Tuesday, 24 April 2018

గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి ?

గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి ? 

Image result for బీరువా వాస్తు
గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనేదాని మీద భిన్న వాదనలున్నాయి. ఉత్తరం కుబేరస్థానం. కాబట్టి కుబేర స్థానంలో నగదు బీరువా ఉండటం మంచిది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో హుండీ కూడా ఉత్తర దిక్కులోనే ఉంటుంది. న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ము ఉత్తర దిక్కులో బీరువాలో ఉండటం ఉత్తమం. ఉత్తర వాయువ్యంలో కూడా బీరువా పెట్టవచ్చు.

మీ గృహ ఆవరణలో తూర్పు, ఉత్తర దిక్కులు దక్షిణ, పడమరల కన్నా పల్లంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇదే సూత్రం గృహానికే కాదు ఆ గ్రామానికి, నగరాలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉత్తరం ఎత్తైతే సిరిసంపదలు చిత్తే. దక్షిణ పడమరల కొండ అష్టైశ్వర్యాలకు అండ. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులు :

వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులు : 



వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయో చూద్దాం.

తూర్పు.. గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
పడమర.. సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం.. వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం.. అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం.. తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి.. తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
ఈశాన్యం.. వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం.. అదృష్టం,

అద్రుష్టం మీ తలుపు తడుటకు పఠీoచవలిసిన గణపతి మంత్రం :

బుధవారం గణపతి ఆరాధన విధానం : 
అద్రుష్టం మీ తలుపు తడుటకు పఠీoచుటకు గణపతి మంత్రం : 

Image result for బుధవారం గణపతి


ఈ క్రింది మంత్రాన్ని ఇలా పఠిస్తే మంచి ఫలితాలు పొందగలుతారు. మీరు వినాయకుడి విగ్రహం ముందు కూర్చుని ఈ మంత్రం పఠించండి. ఈ శ్లోకాన్ని 108 లేదా 1008 సార్లు పఠించడం చాలా మంచిది. ఇలా 21 రోజుల పాటు చేస్తే అద్రుష్టం మీ తలుపు తడుతుంది.గరికిని పూజ ఈ పూజ విధానం లో వాడుట శేష్టం. 


“ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ  స్వాహా   ఏకదంతాయ విద్ మహే వక్రతుండాయా దీమహి తన్నో దంతి ప్రచోదయాత్"

సంపద కొరకు లక్ష్మి గణపతి స్త్రోత్రం :

సంపద కొరకు లక్ష్మి గణపతి స్త్రోత్రం :
Image result for లక్ష్మి గణపతి

అదృష్టం మీ వెంటే ఉండాలని భావిస్తున్నారా? అయితే మీరు మహాలక్ష్మి మంత్రం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి. మీరు జపించాల్సిన మంత్రం ఇదే...
"ఓం శ్రీం అఖండ్ సౌభాగ్యం ధన్ సమిరిదిమ్ దేహి దేహి లక్ష్మి గణపతి నమః"
అయితే ఈ మంత్రాన్ని బుధవారం జపిస్తే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు. అలాగే మంత్రం పఠించే సమయంలో మీరు నెయ్యితో దీపం వెలిగించాలి. లక్ష్మి గణపతిని నిష్టతో పూజించాలి. 11 రోజుల పాటు మంత్రాన్నిజపిస్తూ  లక్ష్మి గణపతిని ఆరాధిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది.

Tuesday, 17 April 2018

అక్షయ తృతీయ పూజ విధానం :



అక్షయ తృతీయ  పూజ విధానం :

Image result for అక్షయ తృతీయ పూజ విధానం :
మన సంప్రదాయంలో ఐశ్వర్యాలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు.. దీంతో మహిళలు అమ్మవారి కటాక్షం వుంటే చాలు అనుకోవడమే కాదు.. పసుపు, కుంకుమ లతో పాటు బంగారం లను శుభ చూచికంగా భావిస్తారు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం తమ పై సర్వదా ఉండాలని అక్షయ తృతీయ రోజున పూజలు చేసి..సంపదకు చిహ్నమైన బంగారంను పూజిస్తారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటె అక్షయం (తరగనిది ) అవుతుందనే నమ్మకంతో బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు.
 
