Wednesday, 30 October 2019

నాగుల చవితి పరిపూర్ణ పూజ విధానం nagula chavithi puja procedure


నాగుల చవితి పరిపూర్ణ పూజ విధానం 



దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీకశుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగా జరుపుకోవడం మన సంప్రదాయం. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటుంటారు. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి.
Image result for నాగ చతుర్థి నాగుల చవితి ,


నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు - ఎర్రటి పువ్వులు కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దల విశ్వాసం.

స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్రస్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి, ముత్తైదువులకు అందజేయాలి.

అనంతరం దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. నాగులచవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి, నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిరి ఉండలు (నువ్వులతో చేస్తారు), అరటిపళ్ళు, తాటి బుర్ర గుజ్జు, తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. పాలను పుట్టలో పోస్తూ నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ముఅంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు.

నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించుకుంటే శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రగాఢ నమ్మకం. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది. నాగ వస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే కోరికలు తీరతాయని కూడా కొందరి నమ్మకం.

Tuesday, 29 October 2019

కార్తీక మాసంలో తదియ తిథి లో త్రిలోచన గౌరీ వ్రతము విధివిధానం



త్రిలోచన గౌరీ వ్రతము విధివిధానం  
కార్తీక మాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేసుకుంటారు.సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు. వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది.ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు.
 trilochana gowry vratam

అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి.ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది.అవేమిటో గమనిద్దాం.ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి. "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి. "ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి.. "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు,పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు.కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి. "ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది. "క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది. నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం. మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది.నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు.సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి. జై శ్రీమన్నారాయణ.

Sunday, 27 October 2019

కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ* *పాటించవలసిన నియమాలు

*కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ* *పాటించవలసిన నియమాలు*
 NAMASIVAYA


*మొదటి రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

*రెండవరోజు*

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము :- బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :- ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము

3 వ రోజు
నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము

4 వ రోజు
నిషిద్ధములు :- వంకాయ, ఉసిరి
దానములు :- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి

5 వ రోజు
నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి

6 వ రోజు
నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

7 వ రోజు
నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం

8 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం

9 వ రోజు
నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

10 వ రోజు
నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :- ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి

11 వ రోజు
నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి

12 వ రోజు
నిషిద్ధములు :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

13 వ రోజు
నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం

14 వ రోజు
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట

15వ రోజు
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

16 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత

17 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

18 వ రోజు
నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి

19 వ రోజు
నిషిద్ధములు :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు :- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం, సర్వవిఘ్న నాశనం

20 వ రోజు
నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

21 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

22 వ రోజు
నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు

23 వ రోజు
నిషిద్ధములు :- ఉసిరి, తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం, వశీకరణం

24 వ రోజు
నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

25 వ రోజు
నిషిద్ధములు :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :- ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

26 వ రోజు
నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

27 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

28 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
దానములు :- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన మంత్రము :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం

29 వ రోజు
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

30 వ రోజు
నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు + పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

*****ఓం నమః శివాయ*****

kartika puranam - కార్తిక పురాణం

                                          కార్తిక పురాణం

                                      మొదటి అధ్యాయము: 

                                              Image may contain: plant, dessert and food

కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిశారణ్య ములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనికాది మునులు గురుతుల్యుడగు సుతునిగాంచి" " ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది" అని కోరిరి. అంత నా సూతమహర్షి " ఓ మునిపుంగవు లారా! ఒకప్పుడు యీదే కోరికను నారదుడు సృష్టి కర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి- విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సా౦బశివుడు పార్వతీదేవికి తెలియ చేసిన విదముగా నా గాథను వివరించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రదగానాలకింపు " డని యిట్లు చెప్పెను.

పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి " ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ  భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు"డని కోరెను.అంతట మహేశుడు మందహాసమొనరించి " దేవి ! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడు, మా మిథిలా  నగరమువైపు"అని మిథిలానగరపు దిశగా చూపించెను.

అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు' డని వేడుకొనెను. అందులకు వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి  క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు" మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవ త్సరములో  గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి  వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" రాజ! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నాన౦ద దాయకమైనది. అ౦తియే గాక వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్దగా ఆలకింపు'మని యిట్లు చెప్పసాగెను .

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట

ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను " ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి ,  దానధర్మములను, దేవతపూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.

కార్తిక స్థాన విదానము
ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయీ స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ , పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను. ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో , లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత  జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి
మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము సమాప్తం

                               ద్వితీయ అధ్యాయం 


శ్లో ఓమిత్యే కక్షార౦  బ్రహ్మవ్యాహరితి త్రయశిఖ:
తాసై తరాత్మ నే మేతదశినముర్తాయే నమ:

సోమవార వ్రత మహిమ

జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన  విధి కార్యక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కానీ, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావదానుడవై ఆలకించుము. కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తేసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంట ప్రాప్తియు నొందును. దీనిని ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను శ్రద్దగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్య వాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, "చీ పోమ్మనక , విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ , ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షి న్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయీ ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదరములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతో డ నూరమిన్చుచు వర్ణ సంకరు రా లయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి, వితులకు తార్చి ధనార్జన కూడ చేయసాగాను.

