, issue solving in matrimonial life,business loss, more loan, money recovery,court case issues,road accidents,own house or rent house,marriage time approaches,career planing as per kundili ..ets.
For Online Slot booking For Appointment   click here whatsapp link

Nakshtras And lords :

NakshatraNakshatraNakshatraLord Planet
1Ashwini10Magha19MoolaKETU
2Bharni11Poorva-Falguni20Poorva-ShadaSHUKRA
3Kritika12Uttara-Falguni21Uttara-ShadaSURYA
4Rohini13Hast22ShravanaCHANDRA
5Mrigshira14Chitra23DhanishthaMANGAL
6Aardra15Swati24ShatbhishaRAHU
7Punarvasu16Vishakha25Poorva-BhadrapadaGURU
8Pushya17Anuradha26Uttara-BhadrapadaSHANI
9Aashlesha18Jyestha27RevatiBUDH

CONTACT US

Send your birth details  or face  and hand images to our 
Whats app  direct link   : click here.
Office Address : 
Sri Janayitri Vaastu Jyothishya Nilayam: D.NO : 58-68-27/2,   Opposite Vantillu Restarent, Beside NSTL Highway Flay over , Shanti Nagar, NAD, Visakhapatnam, Andhra Pradesh 530009
 For Online Slot booking For Appointment   whatsapp link 

Astrology

జ్యోతిష్యశాస్త్రం :

Image result for jyothishyam








విజ్ఞాన శాస్త్రములలో జ్యోతిష్య శాస్త్రం ప్రాచీనమైనది.దీని యొక్క ఉత్పత్తి ఎచట నుండి ప్రారంబమైనది ప్రాచీన చరిత్రలు పరిసోదించి ఎంత వెదకినను శాస్త్రజ్ఞులకు ఈరోజువరకు అంతు చిక్కి ఉండలేదు .భూమిపై గల చరాచర సృష్టికి రవ్యాది గ్రహ కిరణ బ్రభావమునకు ఎంతో సంబంధం ఉన్నట్లు గ్రహించి మన మహ్ర్షులైన బృగు ,బ్రహ్మ ,బృహస్పతి ,పరాశర ,గర్గ ,వ్యాస, అత్రి. వశిష్ట ,అంగీరస, సూర్య ,యువన,సవునిక, వరాహ మిహిరాచార్య మొదలగు మహా మహులేందరో వారి స్వానుభావములతో జ్యోతిష్య శాస్త్రములను రచించి ఉండిరి .ప్రాక్యతి నొందిన సత్యచారుని నాడి సిద్దాంతము ఇప్పుడు లబించుట లేదు.
ఇట్టి విజ్ఞాన శాస్త్రములలో ప్రాచీన ఋషీ సాంప్రదాయక గ్రందములైన బృగు సంహిత ,పరాశర సంహిత ,శుక్ర నాడి,గురు నాడి,మార్కండేయ నాడి ,చంద్ర నాడి ,ధ్రువ నాడి సరస్వతి నాడి ,మొదలగునవి భారత దేసమునందే కాక ప్రపంచమునంతట వ్యాపించి గ్రీకులు రోమనులే కాక ఇతర దేశ వాసులు అనేకులు ఇప్పటి వరకు అవలంబించు చుంటిరి. ఇట్టి ప్రాచీన శాస్త్రములు పోషణ లేని కారణము చే రాను రాను అనుభవము లేని అజ్ఞానులు విద్యాహీనుల చేతులలో పడి శాస్త్ర విజ్ఞానము నశించి బజారు పాలైనందులకు మనం ఎంతగానో చింతించ వలసి ఉన్నది .
ప్రాచీన ఋషీ సాంప్రదాయక గ్రందములలో కొన్ని లబ్యము కాక పోవుటయు మిగిలనవి ఆంద్ర వాన్గ్మయమున లేని కారణముచే చాలా కష్టముగా నున్నది జ్యోతిష్య శాస్త్రము వేద పురుషునకు నేత్రముతో సమాన మైనదిఈ శాస్త్రము వలన ప్రపంచము నందలి సమస్త విషయములు గుర్తింప వచును.

27 నక్షత్రములు

1. అశ్వని 2. భరణి 3. కృత్తిక 4. రొహిని 5. మృగశిర 6. ఆర్ద్ర 7. పునర్వ్సు 8. పుష్యమి 9. ఆశ్రేశ 10. మఖ 11. పుబ్బ 12. ఉత్తర 13. హస్త 14. చిత్త 15. స్వాతి 16. విసాక 17. అనురాధ 18. జేష్ఠ 19. మూల 20. పూర్వాషాడ 21. ఉత్తరాషాడ 22. స్రవన 23. ధనిష్ఠ 24. శతభిష 25. పుర్వాబద్ర 26. ఉత్తరాబద్ర 27. రేవతి .

9 గ్రహాలు

1. రవి 2. చంద్ర 3. కుజ
4. రాహు 5. గురువు 6. శని
7. బుద 8. కేతు 9. శుక్

12 రాసులు :

