Tuesday, 16 April 2019

దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి పరిపూర్ణ వ్రత విధానం


 దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే “అనంగ త్రయోదశి పరిపూర్ణ  వ్రత విధానం
భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే “అనంగ త్రయోదశి”. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు. ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం. శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.
అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి
నమోస్తు పుష్పబాణాయ
జగదాహ్లాదకారిణే!!
మన్మధాయ జగన్నేత్రే !
రతిప్రీతి ప్రియాయతే!!
అనే శ్లోకాన్ని పఠించి
కామదేవాయ విద్మహే|
పుష్పబాణాయ ధీమహి|
తన్నో అనంగ ప్రచోదయాత్‌||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ
మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను. ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది. అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.
మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.
మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ,ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.
రుషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.
మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.
రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతాన్ని రాగాలున్న దంపతులు, అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది

Tuesday, 9 April 2019

మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత:



మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత: 
చైత్ర శుద్ధ తదియ రోజున మత్స్యావతారం ధరించాడు కనుక, ఈ రోజుని 'మత్స్య జయంతి' గా జరుపుకోవడం అనాదికాలం నుంచి వస్తోంది. విష్ణువు యొక్క తొమ్మిది అవతారాలు రామావతారం, కృష్ణావతారం, కూర్మావతారం , నరసింహావతారం, వరాహావతారం, వామనావతారo , నరసింహావతారం, భార్గవ అవతారం అలాగే మత్స్యావతారం హిందూమతంలో అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇతర అవతారాలలో, మత్స్యావతారం ప్రముఖమైనది. ఈ మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని హిందువులు జరుపుకుంటారు. 
               Image result for మత్స్య జయంతి యొక్క ప్రాముఖ్యత:


వేదాలు ... సకల లోకాలలోని చీకట్లను పారద్రోలే ఆయుధాలు. సమస్త దేవతలకు ... మహర్షులకు ... మానవాళికి వెలుగును ప్రసాదించే ఆధారాలు. అలాంటి వేదాలు బ్రహ్మదేవుడి అధీనంలో ఉంటాయి. అంతటి విశిష్టమైన వేదాలను అపహరించి అన్ని లోకాలను అజ్ఞానాంధకారంలోకి నెట్టేయాలని హయగ్రీవుడనే రాక్షసుడు భావిస్తాడు. బ్రహ్మదేవుడి అధీనంలో గల వేదాలను అపహరించి, తన ఉనికి ఎవరికీ తెలియకుండా సముద్ర గర్భంలో దాక్కుంటాడు.

విషయాన్ని విష్ణుమూర్తికి వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తాడు బ్రహ్మదేవుడు. ప్రళయకాలం ఆసన్నమైందనే విషయాన్నీ కూడా అదే సమయంలో శ్రీమహావిష్ణువుకి గుర్తుచేస్తాడు. సముద్ర గర్భంలోగల వేదాలను రక్షించడానికీ ... మరో యుగానికి అవసరమైన జీవరాశిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరిస్తాడు. సముద్ర గర్భంలోకి ప్రవేశించి అసుర సంహారం చేసి వేదాలను కాపాడతాడు.

అదే మత్స్యావతారంతో సత్యవ్రతుడనే భక్తుడిని రక్షించి, ఆయన ద్వార తరువాత యుగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఈ కారణంగానే మత్స్యావతారం మహా విశిష్టమైనదిగా చెబుతుంటారు. లోకకల్యాణం కోసం స్వామి చైత్ర శుద్ధ తదియ రోజున మత్స్యావతారం ధరించాడు కనుక, ఈ రోజుని 'మత్స్య జయంతి' గా జరుపుకోవడం అనాదికాలం నుంచి వస్తోంది.
మత్స్య జయంతి చెయ్యవలిసిన విధివిధానం : 
ఈ రోజు మత్స్యo తో అనుబంధం ఉన్న కారణాన, చెరువులు, సరస్సులు, నదులు మరియు ఇతర నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా అదృష్టం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. చేపలు మరియు ఇతర జల జంతువులకు ఆహారమివ్వడం కూడా సాధారణoగా దీక్షలో భాగంగానే ఉంటాయి. ఈ రోజున దాతృత్వంలోని ఏదైనా రూపం ప్రోత్సహించబడుతుంది. అందువల్ల చాలామంది ప్రజలు ఈ రోజున సమాజంలోని పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఆహారాన్ని మరియు పాత దుస్తులు విరాళంగా ఇస్తుంటారు. ఈరోజు మత్స్య్తావతారo లేదా మత్స్య పురాణం సంబంధించిన కథలు చదవడం కానీ వినడం వలన కానీ పాప చింతన తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.


ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించి, విష్ణుమూర్తికి షోడశోపచార పూజను నిర్వహించాలి. స్వామివారికి ఇష్టమైన ఫలాలను ... పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ ... భజనలు ... పారాయణాలు చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజున విశిష్టమైన వైష్ణవ క్షేత్రాలను దర్శించడం వలన , అక్కడ శక్తిమేర దానధర్మాలు చేయడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడుతోంది.

Sunday, 7 April 2019

రామ నవమి పరిపూర్ణ పూజ విధానం మరియు, ఆలస్య వివాహ సమస్య నుండి బయట పడుటకు నేడు చెయ్యవలిసిన యోగక్షేమం :sri raama manavami special article

 శ్రీ రామ నవమి ప్రత్యక శిర్షిక  : శ్రీ రామ నవమి పరిపూర్ణ పూజ విధానం మరియు,  ఆలస్య వివాహ సమస్య నుండి బయట పడుటకు నేడు చెయ్యవలిసిన   యోగక్షేమం :
చైత్రమాసం, పునర్వసు నక్షత్రం, నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను. నవమి నాడే సీతామహాదేవితో వివాహము, నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది. శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ. చైత్ర శుద్ధ నవమి నాడు, అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.
ఇంట్లో జరుపుకునే విధానము:
శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ. చైత్ర శుద్ధ నవమి నాడు, అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.శ్రీరామ నవమి రోజున కుటుంబ సభ్యులందరూ పెందల కడనే (ప్రొద్దుపొద్దునే) నిద్ర లేచి, తలంటు స్నానము చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. సీతా,లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామ చంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములను గాని పూజా మందిరంలో ఉంచి శ్రీ రామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి వూరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్ల లోగాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి.
శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతు.వివాహం కానివారికి వివాహ అనుకూలత లభించును.

అశ్వత్ధ వృక్షాన్నిఏవిధముగా పూజించాలి

రావి వృక్షముని ఏ విధముగా ఎప్పుడు ఎలా పూజించాలి 
అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:
మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.
ప్రదక్షణ మరియు పూజించు విధానము : 
:
ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి( శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి
అశ్వత్ధవృక్ష స్తోత్రం :
Image result for aswatha vruksham
www.srijanayitriastrology.com
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.
అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :
అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం
కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధనచేసిన ఫలితముంటుంది. గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడ లో స్నానమాచరించిన మహాపాపములు తొలగును. అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్నిఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.

Thursday, 4 April 2019

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర ద్వాదశ రాశీ ఫలాలు Sree Vikari Nama Samvatsara 12 Rasies / 12 Signs Free Telugu Rasi Phalalu

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర ద్వాదశ రారాశి ఫలాలు Sree Vikari Nama Samvatsara 12 Rasies / 12 Signs Free Telugu Rasi Phalalu : 

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా
  •  కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.
  • 2019- 2020 శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి 
  • ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 03 అవమానం - 06. పూర్వ పద్దతిలో వచ్చిన 
  • శేష సంఖ్య "3" . ఇది కుటుంబ విషయాలలో కొద్దిపాటి చికాకులను సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మంచి ఫలితాలను కలుగచేయును. సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడును. ఫైనాన్సు వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం బాగా కలసివచ్చును. నూతన వ్యాపార - వ్యవహరాదులు ఆశించిన విధంగా విజయవంతం అగును. సోదర వర్గం వారితో గొడవలు. మానసిక ఆందోళనలు. స్థిరాస్థి వ్యవహారాలలో తగవులు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం. ఐ.వి.ఫ్ పద్దతి ద్వార గర్భధారణ ప్రయత్నాలు చేయువారికి ఆటంకములు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. మానసిక సంతోషం కలిగే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరక శ్రమ అధికం అగును. ఉద్యోగ మార్పిడి యత్నాలకు మంచి కాలం. విదేశీ వ్యవహారములు కొంత కష్టంతో పూర్తీ అగును. పై అధికారుల వలన నమ్మక ద్రోహం. నూతన వ్యక్తుల పరిచయాలలో జాగ్రత్త అవసరం. గృహమునందు శుభ కార్యములు వాయిదా వేయుట మంచిది. పితృ వర్గీయులకు మంచిది కాదు. తీవ్ర ఆరోగ్య భంగములకు సూచనలు కలవు. వ్రుత్తి జీవనములోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి చక్కటి ఫలితాలు కలవు. విద్యార్ధులకు చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరం. కళారంగం వారికి గౌరవం తగ్గును. ఆర్ధికంగా నష్టములు ఏర్పడును. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు. రావలసిన బకాయిలు ఆశించిన సమయానికి చేతికి రావు.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ది.03-నవంబర్-2019 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. చేపట్టిన పనులలో మొదట మంచి ఆరంభం ఏర్పడి చివరకు యోగించక కష్టములను ఏర్పరచును. అష్టమ గురు ప్రభావం వలన రక్త సంబంధ అనారోగ్యములతో బాధపడు వారికి సమస్యలు అధికం అగును. ది. 04-నవంబర్ - 2019 నుండి గురువు అతి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. వారసత్వ సంబంధ భాగ్యం కలసివచ్చును. సంతాన ప్రయత్నములు చేయువారికి శుభ వార్తలను కలుగచేయును.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సంవత్సరం అంతా చక్కటి ధనలాభాలు కలుగచేయును. నల్లని భూములు మంచి దిగుబడిని ఇచ్చును. నల్లని వస్త్రములు, ధాన్యములు, లోహముల వ్యాపారములు చేయువారికి బాగా కలసివచ్చును. న్యాయవాద వృత్తిలోని వారికి బాగా రాణింపు ఏర్పడును.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇద్దరూ సంవత్సరం అంతా మంచి చేయరు. చక్కగా జరుగుతూ ఉన్న పనులలో భంగములు, ధన వ్యయములు, పిత్రువర్గీయులతో సమస్యలు, పితృ సౌఖ్య లేమి సంతాన ప్రయత్నాలలో విఘ్నాలు వంటి చికాకులను ఏర్పరచును.
ఏప్రిల్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో చక్కటి ధనలాభాములు కలవు. భూ లేదా గృహ సంబంధ సంపద ఏర్పాటు చేసుకోవడానికి ఈ మాసం అనువైన కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. పుణ్యక్షేత్ర సందర్శన కోర్కెలు తీరును. విదేశీ ఆదాయం కొరకు చేయు ప్రయత్నాలు సిద్ధించును. ప్రతిభకు తగిన అవకాశములు పొందేదురు. కుటుంభంలో గౌరవ మర్యాదలు , వైవాహిక జీవనంలో సంతోషం. జీవన ప్రయాణంలో సరైన మార్గంలో ఆలోచనలు చేయుదురు. అన్నివర్గాల వారితో సంబంధాలు బలపడతాయి. మాసం చివరి వారంలో విలువైన ఆభరణాల కొనుగోలు. ఈ మాసంలో 16, 17,18 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో ధనవ్యయం కొద్దిగా పెరుగును. ఆర్ధిక విషయాలలో ఆఖస్మిక వ్యయములు. సొంత మనుష్యుల నుండి ఆశించిన సహకారం లభించదు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉపకరిస్తాయి. వారివల్ల అభివృద్ధి వుంటుంది. కోర్టు వ్యవహారాలలో విజయం. తగవులలో పైచేయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందు అవకాశములు. నూతన ఆలోచన విధానం విజయాన్ని అందించును. మూడవ వారం ప్రారంభం నుండి అవసరానికి తగిన విధంగా ధనం సర్దుబాటు. కాని శారీరక శ్రమ అధికం అగును. 24, 25, 28, 29 తేదీలు వివాహ ప్రయత్నాలు చేయుటకు మంచిది. సంతాన ప్రయత్నాలు చేయువారు 28వ తేదీ నుండి రాహు - కేతు దోష నివారణ పూజ ప్రారంభించుట మంచిది.
జూన్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో నూతన గృహ సంభంధమైన కార్యములు విజయవంతము అగును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారములు లాభించును. ధనాదాయం బాగుండును. మిత్రుల నుండి ఆశించిన తోడ్పాటు లభించును. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందేదురు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడును. వారసత్వ పరమైన విషయాల కొరకు కుటుంభ పెద్దలను సంప్రదించవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు స్థిరత్వం లభించును. భాద్యతలు పెరుగుతాయి. చేసేటటువంటి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. మాసమధ్యమంలో తృప్తికర సంఘటనలు. చేపట్టిన పనులను సులువుగా పూర్తీ చేయగలరు. ఈ మాసంలో 4,8,9 తేదీలలో వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
జూలై 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. దీర్ఘకాలిక ఋణాలు తీరును. సంతాన ప్రయత్నాలు ఫలించును. ద్వితీయ వారంలో కామతూరత వలన తలవంపులు. కుటుంభంలో పరాయి వ్యక్తుల పరిచయాల వలన గొడవలు. స్నేహితులతో మీ అంతర్గత వ్యవహారాలు చర్చించకుండా ఉండుట మంచిది. ప్రేమవ్యవహరాల వలన అశాంతి. 17వ తేదీ తదుపరి కొత్త వాతారణం ఏర్పడి కొంత అనుకూలత ప్రారంభం అగును. నిరుద్యోగులకు ధనార్జనకు మార్గాలు ఏర్పడును. తెలివిగా మాట్లాడుట వలన సమస్యలనుండి తప్పించుకొందురు. 22వ తేదీ నుండి 26వ తేదీ మధ్య నూతన ఆర్ధిక ఒప్పందాలు, క్రయవిక్రయాలు నిర్వర్తించుట , ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయుట మంచిది కాదు.
ఆగష్టు 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో వివాదాలు సామరస్యంగా పరిష్కారమగును. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి మాత్రం నిరాశ. గృహంలో శుభకార్య సంబంధ శ్రమ, కార్యములందు ఆటంకములు. ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం. ఒత్తిడితో కూడిన జీవనం. కుటుంబ విలువలు నిలపెట్టుకోవడానికి ఒంటరి పోరాటం. మీ ఉన్నతమైన విలువలే మీ అభివృద్ధికి అడ్డువచ్చును. చివరి వారంలో నిర్దేశించుకున్న మొత్తం కన్నా అధిక ఖర్చులు చికాకును కలిగించును. వైవాహిక సంబంధ విషయాలు నిరాశ కలిగించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం.
సెప్టెంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో ఊహించని విధంగా ఇతరులతో లేదా ఇరుగుపొరుగు వారితో వివాదాలు లేదా వారి వలన నష్టములు. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు. అనారోగ్య మూలక ధన వ్యయం. కోర్టు తీర్పులు ప్రతికూలం. గృహంలో మార్పులకు ఇది మంచి కలం కాదు. వ్యాపార వర్గం వార్కి ప్రతికూల ఫలితాలు. మధ్యవర్తులపై ఆధారపడకుండా స్వయంగా క్రయవిక్రయాలు చేపట్టుట మంచిది. ఉద్యోగ జీవులకు చేపట్టిన పనులలో వాయిదాలు. తీవ్ర ఒత్తిడి లేదా ఉద్యోగ నష్టం. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఈ మాసంలో 2, 3, 4, 13, 20, 29 తేదీలు అనుకూలమైనవి కావు.
అక్టోబర్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో కూడా అంత మంచి ఫలితాలు ఏర్పడవు. వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా సాగవు. నూతన పెట్టుబడులు నష్టములను ఏర్పరచు సూచన. ధనాదాయం తక్కువ లేదా సామాన్యం. ఉద్యోగ అన్వేషణ ఫలించదు. మిత్రులు మాట తప్పెదరు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. ఏకాగ్రత లోపించును. ఆత్మనూన్యత వలన బాధపడు సూచన. 19 వ తేదీ తదుపరి పరిస్తితులు మెరుగవును. నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులకు సహాయత లభించును. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. విద్యార్ధులు శ్రమించవలెను. విదేశీ ప్రయత్నాల వలన ఆర్ధిక ఇబ్బందులు. రాజకీయాలలోని వారికి కోర్టు తగాదాలు లేదా పదవీగండం . మాసాంతంలో సంతాన సౌఖ్యం.
నవంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం వృద్ది చెందును. గత రెండు మాసములుగా ఎదుర్కొంటున్న చెడు ప్రభావం తగ్గుముఖం పట్టును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు సిద్హించును. పెద్దల జోక్యంతో జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అగును. పనులను సకాలంలో పుర్తిచేయగలిగి అందరిని ఆకర్షించగలరు. పనిచేయు కార్యాలయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అభివృద్దికి బాటలు వేయుదురు. తృతీయ వారం నుండి చక్కటి మనోల్లాసం ఏర్పడును. వైవాహిక జీవనమందు అతి చక్కటి సంతోషాలు. సమాజంలో పరిచయాలు పెరుగును. మీ చేతిపై పుణ్యకార్యములు విజయవంతంగా పుర్తిఅగును. వ్యాపారస్తులు చేయు ఆర్ధిక లావాదేవీలు కలసివచ్చును.
డిసెంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో కూడా చక్కటి ధనాదాయం కొనసాగును. వ్యాపార వ్యవహరాదులు అనుకూలంగా కొనసాగును. మొండి బఖాయిలు వసూలు చేసుకోగలరు. కుటుంబ సభ్యుల కలయిక వలన ఆనందకరమైన వాతావరణం. కొత్త ఆలోచనల అమలకు ఇది మంచి మాసం. అవసరానికి అందవలసిన డబ్బు అందుతుంది. గౌరవ ప్రదమైన ఉద్యోగ జీవనం కొనసాగుతుంది. కృషికి తగిన గుర్తుంపు వుంటుంది.
జనవరి 2020 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ పరమైన వ్యయం అధికం. క్రిమి కిటకాదుల వలన అనారోగ్య సమస్యలు ఏర్పడును. కొత్త రంగాలలో చేయు ప్రయత్నాలు ఆటంకములను ఎదుర్కొనును. ఆత్మీయులతో చేరిక వలన ప్రశాంతత ఏర్పడును. ప్రయాణాలు శ్రమను కలిగించును. లక్ష్యసాధనలో ఏకాగ్రత లోపించు సూచన. వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. జూదం వలన ఆర్ధిక నష్టములు. తీరిక లేకుండా సమయాన్ని గడిపెదురు. 22 వ తేదీ తదుపరి ముఖ్యమైన పనులను పూర్తీ చేయగలుగుదురు. భవిష్యత్ గురించిన ప్రణాళికలు లాభించును.
ఫిబ్రవరి 2020 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో వ్రుత్తి ఉద్యోగాలలో అనుకోని చెడు మార్పులు సంభవించును. అతివిశ్వాసంతో నష్టాన్ని ఏర్పరచుకొందురు. మంచి అవకాశములను పాడుచేసుకోను సూచన. దైవ సంబంధ కార్యక్రమాలలో మీ వంతు సహకారం అందించేదురు. ధనాదాయం తగ్గును. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగవు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. ఈ మాసంలో 8,9,17.18.20 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చి 2020 మేషరాశి ఫలితాలు:
ఈ మాసంలో పితృసంబంధమైన భాగ్యం లభించును. ఎదురుచూస్తున్న మంచి మార్పులు కెరీర్ పరంగా ఏర్పడును. వ్రుత్తి వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. కుటుంబం ఆర్ధికంగా మెరుగైన స్థితిని పొందును. 11 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య తలపెట్టిన ప్రతీపని శుభఫలితాలను కలుగచేయును. నూతన పదవులు పొందుదురు. సమర్ధవంతంగా పనిచేయగలుగుతారు. చివరి వారంలో కార్యభారం వలన ఆరోగ్యం పాడగును. భాత్రు వర్గం వారికి మీ సలహాలు మంచి చేయును.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా 
  • మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 08 వ్యయం - 08 
  • రాజపూజ్యం - 06 అవమానం - 06. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక 
  • విషయాలలో విజయాన్ని సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400

వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆరోగ్య పరమైన విషయములందు మినహా మిగిలిన విషయాలలో మంచి ఫలితాలను కలుగచేయును. నూతన ప్రయత్నాలు లాభించును. వ్యాపార వ్యవహరాదులు లాభించును. సంతాన సంభంధమైన ప్రయత్నాలు కలసి వచ్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధించును. ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. మీ చేతిపై శుభకార్యములు చేయుదురు. వ్యాపార రంగం వారికి నూతన పెట్టుబడులు కలసి వచ్చును. స్నేహితుల సహకారం ఆశించిన విధంగా ఉండదు. గృహమున సౌఖ్యం పెరుగును. జీవిత భాగస్వామి వలన కుటుంబ కార్యములు విజయవంతంగా పూర్తీ చేయగలుగుతారు. వ్యవసాయదారులకు మంచి ఆదాయం లభించును. విద్యార్ధులకు మిశ్రమ ఫలితాలు. వస్త్ర రంగ వ్యాపారులకు శ్రమ అధికం. మద్యం , చలన చిత్ర రంగంలోని వారికి ఖర్చులు అధికం. విదేశీ ప్రయత్నాలు చేయువారికి సానుకూల ఫలితాలు. ఆరోగ్య విషయాలలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీవ్ర ఆరోగ్య భంగములు ఏర్పడు సూచనలు అధికం. మానసిక రుగ్మతలు, ప్రయాణములందు ప్రమాదాలు, వాహనముల వలన సమస్యలు. మూత్రపిండాల సమస్యలు కలిగిన వారికి ప్రమాద కాలం. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గురు గ్రహానికి శాంతి జపములు జరిపించుకోనూట మంచిది.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ఆరోగ్య విషయముల మినహా నవంబర్ 3 వరకూ అన్ని విషయాలందు మంచి ఫలితాలు ఏర్పడును. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. భార్యాభర్తల మధ్య ప్రెమపూరిత వాతావరణం. 04-నవంబర్ - 2019 తదుపరి భాగ్యం స్వల్పంగా ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పరచును.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన 23-జనవరి-2020 వరకూ ఆర్ధిక పరమైన చికాకులు , పూర్వ కాలపు ఋణముల వలన బాధలు ఏర్పరచును. 24-జనవరి-2020 నుండి మిక్కిలి ధనాదాయం ఏర్పరచును. ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశించు వారికి కోరుకొన్న ఫలితాలు. మీ చేతిపై సత్కార్యములు జరుగును. వారసత్వ లాభములు పొందేదురు. కోర్టు తీర్పులు అనుకూలంగా ముగియును.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు మంచి ఫలితాలు ఇవ్వరు. రాహువు వలన అదుపు తప్పిన వ్యయం, ఆయు: గండములు ఏర్పడును. కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయువారికి నష్టములు, తగాదాలు ఏర్పడును.
ఏప్రిల్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో నూతన గృహం కొరకు చేయు ప్రయత్నాలు నెరవేరును. గృహ నిర్మాణ పనులు సజావుగా కొనసాగును. నూతన వాహన ప్రయత్నాలకు కూడా ఇది మంచి కాలం. ఆదాయం బాగుండును. సంతాన పరమైన సంతోషాలు. ఉద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు కలసి వచ్చును. కుటుంబ ప్రశాంతత పూర్తిగా లభించును. స్నేహితుల వ్యక్తిగత విషయాలలో జోఖ్యం చేసుకోవడం వలన అపఖ్యాతి. ఈ మాసంలో 24, 25,26 ,27 తేదీలలో చేయు ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.
మే 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ పరమైన అవసరాల వలన శారీరక శ్రమ అధికం అగును. నూతన పెట్టుబడులు లాభించును. పై అధికారుల పరిచయాలు కెరీర్ పరంగా కలసి వచ్చును. లక్ష్యాలను సాధించుకొందురు. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు. శుభకార్యాలలో పాల్గోనేదురు. వైద్య రంగంలోని వారికి మంచి ప్రోత్సాహం ఏర్పడును. 12,13 తేదీలలో ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులు. 20వ తేదీ తదుపరి ధనాదాయం బాగుండును.
జూన్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసం నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగ మార్పులకు, సంతాన ప్రయత్నాలకు , వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభకరమైన పరిస్థితి కలుగచేయును. ధనాదాయం బాగుండును. బంధు కలయికలు - బంధు సంతోషాలు. నూతన వ్యక్తుల పరిచయాలు. పిల్లల విషయాలలో శ్రద్ధ వహించుట అవసరమగును. మూడవ సోమవారం నుండి ఆరోగ్య పరమైన క్షీణత సూచన. మానసిక ప్రశాంతత లోపించును. వ్యాపార రంగంలో మీదైన గుర్తుంపు నిలబెట్టుకుంటారు. ఈ మాసంలో 6,7, 19, 20, 24 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో జీవిత అభివృద్ధి పనులకు శ్రీకారం చేయుదురు. జీవిత మార్గంలో ఆశించిన ఫలితాలు ఏర్పడును. సమాజంలో గౌరవం పెరుగును. ద్వితీయ వారంలో అధికారులతో వివాదాలు ఏర్పడు సూచన. ఆదాయం మాత్రం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లేదా అధికారులతో సంప్రదింపులు చేయుట మంచిది కాదు. తృతీయ వారం నుండి అవకాశములు నిదానంగా లభించును. ఆభరణాలు ఏర్పరచుకొందురు. అవివాహితుల వైవాహిక ప్రయత్నాలు లాభించును. దూర ప్రాంత ప్రయాణాలు , వ్యాపార వ్యవహరాదులు కలసి వచ్చును. చివరి వారం సామాన్యం.
ఆగష్టు 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో వ్యక్తిగత జీవిత విషయాలలో అశాంతి, అసంతృప్తి కలిగించు సంఘటనలు ఏర్పడును. సొంత మనుష్యలతో చికాకులు మానసిక ఆవేదనను ఏర్పరచును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగించును. ధనాదాయం సామాన్యం. భూమి లేదా గృహం వంటి స్థిరాస్థి కొనుగోలు ఈ మాసంలో మంచిది కాదు. ఆధ్యాత్మిక మార్గం అవసరం. కుటుంబ వసతులకు వ్యయం చేయుదురు. నూతన ఆలోచనలకు కూడా ఇది మంచి సమయం కాదు. ముఖ్యమైన కార్యములను వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో మాటలందు జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 14, 15, 18 తేదీలు మంచివి కాదు.
సెప్టెంబర్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో కూడా ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. ఆదాయం ఆశించినంతగా ఉండదు. సొంత వ్యవహారాలకు సమయం ఉండదు. ఆలోచనలు అమలుపరచడానికి తగిన వాతావరణం ఉండదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పోలీసులతో సమస్యలు. మీ అభిప్రాయాలకు విలువ ఉండదు. ఉద్యోగ జీవనంలో భారం పెరుగును. పట్టుదలతో పనిచేయవలసిన కాలం. వైవాహిక జీవన సంతోషాలు సామాన్యం. వ్యాపార రంగం వారికి ప్రతికూల ఫలితాలు. వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 2 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్య ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.
అక్టోబర్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో అనుకూల శుభవార్తలు అందును. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుటకు ఈ మాసం అనుకూలమైనది. కుటుంబ సహకారం లభించును. ఆర్ధిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉండును. ధార్మిక కార్యక్రమాలకు వ్యయం. ధనాదాయం సామాన్యం. పనులు సకాలంలో పుర్తిఅగును. ద్వితీయ తృతీయ వారాలలో ఉద్యోగ జీవనం వారికి శుభవార్త. ఇతరుల మన్ననలు పొందుదురు.
నవంబర్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో చేపట్టిన పనులు సజావుగా పూర్తిఅగును. శత్రువులపై విజయం. ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి ఒప్పందాలు. ధనాదాయం సామాన్యం. కుటుంబ విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభవార్త. భూసంబంధమైన క్రయవిక్రయాలు కలసివచ్చును. ఈ మాసంలో ప్రయాణాలు అధికం. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి శుభ సమయం. వ్రుత్తి జీవనంలోని వారికి ఆదాయం తగ్గును. ఈ మాసంలో 11, 12, 22, 23, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో శుక్ల దశమి నుండి పౌర్ణమి వరకూ చేయు సంతాన ప్రయత్నాలు ఫలించును.
డిసెంబర్ 2019 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో సోదర లేదా సోదరి వర్గం వారితో కుటుంబ అవసరాల వలన మనస్పర్ధలు ఏర్పడు సూచన. ఆదాయం పెరుగును. పితృసంబంధమైన భూ లేదా గృహ సంపద లభించును. విద్యా - సాంస్కృతిక రంగాలలోని వారికి ఈ మాసం అనుకూలంగా ఉండును. పనిచేయు కార్యాలయములందు అంతర్గత వ్యవహారాలు మీకు నచ్చిన విధంగా ఉండవు. మీ పనిభారం అధికమగు పరిస్థితులు ఏర్పడును. ఈ మాసం నిరుద్యోగులకు కలసిరాదు. మాసాంతానికి ఆరోగ్య భంగములు చికాకులను ఏర్పరచును. ఆహారపు అలవాట్లను నియంత్రించుకొనుట మంచిది.
జనవరి 2020 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసం ప్రారంభంలో కొద్దిపాటి ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు ఏర్పడును. మాసాంతానికి పరిస్థితులు మెరుగవును. పెద్దల సహాయం వలన నూతన ఉత్సాహం పొందేదురు. కెరీర్ పరంగా అభివృద్ధి ఏర్పడును. జీవిత భాగస్వామితో తగాదాలు తగ్గును. అవివాహితులకు ఆశించిన శుభ ఫలితాలు. ఉద్యోగస్తులకు ప్రత్యెక గుర్తింపు. వాయిదా పడుతూ వస్తున్నా పనులు పూర్తిఅగును. నూతన వస్త్ర సౌఖ్యం. భాగస్వామ్య వ్యాపారములు చేయువారికి అనుకూలమైన కాలం. ఆశించిన లాభాలు పొందేదురు. ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్య కాలంలో అన్నదనాదులు చేయడం అతంత ఉత్తమం.
ఫిబ్రవరి 2020 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సభ్యుల అవసరాలకు అధికంగా ధనం, సమయం కేటాయించవలసి వచ్చును. మధ్యవర్తుల వలన సమస్యలు పరష్కారం అవుతాయి. రావలసిన ధనం సమయానికి అందును. వ్యాపారాదులు సామాన్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పల్గోనేదురు. రాజకీయ నాయకులకు ఆశించిన పదవులు. ఈ మాసంలో తలపెట్టిన కార్యములన్ని విజయవంతంగా పూర్తిఅగును.
మార్చి 2020 వృషభరాశి రాశీఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సంబంధాలు మెరుగవును. విలాసవస్తువుల కొరకు ధనం వెచ్చించేదురు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పాత ఋణాలు తీర్చివేసేదురు. ఆర్ధిక లక్ష్యాలు పూర్తిచెయగలరు. విదేశీ ప్రయత్నాలు విఘ్నాలు పొందేదును. ధనాదాయం వృద్ధి చెందును. జీవిత భాగస్వామితో సఖ్యత - సౌఖ్యం.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • మృగశిర 3 , 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా
  •  పునర్వసు1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 
  • అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని
  •  సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400
మిధున రాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. ధనాదాయం బాగుండును. ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలసి రాదు. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఉద్యోగుల స్థానచలన ప్రయాతాలు విఫలమగును. అధికారుల వలన తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. విదేశీ వ్యవహారములందు విజయం ఏర్పడును. మంచి ఆలోచనలు చేయుట, మాట నిలకడ కలిగి ఉండుట వలన మంచి గుర్తింపు , గౌరవ మర్యాదలు పొందేదురు. కుటుంబ భాధ్యతలు చక్కగా నిర్వహించగలరు. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మక మార్పులకు ఈ సంవత్సరం కలసిరాదు. చేతి వృత్తి నిపుణులకు గడ్డుకాలం. విద్యార్ధులకు మంచి ఉత్తీర్ణతా ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి చక్కటి లాభాలు. భాగస్వామ్య వ్యవహరాదులు నష్ట పరచును. కుటుంబ తగాదాలు పరిష్కారం అగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు.
మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 03-నవంబర్-2019 వరకూ అనవసర తగాదాలు, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామితో తగాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. 04-నవంబర్-2019 నుండి సొంత ఆరోగ్య సమస్యలను కలుగచేయును. అవివాహితులకు అతి చక్కటి సంబంధాలు వచ్చునట్టు చేయును. అవివాహిత మగవారికి మిక్కిలి పతిభక్తి కలిగిన జీవిత భాగస్వామి లభించును. అయితే వక్తిగత జాతకంలో గురు గ్రహం పాప సంబంధం కలిగి , నీచ స్థానాలలో ఉన్న మిధున రాశి వారికీ ఆయుర్ధాయ భంగములకు సూచనలు కలవు.
మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మంచి ఫలితాలను ఇవ్వడు. 23-జనవరి-2020 వరకూ ఆర్ధికంగా మంచి ధనాదాయం కలుగచేయును. ప్రధమ కళత్ర నష్టం జరిగి, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి జీవిత భాగస్వామిని ఏర్పరచును. 24-జనవరి-2020 నుండి వారసత్వ పరంగా లభించిన భాగ్యంలో కొంత వ్యయం ఏర్పరచు సూచన. వ్యక్తిగతంగా పూర్ణ ఆయుర్దాయం కలుగచేయును.
మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మిశ్రమ ఫలితాలను కలగచేయును. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు , శరీర ధారుడ్య సమస్యలు వంటి సమస్యలు ఏర్పరచును.
ఏప్రిల్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఉన్నతికి మీ ప్రయత్నాలు సాగిస్తారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యం. ఉద్యోగ జీవనంలో స్వల్ప ఇబ్బందులు. చివరి నిమిషానికి కార్య విజయం పొందుదురు. వ్యాపారాదులు బాగా జరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధుల ఆశలు నెరవేరును. వివాహ మరియు సంతాన విషయాలలో ఆనందోత్సవాలు ఏర్పడును. విదేశియాన ప్రయత్నాలు తీవ్ర కృషి తరువాత ఫలించును. చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దుర్వార్త. ఈ మాసంలో 10, 24, 25, 26 తేదీలు అనుకూలమైనవి కాదు.
మే 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాస ప్రారంభంలో వాద వివాదాల వలన కొన్ని మానసిక సంఘర్షణకు సంబంధించిన సంఘటనలు. మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. ధనాదాయం సామాన్యం. అనుకోకుండా ఇతరుల పనులు మీకు కార్య భారంగా మారును. జూదానికి ఈ కాలం కలసిరాదు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అగును. 10 నుండి 18 వ తేదీల మధ్య ఏర్పడు నూతన పరిచయాల పట్ల లేదా చేయు భాగస్వామ్య వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శన చేయును. మిధున రాశికి చెందన స్త్రీలకు ఈ మాసంలో నూతన భాద్యతలు ఏర్పడును.
జూన్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో కొన్ని ప్రత్యెక వ్యతిరేక సంఘటనలు. భాత్రు వర్గం వారితో సమస్యలు. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. ధనాదాయం సామాన్యం. తరచుగా ప్రయాణాలు ఏర్పడును. వ్యుద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండవలెను. నూతన ఆలోచనా విధానం అలవాటు చేసుకొందురు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండుట వలన సమస్యలు ఏర్పరచుకోను సంఘటనలు. కుటుంబ పరమైన వ్యయం కొద్దిగా చేయిదాటును. రాజకీయ రంగం వారికి గౌరవ హాని సంఘటనలు. భూ సంబంధ క్రయవిక్రయాలు చేయువారికి ప్రభుత్వం వలన సమస్యలు.
జూలై 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన ఆదాయ మార్గం ఒకటి లభించు సూచనలు అధికం. దూర ప్రాంత ఆదాయం లభించును. గృహ నిర్మాణ పనులలో తీవ్ర ఆటంకములు. భూ వ్యాపారులకు సమస్యలు కొనసాగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. తృతియ వారంలో అనారోగ్యములతో ఇబ్బందులున్నాయి. పూర్వ కాలంలో ఇచ్చిన హామీల వలన కొన్ని చికాకులు. కుటుంబ లేదా స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుదురు. చివరి వారానికి సంతృప్తికరమైన పరిస్థితులు. కుటుంబ పెద్దల ద్వారా నూతన సమాచారం మరియు వారిచే గుర్తింపు పొందేదురు. ఈ మాసంలో 18, 19, 20 తేదీలు అనుకూలమైనవి కాదు.
ఆగష్టు 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో శుభకార్య సంబంధ లేదా వ్యక్తిగత జీవనం వలన పనిభారం అధికమగును. ఆరోగ్య విషయాలలో, ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్త అవసరం. బాగా ఎదిగిన సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేదురు. సంతానంతో పంతానికి పోకుండా ఉండుట మంచిది. ధనాదాయం కొంచెం తగ్గును. ప్రయాణాలు అంతగా ఫలవంతం అవ్వవు. ఈ మాసంలో 24 వ తేదీ నుండి 31 వ తేదీ వరకూ ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. శుభ కార్య ప్రయత్నాలకు మంచి కాలం.
సెప్టెంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉదర సంబంధమైన అనారోగ్యం వలన చికాకులు. మాట లేదా నింద పడు సంఘటనలు - అవమాన పడు సంఘటనలు. ధనాదాయం సామాన్యం. ఖర్చులు పెరిగినా సమయానికి ధనం చేతికి వచ్చును. దూర ప్రయాణాలు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. మనోవికాసానికి సమయం కేటాయించడం మంచిది. శ్రమకు తగిన ఫలితాన్ని ఈ మాసంలో పొందుట కష్టం. ఈ మాసంలో 4, 6, 9, 17, 28, 29 తేదీలు అనుకూలమైనవి కావు.
అక్టోబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ప్రధమ , ద్వితీయ వారాలలో తండ్రి వర్గం వారికి మంచిది కాదు. విరోధుల వలన మానసిక అశాంతి. వాహన సంబంధమైన సమస్య లేదా ప్రమాదం. స్త్రీల వలన ఆకస్మిక సమస్యలు. ఏకపక్ష నిర్ణయాల వలన సమస్యలు ఎక్కువ చేసుకోనుదురు. 15 వ తేదీ నుండి అనుకూల వార్తలు విందురు. కుటుంబ పరిస్థితులు చక్కబడును. విదేశీ ప్రయత్నాలు సఫలమగును. వైవాహిక జీవనంలో వివాదాలు కలిగిన వారికీ ఒక శుభ మార్పు. బంధుమిత్రులను దూరం చేసుకోకూడదు. నూతన వ్యాపారాలు ఆరంభం అగును.
నవంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆశించినంత ధనాదాయం ఉండును. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. నూతన పరిచయాలు, నూతన సంబంధాలు కలసి వచ్చును. వివాహ ప్రయత్నాలు వేగవంతంగా ముందుకు సాగును. ఉద్యోగ జీవనంలో కోరుకొన్న ఉన్నతి ఏర్పడును. సహోద్యోగులతో వివేకంతో ప్రదర్సించెదురు. ఆకస్మిక ఫలవంతమగు ప్రయాణాలు ఉన్నవి. ప్రేమవ్యవహరాలు ఆర్ధికంగా నష్టపరచును. ఈ మాసంలో 13, 14, 15 తేదీలలో జీవిత భాగస్వామిని లేదా గురువులను లేదా స్నేహితులను ద్వేషించు పరిస్థితులు ఎదుర్కొందురు.
డిసెంబర్ 2019 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు లాభించును. నూతన వాహన కోర్కె సిద్ధించును. ధనాదాయం బాగుండును. వ్యవహరాదులను విజయవంతంగా పూర్తీ చేయగలరు. గత కాలంలో ఆపివేసిన పనులను తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైనది. సజ్జన సాంగత్యం ఏర్పడును. భాత్రు వర్గం వారి జీవన స్థిరత్వం కోసం ఆందోళన చెందేదురు. మీ సలహాలకు విలువ ఉండదు. సమయానుకూలంగా ప్రవర్తించి పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు. పెద్ద కష్టం లేకుండానే రావలసిన ధనం చేతికి వచ్చును. ఈ మాసంలో 8, 9, 10 తేదీలలో కుటుంబ పరమైన ఒక సమస్య ఏర్పడు సూచన.
జనవరి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన వ్యాపార , ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం బాగుండును. గృహంలో నూతన వస్తువల అమరిక ఏర్పడును. మానసిక ఆనందం పొందేదురు. ఆరోగ్యం కొద్దిపాటి ఒడిదుడుకులు కలిగించును. వారసత్వ లబ్ది పొందు సూచనలు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసిరావు. చివరివారంలో వ్యక్తిగత గౌరవం పెరుగును.
ఫిబ్రవరి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో విందు వినోదాలలో పాల్గొనేదురు. నూతన పనులకు రూపకల్పన చేయుదురు. వృత్తి ఉద్యోగ విషయాలలో అభివృద్ధి ఏర్పడును. కోరుకొన్న జీవిత మార్పులు ఏర్పడును. అందివచ్చిన అవకాశములను చక్కగా ఉపయోగించుకోగలరు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు లాభించును. ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 12, 14, 15, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చి 2020 మిధునరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం చక్కటి ఫలితాలను కలుగచేయును. తలపెట్టిన ప్రతీ ప్రయత్నం విజయవంతం అగును. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. కుటుంబంలో అనుకోని కలహాలకు సూచనలు ఉన్నవి. ద్వితీయ తృతీయ వారములలో అకాల భోజన ప్రాప్తి తన్మూలక అనారోగ్యం. చివరివారంలో చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు లభించును. ఒక నూతన పనియండు నిపుణత సాధించుటకు సూచనలు కలవు. వ్యాపార వ్యవహరాదులు కలసివచ్చును. ఆర్ధిక సంవత్సరం విజయవంతంగా పూర్తీ అగును. ఈ మాసంలో 9, 12, 13 తేదీలు ఆరోగ్య పరంగా మంచివి కాదు.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • పునర్వసు పునర్వుసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా 
  • నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 05 వ్యయం - 05 
  • రాజపూజ్యం - 05 అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "2". ఇది 
  • భూసంబంధమైన లేదా గృహ సంభంధమైన లాభాన్ని సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400
కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలను కలుగచేయును. చేపట్టిన పనులలో విజయం ఏర్పడుతున్ననూ సంతృప్తి ఉండదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపించును. సొంత గృహ కోరిక నెరవేరును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందదు. కుటుంబమున, సమాజమున గౌరవ హాని సంఘటనలు. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభ వార్త. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు , స్థానచలన ప్రయత్నాలు కలసి వచ్చును. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు. వారసత్వ భాగ్యం కలసి వచ్చును. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు. వ్యాపార లక్ష్యాలను చేరుకొనుట కష్టం. వ్యాపారం మీద శ్రద్ధ అవసరం. మిత్రుల మీద భాద్యతలు పెట్టుట వలన నష్టపోవు సంఘటనలు కలవు. విద్యార్ధులు శ్రమించవలెను. నూతన విద్యకొరకు చేయు ప్రయత్నములందు పట్టుదల అవసరం. రాజకీయ నాయకులకు లాభవ్యయములు సమానం. అవివాహితుల ప్రయత్నాలు విఘ్నములతో విజయం పొందును.
కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు 03-నవంబర్-2019 వరకూ చక్కటి సంతాన భాగ్యములను కలుగచేయును. పుత్ర సంతానానికి అవకాశములు అధికం. భూసంబంధమైన , గృహ సంబంధమైన వ్యవహారాలలో చక్కటి లాభాలను కలుగచేయును. 04-నవంబర్-2019 నుండి గురువు కలసి రాడు. రక్త సంబంధమైన లేదా నరముల సంబంధమైన ఆరోగ్య సమస్యలను కలుగచేయును. వ్యవహారములందు తగాదాలు ఏర్పడుచుండును.
కర్కాటక రాశి వారికీ శ్రీ వికారి నామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలసి రాడు. నల్లని వస్తువల వలన సమస్యలను, శత్రుత్వాలను , ఆరోగ్య సమస్యలను , శని గ్రహం నీచ లేదా శత్రు స్థానంలో ఉన్న జాతకులకు ఆర్ధిక ఋణములను ఏర్పరచును. వ్యవసాయ రంగంలోని వారు నల్ల ధాన్యపు పంటలు వేయకూడదు. లోహ సంబంధ వ్యాపారములు చేయువారు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరం అంతా కలసిరారు. వ్యవహరపు చిక్కులను, శత్రువ్రుద్ధి, దుర్జన సహవాసముల వలన వృధా ధన వ్యయమును, అపఖ్యాతిని, వ్యక్తిగత జాతకంలో రాహు - కేతు దోషాలు కలిగిన వారికి పోలీసుల వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు , కారాగృహ ప్రాప్తి వంటి సమస్యలు ఏర్పడు సూచన.
ఏప్రిల్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వ్యాపార వ్యవహరాదులు ఆశించిన ధనలాభాలు ఏర్పరచవు. సంతాన ప్రయత్నాలకు ఇది చాల మంచి సమయం. ఉద్యోగ జీవనంలో విరోధుల వలన సమస్యలు. వ్యవహారాలు వేగంగా ముందుకు కదలవు. నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టలేరు. కుటుంబములో బరువు - భాద్యతలు పెరుగును. శారీరక మార్పులు సంభవించును. వైవాహిక జీవనంలో సమస్యలు ఏర్పడును. అనవసర మాటల వలన దంపతుల మధ్య దూరం పెరుగును. ఈ మాసంలో 17, 18, 26,27 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. మాతృ వర్గీయుల వలన కుటుంబ జీవనంలో సమస్యలు. వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా నడుచును. పెద్ద వయస్సు వారికి వెన్నుపూస సంభందించిన ఆరోగ్య సమస్య. నిరుద్యోగులకు, ఉద్యోగ జీవనంలో మార్పులు కోరుకోన్నవారు తమ ప్రయత్నాలలో సఫలీకృతం అవుదురు. సొంత మనుష్యుల ద్వారా శుభవార్తలు వినుదేరు. ఈ మాసం తృతీయ వారంలో నూతన వస్తు లేదా ఆభరణాలు అమరును. చివరి వారంలో మిత్రువర్గాలతో విభేదాలు ఏర్పడుటకు అవకాశములు కలవు. ఈ మాసంలో 1, 4, 9, 11, 25 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. నూతన వ్యాపారాదుల వలన లాభం. పేరు ప్రఖ్యాతలు లభించును. దాన ధర్మములు చేయుదురు. కుటుంబంలో మాత్రం మీకు వ్యతిరేకంగా మార్పులు జరుగు సూచన. ద్వితీయ తృతీయ శనివారములందు చేయు ప్రయాణాలలో ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచనలు అధికం. చివరి వారంలో తక్కువ ప్రయత్నంతో చక్కటి లాభాలు పొందేదురు. వాహన సౌఖ్యం ఏర్పడును. నూతన పరిచయాల వలన వ్యక్తిగత జీవనంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక సుఖ వ్యాధులు.
జూలై 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవనంలో అశాంతి కలుగచేయు సంఘటనలు ఏర్పడును. దూరప్రాంత ప్రయత్నాలు లాభించును. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండదు. ధనం కొరకు లేదా బ్యాంకు ఋణాలు కోసం చేయు ప్రయత్నాలకు ఆటంకములు ఉండును. ప్రయాణాలు అధికంగా ఏర్పడు సూచన. ఈ మాసంలో సాహసోపేతంగా వ్యవహరించుట మంచిది కాదు. 20 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య ఆత్మీయులతో సంతోషంగా సమయం గడిపెదరు.
ఆగష్టు 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన అవకాశములు లభించును. వీసా సంబంధిత విషయాలలో ఆటంకాలు తొలగిపోవును. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితాలు. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులకు ధన వ్యయం. ద్వితీయ వారంలో ఆకస్మిక లాభములు ఏర్పడును. నూతన ఆలోచనలు కలసి వచ్చును. తృతీయ వారంలో కుటుంబ సభ్యుల శస్త్ర చికిత్సకు సంభందించిన ఒత్తిడులు. చివరి వారంలో ఆశించిన ధనం చేతికి అందును. ఈ మాసంలో 8, 9, 10, 12 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.
సెప్టెంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో ఏర్పడిన సమస్యలు తొలగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడును. వ్యాపార వ్యవహారాలలో చేయు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. కుటుంబ భాద్యతలు సులువుగా నేరవేర్చగలరు. ఉత్సాహ పూరిత వాతావరణం ఏర్పడి ఉండును. మాస మధ్యమంలో విందు - వినోదాలలో పాల్గొనేదురు. ఉద్యోగ జీవనంలోని వారికి క్రింది స్థాయి వ్యక్తుల వలన ఊహించని చికాకులు. నూతన ఆదాయ మార్గాల కోసం చేయు ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో 13, 19, 21, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు.
అక్టోబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వారసత్వ లేదా స్థిరాస్థి సంబంధ వ్యవహారాలలో పితృ వర్గీయులతో విభేదాలు ఏర్పడును. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంబంధమైన చికాకులు. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడు సంఘటనలు. పెద్దల సాకారం లేదా సలహాల వలన ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందేదురు. కుటుంబానికి శాశ్వత ప్రయోజనాన్ని కలుగచేసే నిర్ణయాలు తీసుకొందురు. కుటుంబానికి ఆర్ధిక భద్రత ఏర్పడును. ఈ మాసంలో 11, 12, 13 తేదీలలో ఒప్పందాలు చేసుకొనుట, నూతన వ్యక్తులను కలవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
నవంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం సంతోషకరమైన పరిస్థితులను కలుగచేయును. ధనాదాయం బాగుండును. సువర్ణ లేదా గృహ లేదా నూతన వాహన లాభం ఏర్పడును. క్షణికావేశముల వలన ప్రమాదం. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యం సమస్యలపాలగు సూచన. కుటుంబ పరమైన శ్రమ అధికం అగును. తృతీయ మరియు చివరి వారములలో స్వశక్తితో కార్యములను సిద్ధింపచేసుకొందురు. దూరపు బందువుల సహకారం వలన ఒక సమస్య నుండి బయటపడుదురు. కృతజ్ఞతతో వ్యవహరించవలసిన సమయం.
డిసెంబర్ 2019 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన ఆస్తి కొనుగోలు చేయుటకు అవకాశములు అధికం. అవివాహితులకు చక్కటి వివాహ సంభంధాలు ఏర్పడును. శత్రు విజయం సాధించేదురు. ధనాదాయం సామాన్యం. ప్రయాణాలు కలసిరావు. శ్రమతో కూడుకొని ఉండును. వ్యయ ప్రయాసలు చికాకులను కలుగచేయును. 22వ తేదీ తదుపరి అనుకూలంగా ఉండదు. గౌరవం లోపించు సంఘటనలు, వ్యసనముల వలన, స్నేహితుల వలన తీవ్ర సమస్యలున్నాయి. పితృసంబంధమైన ఖర్మలు చేయవలసి వచ్చును. సమస్యలు సత్వరం పరిష్కారం అగుటకు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవుదురు.
జనవరి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. పుణ్యక్షేత్ర సందర్శన చేయుటకు అవకాశం కలదు. ఆదాయం కన్నా వ్యయం అధికం. ఆలోచనలు కార్యరూపం దాల్చుట కష్టం. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవి. ఎవరిదైనా సహాయ సహకారముల కొరకు వేచివుండాల్సిన పరిస్థితులు. మీ సామర్ధ్యాన్ని నమ్ముకోనుట మంచిది. 22 వ తేదీ తదుపరి ఆర్ధిక పరిస్థితిలో కొంత ఉపశమనం కనిపించును. వైద్య లేదా ఔషధ రంగంలోని వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడు సూచన.
ఫిబ్రవరి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పరిస్టితులు మెరుగవును. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, స్థిరాస్థి పెట్టుబడులకు , భాత్రువర్గంతో చర్చలకు ఇది మంచి కాలం. పనిచేస్తున్న కార్యాలయాల్లో గుర్తింపు పొందేదురు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కొంత తగ్గుముఖం పట్టును. సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇది. ఈ మాసంలో ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తీ అగు అవకాశములు అధికం. మీ మనోభావములు అర్ధం చేసుకోగల వ్యక్తులు పరిచయమగును. వ్యాపారాదులకు సానుకూల వాతావరణం. ఈ మాసంలో 2, 9, 13, 14, 24, 29 తేదీలు అనుకూలమైనవి కాదు.
మార్చి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. మానసిక ప్రశాంతత కోరవడును. మనోధైర్యాన్ని కోల్పోవు సంఘటనలు ఏర్పడు సూచన. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం ఏర్పడును. అప్రయత్నంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకొందురు. శారీరక శ్రమ పెరుగును. ఈ మాసంలో అతి ధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండుట మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించుట అవసరమగును. శైవ సంబంధ పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన 
  • వారు సింహరాశికి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 01 
  • అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "5". ఇది మీ ప్రమేయం లేకుండా ఇతరుల
  •  తప్పుల వలన నిందలు భరించవలసిన సంఘటనలను సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) సంతాన సంబంధ మరియు గౌరవ సంబంధ విషయాలలో మినహా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. సింహరాశికి చెందిన గర్భవతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరగటం మంచిది. నూతన దంపతులు ఈ వికారి నామ సంవత్సరంలో పిల్లలకు ప్రయత్నించకుండా వుండడం మంచిది. గ్రహగతుల ఫలితంగా శ్రీ వికారి నామ సంవత్సరం పైన పేర్కొనిన రెండు విషయాలలో మినహా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. తలపెట్టిన పనులున్ని సకాలంలో పుర్తిఅగును. సహనముతో మాత్రమె కుటుంబ సభ్యులను కలపి ఉంచగలము అని గ్రహిస్తారు. సంవత్సర ప్రారంభమున ఆర్ధికంగా కొంత ఇబ్బందులు ఎదురగును. క్రమంగా సంవత్సరాంతానికి ఆర్ధికంగా సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును. స్థిరాస్థి వ్యవహారాలలో, విదేశీ వ్యవహారాలలో, వైవాహిక జీవనములో ఆశించిన ఫలితాలు ఉండును. వ్యాపార రంగంలోనివారికి వ్యాపార విస్తరణకు సొంత వివేకం అవసరం. ఈ సంవత్సరం చక్కటి గృహలాభం ఏర్పడును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ ప్రయత్నాలలో దళారులను నమ్ముకోనుట వలన వృధా వ్యయం. కోర్టు వ్యవహారాలలో లాభం. మందబుద్ధి వలన తీవ్ర నష్టములు ఎదుర్కొందురు. జీవిత భాగస్వామి వలన ధన విషయాలందు లాభం ఏర్పడును. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు మంచి ఆశించిన ఫలితాలు. వృత్తి జీవనంలోని వారికి సామాన్య ఫలితాలు. పేరు ప్రఖ్యాతలు తగ్గును. రాజకీయ నాయకులకు పదవీ గండం.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయలందు మంచి ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన వ్యవహారాలు విజయం పొందును. విద్యార్ధులు రెండు మూడు విద్యలందు ప్రవేశం చేసిననూ అతి నమ్మకంతో దేనియందు పరిపూర్ణత పొందక ఇబ్బందులు ఎదుర్కొందురు. 04-నవంబర్-2019 నుండి సంవత్సర అంతం వరకూ పుత్ర సంతానానికి కొద్ది ప్రమాదపూరిత కాలం.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా యోగించును. చక్కటి ధనార్జనను ఏర్పరచును. వారసత్వ సంపద కోసం కోర్టు వ్యవహారాలు కలిగిన వారికి అనుకూల ఫలితాలను ఏర్పరచును. గర్భవతులకు ఇబ్బందులు కలుగచేయును.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన చక్కటి ఆర్ధిక పురోగతి ఏర్పడును. న్యాయవంతమైన ఆర్జన ఏర్పరచును. సంతానం వలన మాత్రం సౌఖ్యం ఉండదు.
ఏప్రిల్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. సొంత వాహన ఆశ నెరవేరును. గృహంలోనికి స్వర్ణం లేదా ఒక నూతన వస్తువు ఆగమనం. పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గును. వ్యాపారాదులు ఆశించిన విధంగా సాగును. ఉద్యోగస్తులకు నీలాపనిందలు. పేరు ప్రతిష్టలు పోగొట్టుకోనుదురు. తోటి ఉద్యోగస్తుల వలన అపకీర్తి ఏర్పడును. ఆధ్యాత్మిక మార్గం అవసరమగును. ఈ మాసంలో 23 వ తేదీ తదుపరి చేయు ప్రయాణాల వలన ధన వ్యయం ఏర్పడును. నూతన వ్యాపారాలను ప్రారంభం చేయరాదు.
మే 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం ద్వితీయ వారం నుండి నూతన ప్రయత్నాలు లాభించును. గత కాలంలో ఆర్ధిక ఇబ్బందుల వలన వదిలివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. వృత్తి వ్యాపారాదులు జయం పొందును. సంతాన ప్రయత్నాలు విఫలమగును. దగ్గరి కుటుంబ సభ్యులను కోల్పోవు సూచన. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి , ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనం చేయువారికి నూతన ఒప్పందాలు లభించును. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించేదురు. ఈ మాసంలో 2, 4, 5, 6 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ప్రయత్నాలు సులువుగా ముందుకు సాగవు. పనులు వాయిదాలు పడుతుండును. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబంలో కొద్దిపాటి అసంతృప్తికర సంఘటనలు. ఆస్తుల కోసం కలహాలు ఏర్పడే పరిస్థితులు. మాస మధ్యమంలో నేత్ర సంబంధమైన సమస్య లేదా వాహన ప్రమాదం వలన గాయాలు. 20 వ తేదీ తదుపరి నూతన సంబంధాలు, నూతన రంగంలో నిపుణత, విద్యా రంగంలో పనిచేయువారికి ప్రాముఖ్యత లభించును. 29, 30 తేదీలలో అలంకరణ వస్తువుల కొరకు వ్యయం ఏర్పడు సూచన.
జూలై 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు. ఉద్యోగ వాతావరణంలో కొద్దిపాటి అశాంతి, దుఃఖం. ధనాదాయం సామాన్యం. నమ్మినవారి వలన ఒక నష్టం. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలెను. నూతన కార్యములను , స్థానచలన ప్రయత్నాలను, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలను 17 వ తేదీ తదుపరి ప్రారంభించుకోనుట మంచిది. కెరీర్ పరంగా రాజకీయ సహకారం ఉపయోగపడుతుంది.తోటి వారితో మాట తేడా వలన కొత్త శత్రుత్వాలు. మాసాంతానికి ఖర్చులు పెరిగిననూ ధనం సర్దుబాటు జరుగును.
ఆగష్టు 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పెద్దవయస్సు వారికీ హృదయ సంబంధ సమస్యలు అధికం అగును. వైవాహిక జీవన సౌఖ్యం ఉండదు. అవిధేయత ఎదుర్కోను సూచనలున్నాయి. గృహంలో మార్పులు చేయుదురు. ధనాదాయం బాగుండును. మనోధ్యైర్యం పెరుగును. పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి పొందుటకు అవకాశములు లభించును. మాట చాతుర్యంతో పనులను పూర్తీ చేసుకోగలరు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ముగియును.
సెప్టెంబర్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వ్యాపార వ్యవహరాదులు నష్టాన్ని, నూతన ప్రయత్నాల వలన కష్టాల్ని కలిగించును. ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. ధనవ్యయం అధికం అగును. పై అధికారుల లేదా కుటుంబ పెద్దల కోపానికి గురవుతారు. చేస్తూ ఉన్న ఉద్యోగం అఖస్మికంగా కోల్పోవు సూచన. సిఫారసుల కొరకు తీవ్రంగా తిరగవలసి వచ్చును. ప్రతీ విషయములో సందేహాలు ఏర్పడును. వివాహ సంబంధాలు బెడిసికోట్టును. ఈ మాసంలో 5, 7, 8, 13, 14, 22, 28 తేదీలు అనుకూలమైనవి కావు. స్వ ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవలెను.
అక్టోబర్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుడా సెప్టెంబర్ మాసంవలె ఇబ్బందులు ఏర్పరచును. అవమానాలు ఎదురగును. ఏదో ఒక మానసిక అశాంతి బాధించును. ప్రయాణాలలో భయాందోళనలు, రహస్య కార్యాచరణ వలన సమస్యలు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో అనిచ్చితి కొనసాగును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం ఆలస్యంగా లభించును. జీవిత భాగస్వామి సంభందిత వ్యక్తులకు పీడగా ఉండు సూచన. ఈ మాసంలో రాహు - కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.
నవంబర్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కొంత పరిస్థుతులలో అనుకూలమైన మార్పులు ఎదుర్కొందురు. ప్రతీ చర్యలోనూ ఆచితూచి వ్యవహరించుట మంచిది కాదు. ఉద్యోగ రీత్యా చేయు ప్రయత్నాలు 6 వ తేదీ నుండి అనుకూలిస్తాయి. అందివచ్చిన ప్రతీ అవకాశమును ఉపయోగించుకోవాలి. అతిగా ఆలోచించుటకు ఇది మంచి సమయం కాదు. వివాహ విషయాలలో కూడా ఇదే సూత్రం వర్తించును. శారీరాక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టును. చివరి వారం నుండి వ్యాపార వ్యవహరాదులు అనుకూలంగా సాగును. ఆశించిన లాభములు పొందేదుదురు.
డిసెంబర్ 2019 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గములు లభించును. తలపెట్టిన కార్యములన్ని విజయం సాధించుదురు. కుటుంబ సభ్యులకు సంబందించిన ఒక భాద్యత మీపై పడుతుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరును. గతకాలపు తగాదాలు పరిష్కారమగును. తృతీయ వారం ముగిసే సమయానికి ఉల్లాసపూరిత వాతావరణం ఏర్పడును.
జనవరి 2020 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో గృహలాభం లేదా గృహ నిర్మాణ పనులలో సఫలత ఏర్పడును. శత్రుబాదలు తగ్గును. చేపట్టిన పనులు సకాలంలో పుర్తిఅగును. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త. ఆరోగ్యం బాగా సహకరించును. వ్యాపారులకు అనిచ్చిత వాతావరణం తొలగిపోవును. ఆఖస్మికంగా ధనాదాయం పెరుగును. కృషికి తగిన ఫలితాలు పొందుదురు. కోరుకొన్న గుర్తింపు లభించును. ఈ మాసంలో 15, 16, 17 తేదీలు అనుకూలమైనవి.
ఫిబ్రవరి 2020 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో మీ మాట నెగ్గును. ఆశించినంత ధనాదాయం ఏర్పడును. గృహంలో శుభకార్యములు ఏర్పడును. చేపట్టిన పనులందు దైవ సహాయం అందును. సామాజికంగా పలుకుబడి పెరిగి నూతన పరిచయాలు ఏర్పడును. నూతన వస్తువులు సమకూర్చుకొందురు. రాజకీయ నాయకులకు మినహా మిగిలిన అన్ని రంగాల వారికి ఈ మాసం కలసి వచ్చును. ఈ మాసంలో చేయు ప్రయాణాలు కూడా లాభించును.
మార్చి 2020 సింహరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా కాలం గడిపెదరు. బంధు మిత్రుల సమాగమము ఏర్పడును. కుటుంబ సభ్యుల మారిన వ్యక్తిత్వాలు సంతృప్తిని కలుగచేయును. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఏర్పడును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన
  •  వారు కన్యారాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 04 
  • అవమానం - 05. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని
  •  సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400
  • .
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) చక్కటి ఆర్ధిక పురోగతిని కలుగచేయును. వ్యాపార వ్యవహరాదులలో గతంలో ఏర్పడిన అవరోధాలు అన్ని తొలగిపోవును. నూతన ఆలోచనలకు పెట్టుబడులు లభించును. ధన విషయాలలో సొంత నిర్ణయాలు కలసి వచ్చును. భాగస్వామ్యాలు కలసి వచ్చును. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాభించును. ప్రమోషనులు ఆశిస్తున్నవారు ఆటంకములు, పైరవీల అనంతరం అనుకున్నది సాధిస్తారు. పుత్ర సంతాన ప్రయత్నాలకు దైవ ఆశీస్సులు అవసరం. సంవత్సర మధ్యకాలంలో ఉదర సంబంధమైన సమస్య వలన బాధపడు సూచన. ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శనలు ఏర్పడును. మాట గౌరవం పెరుగును. కుటుంబ సభ్యుల సహకారం వలన మనశ్శాంతి పొందుతారు. విదేశీ ఉద్యోగ లేదా నివాస ప్రయత్నాలు చేయువారికి 2019 నవంబర్ తదుపరి అనుకూలత ఏర్పడును. కోర్టు వ్యవహరాదులకు సంవత్సరాంతం వరకూ వేచివుండుట అవసరం. వైవాహిక జీవనములో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సౌఖ్యం తగ్గును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. కష్టించ వలసిన అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు పెట్టుబడికి మించి ఆదాయం లభించును. కళాకారులకు నూతన అవార్డులు, చక్కటి గుర్తింపు లభించును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబర్-2019 వరకూ చెడు ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా ఈ రాశికి చెందిన 12 సంవత్సరములలోపు పిల్లలకు బాలారిష్టములు కలుగచేయు సూచన. వారి ఆరోగ్య విషయములందు తల్లితండ్రులు జాగ్రత్త వహించవలెను. 04-నవంబర్-2019 నుండి చక్కటి ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా మాత్రు వర్గం వారి వలన సౌఖ్యం, వారి వలన లాభం, విద్యార్ధ్యులకు ఆశించిన విద్య, నూతన వాహన సౌఖ్యం, భూ సంబంధ లాభం ఏర్పరచును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన పిత్రార్జితం కొంత వ్యయం అగును. పుత్ర సంతాన వితవిభవములను ఏర్పరచును. స్త్రీ సంతానం వలన సౌఖ్యతను కలుగచేయును. 24-జనవరి-2020 నుండి ఆర్ధికంగా బాగా యోగించును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుచుండును. తీర్ధయాత్రా ఫలితమును ఏర్పరచును. స్వల్ప భూ వ్యయం ఏర్పరచు సూచన.
ఏప్రిల్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం అవివాహితులకు చక్కటి వివాహ సంభంధాలను ఏర్పరచును. ధనాదాయం సామాన్యం. స్పెక్యులేషన్ వలన ఆశించిన ధనం లభించును. విద్యార్ధులకు తగిన ప్రోత్సాహం లభించును. ద్వితీయ వారములో దైనందిన ప్రయాణాలలో ముఖ్య వస్తువులను పోగాట్టుకోను సూచన. ప్రయనములందు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో అనూహ్య మార్పులు గమనించేదురు. ఆటంకములు ఎదురైననూ స్వశక్తితో కార్యసాధన ఏర్పరచుకొందురు. చివరి వారంలో ధార్మిక కార్యక్రమాలకు , విరాళ సంభంద శుభ వ్యయం ఏర్పడు సూచన.
మే 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన వ్యక్తుల రాక వలన కుటుంబమున సంతోష కార్యములు నిర్వహించుదురు. వారసత్వ సంబంధ సమస్యలు పరిష్కారం అగును. గృహోపకరణాలు కొనుగోలు చేయుదురు. ఆశించిన సహకారం లభించును. వ్యాపారాదులలో మంచి అభివృద్ధి కనిపించును. 20 వ తేదీ తదుపరి కుటుంబ సభ్యుల మూలంగా అనారోగ్య మూలక ధనవ్యయం ఏర్పడు సూచన. 27, 28, 29, 30, 31 తేదీలలో మంచి ఫలితాలు ఏర్పడును.
జూన్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పనులు కొద్దిపాటి ఆటంకములతో పూర్తగును. మిత్ర వర్గంలో ఒకరి వలన నష్టం. ఉద్యోగ జీవనంలో ఆశ్చర్యకర సంఘటనలు. ఒత్తిడితో కూడిన వాతావరణం వలన నిద్రలేమి. వ్యాపారాదులు, ధనాదాయం సామాన్యం. ఈ మాసంలో 10 వ తేదీ నుండి 23వ తేదీ వరకూ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. పెద్దలకు శిరోవేదన అధికం అగు సూచన. ఈ మాసంలో 2, 3, 5, 10, 13, 19 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉద్యోగస్తులకు సమస్యలు తగ్గును. సంఘంలోనూ, కుటుంబములోను గౌరవం పెరుగును. ప్రయాణాలు లాభించును. వ్యాపార వ్యవహరాదులలో ధనలాభం, ధనాభివ్రుద్ధి ప్రాప్తించును. సంతాన విషయాలు మాత్రం అనుకూలంగా ఉండవు. బాకీలు వసూలవుతాయి. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడు సూచన. ఏకాగ్రత లోపించుటకు అవకాశములు అధికం. ఈ మాసంలో 14, 15, 16, 17 తేదీలలో తలపెట్టిన పనులన్నీ పూర్తీ అగును.
ఆగష్టు 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండును. లేదా ఒక చిన్న వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. జల సంబంధ ప్రయాణాలు చేయవలసి వచ్చిన జాగ్రత్త వహించవలెను. మత్స్యకారులకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ద్వితీయ తృతీయ వారాలలో ఆర్ధిక లావాదేవీలు లాభాలను కలుగచేయును. సమస్యల నుండి జగన్మాత అనుగ్రహం వలన బయటపడుడురు. మాసాంతానికి మానసిక ప్రశాంతత , ఆనందం పొందుదురు. ఆశిస్తున్న వర్తమానాలు అందును.
సెప్టెంబర్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో చక్కటి గౌరవ ఆదర అభిమానాలు పొందుదురు. వ్యాపారస్థులకు అతి చక్కటి లాభాలు. ఆరోగ్య సమస్యలు తగ్గును. గృహంలో ఆతిధ్య సంబంధమైన వ్యయం అధికం అగు సూచన. పలుకుబడి పెంచుకొందురు. నూతన ఆలోచనలు చేయుదురు. ధనాదాయం సామాన్యం. వ్యవసాయదారులకు వాతావరణం వలన కొద్దిపాటి పంట నష్టము ఏర్పడును. నిరుద్యోగులకు ఈ మాసంలో 14 వ తేదీ నుండి 21 వ తేదీల మధ్యకాలం అనుకూలమైనది.
అక్టోబర్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అంతగా ఆశించిన ఫలితాలు ఏర్పడవు. స్థిరాస్థి వ్యవహారాలు కొద్దిగా నష్టపెట్టును. వ్యాపార వ్యవహరాదులలో ఆకస్మిక నష్టం ఏర్పడుటకు అవకాశం కలదు. ప్రయత్నాలు కలసిరావు. అధికారుల ఒత్తిడి వలన శ్రమ అధికం అగును. లక్ష్యాలను సకాలంలో పూర్తీ చేయలేరు. తరచుగా దుస్వప్నాలు ఏర్పడు సూచన. భాత్రు వర్గం వారికి ఆరోగ్య సమస్యలు. చివరి వారంలో విందు వినోదాలలో చురుకుగా పాల్గోనేదురు. ధనాదాయం కొద్దిగా తగ్గును.
నవంబర్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. జీవిత భాగస్వామి సంబంధిత ధనవ్యయం అధికమగును. తలచిన కార్యములు కొద్దిపాటి ఆటంకములతో పుర్తిఅగును. తొందరపాటు తనం వలన ఉద్యోగ జీవనంలోని వారు సమస్యలను ఎదుర్కొందురు. ఎదుటివారి విషయంలో క్ష్రీర-నీర న్యాయంతో ప్రవర్తించుట మంచిది. ఆశించిన విధంగా ఆర్ధిక ప్రయోజనాలు ఏర్పడవు. ప్రయాణాల వలన శ్రమ పడవలసి వచ్చును. ఈ మాసంలో ఇనుము - సిమెంట్ వంటి నిర్మాణ సంబంధ వ్యాపారములు చేయువారికి మంచి అభివృధ్హి ఏర్పడును. ఈ మాసంలో 17, 18, 24, 25 తేదీలందు అన్ని విషయాలందు జాగ్రత్తగా ఉండవలెను.
డిసెంబర్ 2019 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. అనారోగ్య మూలక వ్యయం ఏర్పడును. ఉద్రేకముతో మంచి అవకాశములను దూరం చేసుకోను పరిస్థితులు కనిపిస్తున్నవి. ఆలోచనలతో సతమతమవుదురు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుటలో మిత్రుల సలహాలు తీసుకోకపోవడం మంచిది. ద్వితీయ వారంలో ఉదర లేదా మోకాలి సంభంధ శస్త్ర చికిత్సకు అవకాశం కలదు. మాసంలో తృతీయ బుధవారం నుండి చికాకులు, సమస్యలు తగ్గును. ఆగిపోయిన వ్యాపార వ్యవహరాదులు తిరిగి ప్రారంభం అగును. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి శుభవార్త. మాసాంతానికి ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. కానీ అవగాహన లేకపోవడంతో కుటుంబ విషయాలు రచ్చకేక్కును.
జనవరి 2020 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ ఆంగ్ల సంవత్సర ఆరంభం లాభదాయకంగా ఉండును. ధనాదాయం ఆశించినంత ఉండును. వ్యాపార వ్యవహరాదులు బాగుండును. అవివాహితులకు చక్కటి సంబంధాలు దొరుకును. రూపొందించుకున్న ప్రణాళికలు విజయవంతం అగును. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టువ్యవహారాలలో ఇతరులు చెప్పే మాయమాటలకు మోసపోవు సూచన. వివాదములందు వెనుకడుగు వేయుట మంచిది. ద్వితీయ తృతీయ వారములలో విందు వినోదాలు. చివరి వరమలో లక్ష్యాలను పూర్తీ చేయుదురు. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభవార్త.
ఫిబ్రవరి 2020 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సోదర బంధు స్నేహిత వర్గం నుండి చక్కటి ఆదరణ , ఆశించిన ప్రోత్సాహం ప్రాప్తించును. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును. ధనాదాయం ఆశించినంత ఉండును. ఆధ్యాత్మిక ప్రశంగాలు ఆకర్షించును. సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగస్తులకు తిరిగి విధులు అప్పగించబడును. విద్యార్ధులు బాగా శ్రమించవలెను. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. 25, 26, 27 తేదీలలో విహార యాత్రలకు సూచనలు ఉన్నవి.
మార్చి 2020 కన్యారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం గృహ సంబంధ నిర్మాణ పనులకు , వ్యాపార విస్తరణకు చక్కటి కాలం. రావలసిన ధనం చేతికి వచ్చును. ధనాదాయం వృద్ధి చెందును. ఉద్యోగంలో చక్కటి గౌరవ పురస్కారాలు లభించును. ఈ మాసంలో అన్ని విషయాలలో పూర్తీ అనుకూలత ఏర్పడును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. ఈ మాసంలో 19 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య కాలం చక్కటి అనుకూలమైన కాలం.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో
  •  జన్మించినవారు తులారాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 08 రాజపూజ్యం - 07 
  • అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని 
  • సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) సామాన్య ఫలితములను ఏర్పరచును. జీవన మార్గమునకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతానికి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారును. నూతన వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా కార్యరూపం దాల్చును. లాభించును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. సోదర వర్గం వార్కి అంత మంచి సంవత్సరం కాదు. స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. దూర ప్రాంత స్థిర నివాసం కొరకు ప్రయత్నించు వారికి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయువారికి స్త్రీ సంతానం ఏర్పడు సూచనలు అధికం. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యలు కొనసాగును. చేతివృత్తి పనివారికి లాభములు ఏర్పడును. వ్యవసాయదారులకు చక్కటి పంట అభివృద్ధి. విద్యార్ధులకు ఆశించిన ఉన్నతి లభించును. వడ్ది వ్యాపారం చేయువారికి ఈ వికారి నామ సంవత్సరం బాగా కలసి వచ్చును.
తులా రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు. ఫైనాన్సు వ్యాపారాలకు మాత్రం అతి చక్కటి ఫలితాలను కలుగచేసి వ్యాపార వృద్ధిని ఏర్పరచును. ఆరోగ్య పరంగా మధ్య మధ్య కాలంలో కీళ్ళ సంబంధమైన , రక్త సంభందమైన సమస్యలను ఏర్పరచును. భాత్రు వర్గం వారితో సంబంధాలు తెగిపోవును. మొత్తం మీద ఈ సంవత్సరం గురు గ్రహం తులారాశి వారికి కలసి రాదు.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన ఆర్ధిక లాభములను కలుగచేయును. స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి కొద్దిపాటి విఘ్నాలను కలుగ చేయును. విద్యార్ధులకు ఆశించిన విద్యను ఏర్పరచును.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ యోగించును. పితృ వర్గం వారికి ఆనారోగ్య సమస్యలను ఏర్పరచుట మినహా మిగిలిన వ్యవహారములందు అనుకూలమైన ఫలితాలను ఇచ్చువారగును.
ఏప్రిల్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆశించిన ధన లాభములు ఏర్పడును. వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా నడచును. అవసరాలకు ధనం సర్దుబాటు జరుగును. బంధు వర్గం వారితో ద్వితియ వారంలో కుటుంబ వ్యవహార పరమైన సమస్యలు. వైవాహిక జీవనంలో కూడా కొద్దిపాటి మనస్పర్ధలు. రాజకీయ నాయకులకు నూతన పదవులు. ఈ మాసం 18, 19, 20 తేదీలలో వాహన చోదన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలెను. ప్రమాదం జరుగుటకు ఆస్కారం ఉన్నది. 24 వ తేదీ తదుపరి పాతబాకీలు వసూలు అగును. ఉద్యోగ ప్రయత్నాలు లాభించును.
మే 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఒక వివాదం ఏర్పడుట వలన మానసిక వ్యాకులతకు సూచనలు కలవు. ధనాదాయం సామాన్యం. నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు ఫలించును. ఆరోగ్యం సహకరించును. ఈ మాసంలో తృతీయ వారం బాగుండును. వ్యాపార వ్యవహరాదులలో విజయం ఏర్పడును. నూతన ఆదాయ మార్గములు లభించును. ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశిస్తున్న వారికి కోరుకొన్న స్థానచలనం ఏర్పడును. సంఘంలో విశేషమైన గౌరవం ఏర్పడును. సన్మానములను పొందుదురు.
జూన్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య లేదా ఒక చిన్న శస్త్ర చికిత్స. ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం. వ్యాపారాదులు లాభదాయకంగా ఉండును. జీవిత అభివృద్ధికి సంభందించిన పనులు పుర్తిఅగును. సంతానానికి సంతోషాన్ని కలుగచేస్తారు. దిగువ స్థాయి వ్యక్తుల వలన ఉపకారమును పొందుదురు. చివరి వారంలో అనగా 22 వ తేదీ తదుపరి వైవాహిక సమస్యలకోసం కోర్టును ఆశ్రయించిన దంపతులకు పరిష్కారం లభించును. వివాహ ప్రయత్నాలు లాభించును. ఈ మాసంలో 5, 6, 8, 19, 29 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. తులారాశికి చెందిన స్త్రీలకు ఉదర సంబంధమైన సమస్యల వలన చికాకులు. ఉద్యోగ వ్యాపారాదులు సామాన్యం. ఇతరులపై భారం వేసి నూతన పనులను ప్రారంభించుట మంచిది కాదు. నూతన బంధు వర్గం ఏర్పడును. ఆశయ సాధన ఏర్పడును. 11 నుండి 20 వ తేదీల మధ్య తలపెట్టిన పనులందు ఇబ్బందులన్నీ తొలగి నూతన జీవన మార్గాలు ప్రారంభమగును. గృహ వాతావరణం మరియు పనిచేయు కార్యాలయంలోనూ ఆనందకరమైన పరిస్థితులను కలిగి ఉందురు. కుటుంబంలో అభిప్రాయ బేధాలు తొలగును.
ఆగష్టు 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో గృహ అవసరాలకు , శుభకార్యములకు సంబంధించిన వ్యయం అధికం అగును. బాధ్యతలు పెరుగును. ధనాదాయం సామాన్యం. విద్యార్ధులకు వీసా సంబందిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు. వ్యాపారాదులు సామాన్యం. భాత్రు వర్గం వారికి మంచిది కాదు. ఇంట్లో సౌకర్యాలు పెరుగును. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ముగియును. ఈ మాసంలో 7, 10, 14, 25 తేదీలలో మంచి అవకాశములు లభించును. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఏర్పడును.
సెప్టెంబర్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
తులారాశి వారికి ఈ మాసంలో అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ఈ మాసంలో తలపెట్టిన పనులన్నీ విజయవంతం అగును. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం ఆశించినంతగా ఉండును. స్వాతి నక్షత్ర జాతకులకు లాటరీలు కలసివచ్చును. ఉద్యోగ జీవనంలో మార్పులు శుభప్రదంగా ఉండును. మిత్రుల సహకారంతో లక్ష్యాలను పూర్తీ చేయగలరు. ప్రయాణాలు అంతగా ఫలించవు. మాసాంతానికి పరిస్థితులు అనుకూలంగా ఉండుట వలన చక్కటి మానసిక ఆనందం ఏర్పడును.
అక్టోబర్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ మిత్రులతో విహారాయాత్రలు ఏర్పడును. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించెదురు. ఆనందోత్సవాలతో కాలాన్ని గడిపెదురు. ధనాదాయం సామాన్యం. ఇతరుల పట్ల ఉన్న అనుమానాలు తొలగిపోవును. నూతన పరిచయాలు అభివృద్ధిని కలుగచేయును. యువ దంపతులకు సంతాన సిద్ధి వలన అమిత ఆనందం. ఈ మాసంలో 22 నుండి 29 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో నూతన ప్రగతిని పొందుదురు.
నవంబర్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం విదేశీ ఉద్యోగ లేదా స్థిర నివాస ప్రయత్నాలు చేయువారికి కలసివచ్చును. ధనాదాయం సామాన్యం. కుటుంబంలో అనుకోని ఖర్చులు ఏర్పడు సూచన. సమాజంలో పెద్దలతో లేదా ఉన్నత అధికారులతో అనుభంధం పెరుగును. సమయానికి పనులు పూర్తి చేసుకొని చక్కటి గుర్తింపు ఏర్పరచుకొందురు. ద్వితీయ వారంలో చిన్న పిల్లలకు ఆరోగ్య పరమైన చికాకులు. కుటుంబ వ్యక్త్రుల పట్ల శ్రద్ధ చుపించవలెను. వ్యాపార రంగంలోని వారికి ప్రారంభ వారములలో ఆశించినంత ఆదాయం ఉండదు. మాసాంతానికి ఆదాయం వృద్ధి చెందును. ఈ మాసంలో 8, 13, 15, 22 తేదీలు అనుకూలమైనవి కావు.
డిసెంబర్ 2019 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అతి చక్కటి ధనాదాయం ప్రాప్తించును. ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు ఆశించవచ్చును. నూతన ఇండ్లు లేదా స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు లాభించును. వ్యాపారస్థులకు గతకాలపు వివాదాలు పరిష్కారం అగును. ప్రయాణాలు ఫలవంతం అగును. తెగిపోయిన స్నేహబంధాలు ఈ మాసంలో తిరిగి పొందేదురు. నూతన ప్రతిపాదనలు చేయుటకు కుటుంబ పెద్దలను కలువుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఆశించిన ధన ప్రాప్తి ఏర్పడును. సంతాన ప్రయత్నాలకు మాత్రం అసంతృప్తి ఏర్పడును.
జనవరి 2020 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో విరివిగా ప్రయాణాలు ఏర్పడు సూచన. కార్య ఒత్తిడి అధికంగా ఉండుట వలన కొద్దిపాటి మానసిక అశాంతి. దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడును. ఒత్తిడులు ఎదురైనా ఆశించిన విజయాలు పొందేదురు. ఇతరుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. ధనాదాయం సామాన్యం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరియు అవకాశములు లభించును. వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి అసంతృప్తి. మిత్రులకు సంబంధించిన ఒక సమస్య మీ జోక్యం వలన పరిష్కారం పొందును. కుటుంబంలో బంధు వర్గ సమీకరణలు. ఈ మాసం చివరి వారంలో అనగా 24, 25, 26, 27 తేదీలలో ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండుట మంచిది.
ఫిబ్రవరి 2020 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం అవివాహితులకు చక్కటి వైవాహిక జీవనారంభాన్ని కలుగచేయును. ధనాదాయం కూడా బాగుండును. తలచిన పనులన్నీ పుర్తిచేయగలరు. జీవన అభివృద్ధికి నూతన ఆలోచనలు చేయుటకు ఈ మాసం తగిన సమయం. వ్యాపారంలో పెట్టుబడులు లాభించును. ఈ మాసంలో విశాఖా నక్షత్ర జాతకులకు అప్రయత్న ధనలాభాములు ఏర్పడు సూచన. స్పెక్యులేషన్ లాభించును.
మార్చి 2020 తులారాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలను, ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు. సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించు సూచన. సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగించుటకు అవకాశం కలదు. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో కుటుంబ పరిస్థితులు గతి తప్పును. ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం. నూతన రుణాలకు ఈ మాసంలో ప్రత్నించకుండా ఉండుట మంచిది. తృతీయ వారం ఉద్యోగ మార్పులకు , ఇంటర్వులకు అనుకూలమైన కాలం.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో 
  • జన్మించినవారు వృశ్చిక రాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 03 
  • అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "3". ఇది వాహన సంబంధ ప్రమాదాన్ని లేదా
