Thursday, 11 October 2018

భీమా నది పుష్కరాలు 12-10-2018 : BHIMA NADHI PUSHKARAMULU

 12-10-2018  నుండి  23-10-2018 భీమా నది పుష్కరాలు: ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఏవిధముగా ఉండును.

 

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులుభావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి

భీమానది పశ్చిమ కనుమల్లోని భీమశంకర్ ఆలయం వద్ద పుట్టింది. ఇది కర్నాటక- తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిలో కలుస్తుంది. భీమానదితో పాటు తమిళనాడులోని తామ్రపర్ణి నదికి కూడా పుష్కరాలు వస్తాయి. 

ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఏవిధముగా ఉండును: 


తేది : 11.10.2018 అనగా గురువారం రా. 08.04 ని.ల నుండి గురువు గ్రహం (బ్రహస్పతి గ్రహం) తులా రాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశము అవుతున్నందునా ఆయా రాశుల వారికి దానిప్రభావం వుంటుంది.
దీంతో ఈ రాశుల వారికి అనుకూలంగా వుంటుంది.
1) వృషభ రాశి కి 7 లో శుభం
2) కర్ణాటక రాశి కి 5 లో
3) తులా రాశి కి 2 లో
4) మకర రాశి కి 11 లో ( Best) ఫలితాలు కలుగుతాయ్.
ఈ క్రింద రాశుల వారికి అనుకూలమై వుండదు.
1) మేషం 8 వ స్థానం లో
2) మిథునం 6 లో
3) సింహ రాశి కి 4లో
4) కన్య రాశి కి 3 లో
5) వృశ్శిక రాశి కి 1 లో
6) ధనస్సు రాశి కి 12 లో
7) కుంభ రాశి కి 10 లో
గురు గ్రహం అనుకూలంగా లేని వారు గురు ఙపం, దానం చేసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. శుభమస్తు

No comments:

Post a Comment