1. మేషరాసి 2. వ్రుషభారాసి 3. మిదునరాసి 4. కర్కాటక రాసి 5. సింహరాశి 6. కన్యరాసి
7. తులరాసి 8. వ్రుచికరాసి 9. ధనస్సురాసి 10. మకరరాసి 11. కుమ్బరాసి 12. మీనరాసి
27 నక్షత్రములుకి జ్యోతిష్య శాస్త్రం మొత్తం వీటిమీదనే వుంటై ఇవి ప్రకంపనలతో జీవితం నడుస్తుంది అవి వుండే స్తానలను బట్టి జీవితం నడుస్తుంది ఇవి అన్ని కూడా పూర్వజన్మ సుక్రుతాన్ని బట్టి నడుస్తుంది గ్రహ కక్ష్యల యొక్క పరుదులు బెదించి యుండుటచేత గ్రహములకు గతి బేదములు కలుగుచున్నవి .అదిక గతి గల గ్రహములు భ చక్రమును అల్ప కాలమునకు చుట్టి వచుచున్నవి .సూర్యుడు రమారమి ఒక దినమునకు ఒక బాగా వంతున నెల ఒకటికి ఒక రాసి క్షేత్రమును నడచును ౧౨ రాసులు మొత్తమును ఒక సవస్తరములో తిరిగి వచును ఒకరాసి దాటుటకు అన్ని గ్రహముల కంటే దగ్గరగా నున్న చంద్రునకు రెండున్నర రోజులు పట్టును అన్నిటి కంటే దూరముగా నున్న శనికి రెండున్నర సవస్చారం పట్టును గురువుకు ౧ సవస్చారం సుక్రునకు ఒక మాసం రాహు కేతువులకి ఒకటిన్నర సవస్చ్రం పట్టును
రాహు కేతువులు మినహా కొరవ గ్రహములు అన్నియు సవ్యములో రాహు కేతువులు అపసవ్యములోను సంచరించును మనకు మిత్రులు శత్రువులు ఉన్నట్లే గ్రహములకు కూడా మిత్రులు శత్రులు సములు గలరు .
భూమి యొక్క ఐస్కాంత క్షేత్రములో చెలరేగిన సక్షోభము వలన సంబవించిన పరిణామములపై హైదరాబాద్ శాస్త్రవేత్తలు పరిసోదనలు జరిపి యుండిరి ఆ సమయములో సూర్య మండలములో ప్రేళులు సంబవించినవి అని వాటి మూలమున భూమి యొక్క ఐస్కంత క్షేత్రములో మూడు సార్లు తుపానులు వచినవి అని వారు కనుగొన్నారు .ఆ సమయములో గుండె జబ్బులు రోడ్ల ప్రమాదములు ఆదికమైనట్లు ఆసుపత్రుల్లో చేరిన వారి సంక్య పెరిగినట్లు వారు తెలిపి యుండిరి
జ్యోతిష్యమనగా మానవునిపై గ్రహముల ప్రభావము తెలుపు శాస్త్రము .జీవి ఎ కాలమునందు జననము నొందునో ఆకాల గ్రహ గతి ప్రభావము జీవి పైనున్డక తప్పదు.పరి సోదన వలన మనవ బుద్ది వికాసముప్రకృతికి సంబంధం వున్నట్లు విసదమగుచున్నది జీవి తను తలచిన కార్యమును చేయగలడు కానీ తను దేనిని తలంచ వాలేనో నిర్నింప జాలడు .బుద్ది ప్రభావమగు నిర్ణయములు పూర్వకర్మ అనుసరములు అవియే గ్రహ ప్రభావము వలన కలుగుచున్నవి స్త్రీ పురుష సంయోగం వలన శుక్ల సోనితము వలన పిండోత్పత్తి కలుగుచున్నది కానీ జీవోత్పత్తి కలుగుట లేదు జీవోత్పత్తి ఒకానొకప్పుడు శక్తి కిరణప్రసార ప్రభావము వలన కలుగుచున్నది గ్రహ ప్రభావము జీవి మాతృ గర్బ ప్రవేశ కాల మందు ప్రారంబమగుచున్నది
తపోధనులు వారి సహజ జ్ఞానము వలన ప్రత్యక్ష అనుభవము వలన గ్రహ ప్రభావములను గ్రహించి యుండిరి .అట్టి విద్యనేరిగిన యోగ పుంగవులు సమాది స్తితి యందు రావ్యాది గ్రహముల సంచార క్రమమును పరిశీలించి ఆ వివరములు లోక సంగ్రహనర్దమైప్రకటించిరి .ఆ నిర్నయములే నేటికిని సిరోదార్యములై ఉన్నవి.

*********************************************************************************************************

నక్షత్రములు :