  •  వాహన సంబంధ నష్టమును సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. వృచ్చికరాశి వారికి ఈ సంవత్సరం 23-జనవరి-2020 నుండి ఏలినాటి శని దశ పుర్తిఅగును. గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని దోష ప్రభావం తొలగిపోవును. ఈ సంవత్సరం కుటుంబ , ఆర్ధిక లావాదేవీలు , వ్యాపార వ్యవహరాదులు లాభదాయకంగా కొనసాగును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆటంకములు ఎదుర్కొనును. అవసరములకు బంధు సహకారములు లభించును. తగాదాలందు విజయం చెకూరును. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి అనారొగ్యమూలక ధనవ్యయం తరచుగా ఏర్పడుటకు సూచనలు కలవు. కావునా ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండవలెను. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ద్వితియార్ధంలో సఫలమగును. విదేశీ వ్యవహారములందు ఆశించిన ఫలితాలు ఏర్పడును.
వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా చాలా చక్కని ఫలితాలు కలుగచేయును. మిక్కిలి ధన భాగ్యములను ఏర్పరచును. విద్యార్ధులకు అతి చక్కటి విద్యాభ్యాసం కలుగచేయును. సమాజంలో , వంశంలో పేరు ప్రఖ్యాతలను ఏర్పరచును. శన్మానములను కలుగచేయును.
వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం 22-జనవరి-2020 వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు , అధిక ధన వ్యయం, నేత్ర హాని లేదా నేత్ర సంబంధ అనారోగ్యం వంటి సమస్యలను ఏర్పరచును. 23-జనవరి -2020 తదుపరి ఏలినాటి శని దశ పుర్తిఅగును. లాభావ్యయములు సమానంగా ఉండును.
వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతు గ్రహముల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. రాహువు ఆరోగ్య కష్టములను, కేతువు అధిక ధనవ్యయం ఏర్పరచును. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కోను వారు రాహు గ్రహ శాంతి జరిపించుకోనువలెను.
ఏప్రిల్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధన సంబంధమైన వ్యవహారాలు కొద్దిపాటి చికాకులు కలుగచేయు సూచన. వ్యాపార వ్యవహరాదులలో నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండుట మంచిది. స్పెక్యులేషన్ వలన భారీ నష్టం ఏర్పడు అవకాశములు అధికం. ఈ మాసంలో గృహోపకరణాలు కొనకపోవడం మంచిది. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును. వ్యక్తిగత ప్రతిభ అవసరం అగును. 20 వ తేదీ తదుపరి కొంత అనుకూలమైన పరిస్థితులు ప్రారంభమగును. శుభవార్తలు పొందుతారు. వ్యాపారాలు క్రమంగా లాభాల మార్గం పొందును. ఈ మాసంలో 2, 6, 8, 13,17 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో ఆశించిన సంతోషాలు ఏర్పడును. వివాహ ప్రయత్నాలు విజయవంతమగును. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలగిపోవును. స్థిరాస్థి వ్యవహారాలు లాభాలను కలుగచేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మంచి అభివృద్ధికి బాటలు వేస్తాయి. తృతీయ వారంలో చేయు ప్రయాణాలు కలసివచ్చును. నిరుద్యోగులకు ఆశాభంగములు. చివరివారంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరమైన చికాకులు. ఇతరుల పనుల కోసం మీ సమయాన్ని, ఆదాయాన్ని వెచ్చించాల్సి వచ్చును. ఈ మాసంలో 22 వ తేదీ నుండి 28వ తేదీ మధ్య కాలంలో పోలీసులకు విధి నిర్వాహణలో ప్రమాదాలు ఏర్పడు సూచన.
జూన్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఆశించిన ధనభాగ్యములు పొందుతారు. పాత బాఖిలు వసూలు అగును. ఉద్యోగ జీవులకు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తీ అగుట సంతృప్తిని కలుగచేయును. ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన లేదా ఆధ్యాత్మిక గురువులతో పరిచయాలు ఏర్పడును. రాజకీయ రంగంలోని వారికి అపవాదులు లేదా ప్రభుత్వ పరమైన సమస్యలు. ఈ రాశికి చెందిన స్త్రీలకు బాధ్యతలు పెరుగును. ఈ మాసంలో 5, 9, 10, 14, 20, 25 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో గతకాలపు తగాదాలు తొలగును. ధనాదాయం సామాన్యం. ఒక నమ్మిన వ్యక్తి చేసిన మోసం వలన మానసిక ప్రశాంతత లోపించు సూచన. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం లోపించును. గృహ అవసరాల కోసం ఆధునిక వస్తువులు కొనుగోలు చేయుదురు. విదేశీయాన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. ద్వితీయ వారంలో సంతాన సంబంధ శుభవార్త. ఉద్యోగ జీవనంలో అననుకూల మార్పులు ఏర్పడు సూచన. ప్రతికూల పరిస్థితులు ఉన్నా పట్టుదలతో లక్ష్యాలను పూర్తీ చేయగలరు. మీ తప్పులను సరిదిద్దుకోవలసిన సమయం ఇది. విద్యార్ధులకు శ్రమానుకూల ఫలితాలు. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి సమస్యలు.
ఆగష్టు 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వ్యాపారాదులు బాగానే ఉండును. ధనాదాయం ఆశించినంత లభించును. సోదర వర్గం వారికి మీ సహాయ సహకారములు అవసరమగును. నూతన స్నేహాలు , పరిచయాలు ఏర్పడును. ఆఖస్మిక ప్రయాణాలు ఏర్పడును. గృహంలో మీ అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసుకొందురు. ఋణాలు తీర్చివేస్తారు. కోర్తుకేసులు మీకు అనుకూలంగా తీర్పులను పొందును. ఉద్యోగ జీవనంలో ఉన్నతాధికారులతో సమావేశాలు కలసివచ్చును. రాజకీయ నాయకులకు తిరిగి ఆశించిన గుర్తింపు లభించును. ఈ మాసంలో 7 వ తేదీ నుండి 16 వ తేదీ మధ్య చేయు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.
సెప్టెంబర్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. తలపెట్టిన నూతన కార్యములు ఆర్ధిక లాభాలను కలుగచేయును. జయప్రదమగును. పై అధికారుల మన్ననలు లభించును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. తృతీయ వారంలో విందు వినోదాలు ఏర్పాటు చేయుదురు. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఈ తృతీయ వారం మంచి సమయం. బ్యాంకు లావాదేవీలు, నూతన ఒప్పందాలు విజయవంతం అగును. వృత్తి సంబంధ సమస్యలను అధిగమిస్తారు. మాసాంతానికి ఆశించిన వ్యక్తిగత సౌఖ్యం.
అక్టోబర్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్ర ఆరోగ్య భంగం ఏర్పడు సూచన. ముఖ్యంగా తండ్రి వర్గం వారికి మంచిది కాదు. కార్యదీక్షతో వ్యవహరించి ఉద్యోగ లక్ష్యాలను పూర్తీ చేయుదురు. ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లోపించును. అనవసర పట్టుదల వలన సొంత వారితో విభేదాలు ఎదుర్కొందురు. మిత్రుల సహకారంతో కొంత వరకూ లక్ష్యాలను చేరుకోగలరు. వ్యాపారాదులు సామాన్యం. ఈ మాసంలో 11, 13, 18, 27 తేదీలలో ప్రయాణములందు జాగ్రత్త అవసరం. చివరి వారానికి ధనవ్యయం పెరుగును.
నవంబర్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పనుల వలన శ్రమ , ఒత్తిడి అధికమగును. విరామం దొరుకుట కష్టం. భాద్యతలను మిత్రులతో పంచుకొనుట మంచిది. ధనాదాయం సామాన్యం. గత మాసంలో పెరిగిన వ్యయమును తగ్గించుకొందురు. కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకొనుట మంచిది. ఈ మాసంలో స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం పెరుగును. 14 వ తేదీ తదుపరి విద్య, ఉద్యోగ రంగాలలో నూతన అవకాశాలు ఉత్సాహపూరితంగా ఉండును. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఉండును. రచనా రంగంలోని వారికి చక్కటి గుర్తింపు లభించును. రచనల ద్వారా ధనార్జన ఆరంభానికి ఇది మంచి కాలం.
డిసెంబర్ 2019 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అభిరుచులకు తగిన విధంగా పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగ జీవులకు మాత్రం కార్యభారం , ఒత్తిడి కొనసాగును. ధనాదాయం కొద్దిగా పెరుగును. మిత్రుల ఆదరణ సంతృప్తిని కలుగచేస్తుంది. ఉన్నత లక్ష్యాలను నిర్దేసించుకొంటారు. మాస మధ్యమంలో నూతన ఆదాయ మార్గాలు లభించును. చివరి రెండు వారాలు సామాన్య ఫలితాలను ఏర్పరచును.
జనవరి 2020 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. పుత్ర సంతాన కాంక్ష తీరును. కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉండును. స్నేహాల వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ప్రోత్సాహకరంగా ఉండును. ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమమం అగును. చివరి వారంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడును. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
ఫిబ్రవరి 2020 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో విహార యాత్రలు , దూర ప్రాంత ప్రయాణాల వలన ఆరోగ్యం మందగించు సూచనలు కలవు. కోర్తుకేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్ధికంగా నూతన లాభాలు ఏర్పడడంతో సంతోషకర వాతావరణం కలిగివుందురు. వివాహ - సంతాన సంబంద సంతోషాలు ఏర్పడును. వ్యాపారాదులు బాగుండును. ఈ మాసంలో 25, 26, 27 తేదీలలో కార్యభారం అధికంగా ఉన్నా పనులను పూర్తిచేస్తారు. ఈ తేదీలలో ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు.
మార్చి 2020 వృశ్చిక రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పుర్తిచేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందటానికి ఇది యోగావంతమైన కాలం. నూతన పారితోషకాలు అందుకోను సూచనలున్నాయి. చివరివారంలో ఆరోగ్య సమస్య లేదా శస్త్ర చికిత్స జరుగు అవకాశం కలదు.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో
  •  జన్మించినవారు ధనుర్ రాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 06
  •  అవమానం - 01. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "1". ఇది ఉద్యోగ సంబంధమైన లాభాన్ని 
  • సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శ్రీ వికారి నామ సంవత్సరం ధనుర్ రాశి వారికి ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. వైవాహిక జీవనంలో తీవ్ర సమస్యలను, వివాహ సంబంధాలు కుదురుటలో ఇబ్బందులను ఏర్పరచును. అయితే ఒకసారి వివాహ నష్టం జరిగి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి మాత్రం చక్కటి ఫలితాలను ఏర్పరచును.
ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబెర్ - 2019 వరకూ వ్యవహరపు చిక్కులు అధికంగా ఏర్పడుచుండును. ముఖ్యమైన పనులు ఆటంకాలు ఎదురగుట వలన ముందుకు సాగక తీవ్ర ఇబ్బందులను కలుగచేయును. 04-నవంబెర్-2019 నుండి గురువు ఆర్ధికంగా అఖండమైన యోగాన్ని ఏర్పరచును. వ్యక్తిగత జీవనంలో మాత్రం నైతిక విలువలు తప్పుట వలన పతనమగునట్లు చేయును. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేయువారికి సహాయపడును.
ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా శారీరక శ్రమ అధికం అగును. కోరుకొన్న విధంగా శరీర సౌఖ్యం ఉండదు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఏర్పరస్తూ ఇబ్బందులు కలుగ చేయును. ఆర్ధికంగా మాత్రం శని ఈ సంవత్సరం ధనుర్ రాశి వారికి పెద్దగా ఇబ్బందులను కలుగచేయడు. సంవత్సరాంతానికి కొద్దిపాటి సంపాదించిన ధనం నిలువచేసుకోను పరిస్థితులను ఏర్పరచును. వ్యక్తిగత జీవనంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు కలుగచేయును.
ధనుర్ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ కలసి రారు. వైవాహిక జీవనంలో తగాదాలను, కళత్ర నష్టములను, జారత్వం వలన ( అక్రమ సంబంధాలు) తీవ్ర సమస్యలను కలుగచేయును. అనవసర పట్టుదలకు పోవుట వలన వ్యక్తిగత నష్టములను, శరీర సౌఖ్య లేమిని కలుగచేయును.
ఏప్రిల్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో గృహ నిర్మాణ సంబంధ పనులు ప్రారంభం అగును. ఋణాలు లభించును. ధనం సర్దుబాటు జరిగి ఆశించిన విధంగా బాధ్యతలు పుర్తిచేయగలరు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. విదేశీ ప్రయత్నాలు లాభించును. సమాజంలో గౌరవం లభించును. వ్యాపార రంగంలోని వారికి అనుకోని మార్పులు సంభవించు సూచన. అధికారుల వలన తృతీయ వారంలో చికాకులు. స్నేహ వర్గం సహకారంతో ఇబ్బందులనుండి తప్పించుకొందురు. చివరి వారంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించు సంఘటనలకు అవకాశం కలదు.
మే 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ప్రధమ వారంలో ధనాదాయం బాగున్నప్పటికీ అకారణంగా మాటపడుట, నింద ఏర్పడుట వంటి సమస్యలు కలవు. ఇతరులకు సంబంధించిన సున్నిత విషయాలలో దూరంగా ఉండుట మంచిది. పెద్ద వయస్సు వారికి ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్య ఏర్పడును. వ్యాపార వ్యవహరాదులు మందకొడిగా కొనసాగును. ద్వితీయ వారంలో చేపట్టే కార్యములు విజయవంతం అగును. ఉద్యోగ రంగంలో ఆటంకములు ఉన్ననూ లక్ష్యాలు పూర్తిచెయగలరు. స్థానచలన ప్రయత్నాలు ఫలించును. మేధావి వర్గంలో స్థానం లభించును. తృతీయ, చతుర్ధ వారాలు ప్రోత్సాహకరంగా ఉండును. విద్యార్ధులకు ఇది చక్కటి ఫలితాలు కలిగించు మాసం.
జూన్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం వృద్ధి చెందును. కుటుంబ సమస్యలు తగ్గును. వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతమగును. నూతన వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలం. ఆశించిన విధంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారములు లభించును. 9 నుండి 17 వ తేదీ మధ్య తలపెట్టిన పనులన్నీ విజయవతం అగు సూచనలు కలవు. కోర్తుకేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో పరిష్కారం లభించును. సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు ఆనందాన్ని కలుగచేయును. పర్యాటక రంగంలో పనిచేయువారికి ఈ మాసంలో అతి చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో ధనమునకు లోటు రాదు.
జూలై 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వారసత్వ సంబంధ స్థిరాస్థి లభించుట వలన కుటుంబానికి ఒక లాభం. యువ దంపతుల సంతాన కోర్కెలు సిద్ధించును. ధనాదాయం బాగుండును. నూతన గృహోపకరణాలు ఏర్పరచుకొందురు. శుభాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. ఉత్సాహవంతంగా కాలం గడుచును. ఉద్యోగ జీవనంలో చురుకుదనంతో అధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం సహకరించును. చివరి వారంలో ఆత్మీయుల నుండి ఒక శుభ వార్త. దూరప్రాంత ప్రయాణాల వలన కొద్దిపాటి శారీరక ఒత్తిడి. ఈ మాసంలో 4, 5, 9, 11, 15, 18, 24, 25, 29 తేదీలు నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టుటకు అనుకూలమైనవి.
ఆగష్టు 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబంలో ఒక మార్పు ఏర్పడును. మూత్రపిండాల వ్యాధితో బాధపడు వారికి ఇది మంచి మాసం కాదు. వ్యాపారాదులు సామాన్యంగానే నడుచును. భాగస్వామ్య వ్యాపారాదులు బాగా ఆదాయం కలుగచేయును. జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిగా లభించును. రుణభారం తగ్గును. కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి కృషి చేయుదురు. భాత్రు వర్గానికి మీ సలహాలు లాభాన్ని కలుగచేయును. విఘ్నాలు ఎదురైనా కార్యజయం పొందుదురు. గతకాలంలో చేసిన తప్పులు సరిదిద్దుకోనుటకు ఒక అవకాశం లభించును. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ఫలితాలు.
సెప్టెంబర్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఆరోగ్య సమస్యలు కొద్దిగా చికాకులను కలుగచేయును. ఉద్యోగ వ్యాపార వ్యవహరాదులు సామాన్యంగా కొనసాగును. నిత్య జీవనంలో శ్రమ అధికంగా ఏర్పడును. అయినా గృహ భాద్యతలను సకాలంలో పూర్తి చేయగలరు. ప్రమోషన్లు ఆశించువారికి ఆశాభంగములు. ఈ మాసంలో 6, 10, 13, 14, 20, 27 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యంగా ఈ తేదీలందు ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది.
అక్టోబర్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆర్ధికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడును. ఉహించని రీతిలో ఒక ధన నష్టం ఏర్పడుటకు అవకాశం ఉన్నది. నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచి ఫలితాలు ఇవ్వవు. ద్వితీయ వారంలో ధనవ్యయం అంచనాలు దాటును. ఉద్యోగ కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండుట మంచిది. ఈ మాసంలో నూతన ఋణాలు తీసుకొనుట లేదా ఇతరుల రుణాలకు హామీలు ఇచ్చుట మంచిది కాదు. ఈ మాసంలో శనికి శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.
నవంబర్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం ప్రారంభం నుండే ఆర్ధికంగా పడుతున్న ఇబ్బందులు తొలగును. ధనాదాయం వృద్ధి చెందును. ఆశించిన విధంగా ధన సంబంధ పరిస్థితులు ఏర్పడును. వ్యాపార విస్తరణకు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మనో ఉల్లాసాన్ని పొందుదురు. వ్యక్తిగత ప్రతిభ, పని నైపుణ్యం ఉద్యోగ జీవులకు చక్కటి గుర్తింపు ఏర్పరచును. 22 వ తేదీ నుండి కొద్దిపాటి శారీరక బలహీనత బాధించును. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక ఆనందాన్ని కలుగచేయును.
డిసెంబర్ 2019 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవనంలోని సమస్యలు పరిష్కారమగును. అపోహలు తొలగును. ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్త వహించాలి. నూతన వాహన లేదా ప్రయాణ సౌఖ్యం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కార్యభారం లేకుండా పనులు పూర్తిచెయగలరు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాదులు సామాన్యం.
జనవరి 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన ఆలోచనలు ఫలించును. ధనాదాయం సామాన్యం. మిత్రుల తోడ్పాటు వలన అభివృద్ధి ఏర్పడును. గతకాలంలో ఏర్పడిన నిందలనుండి బయటపడుదురు. కోర్టు వ్యవహరాదులలో విజయం. ఆరోగ్య సమస్యలు కొనసాగును. గృహనిర్మాణ పనులు చేస్తున్నవారికి ఆకస్మిక ఇబ్బందులు. వ్యయం చేయిదాటును. తృతీయ వారంలో ఉద్యోగ విషయాలలో లాభం. వ్యాపారాదులలో చక్కటి ఆర్ధిక ప్రయోజనాలు. చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంభందించిన ఒక దుర్వార్త. ఈ మాసంలో 15, 19, 25, 27 తేదీలు అనుకూలమైనవి కాదు.
ఫిబ్రవరి 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన విషయాలు ఆనందాన్ని కలుగచేస్తాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు. అవకాశాలు చేజారిపోవును. గృహంలో కొద్దిపాటి అననుకూల వాతావరణం. పితృ వర్గీయులతో సమస్యల వలన మానసిక వ్యధ. వ్యాపారాదులు మందకొడిగా కొనసాగును. నూతన కార్యములు వాయిదా వేయడం మంచిది.
మార్చి 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం వలన సొంత మనుష్యలతో విరోధాలు, శారీరక బాధలు, అవాంచిత కలహాలకు సూచనలు కలవు. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవితంలో మానసిక అశాంతి. భాద్యతలను నేరవేర్చకపోవుట వలన ఉద్యోగ జీవనంలో సమస్యలు. వృత్తి జీవనంలోని వారికి ఆదాయం ఆశించినంతగా ఉండదు. లాటరీలు లేదా స్పెక్యులేషన్ వలన నష్టములు.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో 
  • జన్మించినవారు మకర రాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 02 రాజపూజ్యం - 02 
  • అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "6". ఇది రాజకీయాలలో విజయాన్ని 
  • సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
మకరరాశి వారికి కూడా శ్రీ వికారి నామ సంవత్సరం అంతా ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శని వలన ఈ సంవత్సరం అనవసర ఆడంబరాలకు అధికంగా ధనవ్యయం ఏర్పరచును. ఆర్ధికంగా ఆశించిన ప్రగతి ఏర్పడదు. పిత్రార్జితం మరియు స్వార్జితం రెండునూ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనిపించుచున్నవి. ఆర్ధికంగా క్రమశిక్షణ అవసరం. 24- జనవరి-2020 నుండి కొంత ఆర్ధికంగా పరిస్థితి మెరుగు పడును. ఉద్యోగ జీవులకు లక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమించవలసిన పరిస్టితులను , ఒడిదుడుకులను కలుగచేయును. మొత్తం మీద శని వలన మకరరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండవు. శనికి శాంతి జపములు అవసరం.
మకరరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం గురు గ్రహం వలన 03-నవంబెర్-2019 వరకూ వృత్తి జీవనం చేయువరకి ముఖ్యంగా వైద్య రంగంలోని వారికి, కుల వృత్తులు చేయువారికి అధిక వృద్ధిని కలుగచేయును. న్యాయమైన మార్గంలో ధనార్జనను ఏర్పరచును. 04-నవంబెర్-2019 నుండి అంతగా యోగించడు. కుటుంబ సభ్యుల కొరకు , మంచి కార్యములకు అధిక ధన వ్యయం అగునట్లు చేయును.

