మనవ జీవన విధానములో వివాహం చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటె మనిషి తన జీవితం ఏ ఎదుగుదలకు బాగస్వామి పాత్ర ఎంతగానో ఉంటుంది ,వంశం వృద్ది ,సమాజం మేరుగుపడుడుతకు వివాహ జీవితం ఎంతగానో ప్రభావం పడుతుంది, వివాహ జీవితం లో ముఖ్యముగా జాతకరిత్య పరిశీలన చేయునప్పుడు స్త్రీ పురుషులలో గమనించవలిసినవి వధువు ,వరుని వ్యక్తీ గత జతకంతో పాటు వాళ్ళ ఇద్దరి జాతక చక్రం లో ముఖ్యముగా పరిశీలన చెయ్యవలిసి ఉండును,అవి ఏమనగా 1. మానసిక స్వభావములు 2. ఆరోగ్య స్ధితి గతులు 3. సంతన స్థానములు , ఇవి సాయన ,నిరాయన జాతక విదివిధానములో ఏవిదముగా పరిశీన చేయుదరో ఇప్పుడు తెలుసుకుందాం
> అబ్బాయి జాతకం లో శుక్రుడు బాగుండాలి --> అమ్మాయి జాతకం లో కుజుడు బాగుండాలి ,
> అబ్బాయి జాతకం లో బుధుడు బాగుండాలి --> అమ్మాయి జాతకం లో గురుడిని బాగుండాలి ,
పై గ్రహ పొంతనలో అబ్బాయి కి అమ్మాయికి ఇద్దరిలో ఏ ఒక్కరికి గ్రహ స్థితి బాగోపోయిన ఆ పాయింట్ తీసుకోము ..ఇలా ముడితో కనీసం రెండు అయిన బాగుండాలి.
> అబ్బాయి జాతకం లో లగ్నం లేదా సప్తమం లో యురేనాస్ ,నెప్ట్యూన్ ,ప్లూటో ,నోడ్( రాహువు ),ఏంటి -నోడ్ (కేతువు ) ఒకే డిగ్రీ లు అమ్మాయి > > > జాతక చక్రం లో లగ్నం లేదా సప్తమం లో అదే డిగ్రీ లలో ఉండరాదు.
> వధువు లేక వరుడు ఉంటే ఇద్దరికీ కుజ దోషం వుండాలి లేకపోతె ఎవరికి ఉండరాదు, ఒక్కరికి కుజదోషం వుంది మరొకరికి కుజ దోషం లేకపోతె వాళ్ళ ఇద్దరికీ వివాహం చేయుట సరి కాదు,
> అమ్మాయి కానీ అబ్బాయి కానీ శని-చంద్రులు ,లేక శని-రవి ల దృష్టులు సమసప్తకము(0-30 డిగ్రీ ) లేక వెతిరేక దృష్టి (180 డిగ్రీ ) లేదా కేంద్ర దృష్టి (90 డిగ్రీ )వచినప్పుడు వివాహ పొంతన పరిగినిలోకి తీసుకోరు.
చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని,రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని ,లగ్నం శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది.
ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల,లగ్నాధిపతుల,రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన,మానసికమైన ఏకీకృత ఆలోచనా విధానం,శారీరక విషయాలలో లోపాలు లేకుండటం మొదలైన అంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతారు.
ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది.బాల్యవివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యకరమైన ఆనందకరమైన విధానమే ఈ మేలాపలకం.ఈ మేలాపలకం సరిగా ఉంటే వ్యక్తుల శరీర మానసిక ఆత్మిక ధోరణులలో ఐక్యత ఉండి దాదాపుగా ఇద్దరి ఆలోచనా ప్రవృత్తుల్లో ఆనందదాయకమైన ఫలితాలు ఏర్పడతాయి.లేకుంటే బలవంతంగా భావాలను,శరీరాలను పంచుకోవాల్సి రావటం వల్ల అక్రమ విధానాలకు,ఇబ్బందులకు వ్యక్తులు పాల్పడుతుంటారు.ప్రాశ్చాత్యులు కూడా ప్రస్తుత కాలంలో వివాహాల విషయంలో మేలాపకాదులను గమనిస్తున్నారంటే వారి విధానాల నుండి మన వైజ్ఞానిక మేలాపాక విధానం,సంప్రదాయ ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు వారు చూసే చూపును మనం అర్ధం చేసుకోవచ్చును.
చాలా మంది పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.
వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం),సప్తమ స్ధానం (దాంపత్య జీవితం),అష్టమ స్ధానం(వైదవ్యం),దశ ,అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.
వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .
1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి
వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం,కానీ సప్తమ,పంచమ,అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు.ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.
వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.
కర్కాటకం,వృశ్చికం,మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం,సింహం,దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున,తుల,కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.
వృషభ,కన్య,మకర రాశులు శూద్ర వర్ణం.
వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం.వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం.వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.
2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి – వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము , మకర రాశికి – మేషం , కుంభం కుంభరాశికి – మేషము , మీనమునకు – మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున,కన్య,తుల నర రాసులు.వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే.సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.
౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.
4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త-ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తిక-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త-పులి
ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు
పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస , సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు.ఒకే యోని అయితే సంపద,భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం,రాశి కూటం,వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.
5 గ్రహకూటమి :
సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు , కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం,సమమైత్రి మద్యమం,పరస్పర సమత్వం కనిష్ఠం,పరస్పర శతృత్వం మృత్యుపదం,శతృత్వం కలహాప్రదం.
6 గణ కూటమి :-
స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.
వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.
దేవగణ నక్షత్రాలు:-అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,హస్త,స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.
మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు.భాదించటం,వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.
రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక,ఆశ్లేష,మఖ,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,ధనిష్ట,శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు.అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు.కఠినంగా మాట్లాడుతారు.మిక్కిలి స్వార్ధపరులు.
వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం ,ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు,5-9 అయితే సంతాన హాని,2-12 అయితే నిర్ధనత్వం.
ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.
మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.
శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.
అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.
శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.
అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-మిధునం,మీనం-కర్కాటకం.
ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.
8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటములో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.
శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.
1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.వదూవరులిద్దరి నక్షత్రాలు ఉత్తర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.
2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ,అనురాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.
3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాడ,రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.
జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.
మహర్షి వశిష్టు (Maharishi Vashisht)ని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.
నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nari also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Naridosh also effect Mind of their Child and Health of their Child).
ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Naridosha will not affect you in this Conditions)
1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.
2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.
3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.
తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.