Image result for నక్షత్రములు
[1] అశ్వని-అధికమైన బుద్ది ,ధనము,వినయము ,ప్రజ్ఞ, కీర్తి ,సుకము గలవాడగును.అందరికి ఆకర్షినియముగా ఉండును.ప్రేమ స్నేహ భావము గలవాడగును .ఎక్కువ గవురవము పొందగలడు.
[2] భరణి -కోరికలు ఎక్కువ పరస్త్రీ వ్యామోహం కృతజ్ఞుడు ధనము కలవాడు తేజోవంతుడు అగును.సంతోషముగా నున్డువాడునుఆతిధ్యము వేడుక వినోదము గలవాడును పెద్దవాటికై అపెక్షిన్చువాడును, కామము మోహము కలవాడును అత్యాస కాల వాడును అగును .
[3] కృత్తిక – ప్రభువులతో సమానుడును, ముర్కుడును,విద్యావంతుడు అగును.మంచి ఆరోగ్యము భలము సంతోషము ,ముందుకు సాగిపోయే స్వభావము గలవాడును, అదికారము చలాయిన్చువాడును నాయకత్వము వహించు స్వభావము గల వాడును పోటి తర్కించు స్వబావము గలిగి ఉండును మంచి శారిర కాంతి కీర్తి వాక్చాతుర్యము బందు ప్రీతి సుక సంపదలు కాల వాడగును.
[4] రోహిణి -పరుల దోషములు తెలిసినవాడు,కృశించిన శరీరము ,జ్ఞానము ,పరస్త్రీ వ్యామోహము ,మంచి అలవాట్లు, మంచి స్వభావము ,మంచి వాక్కులు పలుకు వాడును సంగీతము ,కళ నాటకములందు అభిరుచి కలవాడును సమర్ధత ,సంపాదన, జనాకర్షణ ,కలిగి ఉండును.
[5] మ్రిగసిర -మంచి మనస్సు ,దేశాటన చేయువాడును, కుటిల చూపు గల వాడును ,క్కమతురుడును , అనారోగ్యము కలవాడు అగును హాస్య స్వభావము కళ వాడును మనోశక్తి గలవాడును చురుకు తొందర కలవాడును ధైర్య సహసమును పాపా బీటి మాతృ భక్తీ ,శాస్త్ర విజ్ఞానము ,విపుల భుజములు ,ఉస్తహాముగా పనులు నిర్వాహించును .
[6] ఆరుద్ర -క్రయ విక్రయ ములందు రానిన్చిను.చిత్ర సీమలో కలలలో రానిన్చును మంత్ర శాస్త్ర సాహిత్యములు అనుకులించును.ప్లాన్లు ,డిజైన్లు ,పుస్తకముల వ్యాపారము ,రవాణా,వ్రుత్తి మందులు ,వేలిముద్రల నిపుణులుగా రానిన్చును.
[7] పునర్వసు -మంచి తెలివి తేటలు ,ధర్మ బుద్ది అవుదార్యము.దైవభక్తి ,శాస్త్ర విజ్ఞానము ,న్యాయ దృష్టి ,సత్య శీలము ,సుగుణ సంపద, పరోపకార గుణము గలిగి అభి వృద్దికి రాగలరు.ప్రజాకర్షణ ,ప్రసిద్ది ,శన బలము ,కవి,కాముకుడు అగును.
[8] పుష్యమి -దేవ బ్రాంహనులకు ప్రియుడును, ధనము కీర్తి గల వాడును.రాజప్రియుడును.బందువులు కళ వాడును అగును. పొడుపు చేయువాడును ,సంప్రదయములపై పట్టుదల కలవాడును దీక్షతో పని చేయు వాదు.
[9] ఆశ్రేష – మాటలలో మంచి నేర్పరి ,రహస్యముగా అదికారము చేయగలుగును.స్వమి కార్యము చేయగలుగుటలో ఆసక్తి చాతుర్యము చూపించును .పెద్ద మన్ననలను ఆదరణ పొందును .రహస్యమైన బుద్ది గలవాడును కృతజ్ఞ వచనము గలవాడును,కామగుణము అధికము.దురాచారము కాలవదగును. సుక్ష్మ బుద్ది గల వాడును ,న్యాయము గలవాడును ,అనేకవిషయములలో ప్రావిన్యము గలవాడును అగును.
[10] మక -తేజోవంతుడై తండ్రిని మించిన వాడై ఉందును.గురు భక్తి, దైవ భక్తి,కలిగి ఉండును.కోపము ఎక్కువ వాదిన్చ్గలదు బండువర్గమునకు ఉపకారిగా ఉండును భార్యకు లోబడి ఉన్డువాడుగా ఉండును. ధనము గలవాడగును జీవితమూ సుకముగా గడుపు కొను వాడగును
[11] పుబ్బ [పుర్వపాల్గుని] – త్యాగ గుణము గలవాడును ,దృడమైన వాడును ,కాముకుడు, లోభి ,ఉదారస్వభావము,కవి ,మంచి హృదయము గలవాడును ,విదేయుడును ,సుకము కోరువాడును ,విలాసము ,సత్యము ,తనకోరికలు సాదించు వాడగును.
[12] ఉత్తర [ఉత్తరపల్గుని] – మానియును,క్రుతగ్నుడును, విద్వాంసుడును అగును.విద్యయందు ఆసక్తి గలవాడును బుద్ది బలము గలవాడును ,గణిత శాస్త్రము లేక ఇంజనీరింగ్,జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రము తెలిసికోనును,కీర్తి గావురవములందు ఆపేక్ష మహిళలకు ఇష్టుడు కాగలడు.
[13] హస్త -మంచి కీర్తి, గవురవము,గామ్బిర్యము, విద్య ,సంపద, పెద్దల వాళ్ళ గవురవము ,దైవ భక్తీ ,ఉపకార గుణము ,మహిళలకు ఆనందము కలిగించే స్వభావము ,వ్యాపారస్తుడు, వాళ్ళు వంచి పని చేయువాడు అభిరుచి గలవాడు ,కనికరము లేను అగును .
[14] చిత్త -సత్య భావమునందు ఆసక్తి గలవాడు.మనము గలవాడు,వ్యాపార సరళి గలవాడు .ఆనందముగా ఉండును .ధైర్యవతుండు ,శక్తివంతుడు ,ఎత్తిపొడుపు మాటలు గలవాడును ,రసాయన్ శాస్త్రములందు ప్రీతి ,సర్వజన ప్రియుడు, సహజ జ్ఞానము గలవాడు ,సుగంద ద్రవ్యములు ,పుష్పములు ,అలంకారము పై ఆసక్తి దుండును.
