శ్రీ కృష్ణాష్టమి విశిష్టత :
ద్వాపరి యుగం లో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు కలియుగ సంధికాలమందు లో శ్రీ ముఖ నామ సంవత్సరం లో శ్రావణం మాసం లో బహుళ అష్టమి నాడు అర్దరాత్రి రోహిణి నక్షత్రం లో కంసుడు చెరసాలలో శ్రీ కృష్ణడు జన్మించాడు.ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. శ్రీ కృష్ణుడు పరిపూర్ణుడు. అన్ని అవతారాలలో కృష్ణావతారమే పూర్ణావతారామని ప్రసిద్ది. అందుకే ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటారు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథె "కృష్ణాష్టమి". ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుని అర్చించాలి. పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయన లోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయం లోను స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి,మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి.
శ్రీ కృష్ణాష్టమి పూజ విధానము :
కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
పూజ సామనులు :
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల ,శ్రీ కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
పూజ విధానము:
తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి.
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి , అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి , దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి . పీట మరీ ఎత్తుగా గాని , మరీ పల్లముగా గాని ఉండకూడదు . పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి , కుంకుమ తో బొట్టు పెట్టి , వరి పిండి , (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి . సాధారణం గా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి . ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని , చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి . ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి ,పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి , అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము :
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని , ఇత్తడిది గాని , మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి , వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను . దీపారాధనకు నువ్వులనూనె గాని ,కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు . పూజకు విడిగా ఒక గ్లాసు గాని , చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోవలెగించను .
శ్రీ కృష్ణుని వ్రత పూజకు కావలసిన ముఖ్య వస్తువులు :
కృష్ణుని బొమ్మ (శక్తి కొలది బంగారం , వెండి లేదా మట్టి బొమ్మ ) లేదా చిత్ర పటము , పువ్వులు, కొబ్బరికాయలు , పళ్ళు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరు వత్తులు , వస్త్ర , యజ్ఞోపవీతములు , నివేదనకు అటుకులు ,బెల్లం ,వెన్న , ప్రత్యేకముగా చేసిన పిండి వంటలు ( కృష్ణునికి ఇష్టమైన పదార్దములు జంతికలు , బియ్యం పిండితో చేసిన పాలకాయలు మొ|| వి ) సిద్దము చేసుకొనవలెను..సాయంత్ర సంధ్యాకాలంలో గృహమధ్యమున గోమయంతో ఆలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి ఒక మంటపాన్ని ఏర్పరుచుకుని నూతన కుంభం వుంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. తరువాత ఆ కలశం మీద బాలకృష్ణుని ప్రతిమను ప్రతిష్టించుకోవాలి.
అయితే ముందుగా దేవకీదేవ ప్రార్థనను ముగించుకున్న తరువాత కృష్ణుని ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి, తరువాత దేవకీదేవకి నివేదనం చేయాలి.
శ్రీకృష్ణుని పూజ అర్థరాత్రి వరకు నిర్వహించుకోవాల్సి వుంటుంది. పూజలో కృష్ణుడికి నైవేద్యంగా ముఖ్యమైన పాలు, పెరుగు, వెన్నలను సమర్పించుకోవాలి. చంద్రోదయ సమయంలో బయటకు వెళ్లి... అలంకృతమైన భూమిలో ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి.
ఈ పండుగనాడు వెండితో తయారుచేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాదికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం.
తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేసి, ఉపవాసాన్ని విరమించుకోవాలి.
ఒకవేళ ఇదంతా చేయడం సాధ్యం కాకపోతే.. కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి.
పాపపుణ్యాల గురించి ఎటువంటి అనుభవాలు తెలయని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని బయటపెట్టే కార్యకలాపం గల పండుగ ఈ కృష్ణాష్టమి.
ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి పూజలను నిర్వహించుకోవాలి.
Interesting post. Thanks to share with us. Also Get in touch with Astrologer pandit ramdial Ji, who offered effective solutions to many customers all over USA, UK, Canada & australia. click on below link & clear your probles start your's happy life...!
ReplyDeleteFamous indian astrologer in new york