జనక రాజ! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రానములు బయలుదేరినవి. ఆ వ్రానములనుండి చీము, రక్తము రాసికరుత ప్రార౦భంయ్యేను. దానికి తోడూ శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి ద్రుర్ఘందము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగాములతో భాదపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విడల తృపి కలిగేంచిన విటులయే ఒక్కరు ఇప్పుడమను తొ౦గి చూడ రైరి . ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునే టులైననూ పలుకరించునని, ఆ విది మోఘమైనను చుదకున్తిరి. కర్కశ ఇటుల నరక బాధలను భావించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్ర గుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చుపించి, భటులారా! ఈమే పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన ఎనుప స్తా౦భామునకు కట్ట బెట్టుదు' అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦ దులకు గాను-యమభ టులామేను ఎర్రగా కాల్చిన ఇనుప స్తా౦భామునూ కౌగాలిచుకోమని చెప్పిరి. భర్త నూ బండ రాతిలో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారి ణి లుగా చేసినదుకు సలసల కరగిన నూనెలో పదవేసిరి. తల్లితండ్రులకు అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను, పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦బిపాకమును నరకములో వేయగా, అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు,జెర్రులు, కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఈటు ఏడు తరాలవాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు, కాళింగ దేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిభాడ పడలేక ఈల్లిలు తిరుగుచుండగా, కర్రతో కొట్టువారు, కొట్టుచు తిట్టువారు, తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఈట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమ వార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నాము తినెను. వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ ధానముచే జరిపెంచిన బలియన్నమగు టచే తను ఆ రోజు కార్తిక మాస సోమ వరమగు ట వలననూ, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుతవలనాను, శివ పూజ పవిత్ర స్థానామిన ఆ ఎంత దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦ తా రజ్ఞా న ముద్భ వించెను. వెంటనే ఆశునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులేవారు లేన౦దుకు లోనికేగాను. మరల ' రక్షిపుము రక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు ! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత న కుక్క 'మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గానను నేను. వ్యభిచారి ణి నై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్య ములో కుష్టు రాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవిన్చినా పూర్వికుల పుణ్య ఫలము వల్ల ఈజన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకుధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందు-మని వశిష్టునకు హితబోద చేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము సమాప్తం.

                         3 వ అధ్యాయము


కార్తీక మాస స్నాన మహిమ

జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిన నూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు న యిన నూ స్నాన దాన జపత పాదులు చేయక పోవుట వలన న నేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.

బ్రహ్మ రాక్ష సులకు ముక్తి కలుగుట

ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు
సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ  దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను.

' నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.

ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య ముందలి
మూడవ రోజు అధ్యాయము - మూడవ రోజు పారాయణము సమాప్తము.

                              4 వ  అధ్యాయము


దీపారాధన మహిమ
ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

శతృజిత్ కథ
పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు పిk దుడను idముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత మునిపున్గావుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో  నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ' శత్రుజి' యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థ మనుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలత్కరించుచు,యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛా తిర్చుకోను చుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.  ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦ చుట మన్మదునకై ననూ శక్యము గాదు.  అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చే ష్టుడై  కమవికరముతో నామెను సమీపించి తన కమవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము, శిలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను.

ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.

ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ' ఓ బాపడ!ఎ వరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు
శివధూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అల యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.

వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత త వశిష్ట ప్రోక్త  కార్తిక మహాత్యమందలి
నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.
ఉ || ఎల్ల శరీర దారులకు నీళ్ళను చీకటి నులిలోపలన్
ద్రెళ్లక ' మీరుమే' మనుమమతి భ్రమ ణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళమయమంచు విష్ణు న౦
దుల్లము జేర్చి తారడ విను౦డుట మేలు నిశాచ రాగ్ర ణి ||

                                  5 వ అధ్యాయము


వనబోజన మహిమ
ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా  పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి,  ఉసిరి చెట్టు నీడను  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల  కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.

కిరాత మూ షికములు మోక్షము నొందుట
రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము

విని, తండ్రీ ' ఓరి నీ చుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ  క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే  విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.

                              6 వ అధ్యాయము


దీపారా దన విధి- మహత్యం
ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు  దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||

అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా , ' అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈదీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అనిఅర్ధము ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన నూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను. ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త  కార్తీక మహాత్య మందలి
అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

                                      7వ అధ్యాయము



శివ కేశ వార్చనా విధులు
వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.

                                        8 వ అధ్యాయము


శ్రీ హరి నామస్మర ణా ధన్యోపాయం
వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.
రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

ఆజా మీళుని కథ

పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.


                               9 వ అధ్యయము


విష్ణు పార్షద, యమ దూతల వివాదము

'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్ర ష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృత ఘ్నులును, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా

మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును- అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువరును, తటాకములు త్రవ్వి౦చువరును, శివ కేశవులను పూజి౦చు వారును సదా హరి నమ స్మరణ చేయువారును మరణ కాలమందు ' నారాయణా'యని శ్రీ హరిణి గాని, ' శివ ' అని శివుని గాని స్మరించు వారును, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున" నారాయణా"అని పలికిరి.

అజా మీ ళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది " ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్ర ష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో " నారాయణా" యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకున్తమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడు! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంటమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద, కలిగించేనో, అటులనే శ్రీ హరి స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదారు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

                                       10 వ అధ్యాయము


అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము

జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించ వలసినది " గాప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా! అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి, " ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంట మునకు దీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' అని భయ కి౦ పితులై విన్నవి౦చు కొనిరి.

"జా రా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృ త్తాంతము తెలుసుకొని " ఓహొ! అది యా సంగతి! తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకుంట వాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని, తెలిసిగాని ముత్యు సమయమున హరి నామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంట ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజా మీ ళునకు వైకుంట ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

అజా మీ ళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనము నపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక, దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్క ప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరు౦డెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనద గు టచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కలం గడుపుచు౦డెడి వాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి " నాకు యీ రొజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము", అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు, నిర్లక్ష్యముతో కళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని

వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్త కు కోపం వచ్చి లనున్న కఱ్ఱతో బదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు సివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి " ఓయీ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు ర"మ్మని కొరెను. అంత నా చాకలి " తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నిచాకులస్తుడును, చాకలి వాడిని మిరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తన కామవా౦ఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి " అయ్యో! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని" అని పాశ్చాత్తాపమొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకు రావలసినది గ పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత బారత యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవ లంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణి౦చుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొంది మరల నారా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణో త్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడై పుట్టెను. ఎప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా ' అని శ్రీ హరి స్మరించుట వలన వైకుంట మునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాత నలనను భవించి ఒక మల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడా శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ హరి కథలను ఆలకించుట, కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొంద గలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొంద గలరు.

ఇట్లు స్కాంద పురాణా౦త ర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.

