Sunday 21 August 2016

వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు,అమ్మలకు అతి త్వరలో నేరవేరుటకు:రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి :

వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు / అమ్మలకు అతి త్వరలో నేరవేరుటకు:రుక్మిణి కళ్యాణం పారాయణం  చేయండి :

రుక్మిణి కళ్యాణం:


విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉన్నది. రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలే దినదిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వస్తుంది.వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణిదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదే విధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుని ఇచ్చి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిజోతనుడు అనే వి ప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురానికి వెళ్లి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. దీంతో అగ్నిజోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్లి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణుడికి విన్నవిస్తాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మణీదేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచనగా వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయంలో యదు వంశనందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్లవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కనుక యుద్దం జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశం వైపు బయలుదేరుతారు. అగ్నిజోతకుడు రుక్మిణి వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు. శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది.
ఆ విధంగా అర్చనలు పూర్తిచేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకుని హుటహుటిని ద్వారక వైపు బయలు దేరతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్లుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్దమునకు బయలు దేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యుద్ద వీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య, ఇప్పుడా ఇంటికి వెళ్లి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణాదేవి శ్రీకృష్ణుడి కాళ్లపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొని వస్తాడు. ద్వారకకు వచ్చాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వి వాహం జరిపిస్తారు.
క్షీర సాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారము అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్ఠములో ఉన్నను ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు అతి త్వరలో సౌందర్యవతి అయిన, అనుకూలవతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయం లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అనిచెప్పనలవి కాదు.

 ---------------------------------------------------------------------------------------------------------------------

1 comment:

  1. Thank you for వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకు,అమ్మలకు అతి త్వరలో నేరవేరుటకు:రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి : your blog is awesome and informative. check out our website how to remove evil spirits, and Master Vishnu ji is a Famous Indian Astrologer. We is the most accurate astrologer provides his services in various areas of Indian Astrology includes palms reading, psychic reading, vedic astrology, vashikaran specialist, black magic removal and more. Book an Appointment Now.

    ReplyDelete