ఏప్రిల్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కొద్దిగా ఆకస్మిక ప్రమాదములు ఏర్పడు సూచన. వాహన ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండవలెను. నూతన ప్రయత్నాలు లాభించవు. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. లక్ష్య సాధనకు శ్రమించవలెను. ఆదాయం సామాన్యం. నూతన వ్యక్తుల పరిచయాల వలన మానసిక ఆనందం. తృతీయ వారంలో గృహ అవసరాలు పెరుగును. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. చివరి వారంలో సంతానం వలన సంతోష సమయం. స్త్రీ సంతానం వలన సౌఖ్యం.
మే 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కొద్దిగా అనుకూల ఫలితాలు ఏర్పడును. వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మంచి మార్పులు ప్రాప్తించును. కుటుంబ జీవనంలో మాత్రం అసంతృప్తి కలిగించే సంఘటనలు. జీవిత భాగస్వామి బంధువులతో తగాదాలు, తీవ్ర విమర్శలు. 15 వ తేదీ నుండి 21 వ తేదీ మధ్య కాలంలో నూతన ప్రయత్నాలు లాభించును. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడును. అవివాహితులకు ఈ మాసం చివరివారంలో చక్కటి శుభవార్త.
జూన్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ సమస్యలను పరిష్కరించగలుగుతారు. ధనాదాయం సామాన్యం. వ్యయం కొద్దిగా అంచనాలను మించును. పెరిగిన శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణ లేదా నూతన గృహ సంబంధ విషయాలలో అనుకూలత. ప్రధమ వారంలో ఉద్యోగ స్థాన చలన ప్రయత్నాలు విజయవంతమగును. పుణ్య క్షేత్రాలను దర్శించుకొందురు. స్నేహితుల వలన వ్యాపార విస్తరణకు అవకాశములు ఏర్పడతాయి. చివరి వారంలో కుటుంబంలోని పెద్దలకు ఆరోగ్య సమస్యలు. విద్యార్ధులకు కష్ట కాలం.
జూలై 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో భూ సంబంధమైన వ్యాపారాదులు లాభించును. ధనాదాయం సామాన్యం. గతకాలపు ఆరోగ్య సమస్యలు తగ్గును. స్వశక్తితో పనులను సాధించుకొందురు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుదురు. వృత్తి జీవనంలోని వారికి పురస్కారాలు లభించును. ఆస్తి వ్యవహారాలలో సానుకూల పడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో రాజకీయనాయకులకు నూతన పదవులు ప్రాప్తించును. 24 వ తేదీ నుండి చేయు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.
ఆగష్టు 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండును. శిరోవేదనకు సంబందించిన సమస్యలు తరచుగా బాధించు సూచన. ఉద్యోగ కార్యాలయంలో ఏకాగ్రత లోపించు సంఘటనలు. సమయాన్ని వృధాగా గడిపెదరు. లక్ష్యాలను నిర్లక్ష్యం చేయుదురు. వ్యక్తిగత జీవనంలో చక్కటి సంతోషాలు. మాసాంతానికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ మాసంలో 14 వ తేదీ నుండి 22 వ తేదీ మధ్య చేయు ప్రయాణాలు లాభిస్తాయి. చివరి వారంలో వ్యాపారంలో అధిక ధనాదాయం ఏర్పడు సూచన.
సెప్టెంబర్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం కొంచెం పెరుగును. సోదర వర్గం వారికి ఈ మాసం మంచిది కాదు. గృహ మార్పిడి ప్రయత్నాలు లాభించును. వ్యక్తిగత జీవనంలోని సమస్యలనుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత , ఆనందాన్ని పొందుతారు. దూర ప్రాంత చలనలకు సంబందించిన విషయాలలో పురోగతి ఏర్పడును. వ్యాపార వర్గాలకు ఈ మాసం ఆశించిన రాబడులు ఇచ్చును. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ మాసంలో 1, 4, 16, 18, 26 తేదీలు నూతన కార్యాలకు మంచివి.
అక్టోబర్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వ్యాపార, వ్యవహార, ఉద్యోగ విద్యా వ్యవహారాలలో ఒక నష్టం ఏర్పడు సూచన. ఆకస్మిక వివాదం ఒకటి ఏర్పడును. నూతన ప్రయత్నాలకు పూర్తి స్థాయి శక్తిని వినియోగించాలి. పట్టుదలని కోల్పోకూడదు. ఆటంకాలు ఎదురైనా విజయం చేకూరు సూచనలు ఉన్నాయి. సంతానంతో వ్యతిరేకత ఏర్పడి కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉండును. తృతీయ వారం చాలా నిరాశాజనక ఫలితాలు ఏర్పడు గ్రహ సూచనలు కలవు. కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ చూపాలి. ప్రయాణాలు , ముఖ్యులను కలిసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ మాసంలో 17, 18, 21, 22 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబర్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా గత మాసం వలె సమస్యలు కొనసాగును. ధనాదాయం తగ్గును. ఆలోచనలు ముందుకు సాగవు. చేసే పనులలో అదృష్టం కలసి రాదు. నూతన వ్యవహారాలు ప్రారంభించుటకు ఇది మంచి సమయం కాదు. గర్భిణి స్త్రీలు చాల జాగ్రత్తగా ఉండవలెను.
డిసెంబర్ 2019 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సమస్యలు కొంచెం తగ్గును. ధనాదాయం సామాన్యం. ఇతరుల నుండి ఆశించిన సహకారం లభించుట వలన లక్ష్యాలను పూర్తీ చేయగలుగుతారు. ప్రోత్సాహకర సంఘటనలు ఏర్పడును. ఆర్ధిక వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాదులలో ఆశించినంత రాబడి ఏర్పడును. ద్వితీయ తృతీయ వారములలో నిరుద్యోగులకు శుభవార్తలు ఉన్నవి. వ్యక్తిగత జీవనంలో కఠిన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. ఈ మాసంలో 10, 18, 20 తేదీలు అనుకూలమైనవి కావు.
జనవరి 2020 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ వ్యాపార వ్యవహారములలో ఆశించిన మంచి ఫలితాలు కలుగును. విరోధులపై విజయం ఏర్పడును. ప్రయాణాల వలన మాత్రం ధనం వృధాగా వ్యయమగును. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఉద్యోగ జీవులకు నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థిరాస్తుల ద్వారా నూతన ఆదాయం లభిస్తుంది. వివాహ సంబంధాలు చివరి నిమిషంలో రద్ధగు సూచన. వివాహ పొంతన విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. విద్యార్ధులకు నూతన అవకాశములు ప్రోత్సాహకరంగా ఉండును.
ఫిబ్రవరి 2020 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. జీవన మార్గంలో కొద్దిపాటి ఆటంకములు ఏర్పడును. కుటుంబంలో ప్రాముఖ్యతను పెంచుకొందురు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మాట పట్టింపులు తొలగును. ఖర్చులు పెరిగినా ధనం సర్దుబాటు అగును. 15 వ తేదీ తదుపరి గతంలో నిలచిన పనులు పూర్తీ అవుతాయి. మిత్ర వర్గంలో ఆదరణ పెరుగుతుంది. చివరి వారంలో సన్నిహితుల శుభాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసంలో 6 వ తేదీ నుండి 12 వ తేదీ మధ్య చేయు విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి లేదా ప్రమోషన్లు కొరకు చేయు ప్రయత్నాలు లాభించును.
మార్చి 2020 మకరరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమగు సూచనలు కలవు. ప్రతీ విషయంలోనూ సందేహాలు ఎదురగు అవకాశం కలదు. వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు. వ్యక్తిగత జీవనం మాత్రం బాగుంటుంది. జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగువిధంగా నడుచుకొందురు. సంతానం కోసం ప్రయత్నాలు చేయువారికి శుభవార్తలు. గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి. సొంత గృహం కల నెరవేరుతుంది. ఈ మాసంలో 13 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య చేయు ప్రయాణములందు జాగ్రత్త అవసరం