[15] స్వాతి -స్వతంత్రుడు ,బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు ,పెద్దల పట్ల గవురవము ,అనేక భోగ బాగ్యములు అనుభవించగలడు .బందు ప్రేమ కీర్తి విశాల హృదయము, దేవ బ్రంహనులకు ప్రియము చేయువాడును ,బోగము ధనము గలవాడగును ,మందబుద్ది ఉండును
[16] విశాక -గర్వము, భార్యకు లోబడువడుగాను,శత్రువులను జైన్చువాడును ,దేహకర్షణ్,దేవుళ్ళ యందు భక్తీ ,సోదరులు గలవాడును,నిజైతి గలవాడును,ధర్మమూ గలవాడును మంచి పరిజ్ఞానము గలవాడగును.
[17] అనురాధ -రాజకియాసక్తి ,మంచి రూపము ,సవుర్యము ,పాప భీతి,మహిళల అభిమానము ,సుకమునందాసక్తుడు,ధన వంతుడు ,విభుడు అగును.
[18] జేష్ఠ -అధికమైన కోపము ,పరస్త్రీ ఆసక్తి ,విద్యాసక్తి, మాటలతో పోట్లాటకు వెనుదీయని వాడు ,యుక్తాయుక్తముగా నటించు నేర్పు గలవడుగాను ,విద్యావంతుడు,పుత్రసంతతి ఉండును.
[19] మూల -సమర్ధమైన వాక్కులు గలవాడును ,కుశలుడు,దుర్తుడు,ధనము గలవాడు,నిజాయితి ,ఇతరులయొక్క గవురవము కాపాడు వాడు ,ఆచరావంతుడు,రహస్యములను పసి కట్టి వివక్షత లేకుండా అన్ని పదార్దములు బుజించును.
[20] పూర్వాసాడ -సుకము గలవాడు .శాంతి బుద్ది గలవాడగును .ఇతరులను ప్రేమించువాడు ,బోగావస్తు ప్రీతి,ప్రసన్న ముకము ,దానగుణము తల్లి మీద ప్రేమ మంచి పేరు ఉండగలదు.
[21] ఉత్తరాషాడ -మాన్యుడు,శాంతి గుణము ,ధనము ,కర్చు పెట్టు మనస్సు గల ,హాస్యము ,ఉల్లాసము ,ఉస్ట్చాహము ,నమ్మకము ,సర్వము మంచి కొరకు ఉన్నదనే ఆశయము ,ఇతరులు చేసిన మేలు మరువడు.
[22] శ్రవణ -పండితుడును ,దేవ బ్రమహనులందు భక్తీ ,రాజునూ,ధన వంతుడును ,పొడుపు గలవాడు ,దాన్యపరుడును ,విసుగు చెందని వాడు,పట్టుదలగలవాడు అగును .
[23] ధనిష్ఠ -దాతృత్వము ఉపకార గుణము రోష పవురుశము అదిక సంపాదనభిరుచి,క్రీడలలో ఆసక్తి శ్రమ పడే స్వభావము ,సుకము గల వాడును ఉద్రేకము కొన్ని సమయము లలో అదిక వ్యేయము ,ఆస గలవాడు అగును .
[24] శతభిష -బందు ప్రీతి ,గావురవ మన్ననలు,శాంతి స్వభావము ,లవుకిక పరిజ్ఞానము ,దైర్య సాహసము,భార్య పట్ల అభిమానము .దీర్గాయువు ,కాల జ్ఞానము గలవాడగును .
[25] పూర్వాబద్ర -ప్రవుడముగా మాట్లాడు వాడు,వేదాంతి ,సర్వము మంచికోరకు ఉన్నదనే ఆసతో గూడా కలిగి ఉండును .విదేయత, నిజము,నమ్మ దాగిన వాడు ,తత్వ శాస్త్రము ,కగోళ,విద్య ,విమర్శ,ఉండును .
[26] ఉత్తరాబద్ర -దైర్యము ,నీటి ,నిజాయితి ,చాపల్యము,నెమ్మది,ఆలస్య భావము ,అభి వృద్ది ,ఏదో ఒక అనారోగ్యము ఉండును త్యాగ బుద్ది ధనము గలవాడు ,పండితుడు అగును పేద సాదలకు సహాయము చేయువాడునగును.
[27]రేవతి -గొప్పదగు లాన్చనము గలవాడు,కామాతురుడు ,సుందరుడు,మంత్రి ,స్తిరమైన సంపద యందు ఆసక్తి ,నీటి మంతుడు గావురవ నీయుడు ,విద్యాసక్తి ,మనోనిగ్రహము ,స్తిర బుద్ది,పాండిత్యము .సామర్ద్యము ,న్యాయముకోరకు ఎక్కువ శ్రద్ద చూపు వాడగును.
రుద్రాక్ష:
Image result for రుద్రాక్ష:
ఆదార శాస్త్రము-రుద్రాక్ష జాబాలో ఉపనిషత్రుద్రాక్షలు ఎక్కడివి ?వాటికాపెరెలా వచెను? నరులచే నెట్లు ధరింప బడును?ఎన్ని బెదములున్నవి?ఎ మంత్రములచే ఎట్లు ధరింపవలెను?కాలాగ్ని రుద్రుని బసుండుడు ప్రశ్నించెను.”రుద్రాక్ష “లు ఎట్లు పుట్టినవి?వటిన ధరించిన ఫలమేమి ?అని .బగవానుడుకాలాగ్నిరుద్రుడుఅతనికి ఇట్లు చెప్పెను .నేను త్రిపురాసుర వదకై కన్నులు మూసి కొంటిని.ఆకన్నులనుండి జల బిందువులు భూమిపైకి రాలినవి .అవి రుద్రాక్షలు ఐనవి సర్వులు ననుగ్రహించు నిమిత్తము వాటి పేరు ఉచరించినంత మాత్రమున దశ గోదాన ఫలములను ,దర్సన ,స్పర్సనములచే దానికి రెట్టింపు ఫలమును కలుగును
నేను కొన్ని వేల దివ్య వర్షములు కన్నిలు మూసుకొంటిని.అక్షి పుటముల నుండి భూమి మీదకి జల బిందువులు ఆడినవి.ఆ కన్నీటి బిందువులే మహారుద్రాక్ష వ్రుక్షములైనవి.భాక్తనుగ్రహము చేయు కోరికతో
అని స్తావరములైనవి.వాటిని దరించినందున భక్తులకు దివారాత్రి కృతమైన పాపము పోవును.దర్శనమున.