                              11 వ అధ్యాయము


మ౦థరుడు - పురాణ మహిమ

ఓ జనక మహారాజా! యీ కార్తిక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనా నంతరం పురాణ పటణం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుం ట న్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించు చు, మద్య మా౦సాది పానీయాలు సేవించు చూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపరదన నాదికములను ఆచరములును పాటింపక దురాచారుడై మెలుగు చుండెను. అతని భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంత మంతురాలు, భర్త యెంత దుర్మార్గుడ యిననూ, పతనే దైవము గనెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతి వ్రతా ధర్మమును నిర్వర్తించు చుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంట వాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించు చెండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవు చుండ నతనిని భయ పెట్టి కొట్టి ధన మపహరిం చుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమిపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపో యినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తి నియై భర్తను తలచుకోని దు. ఖిoచుచు కలము గడు పుచు౦ డెను. కొనాళ్ళు కు ఆమె యిoటి కి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌర వముగా ఆహ్వానించి అర్ఘ్య పాధ్యదులచే పూజించి " స్వామి!నే ను దీ నురాలను, నాకు భర్త గాని, సంత తిగానిలేరు. నేను సదా హరి నమ స్మరణ చేయుచు జివించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె విన మమునకు, ఆచార మునకు ఆ ఋషి సంత సించి" అమ్మా! ఈది నము కార్తిక పౌర్ణ మి, చాల పవిత్ర మైన దినము. ఈ దినమును వృ థా గా పాడు చేసుకోను వద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నివు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలమును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తో డనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమున నీ కు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీ పారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి మంతము పురాణమును వినెను. ఆనతి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమున కు మరణించెను. ఆమె పుణ్య త్ము రాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపతుడైన భర్త తో సహవాసము వలన కొంచము దో షముందుట చేత మార్గ మధ్యమున యమలో కమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక భాద పడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయ పాదెమపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నిభార్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంద్యాదులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడై ననూ అతడు కూడా ధ నాశ చే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగు వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బరహణుడే జన్మించినాను అనేక అత్యాచార ములు చేసి దాధ శి రోజున కూడా తేలలే పనము, మద్య మాంసభ కణచె సినాడుగాను పాపాతుడేనాడు. అందుకే యీ నలుగురు నరక భాదలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాల విచారించి "ఓ పుణ్యాత్మురాల! నా భర్తతో పటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డ ని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణ మినాడు నివు వత్తి చేసిన ఫలమును ఆ విప్రునికి ధరపోసినచో వారికి మోక్షము ఫలము కిరాత కునకు, నని చెప్పుగా అందులకమె అట్లే ధార పోసేను. అ నలుగురు ను ఆమె కడ కువచి విమాన మెక్కి వైకుంట మునకు వేలిరి. కావున, ఓరాజా! కార్తిక మాసమున పురాణము వినుటవలన, దీ పము వెలిగించుట వలన అట్టి ఫలము కలిగెనో వింటి వా? అని వశిష్టుల వారు నుడి విరి.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

ఏకాద శాద్యయము - పకొండవ రోజు పారాయణము సమాప్తము.

                                 12 వ అధ్యాయము


ద్వాద శి ప్రశంస

" మహారాజా! కార్తీక మాసమున కార్తీక సోమవార మున కార్తీక ద్వాద శి వ్రతమును గురించి, సాలగ్రమపు మహిమలను గురించి వివరించెదను విను" మని వశిష్ట మహాముని ఈవిధ ముగా తెలియచే సిరి.

కార్తిక సోమ వారమునాడు ఉద యమున నే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నాన ముచేసి అచ మనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము౦డి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్యలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధ ముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటమే గాక, మోక్షము కూడా పొందుదురు.

కార్తిక మాసములో శ నిత్ర మోద శి వచ్చిన యెడల నావత్ర మాచరించిన చో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తిక శుద్ధ యేకాద శిరోజున, పూర్ణ పవాస ముండి అరాత్రి విస్తాలయమున కు వెళ్లి శ్రీహరి ని మన సారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షే పము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధ న చేసిన, కోటి యజ్ఞ ముల ఫలితము కలుగును. ఈవి ధ ముగా చేసిన వారాలకు సూర్య గ్రహణ సమయమున గంగానది లో స్నాన ముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నద్ కముగా ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి నాడు శ్రిమన్నారాయుణుడు శేషపానుపు నుండి లెచును గనుక, కార్తిక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువున కు యిష్ట ము. అరోజున శ్రీమంతు లెవ రైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడ తో సహా బ్రహణునకు దాన మిచ్చిన యెడల ఆ యా వు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవ త్సరాములు యింద్ర లో కములో స్వర్గ శుక ములందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తిక పౌర్ణ మిరోజున కంచుపాత్ర లో అవు నేయి పోసి దీ పముంచిన వారు పూర్వ జన్మ ముందు చేసిన సకల పాపములు హరించును. ద్వాద శినాడు యజ్ఞ పవితములు దక్షిణతో బ్రహణునకు దాన మిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాద శి రోజున బంగారు తులసిచేటునుగని, సలగ్రమమునుగని ఒక బ్రహణునకు దాన మిచిన మేడల నలుగు సముద్రాల మద్య నున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. ధీ నికి ఉదాహరణముగా ఒక కధ గలదు - శ్రద్దగా అలకింపుము.

సాలగ్రామ దాన మహిమ

పూర్వము అఖ ౦డ గోదావరి నదీ తీర మా౦దలి ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివ సించుచుడెను. వాడు మిగులు దురాశా పరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు, తాన నుభ వించక, యితరులకు బెట్టక, బీద లకు దాన ధర్మములు చేయక, యెల్లప్పుడు పర నింద లతో తనే గొప్ప శ్రీ మంతుడుగా విర్ర వి గుచూ మేజీవికి కూడా ఉపకార మైన నూ చేయక " పరులద్ర వ్యము నెటుల అపహరింతునా! మను తలంపుతో కుతిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.

అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లె లో నివసించుచున ఒక బ్రాహ్మణునకు తన వద్ద నున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమున కు తన సొమ్ము ని అడుగగా ఆ విప్రుడు " అయ్యా! తమకి మవలసిన దానము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈజన్మలో తీర్చని మేడల మరోజన్మమున మీ యింట మేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తిర్చుకోగాలను" అని సవినయముగా వేడుకోనేను. అమా ట లకు కో మటి మండి పడి " అట్లు వీలులేదు నాసొమ్ము నాకిప్పుడే యియవలయును. లేని యెడల ని క౦ ట మును నరికి మేయుదును " అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలో చించక తన మేలనున్న కత్తి తో ఆ బ్రాహ్మణుడు కుత్తు కను కొసెను. వెంటనే ఆ బ్రహేణుడు గిలగిల తన్ను కొని చనిపోమెను. ఆ కో మటి భయపడి, అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురు ని జడి సీతన గ్రామమునకు పారి పోమేను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మ హత్యా పాప మావ హించి కుష్టు వ్యాధి కలిగి నానా భాధ లూ పడుచూ మరి కొనాళ్ళు కు మరణించెను. వెంటనే యమదూత లువచ్చి అత నిని తీ సుకోనిపోయి రార వాది నరకకూపముల బడ ద్రోసిరి

ఆ వైశున కు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మ వీరుడు. ఆ పేరున కు తగినట్లు గానే తండ్రి స౦పదించిన ధనమును దాన దార్మలు చేయుచు పుణ్యకార్యములాచ రించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరవులు త్ర వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచికిర్తి నీ సంపాదించెను .ఇట్లువుండగా కొంత కాలమున కు త్రిలోక సంచారి మగు నార దులవారు యమలోకము దర్శించి భోలోకమునకు వచ్చి, త్రో వలో ధర్మ వీరుని యింటికి వెం చే సిరి. ధర్మ వీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణు దేవునిగా భావించి అర్ఘ్య పద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి " మహానుభావా! నాపుణ్యం కొలదీ నేడు తమ ధర్మనం లభించినది . నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావన మైనది . శక్తి కొలదీ నే జేయు సత్కర ములను సికరించి మరువచ్చిన కార్యమును విశ ధీ కరింపుడు" అని సవిన యుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి " ఓ ధర్మవిరా! నేను నీ కోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహ విష్ణువునకు కార్తిక మాసంలో శుద్ధ ద్వాద శి మహాప్రితిక రమైన దినము. అరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నే జాతివారైన నూ- స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, ప్రతివ్రత మైనా, వ్యభి చారిణి మైనా కార్తిక శ్రుద్ద ద్వాద శిరోజున సూర్యుడు తులారాసి యందు వుండగా నిష్టగా ఉపవాసముండి, సాలగ్రామా దనాములు

చెయ్యక తప్పదు అట్లు చేసిన తండ్రి ఋణం తిర్చుకోనుము. అని చెప్పెను. అంతట ధర్మ వీరుడు నారద మహా ముని వార్య! మేడల వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను. అంతట దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గో దానము, భూదానము." హిరణ్య దానము మొదలగు మహాదానములు చిసియుంటి ని, అటువంటి దానములు చేయగా నాతండ్రి కి మోక్షము కలుగ నప్పుడి" సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున అయున మెట్లువుద్ద రింపబడునా యని సంశ యము కలుగుచున్నది. ధీ నివలన ఆకలిగొన్నవాని ఆకలితిరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకు దానము చేయవలమును? నేనీ సాలగ్రామ దానము మాత్రము చేయజాల " నని నిష్క ర్షగా పలికెను. దర్మవిరుని అవివే మునకు విచారించి "వైశ్యుడ ! సాలగ్రమమును శిలామాత్రముగా అలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదాన ములకంటె సాలగ్రమదానము చేసిన చొ కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నీ నరక బాధ నుండి విముక్త నీ గావింప నెంచి తివెని, యీ దాన ముతప్ప మరొక మార్గ ము లేదు" అని చెప్పి నారదుడు వెడ లిపోయాను. దర్మవిరుడు ధన బలము గలవాడై యుండి యు, దాన సామర్ద్యము కలిగి యుండి యు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోమెను. నారదుడు చెప్పిన హిత భోధను పెడ చెవిని పెట్టుతచేత మరణాంతర మేడు జన్మలముందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీ గాపుట్టి , పది జన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పద కొండవా జన్మలో ఒక పేద బ్రాహ్మణుని నింట స్త్రీగా పుట్టి గా ఆమెకు యువన కాలము రాగా ఆపేద బ్రాహ్మణునికి ఒక విద్వం సునకు ఇచ్చి పెడ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతన ముందే ఆమెకు అష్ట కష్టములు సంభ వించినంధులకు తల్లి దండ్రులు బంధు మిత్రులు చాల దుఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యందువలన కలిగే నాయనిది దివ్య దృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామ దానము చే యించి " నాకు బాల వైద వ్యమునకు కారణ మైన పూర్వజన్మ పాపము న శించుగాక యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధార వో యిoచేను. ఆరోజు కార్తిక సోమవార ముగుట వలన అ సాలగ్రామ ఫాలముతో ఆమె భర్త జీవించెను. పిద ప ఆ నూతన దంపతులు చిర కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున, ఓ జనకా! కార్తిక శ్రుద్ద ద్వాద శిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది . కావున నీ వును ఆ సాలగ్రామ దానమును చేయుము.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి

ద్వాద శా ధ్యాయము - పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము

                                     13 వ అధ్యాయము


కన్య దన ఫలము

ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసములో యింకనువిధిగా చేయవలసిన ధర్మములు చాల యున్నవి. వాటిని వివరించెదను. సావధాను డై అలకి౦పుము. కార్తీక మాసములో నదీస్నాం ముఖ్యము. దాని కంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్ష తలు , దక్షణ తా౦బూలాది. సంభావనలతో తృప్తి పరచినాను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహా పాపములు చేసియున్నాను, అ పాపములన్నియు పోవును.ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిన నూ పై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనము చేసిన౦దు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తి శ్రద్దలతో కన్య దానము చేసిన యెడల తను తరించుటయే గాక తన పితృ దేవతలను కూడా తరింప జేసినా వాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము.