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో
  •  జన్మించినవారు కుంభరాశి కి చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 02 రాజపూజ్యం - 05
  • అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "6". ఇది రాజకీయాలలో విజయాన్ని
  •  సూచించుచున్నది. రాజకీయ రంగంలోని వారికీ అభివృద్ధి ఏర్పడును.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. 23-జనవరి-2020 వరకూ ఉన్నతమైన జీవన మార్గమును, ప్రమోషన్లను , విదేశే ప్రయాణాలను, ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయమును ఏర్పరచును. ది.24-జనవరి-2020 నుండి కుంభరాశి వారికి ఎడున్నార సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమగును. అప్పటి వరకూ అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలసిరాదు. వృధా వ్యయమును, మానసిక అశాంతిని , ఆరోగ్య భంగములను ఏర్పరచును.
కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా విద్యార్ధులకు, వైద్యులు, ఇంజనీర్లు, ప్లీడర్లు మొదలగు వృత్తి ఆధార నిపుణలకు అత్యంత అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. సమాజంలో ఖ్యాతిని పెంపొందించును. న్యాయవంతంగా మిక్కిలి ధనార్జనను ఏర్పరచును.
కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు వలన సంతాన సంబంధ సమస్యలు ఏర్పడును. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలవంతం అగుట కష్టం. దైవ ఆశీస్సులు ఉండవలెను. రాహు - కేతువులు ఇరువురూ ఆర్ధికంగా అతి చక్కటి ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద కుంభరాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం ఆర్ధికంగా బాగా కలసి వచ్చును.
ఏప్రిల్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసం నూతన కార్యములు ఆరంభించుటకు మంచి ప్రోత్సాహకరంగా ఉండి లాభించును. విరోదులపై విజయం ఏర్పడును. కోర్టు కేసుల తీర్పులు అనుకూలంగా వచ్చును. ధనాదాయం బాగుండును. వ్యాపారాదులు చక్కటి లాభాలను కలుగచేసి ఆశించిన విధంగా ముందుకు సాగును. మాస ద్వితియార్ధంలో గౌరవ పురస్కారాలు లభించును. ఋణ బాధలు తొలగును. మిత్రు వర్గం నుండి దూరంగా ఉండటం మేలు. ప్రతిభకు గుర్తింపు ఏర్పడును. పై అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పొందుదురు.
మే 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుంటుంది. వ్యాపార, ఉద్యోగ , వృత్తి జీవనంలోని వారికి అనుకూలమైన ఫలితాలు కొనసాగును. రావలసిన ధనం సమయానికి అందును. వ్యక్తిగత , వైవాహిక జీవనములలో చక్కటి సంతోషపూరిత రోజులు ఏర్పడును. అవివాహితులకు , నిరుద్యోగులకు ఈ మాసం శుభవార్తలను కలుగచేయును. సమయానుకూలంగా పనులు పుర్తిఅగును. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందును. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. కుటుంబ సభ్యుల బాధలను పరిష్కారం చేయుదురు. అందరూ హర్షించే కార్యక్రమాలు చేస్తారు.
జూన్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన ప్రయత్నాలు ఫలించు గ్రహ గతులు కలవు. వ్యాపారాదులు సామాన్యంగా ఉండును. భాగస్వామ్య వ్యవహారాలకు ఇది మంచి కాలం. ఈ మాసంలో శ్వాస సంబంధ సమస్యలు బాధించు సూచన. తృతీయ వారంలో ఏదో ఒక విషయంలో మనస్థిమితం లోపించు పరిస్థితులు కలవు. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. కార్య దీక్ష లోపించును. మాసాంతానికి పరిస్థితులలో అనుకూలత ఏర్పడును. ఈ మాసంలో 8, 11, 15, 23, 28 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆలోచనలలో వేగం కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఆ వేగం లోపిస్తుంది. ప్రణాళికాబద్ధమైన కార్యదీక్ష అవసరమగును. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. పెద్దలను లేదా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. ఆర్ధిక ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. నూతన భాధ్యతలు ఏర్పడును. ధార్మిక విషయాలందు ఆసక్తి పెరుగును.
ఆగష్టు 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుటుంబ విషయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉంటాయి. ఉద్యోగ కార్యాలయంలో వ్యతిరేక స్వభావం కల వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ధనాదాయం సామాన్యం. వ్యాపార వర్గం వారికి మందకొడి ఆర్జన. ఆశించిన స్థాయి వ్యాపారం ఉండదు. మాస ద్వితీయ భాగంలో వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల కలయిక ఇబ్బందులకు దారితియవచ్చు. ఈ మాసంలో జల ప్రయాణాలు చేయువారు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు జల సంబంధ ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
సెప్టెంబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో గతకాలంలో గాడి తప్పిన వ్యాపార వ్యవహారాలు ఒక దారికి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం కలసి వచ్చును. ఉద్యోగ జీవనంలో మార్పులు ఆశిస్తున్న వారికి కూడా ఈ మాసం కలసి వచ్చును. నూతన పదవులు లభించును. ధనాదాయం సామాన్యం. స్త్రీలకు ఉదర సంబంధ అనారోగ్య సమస్యకు సూచనలు కలవు. మాసాంతంలో ఆత్మీయులతో సంతోష సమయం లేదా విహార యాత్రలకు అవకాశం. నూతన వాహనాల కొనుగోలుకు ఈ మాసం అనుకూలమైనది కాదు.
అక్టోబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో మేనమామ వర్గీయులకు మంచిది కాదు. వ్యాపార వ్యవహారాలు ధనాదాయం సామాన్యం. గృహ జీవనంలో కొద్దిపాటి అశాంతి, సౌఖ్యం తగ్గును. తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వాయిదా వేసిన పనులను పూర్తీ చేయగలుగుతారు. మాసం చివరి వారంలో దూర ప్రాంత ప్రయాణాలు. శారీరక అలసట. ఈ మాసంలో 13, 19, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబెర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఇష్ట దేవతా అనుగ్రహ ప్రాప్తి ఏర్పడును. స్వశక్తితో కార్యాలను పూర్తీ చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారాన్ని పొంది సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఒక పెద్ద పనిని పూర్తీ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఉద్యోగంలో కోరుకొన్న మార్పులు. సత్కారములు పొందుదురు. కుటుంబంలో శుభకార్యములు విజయవంతంగా నిర్వహిస్తారు.
డిసెంబర్ 2019 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఆర్ధిక విషయాలలో అభివృద్ధి క్రమానుగతంగా తగ్గును. వ్యాపార వ్యవహరాదులలో చిక్కులు ఏర్పడును. అదృష్టం కలసి రాదు. మంచి మంచి అవకాశములు కోల్పోవుదురు. సమస్యల పరిష్కారం కోసం ఇతరులను ఆశ్రయించవలసి వచ్చును. సరిహద్దు విషయాలలో సమస్యలు. అనవసర సామాగ్రి కొనుగోలు చేస్తారు. చివరి వారంలో శ్రమతో కూడిన జీవనం. నూతన ప్రయత్నాలు కలసిరావు. పాత మిత్రులు అవసరమగును.
జనవరి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కుంభరాశి వారికి ఏలినాటి శని దశ ప్రారంభమగును. అభివృద్ధిలో వేగం తగ్గుముఖం పట్టును. జీవన మార్గంలో ఎదో ఒక అశాంతి లేదా అసంతృప్తి కలిగించు పరిస్థితులు ఏర్పడుచుండును. ధనాదాయం ఆశాజనకంగా ఉండదు. నూతన వ్యాపారాలు లేదా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ మాసం 19 వ తేదీ లోపున అమలు చేయవలెను. నూతన ఒప్పందాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. మిత్రుల మధ్య అభిప్రాయ బేదాలు. మాసాంతానికి రాబడికి మించి ఖర్చులు ఏర్పడును.
ఫిబ్రవరి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వృధా వ్యయం అధికమగును. ఆర్ధిక ప్రణాళికలు అనుకున్న విధంగా పూర్తీ చేయలేరు. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందిని కలుగ చేయును. నమ్మక ద్రోహానికి లోనగు సంఘటనలు. ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం మంచిది. భూ సంబంధ క్రయవిక్రయాలు చేయకుండా ఉండుట మంచిది. గృహ నిర్మాణ సంబంధ విషయాలు అధిక వ్యయప్రయాసలు కలుగచేయును. ఈ మాసంలో 5, 12, 13 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఎదిగిన సంతానమ వలన సమాజంలో గౌరవ హాని. పంతాలకు పోవుట వలన ఇబ్బందులు. గత మాసపు సమస్యలు కొనసాగును. వారికి శ్రీ వికారి నామ సంవత్సరం రాహు - కేతువుల వలన పూర్తీ ఆయుర్భాగ్యములు పొందును. పారమార్ధిక చింతన అలవడునట్లు చేయును. ధార్మిక కార్యక్రమాల పట్ల అధికంగా ఆకర్షితులగును.

