శ్రీ రామ నవమి ప్రత్యక శిర్షిక : శ్రీ రామ నవమి పరిపూర్ణ పూజ విధానం మరియు, ఆలస్య వివాహ సమస్య నుండి బయట పడుటకు నేడు చెయ్యవలిసిన యోగక్షేమం :
చైత్రమాసం, పునర్వసు నక్షత్రం, నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను. నవమి నాడే సీతామహాదేవితో వివాహము, నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది. శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ. చైత్ర శుద్ధ నవమి నాడు, అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.
ఇంట్లో జరుపుకునే విధానము:
శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ. చైత్ర శుద్ధ నవమి నాడు, అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.శ్రీరామ నవమి రోజున కుటుంబ సభ్యులందరూ పెందల కడనే (ప్రొద్దుపొద్దునే) నిద్ర లేచి, తలంటు స్నానము చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. సీతా,లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామ చంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములను గాని పూజా మందిరంలో ఉంచి శ్రీ రామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి వూరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి. వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్ల లోగాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి.
శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతు.వివాహం కానివారికి వివాహ అనుకూలత లభించును.
No comments:
Post a Comment