లక్ష పుణ్యము స్పర్స వలన కోటి పుణ్యము కలుగును.వాటిని దర్సిన్చినందున కోటి శత పుణ్య పలము కలుగును.రుద్రాక్షలు దరించి ,జపము చేసినందున లక్ష కోటి శతములు,లక్ష కోటి సహస్రముల పుణ్యము కలుగును ఉసిరి కాయ అంత రుద్రాక్ష ఉత్తమము ,రేగుపందంత ఉన్నవి మద్యమములు.శనగ గింజంత ఉన్నవి అధమము ఇది దీని ప్రక్రియ బ్రామ్హన ,క్షత్ర్యియ ,వైశ్య ,సుద్రులను రుద్రాక్షలు నాలుగు విధములు .తెల్లనివి బ్రామ్హన జాతి వి ఎర్రనివి క్షత్రియములు ,పచనివి వైశ్య జాతివి ,నల్లనివి సూద్ర జాతివి,బ్రామ్హనుడు తెల్లని వాటిని,క్షత్రియుడు యర్రనివాటిని,వైశ్యడు పచని వాటిని దరించ వలెను ,సూద్రులు నల్లని వాటిని దరించ వలెను .సమాన మైనవి ,నునుపైనవి గట్టివి ,స్తూలమైనవి ,కంటక యుతములు శుభములు .పురుగులు కొట్టినవి ,ఇరిగి పాయినవి ,పగిలనవి ,కన్తకము లేనివి ,గొగ్గి గొగ్గి గ ఉన్నవి సమముగా లేనివి వదల వలెను .
వేన్లో అనేక ముకములు కలిగిన రుద్రాక్షలు ఉండును జాతకునకు జాతక రీత్యా ఎ రుద్రాక్ష సరిపోతుందో పరిశిలించి దానిని ధరించిన దోషములు తొలగి శుభము కలుగును.
యంత్రాలు :
Image result for యంత్రాలు
“యంత్రము”అనగా మెషిన్ అని మాత్రం అర్ధం కాదు.యంత్రము అనగా మంత్రపరమైన శక్తిని ఒక నిర్నీతమైన ఆకారములో ఉద్భావిమ్పచేసి ఉంచుట .ఈ రెండు రకాలైన యంత్రాలను ఒక “శక్తీ “యే నడిపిస్తుంది.అయితే మొదటి రకము యంత్రములు చలిస్తూ శక్తీ వలన పని చేస్తూ అనేక పరిశ్రములకు చెందిన కార్కానలల్లో దర్సనమిస్తాయి.రెండవ రకము యంత్రాలు తంత్ర మంత్ర శాస్త్రాలకు చెందినవి ఇవి కదలవు వీటిలోని శక్తీ అంతర్గతమై ఉంది కంటికి కనిపించదు .వీటికి రకరకాలైన శక్తులు ఉంటాయి .ఆ శక్తులను ఆ యంత్రాలల్లో ఒకరకముగా చెప్పాలంటే బందించి ఉంచడమే అవుతుంది .ఆ యంత్రాలల్లో ఆ యా శక్తులను బందించి ఉంచాలంటే ఆ యా యంత్రాలకు కవలసిన్దేమంటే ఆ శక్తులను బందించి ఉంచగల శరీరము లేక [ఆకృతి ]ఏ యంత్రానికి తగ్గ ఆకారాన్ని ఆ యా యంత్రాల కొరకు ప్రత్యేకముగా నిర్ణయించి ఏర్పరచడమైనది ఈ ఆకరాల నిర్మాణానికి ఎక్కువగా వృత్తములను ,త్రికోనములను ఉపయోగించారు.కొన్ని నలుచాదరముగా కూడా ఉంటాయి కొన్ని యంత్రాలు చిత్ర విచిత్రముగా భాణము గుర్తులలోను జండా గుర్తులలోను ఉంటాయి.ఇంకా రక రకాలైన ఆకారములలో ఉంటాయి కూడా.
ఆకారము మన శరీరము వంటిది యంత్ర శక్తి మన ఆత్మ వంటిది ఆత్మ లేక పొతే మన శరీరము ఎలా నిర్జీవము అవుతుందో అదే విదముగా ఆకారములో శక్తి లేకపోతె ఆకారము నిర్జీవము అవుతుంది ముందుగ ఆకరములోని ప్రధాన భాగాలను తెలుసు కుందాము.
ఆకారములో మొదటిది ప్రాకారము దీనిని ఆవరణ అని కూడా అంటారు అనగా అన్నిటి కన్నా ముందరి బాగము ఈ బాగము యంత్రాన్ని ఆవరించి అంగ చుట్టుకొని ఉంటుంది ఈ ఆవరణ లోకూడా యంత్రము లోని ప్రాణము లేక జీవము శక్తిని కాపాడడము కొరకు మంత్రాలూ లేక మంత్రము ఒకటి ఉంటుంది.దీనినే ఆవరణ మంత్రము లేక ప్రాకార మంత్రము అంటారు యంత్రము ఒక కోట లాంటిది.కోటలలో ఎలాగైతే మొదటిప్రాకారము ,రెండవ ప్రాకారము ఎలా ఉంటాయో యంత్రానికి అంతే .కొన్ని యంత్రాలకు ప్రదమ ద్వితీయ ఆవరణలు ఉంటె కొన్నిటికి ఒకటే ప్రాకారము ఉంటుంది .ఇది దాటితే లోపల యంత్ర శరీరము ఉంటుంది .దీనిని కూడా రెండు బాగాలు చేయ వచ్చు .అంతః శరీరము ,మరియు బాహ్య శరీరము ఈ యంత్ర శరీరమును సాదారణముగా త్రికోనాలతో నిర్మిస్తారు .ఆ తరువాత శరీరములో అంతః కోణముల బహ్యకోనములు ,అనేవి ఉంటాయి .వీటికి లెక్కలు ఉన్నాయ్ .ఈ సరిరమునకు కూడా మంత్రము ఉంటుంది.ఈ సరిరములలో తంత్ర శాస్త్రపరమైన ప్రత్యేకతలు ఉన్నాయ్ .శరీరాన్ని దాటి లోపలి వెళితే యంత్రములో ప్రాణము లేక శక్తీ లేక మూల మంత్ర స్తానము ఉంటుంది.ఈ మూల మంత్రము లేక శక్తీ స్తానములను రక్షించడానికి తిరిగి ఒక వ్రుత్తమో,లేక త్రికోనమో ఉంటుంది,దీనిని కవచము అనవచు.యంత్రానికి మూల శక్తీ ఇక్కడే పుడుతుంది .అణువుల్లో కేంద్రిక్రుతమయిన “న్యుక్లియస్”అనెడి ఎంత ముక్యమయినదో అంతే ముక్యమైనది ఈ ప్రాణము . ప్రానమనేది సంపూర్తిగా మంత్రమునుంది జన్మించేది యంత్రమెంత గొప్పదైతే ప్రాణము కూడా అంతే గోప్పదవుతుంది.అంతే కాదు ప్రాణానికి బలము రెండు విదాలుగా ఆవహిస్తుంది .౧ ఉచ్చారణ లేక బలమైన వయిబ్రేషణ్ శబ్ద పరంగా వచెది ౨ ద్యానము లేక మానసిక కేంద్రీకరణ శక్తి ,రెండవది చాలా ముక్యమైనది యంత్రము పనిచేయడమా లేదా అనే విషయాన్నీ నిర్ణ ఇంచేది ఇదే గనుక . యంత్ర శక్తి రెండు విదాలుగా సదింప బడుతుంది ౧ నిర్నీతములయిన నిర్ణీత “తరంగ దిర్గ్యము”కలిగిన అక్షరాలను ఎంపిక చేసి కూర్చుట .