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu
Placeholder image

  • పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో
  •  జన్మించిన వారు మీన రాశి కి  చెందును.
  • శ్రీ వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 01 
  • అవమానం - 07. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "1". ఇది ఆర్ధిక విషయాలలో లాభాన్ని 
  • సూచించుచున్నది.
  • Contact me know your Rasi if you are not sure@9704840400.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) అన్ని విధములా కలసి వచ్చును. ఆర్ధికంగా, వ్యక్తిగత జీవన పరంగా , వృత్తి పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉండును. తలచిన పనులన్నీ విజయవంతమగు గ్రహ ఫలితములు కలవు. ముఖ్యంగా గురు గ్రహం వలన మిక్కిలి యోగవంతమైన కాలాన్ని ఏర్పరచును. భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును, స్వార్జిత ధన సంపదలను ఏర్పరచును. అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదించును. చెడు వ్యసనాలనుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచును. నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదించును. ప్రమోషన్లు, సత్కారములను ఏర్పరచును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేష ధనలాభములను , నూతన ఆదాయ మార్గములను ప్రసాదించును. ఆర్ధికంగా లోభత్వం ప్రదర్శించుట వలన కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పరచును. ముఖ్యంగా 24-జనవరి-2020 నుండి ఆర్ధికాభివృద్ధి చాలా వేగంగా ఉండును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మాతృ వర్గీయుల వలన లాభములను, మాత్రువర్గీయుల సహకారమును, బంధువర్గ సౌఖ్యమును, వాహన సౌఖ్యమును, విధ్యార్ధులకు అతి చక్కటి విద్యా ఫలితములను కలుగచేయును. పారమార్ధిక చింతను అలవరచును.
ఏప్రిల్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అతి చక్కటి గ్రహ బలములు ఏర్పడివున్నవి. ఆశించిన పనులు విజయవంతమగును. ధనాదాయం వృద్ధి చెందును. తలపెట్టిన ప్రయాణాలు లాభవంతమగును. ఉద్యోగ జీవనంలో స్థాయి పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగం లభించును. అనారోగ్య సమస్యలు తగ్గును. వాయిదా పడుతున్న పనులను పూర్తీ చేయగలరు. వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు. రాజకీయాలపట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాదులు సక్రమంగా కొనసాగును. ఆర్ధిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది.
మే 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా క్రిందటి మాసం వలె అతి చక్కటి శుభ ఫలితాలు కొనసాగును. ప్రముఖులతో పరిచయాలు పెరుగును. స్థిరాస్థి లావాదేవీలలో అదృష్టం కలసివచ్చును. ఇతరుల మనసు తెలుసుకొని పనులను పుర్తిచేయగలుగుతారు. ఉద్యోగులకు కృషికి తగిన గుర్తింపు , ప్రజాదరణ అందుకుంటారు. 17 నుండి 23 వ తేదీల మధ్య తీరికలేకుండా శారీరక శ్రమ చేయవలసి వచ్చును. పై అధికారుల సహకారంతో ముఖ్యమైన పనులలో నైపుణ్యత సాధిస్తారు. అవసరమైన వనరులు సకాలంలో లభిస్తాయి. ఈ మాసంలో 5, 8 వ తేదీలలో ఆర్ధిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను.
జూన్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఇతరుల మాటలు నమ్మి నూతన వ్యవహారాలు ప్రారంభించకపోవడం మంచిది. గృహంలో అతిధుల సందడి అధికమగును. ఉత్సాహపూరిత వాతావరణం. విద్యా , వ్యాపారాదులు ఆశించిన విధంగా కొనసాగును. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తగ్గును. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. చివరి వారంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తీ చేసుకుంటారు.
జూలై 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు, స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి లాభాలు సిద్ధించును. విదేశీ వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు ఎదురగును. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు ఇది మంచి మాసం. నూతన ఆదాయ మార్గాల కొరకు చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. క్రొత్త ఆలోచనలు కార్య రూపం దాల్చును. బంధువుల, స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచనా విధానం మార్చుకొందురు. నూతన పదవులు లభించడానికి గ్రహ బాలలు ఉన్నవి. తృతీయ , చతుర్ధ వారాలలో శుభాకార్యములందు లేదా కుటుంబములో కులాసాగా గడుపుతారు. సోదరి వర్గానికి మీ సలహాలు - ఆర్ధిక సహకారం అవసరమగును.
ఆగష్టు 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో బాధ్యతలు పెరిగినప్పటికీ బాధ్యతలన్నిటినీ ఎటువంటి విఘాతం లేకుండా పూర్తీ చేయగలరు. ఆధ్యాత్మిక వేత్తల పరిచయ భాగ్యం ఏర్పడును. ధనాదాయం సామాన్యం. మాతృ వర్గీయులతో చిన్న సమస్య ఏర్పడవచ్చును. ద్వితీయ , తృతీయ వారాలలో దీర్ఘకాలిక కోరికలను నేరవేర్చుకోగలరు. కావలసిన సౌకర్యాలు సాధించుకొందురు. మాసాంతంలో విందు-వినోదాలలో సంతృప్తికర ఆహరం. ఈ మాసంలో 2 వ తేదీ నుండి 8 వ తేదీ మధ్యకాలం వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనది.
సెప్టెంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో మార్పులు శుభప్రదంగా ఉంటాయి. ఆశించినంత ధనాదాయం పొందుతారు. అన్ని అడ్డంకులు తొలగించుకొని గృహారంభ పనులు చేపడతారు. లేదా గృహానికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన మిత్ర వర్గం ఏర్పడును. మార్కెటింగ్ రంగంలోని వారికీ శారీరక శ్రమ అధికమగు సూచనలు కలవు. గృహ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. తృతీయ వారమంతా ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. చివరి వారంలో 22 వ తేదీ నుండి మాసంతం వరకూ నూతన పెట్టుబడులు పెట్టుటకు అనువైన గ్రహ బాలలు కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారాలు ప్రాప్తించును.
అక్టోబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వైవాహిక జీవన సమస్యలు తొలగును. వివాహ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో సంతోషాలు పొందేదురు. ప్రవాస జీవన ప్రయత్నాలకు విఘ్నాలు తొలగును. విదేశీయానం ఫలవంతమగును. వ్యాపారాదులు సక్రమంగా నడచును. నూతన వాహనం ఆశించిన కోరిక సిద్ధించును. సంతానం పట్ల శ్రద్ధ వహించవలెను. వారి ఆర్ధిక సంబంధ ప్రవర్తన కొద్దిపాటి ఆందోళన కలుగచేయును.
నవంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడును. సమాజంలో తగిన గౌరవం లభించును. వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తారు. వ్యాపార అభివృద్ధి పనులు చేపడతారు. హస్తకళా రంగంలోని వారికి అతి చక్కటి కాలం. నూతన ఒప్పందాలు లభించి సంతృప్తికర జీవనాన్ని పొందుతారు. ఈ మాసంలో 13 నుండి 17 వ తేదీ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు కలవు. చివరి వారంలో అనుమానాలు ఎక్కువ ఉండుట వలన కొద్దిపాటి మానసిక అశాంతి. ఇతరులతో మాట్లాడునపుడు జాగ్రత్త వహించవలెను.
డిసెంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కొద్దిపాటి అననుకూల ఫలితాలు ఏర్పడు సూచన. వృత్తి ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నవి. ఆదాయం కూడా ఆశించినంతగా ఉండదు. వైవాహిక జీవనంలో చికాకులు, కోర్టు తగాదాలు, శత్రు సమస్యలు. ఈ మాసం నూతన వ్యవహారదులకు అంతగా అనుకూలమైనది కాదు. కుటుంబంలో గౌరవ అభిమానములు స్వయంకృతాపరాధం వలన తగ్గును. దేవాలయ దర్శనం ద్వారా మానసిక శాంతిని పొందగలరు. ఈ మాసంలో 3, 6, 8, 10, 19, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
జనవరి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పెద్ద వయస్సు వారికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్స. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ధనాదాయం పర్వాలేదు. అనవసర ధనవ్యయం ఏర్పడు సూచన. స్పెక్యులేషన్ లాభించదు. జీవిత భాగస్వామితో తగాదాలు తొలగును. వారి అభిమానం, ప్రేమ పొందుదురు. పరదేశి విశ్వవిద్యాలయములందు అభ్యాసం కొరకు ప్రయత్నించు విద్యార్ధులకు ఉత్తమ ఫలితాలు. వ్యాపారాదులు సామాన్య ఫలములనిచ్చును. పనిచేయు కార్యాలయమునందు మాట గౌరవం పెరుగును. సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంత అనువైనది కాదు.
ఫిబ్రవరి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో చేపట్టిన పనులలో అభివృద్ధి ఏర్పడుట వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించును. ఉద్యోగ జీవనంలో దీర్ఘకాళిక నూతన ఒప్పందాలు లభించును. నూతన వ్యవహరాదులు ప్రారంభంలో సమస్యలను ఎదుర్కొన్నా మాసాంతానికి విజయవంతమగును. మాస మధ్యమంలో గృహంలో శుభకార్యములు ఏర్పడుటకు అవకాశం కలదు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు కోరుకున్న గుర్తింపు, పదవులు. మాసమంతా ధనాదాయం సామాన్యం.
మార్చి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో తలపెట్టిన ప్రతీ కార్యం, ఆలోచన లాభించును. గతకాలపు సమస్యలు తొలగును. కార్య సిద్ధి, ఆర్ధిక అభివృద్ధి ఏర్పడును. వృధా ధనవ్యయం తగ్గును. చేతిపై ధనం నిలుచును. శారీరక స్వస్థత ఏర్పడును. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి లాభం ఏర్పడును. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరచును. 24 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో మీనరాశి కి చెందిన స్త్రీలకు గర్భ లేదా ఉదర సంబంధ సమస్యలున్నాయి.