అక్షయ తృతీయ పూజ విధానం :
మరి మహిళలు ఎంతగానో ఎదురు చూసే ఈ అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలుసుకుందామా..!!
వైశాఖ శుద్ధ తృతీయ అంటే తదియ రోజున కృత యుగం ప్రారంభమైంది అని పురాణాలూ చెబుతున్నాయి. అంతేకాదు.. సంపదలకు అధిపతి కుబేరుడు శివుడిని ప్రార్ధించగా అయన లక్ష్మి అనుగ్రహాన్ని ఇదే రోజున ఇచ్చినట్లు శివ పురాణం చెబుతుంది.
ఈ తృతీయ రోజున తిధి బ్రహ్మ తో కలిసి ఉంటుంది. అందుకనే ఈ రోజున ఏపని చేసినా దాని ఫలితం అక్షయం అవుతుంది… అందుకనే ఈ తిధిరోజున అక్షయుడైన విష్ణువుతో పాటు.. ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ని పూజిస్తారు. అక్షతన్నామును విష్ణు పాదాల ఫై ఉంచి ఆయనకి అర్పించి తరువాత వాటిని బ్రాహ్మణులకు దానమిచ్చి ఆపై ఆ ఇంటి యజమాని ప్రసాదం గా తలచి భుజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అక్షయ తదియ సోమవారం కాని.. బుధ వారం కానీ అయితే మరీ పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇక ఈరోజు ఎ శుభకార్యం అయినా సరే వజ్యం, రాహుకాలం వంటి వాటితో నిమితం లేకుండా జరుపుకోవచ్చు. ఈ రోజున గోమాతను పూజించడం విశేషం. సకల దేవతలందరూ గోమాతలో ఉంటారు కనుక అరటిపండు పెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజున బెల్లం, పండ్లు, చెప్పులు, విసన కర్ర, గొడుగులు, వస్త్రాలు, బియ్యం, పానకం, మజ్జిగ లాంటివి దానం చెయ్యడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. బహుశా ఎండాకాలం లో వస్తుంది కనుక ఎదుటి వారికి సహాయ పడడం కోసం ఈ నియమం పెట్టి ఉంటారు.
ఈ రోజున మనం చేసే పని అక్షయ ఫలితాలను ఇస్తుంది.. (అంటే ఏపని చేసినా తరగనిది అవుతుంది). కనుకనే ఈరోజున ఏది కొన్నా రెంట్టింపు అవుతుంది అని భావించి లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు.
No comments:
Post a Comment