ఇలా కుర్చుతయే “మంత్ర నిర్మాణము”అవుతుంది ౨ అల నిర్మించ బడిన నిర్ణీత ‘మంత్రమును మానసిక కేంద్రీకరణ శక్తి ద్వరా జనిమ్పజేసి ,పెంపొందింప జేసి జీవింప జేసి యంత్రానికి ఇచుట లేక ఆపాదింప చేయుట ,దీనినే”ధరపోయుటము “అంటారు ఐతే ఒక సందేహము రావచును ద్యానము ద్వార మనిషిలో శక్తి ఆవిర్భవిస్తుంది అనేది సరే మరి ఈ శక్తి మనిషి యంత్రానికి ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని అస్సలు ద్యానము ద్వార మణిలో శక్తి ఎలా పుడుతుంది మరియు అల పుట్టే శక్తి ఎలాంటిది .దాని ధర్మాలు ఏమిటి ఇవి ముందుగ తెలుసు కోవాలి మానవ శరీరములో ౭ రకాలైన చక్రాలు ఉన్నాయ్ ఇవి శరీరములో ఉండే ఐస్కాంత శక్తికి మూల కేంద్రాలు ,సాధారణముగా ప్రతి మనిషికి ఆ మనిషియొక్క జన్మపై ఆదారపడి ఈ చక్రాలు ఒక నిర్ణీత శక్తి తో శరీరములో ఉంటాయి ఈ నిర్ణీత శక్తీ అనేది మనిషి మనిషికి మారుతుంటుంది ఐతే మనిషికి మాములు జీవితములో దైనందిన వ్యాపారముల కారణముగా ఈ చక్రలలోని ఐస్కాంత శక్తి మెల్ల మెల్ల గ సంనగిల్లుతుంటుంది .ఐతే ఈ ఐస్కంత కేంద్రాల యొక్క పటుత్వము పోకుండా దానిని కాపాడుతూనే వాటి బలాన్ని “యోగా “ద్వార లేదా ద్యానము ద్వార ఎంత వరకైనా పెంచు కోవచు.ఎంతవరకు పెంచ వచ్చు నంటే అన్నిటికన్నా క్రిందనున్న “మూలాదారం ”చక్రములో అంతర్గతమై ఉన్న “కుండలిని”అనే ఐస్కాంత శక్తిని నిద్రలేపి పై చాక్రలన్నిటికి అందించటము ద్వారా ఆయా శారిర బాగాలను ఉత్తేజిత పరుచాటము ఒక్కటే కాదు సహస్ర చక్రము వరకు ఈ కుండలిని అనే శక్తిని పంపించి శరీరాన్ని ఒక బ్రంహన్దమైన ఒక ఐస్కంత శక్తి కేంద్రము గ మార్చ వచునుఇది చాలా ఉన్నత మైన సైంటిఫిక్ ప్రక్రియ మంత్ర తంత్రాలతో సంబందము లేకుండానే మనిషికి కావలసిన నిర్ణీత శక్తిని మన శరీరములో ఉద్భావింప చేసే అట్టి శక్తిని యంత్రానికి బడి లి చేయ వచ్చు ను ఈ బడి లి స్పర్స లేదా నీటి ద్వరా చేయ వచును.
నవ రత్నాలు:
Image result for gemstone images
ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర వేత్త శ్రీ వరాహ మిహిరుడు బృహత్ సంహిత గ్రందమందు నవరత్నాల గూర్చి వివరించాడు.
మత్స్య పురాణములో రత్న పర్వత దానము,రత్న దేను దానము ,అనెడి దానముల విషయములో నవరత్నాల ప్రసక్తి కలదు.ప్రాచీన ఆయుర్వేద గ్రందాల్లోకూడా వీటి వివరణ కలదు రత్న శాస్త్రం పేరిట ప్రత్యేక అద్వైన గ్రందాలు కూడా గలవు.ఋగ్వేద ప్రదమ ఋక్కులోహోతారం రత్న దాతమం అని రత్న శబ్ద ప్రయేగం కలదు.
పూర్వకాలం నుండి దురదృష్టాలను తొలగించుటకు ,శత్రువుల నుండి రక్షణ పొందుటకు.ప్రకృతి వైపరీత్యాలను తట్టు కొనుటకు రోగాలను నివారించు కొనుటకు జాతి రత్నాలను ధరించుట వాడుకలో ఉంది.
గ్రహదిపతి ఐన సూర్యుని కాంతిలోఏడు రంగులు ఉంటాయనే విషయం సైన్సు లో మరింత లోతుకు పోయి ఆలోచించిన వారు,ప్రయోగాలూ చేసినవారు గుర్తించారు.ప్రతి రంగులో ప్రత్యేకమైన స్పందనలు,కంపనలు,విద్యుదఐస్కాంత తరంగ దైర్గ్యములు కలిగి ఉంటాయి.ప్రతి రంగు అందరికి నప్పదు కొన్ని రంగులు నైసర్గిక తత్వాలను రగుల్కొలుపుతాయి రంగులకి తత్వాలు ఉన్నాయి.కోపానికి ఎరుపు ,సాన్తానికి తెలుపు.త్యాగానికి కాషాయము,ఈర్ష్యకు పసుపు ,అజ్ఞానానికి నలుపు ,ఈవిదంగా ప్రాచీనులు రంగులకు తత్వాలను నిర్దేశించారు. ఈ విశ్వమంతా రంగుల రంగేలిలో ఏర్పడ్డదే. సప్త వర్ణములనుండి సప్తస్వరాలు ,సప్త దాతువులు,సప్త మరుత్తులు ,సప్త ద్వీపాలు మొదలగు విశ్వ సృష్టి మవులిక అంశాలన్నీ ఏర్పడ్డాయి .ఛాయా గ్రహాలైన రాహు కేతులకు తప్ప సప్త గ్రహాలకు సప్త వర్ణాలు కలిగి ఉన్నాయ్ ఆయా గ్రహాలు ఆయా రంగుల కిరణాలను,వాయువులను తరంగాలను,ప్రసరింప చేస్తూ ఉంటాయి గ్రహాలు ప్రసరింపజేసే కిరణ సముదాయాన్ని బట్టే నవరత్నాలు,నవ ఒషదులు నవ ధాన్యాలు ,కల్పింప బడ్డాయి .
మన శరీరములో కల సప్త వర్ణాల్లోఒకదానికి లోపము కలిగినప్పుడు తత్ సంబంద రోగము ,విపరీత మానసిక తత్వము ,భావన ఏర్పడుతుంది .తద్వారా అస్త వ్యస్త పరిస్తుతులు ఏర్పడతాయి.ఏరంగు లోపము వల్ల విపరీత పరిస్తితి ఏర్పడిందో అరంగు కల జాతి రత్నము ధరించుట వల్ల ,ఆ రంగుకు ప్రతి నిది అయిన గ్రహాము యొక్క ప్రభావము తగ్గుతుంది ,గ్రహాల స్తితి గతులను మార్చలేము గాని వాటి ప్రభావాలను తగ్గించుకొనే మార్గాలెన్నో ప్రాచీనులు నిర్దేశించారు,నిప్పులు కక్కే వేసవిలో సూర్యుని అర్పలేము కానీ ,గొడుగు ధరిచుట వల్ల ఎండ తీవ్రత నార్ప వచును ,నీటి ప్రవాహాన్ని ఇంకి పోయేటట్లు చేయలేము కానీ ,ప్రవాహ గతిని దరి మళ్ళింప వచును .