సువీర చరిత్రము

ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన " సువిరు"డను ఒక రాజుండెను. అతనికి రుప వతియను భార్య కలదు. ఒక సారి సువిరుడు శత్రు రాజులచే ఓడింప బడిన వాడయి. భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హినుడయి నర్మదా నదీ తీరమందు పర్ణ శాలను నిర్మించుకొని కంద మూలా ఫలాదులను భక్షించుచు కాలము గడుపు చుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచు చుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయిన ప్పటికి శుక్ల పక్ష చంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు, అతి గారబముతో పెరుగు చుండెను, ఆమె చూచు వార లకు కనుల పండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒక దినము వాన ప్రస్థుని కుమారుడా బాలికను గాంచి అనే అంద ఛందములకు పరవశుడై అ బాలికను తన కిచ్చి పెండ్లి చేయమని అ రాజునూ కోరెను. అందులకా రాజు' ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బిద స్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తోలుగుటకు గాను నాకు కొంత దానమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు'నని చెప్పగా తన చేతోలో రాగి పైసా యైన నూ లేకపోవుటచే బాలిక పై నున్న మక్కువతో అ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి దన పాత్రా సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్త వారింటికి పంపెను.

అటులా ముని కుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లి తల్లి దండ్రులకు నమస్కరించి అంత వరకు జరిగిన వృత్తంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభావించు చుండెను. సువిరుడు ముని కుమారుడి చ్చిన దన పాత్రను తీసుకోని స్వేచగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా వుండెను. యతుల కొంత కలం జరిగిన తర్వాత అ రోజు భార్య మణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరుల యెవరి కైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచు చుండెను.

ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానర్ధమై వచ్చుచు దారిలో నున్న సువిరుని కలుసుకొని' ఓయీ! ని వెవ్వడవు? నీ ముఖ వర్చసు చూడ రాజ వంశము నందు జన్మించిన వాణి వలె నున్నావు. నివి యరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశించగా, సువిరుడు" మహానుభావా! నేను వంగ దేశమును నేలుచుండేది సువిరుడను రాజునూ. నా రాజ్యము శత్రువులాక్రమించుటచె భార్య సమేతముగా నీ యడవిలో నివసించు చున్నాను. దరిద్రము కంటె కష్ట మేదియూనూ లేదు. పుత్రా శోకము కంటె గొప్ప దుఖము లేదు. అటులనే భార్య వియోగము కంటె గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్య భ్రష్టుడని యి నందున యీ కారడవిలో నె సకుటుంబముగా బ్రతుకు చున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాణి వద్ద కొంత దానము పుచ్చు కొంటిని. దానితోనే ఇంత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, ' ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము లలోచి౦పక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహా పాతకములలో నొకటి, కన్యను విక్రయిన్చున వారు' అసి పత్ర వాన' మను నరక మనుభావి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృ దేవత ప్రిత్యర్ధము యే వ్రతము చేసినాను వారు నశి౦తురు. అది యూను గాక కన్య విక్రయము చేసిన వారికీ పితృ దేవతలు పుత్ర సంతతి కలుగ కుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్ధ మగుటయే గాక అతడు మహా నరక మనుభావి౦ చును. కన్య విక్రయము జేసినా వారికీ ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా ణి౦చి యే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున ణి రెండవ కుమార్తెను ణి శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మభుద్ది గల వణికి కన్య దానము చేయుము. యతుల చేసిన యెడల గంగ స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందు టయే గాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలిగి పోవును" అని రాజునకు హితోప దేశము చేయగా అందుక రాజు చిరు నవ్వు నవ్వి " ఓ ముని వర్యా! దేహ సుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జరా విడువమా౦టారా? ధమను, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦ప గలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్య మైయున్న వారిని లోకము గుర్తిస్తుందా?

గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధన మేవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కానీ, కన్య దానము మాత్రము చేయను' అని నిక్కచిగా నిదివేను. ఆ మాటలకూ సన్యాసి ఆశ్చర్య పడి తన దారిన వెడలిపోయెను. మరి కొన్ని దినములకు సువిరుడు మరణించెను. వెంటనే యమ భటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమ లోకములో అసి పత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా భాదించిరి. సువిరుని పుర్వికుడై నా శ్రుత కీర్తి యను రాజు ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గ మందు సర్వ సౌఖ్యములు అనుభవించు చుండెను. సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ శ్రుత కీర్తిని కూడా యమ కింకరులు పాశాములతో బంధించి స్వర్గము నుండి తీసుకోని వచ్చిరి. అంతటా శ్రుత కీర్తి " నేనెరిగున్నత వరకును ఇతరులకు ఉపకారము చేసి ధన ధర్మదులు, యజ్ఞ యాగాదు లోనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె? " నని మనమునందు కొని నిండు కొలువు దీరి యున్న యమ ధర్మ రాజు కదా కేగి , నమస్కరించి " ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధరముర్తివి, భుద్ది శాలివి. ప్రాణ కోటి నంటాను సమ౦గా జూచు చుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణ మేమి? సెలవిండు' అని ప్రాధేయ పడెను. అంత యమ ధర్మ రాజు శ్రుత కీర్తిని గాంచి' శ్రుత కీర్తి! నీవు న్యాయ మూర్తివి, ధర్మజ్ఞుడవు, ని వెతువంటి దురాచారములూ చేసి యుండలేదు. అయిన నేమి? నీ వంశియుడగు సువిరుడు తన జ్యేష్ట పుత్రికను దానమున కాశించి అమ్ముకోనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వికులు యిటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్ను వరెంతటి పుణ్య పురుషులైనను నరకమనుభావించుట యే గాక, నిచ జన్మ లెత్త వలసి యుండును. నీవు పుణ్య త్ముడ వాణియు ధర్మతుడా వాణియు నేనేగుడును గణ, నీ కోక ఉపాయము చెప్పెదను. నీ వంశీ యుడగు సువిరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచూన్నది. నా యశిర్వా దాము వలన నీవు మనవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శిలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాల౦కృత కన్య దానము చేయుచు, యతుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువిరుడు, మీ పితృ గణములు కూడా స్వర్గ లోకమున కెగుదురు. కార్తీక మాసములో సాల కృత కన్య దమను చేసిన వాడు మహా పుణ్యాత్ముడుగాను. పుత్రిక సంతానము లేనువారు తమ ద్రవ్యముతో కన్య దానము చేసినను, లేక విది విధానముగా అబోతునకు వివాహ మొనర్చిను కన్య దన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపి నటుల చేసితి వేణి ఆ ధర్మ కార్యము వలన న పితృ గణము తరిం తుర పోయి రమ్ము ' అని పలికెను.

