Monday 8 October 2018

దేవినవరాత్రి పరిపూర్ణ పూజా విధానము

దేవినవరాత్రి పూజా విధానము
దేవీ నవరాత్రులు ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు / శరన్నవరాత్రులని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి షోడశోపచారాలతో పూజించడం అనుసృతంగా వస్తున్న సంప్రదాయం. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుకనే. ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. మహిషాశురుని మర్దించి శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి అవతారాలని ప్రతిష్టించి పూజలు జరుపుకుంటారు. కొంతమంది తమ ఇంట్లో ఆహవనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిని అగ్ని అను హోమాలు రోజూ జరుపుకుంటారు. ఇవే కాకుండా అదిత్య హొమము మహాసూర్య మంత్రాలను పఠిస్తూ జరుపుతారు. ఈ హొమములు చేయుట వలన ఇంటి ఆవరణం మహా శక్తి మయమై, ఇంటి వాతావరణం ఎల్లప్పుడు స్వచ్చంగా వుండును.
Image result for విజయ దశమి గురించి


1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దసమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదసమి ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి.

పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి.L
గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.
పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను. ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అజ్ఞాతవాసము చేసినారు. అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదశమి నాడు వారి అజ్ఞాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున శమి వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయ బడుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనము లు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను. అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేర ను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి,
అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి: మధ్యే అపరాజితాయై నమః ఇత్యపరాజితామావాహ్య తద్దక్షిణే క్రియా శక్తయేనమః ఇతి జయాం నామతః ఉమాయైనమః ఇతి విజయా నామ అపరాజితా యైనమః జయాయైనమః విజయాయైనమః అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము. కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు.

No comments:

Post a Comment