రత్న ధారణ పూర్వకాలము నుండి జ్యోతిష్య శాస్త్రముతో ముడి పడి ఉన్నది. విది వాయిచత్రిని తట్టుకొనేందుకు ,కాల పురుషుని కొరడా దెబ్బలను బరించేందుకు రత్న దారణ చేయుట అతి ప్రాచినముగా వస్తున్న ఆచారము సూర్య రస్మిలో వలె ,మానవ శరీరములో సప్తవర్ణాల సంగమము ఉంటుంది .ఈ సప్త వర్ణాల్లో,ఒక దానికి లోటు లేదా అధికము అయినప్పుడు వాటిని అదుపులో పెట్టుటకు ,ఆ వర్ణానికి సంబందించిన జాతి రత్నాన్ని ధరించుట శాస్త్రములో నిర్నయిమ్పబడినది .
జాతి రత్నాలు అంత రిక్షఅతీంద్రియ కిరణ జాలాన్నికలిగి ఉంటాయి అని ,వాటి శక్తీ అనంతము ,అద్బుతము సర్వ వ్యాపకత్వ లక్షణ శరీరము లోని అన్ని మర్మ సందుల్లోకి ప్రవేశించి నివారణ జరుగు తుంది అని నిర్ణయించారు ,డా // బట్టాచార్యగారు అతని ౪౦ యేండ్ల పరిశోదన ప్రయోగాలలో ,మూడు లక్షలమందికి పైగా
జాతి రత్నాల ఒషదులను ప్రయోగించి సత్ఫలితాలను పొందారు.ప్రపంచ అన్ని వాయిద్య విదానాల్లో లోటు కలదని ,అవన్నీ రోగము యొక్క రూటు దగ్గరకు వెల్లడము లేదని నిర్దారణ చేసారు .కాస్మిక్ కిరణాలూ మాత్రమే రోగాల యొక్క మూలము లోకి వెళ్ళే శక్తీ కలదని ,అటువంటి కాస్మిక్ కిరణ శక్తీ జాతి రత్నాలకు కలదని రుజువు చేసారు
సుర్యునిలోని సప్త వర్ణాల కాస్మిక్ కిరణ శక్తీ సప్త గ్రహాల్లో కలవని వాటిని అదుపు చేయుటకు, అటువంటి కాస్మిక్ కిరణ శక్తీ గల జాతి రత్నాలకే శక్తీ కలదని చెప్పబడినది .నవగ్రహాలకు కల్పిమ్పబడిన రంగులు విశ్వంలో కల సౌర శక్తిలో కల రంగులకు సంక్షిప్త రూపాలని కూర్మ పురాణము నిర్దేసించినది .రత్నాలు బహిరంగముగా ప్రసరించే రంగులనే కాక ,అంతర్గతముగా కాస్మిక్ [దివ్య]కిరణాలూ కలిగి ఉంటాయి ఇవి స్తూల దృష్టికి గోచరము కావు.ఈ కాస్మిక్ కిరణలకు అత్యంత శక్తి వంతమైన నివారణ శక్తి కలిగి ఉంటాయి.ముత్యము తెలుపుగా కనపడినా దాని కాస్మిక్ కిరణము ఆరంజ్ రంగు ,పగడము యొక్క కస్మికి రంగు పసుపు ,చంద్ర సిల ,పుష్యరగాలవి ,నీలము రంగు ,వజ్రానిది ఇండిగో ,నీలానిది వయిలేటు రంగు,ఎలక్ట్రిక్ మోటారు మీద అత్యంత వేగముగా పరిబ్రింప చేయుట వల్ల కానీ కండ్లకు ప్రిజము ఆపాదించుట వల్ల కానీ రత్నాలకు కల కాస్మిక్ కిరణాలను గుర్తింప వచునని శ్రీ బట్ట చర్య గారు నిరూపించారు.
ప్రాచిన కాలము నుండి ఏరంగు ,ఎ శక్తీ జాతి రత్నాలకు నిర్ణయింప బడిందో అవే అంశాలు నేటికి అనుసరించుట జాతి రాత్నాలకుండే విశ్వ జనినతను స్పష్టం చేస్తుంది.అన్ని దేశాల వారు జాతి రత్నాలను ధరించుట కలదు .వాటి మహత్తును గ్రహించుట కలదు.ధరించే వారికీ ,రత్నానికి మద్య సైన్సు కు అందని కాంతి వలయబందము ఒకటి ఉందని సత్యము అందరు అంగీకరించారు ,గ్రహాలకు గృహాలను గృహలన్కరనలను,ప్రీతీ కరమైన వస్తు జాలాన్నిశాస్త్రాలు నిర్ణయించాయి .అందులోని బాగంగానే గ్రహాలకు జాతి రత్నాలను కూడా నిర్ణయించారు .ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క జతిరత్నము నిర్దేసింప బడినది గ్రహాలు ప్రసరించే కిరణ జాలము సారూప్యత పొందేటట్లు ఈ నిర్దేసముచేయబడినది .
అందుకు బిన్నముగా ధారణ జరిగినప్పుడు విపరీత పరిస్తుతులు ,పరిణామాలు సంబవిస్తుంటాయి .అన్నిటికన్నా ముక్యముగా ఎ రాత్నానికైన ,ఆలజ్ఞాదిపతి సంబంద జాతి రత్నము తప్పక ధరించాలి ,సర్వ శక్తులు లగ్నములోనే ఇమిడి ఉంటాయి .లగ్నమంటే ఏమిటనే భావన చాలా మందికి ఉంది. మనము జననమొందే కాలానికి సూర్యునికి అభిముకముగా ఎరాసి ఉంటుందో ఆరాసే లగ్నమవుతుంది.దానికి సరిగ్గా సప్తమములో ఉండే రాసి సప్తమ రాసి అవుతుంది .
రత్నాలకు కాల కాస్మిక్ కిరణ శక్తీ ఉష్ణ శీతల తత్వాలను కలిగి ఉంటుంది. పురుష గ్రహాలైన రవి, కుజ,గురు గ్రహాల కాస్మిక్ కిరనాలైన ఎరుపు ,పసుపు ,నీలము ,రంగుల్లో ఉష్ణ తత్వము కలవి,స్త్రీ గ్రహాలైన చంద్ర,భుద,శుక్ర ,శనులకాస్మిక్ కిరనలైన ఆరంజ్ ,ఆసుపచ, ఇండిగో ,వైలేటు రంగులు శీతల తత్వము కలవి.ఈ కాస్మిక్ కిరణాలూ ఇంద్రధనస్సు లోను,గ్రహల్లోను,రాత్నాల్లోను,