శుర్తి కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకోని నర్మదా తీరమున ఒక పర్ణ కుటిరములో నివసించు చున్న సువిరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోష పడి, ఆమెతో యవ్వతి విషయములు వివరించి కార్తీక మాసమున సువిరుని రెండవ కుమార్తెను సాలం కృత కన్య దన వివాహము చేసెను. యతుల కన్య దానము చేయుట వలన సువిరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలసి కొనెను.

కన్య దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయములో వారకి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యా దానము చెయవలయునని దీక్ష భుని ఆచరించిన వాడు. విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి యుండి వుదసినత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

త్రయోద శాద్యయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.

                                           14 వ అధ్యాయము


ఆ బోతును అచ్చుబోసి  వదలుట (వృ షో త్స ర్గము)

మరల వశిష్టుల వారు, జనకుని దగ్గరకు కూర్చుండ బెట్టుకుని కార్తిక మాస  మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో  ఇట్లు చెప్పదొడంగిరి.
ఓ రాజ కార్తిక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృ షో త్స ర్జనము చేయుట, శివ లింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరి కాయలు దక్షణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు.

వారికీ కోటి యాగములు చేసిన ఫలముదక్కును ప్రతి మనుజుని పితృ దేవతలును తమ వంశ మందె వ్వరు ఆ బోతునకు అచ్చు వేసి వదలునో అని ఎదురు జుచుచుందురు.

ఎవడు ధనవంతుడై యుండి పుణ్య కార్యములు చేయక, ధన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చు వేసి పెండ్లి యైననూ చేయడో అట్టి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుట యే గాక వాణి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సర౦ కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్టతో  వ్రతమాచరించి సయం సమయమున శివ కేశవులకు ఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రి యంతయు జగర ముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు బోజన మిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను ను భ వి౦తురు .

కార్తీక మాసములో విసర్జిపవలసినవి

ఈ మాసమందు పరాన్న భక్షణ చేయురాదు. ఇతరులకు యెంగిలి ముట్ట కూడదు. తిన కూడదు. శ్రాద్ధ భోజనం  చేయకూడదు. నీరుల్లి పాయ తిన రాదు. తిలదనము పట్టరాదు. శివార్చన, సంద్యావందనము చేయని వారు వండిన వంటలు తిన రాదు. పౌర్ణమి, అమావాస్య , సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ రెండు రాత్రులు తప్పని సరిగా జాగారము ఉండవలెను. ఒక్క పుట మాత్రమే బోజన్నాము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్సిన్చారాడు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని  బ్రహ్మ దేవుడు చెప్పెను. కావున, వేడి నీటితో స్నానము కూడదు. ఒక వేళ అనారోగ్యము వుంది యెలాగైన విధవ కుండ కార్తీక మాస వ్రతం చేయవలెనన్న  కుతూహలం గలవారు మాత్రమే వేడి నిటి స్నానము చేయవచ్చును. అటుల చేయు వారలు గంగ, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతః కాలమున స్నానము చేయవలయును అటుల చేయని యెడల మహా పాపియై జన్మ జన్మములు నరక కుపమున బడి కృశింతురు ఒక వేళ నదులు అందు బాటులో లేనప్పుడు నుతి దగ్గర గాని, చెరువు నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరి స్నాన మాచరించావలెను.

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిది౦కురు||

అని పాటించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పటన శ్రవణ౦, హరి కథ కాలక్షేపము లతో  కాలము గడుప వలెను సయంకలమున సంధ్య వందనది కాది కృత్యములు  ముగించి పూజ మందిరమున నున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించ వలెను.

కార్తీక మాస శివ పూజ కల్పము

1 ఓం శివాయ నమః  ధ్యానం సమర్పయామి.
2  ఓం పరమేశ్వరాయ నమః అవాహం సమర్పయామి
3  ఓం కైలసవాసయ నమః నవరత్న సంహాసనం సమర్పయామి.
4 ఓం గౌరీ నాథాయ నమః పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమః  అర్ఘ్యం  సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమః యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమః గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమః దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమః నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమః సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి

ఈ ప్రకారముగా కార్తీక మసమంతయు పూజించా వలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన యెడల ధన్యు డగును. పూజానంతరము తన శక్తి ని బట్టి బ్రాహ్మణులకు సమర్ధన చేసి దక్షణ తా౦బూలాది సత్కారములతో సంతృప్తి పరచ వలెను. ఇటుల చేసిన నూరు ఆశ్వ మేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి  వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెలరోజులు బ్రాహ్మణ సమారాధన శివ కేశవుల సన్నిధి ని నిత్య దీపరాదన, తులసి కోట వద్ద కర్పూర హరతులతో  దీపారాధన చేసిన యెడల వారికీ, వారి వంశీయులకు, పితృ దేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి యుండి కూడా యీ వ్రతము నాచరించి ని వారు వంద జన్మలు నానా యోనులందునా జన్మించి తర్వత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలేత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్త ముగా ఆచరించిన యెడల పది హేను జన్మయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినాను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్య ములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
చతుర్ద శాద్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము.

                                    15 వ అధ్యాయము


ధీ ప ప్రజ్వలన ముచే ఎలుక పూర్వ జన్మ స్మృతితో  నరరూపమందుట

అంత ట జనక మహారాజుతో వశిష్ట మహాముని - జనకా ! కార్తీక మహత్యము గురించి యెంత  వివరించిననూ పూర్తి కానేరదు. కాని, మరి యొక  యితిహసము   తెలియ చెప్పెదను సావదానుడ వై  ఆలకింపు - మని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరి నామ సంకీర్తన లు వినుట, చేయుట, శివ కేశవుల వద్ద ధీ పారాధ ననుచేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతా దర్శనము  - చేయలెనివారు కాల సూత్రా మనెడి నరకముబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మన సారా శ్రీహరి ని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ ని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీ ప నైవేద్యము యిచ్చిన యెడల, విశే ష ఫలము పొందగలరు. ఈవిధ ముగా నెలరోజులు విడువక చేసిన యెడల, అట్టి వారు దేవదుందుభులు మ్రోగు చుండగా విమాన మెక్కి వైకుంఠ మునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ  త్ర యోదశి, చెతుర్ద శి , పూర్ణ మరోజులందైనా నిష్ట తో పూజలు చేసి  ఆవునే తితో దిపమునుంచవలెను.
ఈ మహా కార్తీక కములో ఆవుపాలు పితికి నంత సేపు మాత్ర ముదీ పముంచిన యెడల  మరు జన్మలో బ్రాహణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన ధీ పము మెగ ద్రోసి వృద్ద చేసిన యె డల, లేక , ఆరి పోయిను ధీ పమున వెలిగించినాను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. విను - మని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.

సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్టుడైన  దయార్ద్ర  హృద యుడగు ఒక యోగి పుంగ వుడు అ దేవాలయము వద్ద కు వచ్చి కార్తీక మాసయంతయు   అచటనే గడిపి పురాణ పటనము జే యు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభ ముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో  వత్తులు జేసి, పండ్రెండు దీ పములుంచి, స్వామిని పుజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను. ఈ విధ ముగా కార్తీక మాసము ప్రారంభ మునుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవెశించి, నలుమూలలు వెదకి, తిన డానికి ఏమీ దొరకనందున అక్కడ అరి పోయియున్న వత్తిని తిని వలసిన దే నని అనుకోని నోట కరుచుకొని ప్రక్కనున్న దీ పమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరి పోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరి పోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగి నందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో వున్న యోగి పుంగ వుడు తన కన్నులను తెర చిచూడ గా, ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా" ఆర్యా ! నేను మూషిక మును, రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రేవేశించి యిక్కడ కూడా ఏమి దొరక నందున నెయ్యి వాసనలతో  నుండి అరి పోయిన వత్తి ని తిన వలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీ పంచెంత నిలబడి వుండగ, నా అదృష్ట  ముకోలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయి నుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని , ఓ మహానుభావా! నేను యెందుకి  మూషిక జన్మ మెత్త వలసివచ్చేనో - దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు " మని కో రెను.

అంత యోగీ శ్వరుడు ఆశ్చర్య పడి తన ది వ్యదృష్టి చే సర్వము తెలుసుకొని " ఓయీ! క్రింద టి జన్మలో నీవు  బ్రాహణుడువు. నిన్ను బాహ్లి కుడ ని పిలిచెడి వారు. నీవు  జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవ సాయంచే స్తూ, ధ నాశాపరుడ వైదేవ పూజలు, నిత్యకర్మములు మరచి, నీ చుల సహవాసము వలన నిషిద్దా న్నము తినుచు, మంచివార లము, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడ వై ఆడ పిల్ల లను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన  ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తిను బండార ములను కడు చౌక గా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభ వించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భ వించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరి పోయిన దీ పాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు  ని గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలు  చేసి భగవంతుని ప్రార్దంచుకొని మొక్షేము పొందు " మని అతనికి నీ తులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
పంచ దశాద్యయము - పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.

మ|| సదయా ఇంద్రియ ధేనువుల్ విషయ ఘాస గ్రాసలో లమ్ము లై
బ్రదు కుం బిడులు బట్టి నిన్మరిచి పోవంబోవ ప్రాయం పుప్రో
ద్ద దేడిందన్ పయిగమ్ము చికటిలలో నల్లాడవే సుంత నీ
మృదవౌ మోవిని పిల్ల గ్రోవి నీడలేని వేణు గోపాలకా||

                                  16 వ అధ్యాయము


స్తంభ దీ పప్రశంసవశిష్టుడు చెబుతున్నాడు-

"ఓ రాజా! కార్తిక మాసము దామోద రునికి అత్యంత  ప్రీతికర మైన మాసము. ఆ మాసముందు స్నా, దాన , వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక  మాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో , అట్టి వారు రౌర వాది నరక బాధ లు పొందుదురు. ఈ నెలది నములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధ ముగానే నెలరో జులలో ఏ ఒక్క  రొజూ  విడువకుండ, తులసి కోట వద్ద గాని - భగవంతుని సన్నిధ నిగాని దీ పారాద న చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ద పౌర్ణమి రోజున నది స్నాన మాచరించి, భగవంతుని సన్నీధ యందు దూ పదీ ప నైవే ద్యములతో దక్షి ణ తంబులాదులు, నారి కేళ ఫలదానము జేసిన యెడల - చిర కాలమునుండి సంతతిలేనివారికి పుత్రా సంతానము కలుగును.

సంతానము వున్న వారు చేసిన చో సంతాన నష్టము జరుగదు . పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ద్వజ స్తంభ మునందు ఆకాశ దీ పమునుంచిన వారు వైకుంఠ మున సకల భోగములు అనుభ వింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీ పముగాని, స్తంభ దీ పాము గాని వుంచి నమస్కరించిన స్త్రీ  పురుషులకు  స క లైశర్యములు కలిగి , వారి జీవితము ఆనంద దాయకమగును . ఆకాశ దీపము పెట్టు వారు శాలిదాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగును పోసి దీ పముంచ వలమును. దీ పము పెట్ట డానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టు నివారును, లేక దీ పం పెట్టువారి పరిహసమడు వారును చుంచు జన్మ  మెత్తుదురు
ఇందులకొక కథ కలదు చెప్పెదను  వినుము.

