Tuesday, 24 April 2018

గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి ?

గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి ? 

Image result for బీరువా వాస్తు
గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనేదాని మీద భిన్న వాదనలున్నాయి. ఉత్తరం కుబేరస్థానం. కాబట్టి కుబేర స్థానంలో నగదు బీరువా ఉండటం మంచిది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో హుండీ కూడా ఉత్తర దిక్కులోనే ఉంటుంది. న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ము ఉత్తర దిక్కులో బీరువాలో ఉండటం ఉత్తమం. ఉత్తర వాయువ్యంలో కూడా బీరువా పెట్టవచ్చు.

మీ గృహ ఆవరణలో తూర్పు, ఉత్తర దిక్కులు దక్షిణ, పడమరల కన్నా పల్లంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇదే సూత్రం గృహానికే కాదు ఆ గ్రామానికి, నగరాలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉత్తరం ఎత్తైతే సిరిసంపదలు చిత్తే. దక్షిణ పడమరల కొండ అష్టైశ్వర్యాలకు అండ. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

No comments:

Post a Comment