సారూప్యత కలిగిఉంటాయి,కనుక కృత్తిమంగా ఈ కాస్మిక్ కిరణాలను మానవసరీరము లోనికి ప్రసరింప చేయుట వల్ల రోగ నివారణ జరుగుతుందని శ్రీ భట్టాచార్య గారు నిర్దారించారు.అయితే ఈ కాస్మిక్ కిరణాలూ ఎక్కువగా ఎక్కడ ఉంటాయనేది ప్రశ్న.గ్రహకిరనల్లోను ,జాతి రాత్నాల్లోను కావలసినంత ఉంటాయి.రత్నాలలో కాల కాస్మిక్ కిరణ శక్తి అత్యంత శక్తీ వంతమై,కాల ప్రవాహి గతిని తట్టుకొని నీల్గా కలిగి ఉంటాయి .ఈ రత్నాల శక్తిని అనేక విదాలుగా ఉపయోగించ వచును .
----------------------------------------------------------------------------------------------------
లగ్నములు :
[1] మేష లగ్నం -చురుకైన తత్వమూ ,వాడి నేత్రములు ,కోప స్వభావము,తామస గుణము వన విలాస ప్రీతి అందరు న స్వాదీనములో ఉండాలనే కోరిక ,దీర్గ కాల శత్రువులు ఉంటారు .గొప్ప దైర్యము ,అధికమైన ఆశ.అదిక ధనము ,మంచి బోజన ప్రియులు ఎప్పుడు కోపముగా ఉన్నట్లు కనపడతారు .
[2] వృషభ లగ్నము – మృదు స్వభావం కలిగి ఉంటారు .దేవతలను ,బ్రంహనులను,గురువులను ,పూజించు గుణము కలిగి ఉంటారు క్షత్రియ స్వభావము ,స్వల్ప సంతానము ,దర్పములలోరాజసము శాంతమైన బుద్ది కలిగి ఎపనైనను బుద్ది బలముతో సాదిన్చెదరు.కామా వాంఛ అధికముగా ఉంటుంది.
[3] మిదున లగ్నము – మంచి బాగా వంతులు ,బందు ప్రీతి ,దయాగుణము ,చామన చాయ ,మంచి గుణము చాడీలు చెప్పే స్వభావము,,గొప్ప ఉహలలో తేలి పోతుంటారు ,ఆరోగ్య విషయములో జాగ్రత్త వహంచ వలెను.
[4] కర్కాటక లగ్నము -ధర్మ గుణము ,సున్నితమైన మాటలు ,మృష్టాన్న ప్రియులు ,కపటమైన బుద్ది .అన్యగ్రుహ ప్రీతి,సున్నిత మనస్సు ,దయగల నేత్రములు ,గొప్ప జ్ఞానము ,మనోడైర్యము ఉంటుంది
[5] సింహలగ్నము – సంతుష్టుమైన బుద్ది ,స్తూల శరీరము మంచి శారిర చాయ ,గొప్ప సురత్వము,శత్రు జయము పిసినారి గుణము మంచి నిర్ణయము ,విదేశి ఉద్యోగాము .
[6] కన్య లగ్నము -గొప్ప శ్రీమంతులు పనిలో నైపుణ్యము ,విద్వాంసులు ,వనిత విలాస వంతులు,వ్యాపార దక్షిత బందు ప్రీతి ,సుకమైన జీవితము ,మంచి కంద పుష్టి ,హాస్యముగా మాట్లాడతారు ,కలలందు ఆసక్తి ఉంటుంది.
[7] తులా లగ్నము -రాజ పూజ్యమైన గవురవము కలిగి ఉంటారు .మదన రతి యందు ఆసక్తి ఆరోగ్య కరమైన దంతాలు ఉంటాయి ,శాంత స్వభావము ,మ్రుడువుస్వబావము నిజాయితి ,దాంపత్య అన్యోన్యత ,ప్రశాంత జీవితమూ గడుపుతారు .
[8] వ్రుచిక లగ్నం -అతి ఆశ ,చురుకైన నేత్రములు పైత్యరోగా బడ ,ముర్కత్వము అదికం అతి చపలత్వము ,గొప్ప అబిమాన వంతులు ,శరీరము బాల హినము,శత్రు జయము మంచి మనస్తత్వము, కలిగి ఉంటారు .
[9] ధనుస్సు లగ్నము -విషాద ప్రియులు ,సుజన ద్వేషము ,ప్రజ్ఞ వంతులు ,మంచి చాయ ,ఎత్తుగా ఉండి బలము కలిగి ఉంటారు .లావు తొడలు మరియు కడుపు ఉంటుంది .సాత్విక స్వభావము ,అన్ని రకాల బోజన ప్రియులు.
[10] మకర లగ్నము -కుల శ్రేష్ఠులు ,శ్రీమంతులు ,గొప్ప కీర్తి ,గొప్ప ధన వంతులు ,రమణి లోలత ,దీన స్వభావము ,నల్లని శరీరము ,తామస గుణము ,వ్రుద్దత్వము ,క్రూర మనస్సు ,కలిగి ఉంటారు .
[11] కుంబ లగ్నము -గొప్ప ధన వంతులు ,పరకాంత లోలత్వము ,కటిన మైన మనస్సు ,కరున్యసీలము,నలుపు వర్ణ శారిర చాయ ,నరముల పుష్టి,కటినమైన నిర్ణయముల వలన ఇబ్బంది పద వలసి వస్తుంది .
[12] మీన లగ్నము – అందరికి ఇష్టము కలిగి ఉంటారు ,మంచి తేజోవంతులు ,ధన ,దాన్య సమృద్ది, మంచి విద్వాంసులు ,సుజన సహవాసం,మంచి చాయ ఉంటుంది.

జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు

Image result for వృక్షాలు
అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.
భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.
పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.
 
మీ జాతకం చుపించుకోవదనికే  
మి జాతకం తెలుసుకొనుటకు మాకు సంప్రదించు మార్గములు : 
1.అంతర్జాలం:  online లో మి జాతకం తెలుసుకొనుటకు లేదా దూరప్రాంతం వాళ్ళు మి జాతకం తెలుసుకొనుటకు మిరు  పుట్టిన వివరములు మా whatsapp నెంబర్ కి పంపండి.మా whatsapp నెంబర్ : 09704840400 .


2. మా ఆఫీస్ కి సంప్రదించవలిసిన చిరునామా :
మా ప్రధాన కార్యాలయం : 
శ్రీ జనయిత్రి జ్యోతిష్యలయం, D-No: 58-68-27/2, OPP: NSTL High Way Bus Stop,శాంతి నగర్ ,NAD కొత్త రోడ్స్, విశాఖపట్నం-530009,మా నెంబర్ : 09704840400 .