Thursday, 11 August 2016

కృష్ణ పుష్కరాలు krishana Pushkaramulu : పుష్కర స్తాన విదానం

కృష్ణ పుష్కర సమయం: 




గురుడు  ( బృహస్పతి ) కన్య రాశి లో ప్రవేశించినప్పుడు కృష్ణ నది పుష్కరములు ప్రారంబిస్తారు , ఆంధప్రదేశ్లో రాష్ట్రం లో ఆగష్టు 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.కృష్ణా పుష్కరాలను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని కృష్ణా పుష్కర కమిటీ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిటీతో చర్చించిన ఆయన పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ పై చర్చించారు. ఏపీ సంస్కృతి గొప్పదనం దశదిశలా వ్యాపించేలా ఉత్సవ వాతావరణం కనిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు పుష్కరాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

పుష్కరమ  అనగా ఏమిటి ?

పుష్క అనగా 12 అని అర్థం ,పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని మన హిందువు శాస్త్రం చెప్పుతున్నది .పుష్కరుడు నివసించే కాలాన్ని పుష్కరాలు అని అంటారు. అందుకే పుష్కర కాలంలో చేసే స్నానాలకు, ఇచ్చే దానాలకు మంచి ఫలితముంటుందని నమ్మకం. సాధారణ రోజుల్లో సంవత్సరం పాటు కృష్న నదీ స్నానం ఆచరిస్తే ఎంత ఫలితముంటుందో, పుష్కరాల్లో ఒక్కసారి స్నానం చేస్తే అంతే ఫలితం దక్కుతుందని చెబుతారు. వేలకొలది మనుసుతో, వాక్కుతో, శరీరంతో చేసిన వివిధ పాపాలన్నీ పుష్కర స్నానం వల్ల తొలగుతాయని విశ్వాసం. తులాపురుష దానాలు వెయ్యి చేస్తే ఏ ఫలితం దక్కుతుందో, వంద కన్యాదానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అంత ఫలితం పుష్కర స్నానం వల్ల లభిస్తుందని చెబుతారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరముఅని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
అంతేగాకుండా పుష్కర కాలంలో చేసే దానాల వలన కలిగే ఫలితాలు అంతా ఇంతా కావు. దానాలలో సాలిగ్రామ దానం, శిలాదానం, కన్యాదానం, తిలపాత్రదానం, సరస్వతీ దానం..ఇవీ ఉత్తమమైన దానాలు. నదీ స్నానం చేసే ఇవి దానం చేస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని కూడా చెబుతారు. అందుకే పుష్కరాల్లో ఏరోజున ఏ వస్తువులు దానం చేయాలో కూడా పేర్కొన్నారు.ఆంధప్రదేశ్లో రాష్ట్రం లో ఆగష్టు 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని అనగా 1 ఎడారి లో  మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, అదే ఎడారి చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరముఅని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

2 comments:

  1. Astrologer Master Rudra Ji is the best astrologer in New York who was practicing Vedic Astrologer for the past many years.
    Astrologer in California

    ReplyDelete
  2. If you also want to reach the Top Indian Astrologer in USA- Master RamDial Ji then book an online appointment now.
    Top Indian Astrologer in USA

    ReplyDelete