మరి మహిళలు ఎంతగానో ఎదురు చూసే ఈ అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలుసుకుందామా..!!
వైశాఖ శుద్ధ తృతీయ అంటే తదియ రోజున కృత యుగం ప్రారంభమైంది అని పురాణాలూ చెబుతున్నాయి. అంతేకాదు.. సంపదలకు అధిపతి కుబేరుడు శివుడిని ప్రార్ధించగా అయన లక్ష్మి అనుగ్రహాన్ని ఇదే రోజున ఇచ్చినట్లు శివ పురాణం చెబుతుంది.
ఈ తృతీయ రోజున తిధి బ్రహ్మ తో కలిసి ఉంటుంది. అందుకనే ఈ రోజున ఏపని చేసినా దాని ఫలితం అక్షయం అవుతుంది… అందుకనే ఈ తిధిరోజున అక్షయుడైన విష్ణువుతో పాటు.. ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ని పూజిస్తారు. అక్షతన్నామును విష్ణు పాదాల ఫై ఉంచి ఆయనకి అర్పించి తరువాత వాటిని బ్రాహ్మణులకు దానమిచ్చి ఆపై ఆ ఇంటి యజమాని ప్రసాదం గా తలచి భుజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అక్షయ తదియ సోమవారం కాని.. బుధ వారం కానీ అయితే మరీ పవిత్రమైనదిగా భావిస్తారు.
 
ఇక ఈరోజు ఎ శుభకార్యం అయినా సరే వజ్యం, రాహుకాలం వంటి వాటితో నిమితం లేకుండా జరుపుకోవచ్చు. ఈ రోజున గోమాతను పూజించడం విశేషం. సకల దేవతలందరూ గోమాతలో ఉంటారు కనుక అరటిపండు పెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజున బెల్లం, పండ్లు, చెప్పులు, విసన కర్ర, గొడుగులు, వస్త్రాలు, బియ్యం, పానకం, మజ్జిగ లాంటివి దానం చెయ్యడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. బహుశా ఎండాకాలం లో వస్తుంది కనుక ఎదుటి వారికి సహాయ పడడం కోసం ఈ నియమం పెట్టి ఉంటారు.
 
ఈ రోజున మనం చేసే పని అక్షయ ఫలితాలను ఇస్తుంది.. (అంటే ఏపని చేసినా తరగనిది అవుతుంది). కనుకనే ఈరోజున ఏది కొన్నా రెంట్టింపు అవుతుంది అని భావించి లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు.

అక్షయ తృతీయ రోజు చేయ్యవలిసిన చేయ్యకూడాని విధి విధానములు :

అక్షయ తృతీయ రోజు చేయ్యవలిసిన చేయ్యకూడాని విధి విధానములు :
--------------------------------------------------------------------------------------
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం - మా ప్రధాన కార్యాలయం: NAD Junction Beside Margadarsi office, మా సబ్ బ్రాంచ్ : Jagadamba Circle, sundar tailors road Vizag.
దురా ప్రాంతం వాళ్ళకి ప్రత్యేకం గా మి ఫోన్ / whatsapp ద్వార online lo మీ జాతక చక్రం,న్యూమరాలజి,గృహ వాస్తు తెలుసుకొనుటకు మమ్మలను సంప్రదిoచవలిసిన మా నెంబర్ 09704840400
--------------------------------------------------------------------------------------

Image result for అక్షయ తృతీయ
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అన్నిఏ శాస్రం లో రాయబడలేదు, అలా కొనుట పాపం ..కావున నిజముగా ఆర్థిక స్తితి గతులు మేరుగుపడాలి అనుకుంటే నేడు స్వయంపాకం గాని, లేదా ఏదైనా ద్రవ్యం అనగా పాలు,నూనే ,మజ్జిక,నెయ్యా మొదలగునవి, అలాగే గొడుగు,చెప్పులు,దుస్తులు దానం చెయ్యుట వలన లక్ష్మి దేవి అమ్మవారి అనుకూలత , కృప పొందవచును.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత :

అక్షయ తృతీయ ప్రాముఖ్యత :
--------------------------------------------------------------------------------------
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం - మా ప్రధాన కార్యాలయం: NAD Junction Beside Margadarsi office, మా సబ్ బ్రాంచ్ : Jagadamba Circle, sundar tailors road Vizag.
దురా ప్రాంతం వాళ్ళకి ప్రత్యేకం గా మి ఫోన్ / whatsapp ద్వార online lo మీ జాతక చక్రం,న్యూమరాలజి,గృహ వాస్తు తెలుసుకొనుటకు మమ్మలను సంప్రదిoచవలిసిన మా నెంబర్ 09704840400
-----------------------------------------------------------------------------------------------
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం

అక్షయ తృతీయ : నేటి దాన విశిష్టత : దుఃఖ నివారణ సంతోష ఐశ్వర్య సిద్ధి కొరకు నేడు చెయ్యవలిసిన దానం :

అక్షయ తృతీయ : నేటి దాన విశిష్టత : దుఃఖ నివారణ సంతోష ఐశ్వర్య సిద్ధి కొరకు నేడు చెయ్యవలిసిన దానం :
--------------------------------------------------------------------------------------
శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం - మా ప్రధాన కార్యాలయం: NAD Junction Beside Margadarsi office, మా సబ్ బ్రాంచ్ : Jagadamba Circle, sundar tailors road Vizag.
దురా ప్రాంతం వాళ్ళకి ప్రత్యేకం గా మి ఫోన్ / whatsapp ద్వార online lo మీ జాతక చక్రం,న్యూమరాలజి,గృహ వాస్తు తెలుసుకొనుటకు మమ్మలను సంప్రదిoచవలిసిన మా నెంబర్ 09704840400
--------------------------------------------------------------------------------------

అక్షయ తృతీయ విశిష్టత ..ఆచరించ వలసిన పూజ విధానం


అక్షయ తృతీయ నాడు గొడుగు ,చెప్పులు ,
స్వయంపాకం ,ఏదైనా ద్రవ్యం అనగా పాలు,నూనే ,మజ్జిక,నెయ్యా, ,దుస్తులు దానం చెయ్యుట దుఃఖ నివారణ కలిగి సంతోషకరమైన జీవితం పొంది ఆ లక్ష్మి దేవి అనుగ్రహం లబించును .
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అన్నిఏ శాస్రం లో రాయబడలేదు ..కావున నిజముగా ఆర్థిక స్తితి గతులు మేరుగుపడాలి అనుకుంటే నేడు స్వయంపాకం గాని, లేదా ఏదైనా ద్రవ్యం అనగా పాలు,నూనే ,మజ్జిక,నెయ్యా మొదలగునవి, అలాగే గొడుగు,చెప్పులు,దుస్తులు దానం చెయ్యుట లక్ష్మి దేవి అమ్మవారి అనుకూలత , కృప పొందవచును.


Monday, 2 April 2018

సంకష్టహరచవితి పరిపూర్ణ వ్రత విధానం :

సంకష్టహర చతుర్థి:

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి నియమాలు: 
  1. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి.
  2. ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి తెల్లవారు ఝామునే నిద్రలేచి, గణపతిని ప్రార్డించి, స్నానాది అనుష్టానాలు పూర్తి చేసుకుని 108 సారు గణపతిని స్మరించడం, స్తోత్రాదులు పారాయణ చేయడం విధి.
  3. సర్వ ఉపద్రవాలు, దీర్ఘవ్యాధులు, భయ, మిధ్యాపవాద దోషాలు, నానా కష్టాలు ఉపశమించడానికై వినయక ప్రీత్యర్ధం ఈ వ్రతం ఛెయువారికి, వారి కామితార్ధం సత్వర ఫల ప్రాప్తి నందగలదు.
  4. పూజ చేయురోజున పగటిపూట ఉపవాసం వుండాలి.
  5. సాయంకాలం షోడశోపచార సహితంగా వేయు నామాలతో గణపతిని పూజించి మోదక, గుడ (బెల్లం) నివేదనల్లో పాటు ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాళ్లు నివేదించాలి.
  6. వినాయకుని పూజించేటప్పడు బిల్వ పత్రాలు తెల్లజిల్లేడు పువ్వులు, గరికపోచలు శ్రేష్టం.
  7. సంవత్సరం పూర్తయిన తర్వాత వాయనదానం, ఉద్యాపన ముఖ్యం.
  8. యథాశక్తి లేదా 108 సార్లు ఓం గణపతియే నమః అనే అష్టాక్షరీ మంత్రజపం పూజ సమయంలో విశేవ ఫలదాయకం.
గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి
  1. వరద గణపతి పూజ
  2. సంకష్టహర గణపతి
పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే ‘వినాయక చవితి’. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకష్టహర గణపతి : 

సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం.
సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.
ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.
సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ )
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
ఓం గం గణపతయే నమః 

సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం 
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః 

సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.


ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.