దీప స్టంభము విప్రుడగుట

ఋషులలో అగ్ర గణ్యుడ న పేరొంది న మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్నిఏర్పర రచుకొని, దానికి  దగ్గరలో నొక విష్ణు మంది రాన్నికూడా నిర్మించుకొని, నిత్యమూ పూజలు చేయుచుండెను. కార్తీక  మాసములో ఆ యా శ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై ది  పాములు వెలిగించి, కడు భక్తీ తో శ్రీ హరిని పూజించి వెళ్ల చుండెడి వారు ఒక నాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులని జూచి " ఓ సిద్దు లారా! కార్తిక సములో హరి హరాదుల ప్రితికోరకు స్తంభ దీ పము నుంచిన చో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంద ని మన కందరకూ తెలిసిన విషేయమె కదా! రేపు కార్తీక శుద్ధ  పౌర్ణమి . హరి హరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భుపాతి, దాని పై దీ పమును పెట్టుదము. కావున మన మందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభ ము తోడ్కుని వత్త ము, రండు " అని పలుక గా అందరు పర మానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవును నేతితి నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీ పము వెలిగించిరి . పిమ్మట వారందరూ కూర్చోండి పురాణ పరనము చెయుచుండ గా ఫళ ఫళ మును శబ్ద ము వినిపించి, అటుచూడ గా వారు పాతిన స్తంభ ము ముక్క లై పడి, దీ పము ఆరి పోయి చెల్లచెదురై పడి యుండెను . ఆ దృశ్య ము చూచి  వారందరు ఆశ్చర్యము తో నిలబడి యుండిరి. అంత లో ఆ స్తంభ మునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వార తనిని జూచి " ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభ మునుండి యేలా వచ్చితి :?

నీ వృతంత మేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి " పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు  బ్రహ్మణుడను . ఒక జమిందారుడను. నా పేరు ధన లో భుడు. నాకు చాలా యై శ్వర్య  ముండుటచే మదాంధుడ నై న్యాయాన్యాయా విచక్షేణలు లేక ప్రవర్తించితిని. దుర్భు ద్దు లలవడుటచే వేద ములు చదువక శ్రీ హరి ని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలగి తిని. నేను నా పరి వారముతో కూర్తుండి యున్న సమయమున నే విప్రుడ యినా వచ్చినన్ను ఆశ్ర యించిన ను ఆత నిచె  నా కళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకో మని చెప్పి, నానా దుర్భా షలాడి పంపుచుండే వాడ ను. నేను వున్నా తాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడ ని చెప్పడి వాడ ను. స్త్రీ లను , పసిపిల్ల లను హిన ముగా చూ చుచుండడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడు వారే కాని, నన్నే వరును మంద లింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడి ది.దాన ధర్మములు మెట్టి వో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడ వై, పాప్తి నై అవ సాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభ వించి, లక్ష జన్మలముందు కుక్క నై, పది వేల జన్మలు కాకి నై, ఐదు వేల జన్మలు తొండ నై, ఐదు వేల జన్మలు పెడ పురుగు నై, తర్వాత వృక్ష  జన్మ మెత్తి కి కారణ్య ముందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొన లేక పోతిని. ఇన్నాళ్ళు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నారా రూప మెత్తి జన్మాంతర జ్ఞానీ నైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్ని౦పు " డ ని వేడుకొనెను.

ఆ మాట లాలకించిన, మునులందరు నమితా శ్చర్య మొంది " ఆహా! కార్తీక మాస మహిమ మంత గొప్పది అది యునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళూ, స్త౦భ ములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందు చున్నవి.    విటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీప ముంచిన మునుజునకు వైకుంట ప్రాప్తి తప్పక సిద్ధించును. అందులననే యీ స్త౦భమునకు ముక్తి కలిగిన" దాని మునులు అనుకోను చుండగా, ఆ పురుషుడా మాట లాలకించి" ముని పుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమే దైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చు టెట్లు? నా యీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦ దరును తమలో నోకడగు అంగీర సమునితో " స్వామి! మీరే అతని   సంశయమును తీర్చ గల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీర సుడిట్లు చెప్పు చున్నాడు.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

షోడ శా ధ్యాయము - పద హరో రోజు పారాయణము సమాప్తం.

                                    17  వ అధ్యాయము


అంగీర సుడు దన లో భానకు చేసిన తత్వ పదేశము

ఓ ముని శ్రేష్టులార ! ఓ ధన లోభి ! నీకు కలిగిన సంశ యంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభ వించు చున్నది. కావున, శారిరోత్పతి కర్మ కారణముగుచున్నది. శ రి ర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరిరమే కార ణ ముగుచున్నది. స్థూల  సుక్ష్మం శరీర సంబంధ మువలన ఆత్మ కు కర్మ సంబంధ మువలన ఆత్మకు కర్మ సంబంధ ము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతి దేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ' యన గా యీ శరీరమును న హంకార ముగా ఆవరించి వ్యవ హరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా " ఓ మునిoద్రా! నేనింత వరకు యీ దే హర మే ఆత్మ యని భావించుచుంటి ని. కనుక, యింకను వివర ముగా చెప్పబడిన వాక్యార్ధ  జ్ఞానమునకు పాదార్ద  జ్ఞానము కారణమగుచుండును. కాన, అహం బ్రహ్మ' యను వ్యక్యార్ధ మును గురించి నాకు తెలియ జెయండి " యని ధన లో భుడు కోరెను. అప్పుడు ధన లోభునితో అంగీర సుడి డ్ల ని యె - ఈ దే హము అంత: కరణ వృత్తి కి సాక్షి యె, ' నేను - నాది ' అని చెప్పబడు జీవత్మాయే  ' అహం' అను శబ్దము. సర్వాంత ర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్ర సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞాన రూపి శరీరెంద్రి యములు మెదలగువాని వ్యాపార మునుందు ప్రవర్తింప జేసి  వానికంటే వేరుగా వున్నా దైమెల్ల ప్పుడు నొకే రీ తిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యునబడ ను." నేను" అనునది  శ రీ రెంద్రి యాదులు కూడా నామరూ పంబుతో నుండి నశించున విమేగాక,  యిట్టి దేహమునకు జగర్స్వప్న సుషుప్త్య వస్థలు స్థూల  సూక్షా కార శ రీ రంబులను మూడింటి ముందునూ "నేను"" నాది " అని వ్యవ హరించేదే ఆత్మయని గ్రహించు కొనుము..

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శ రీ ర, ఇంద్రి యాలు దేని నాశ్ర యించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే  , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్ర లో శ రీ  రే౦ ద్రి యాల సంబంధ మూ లేక గాడ నిద్ర పోయి, మేలోన్న తర్వాత 'నేను సుఖి నిద్ర పోతిని, సుఖింగావుంది ' అనుకోనునది యే  ఆత్మ.

దిపము గాజుబుడ్డి వుండి ఆ గాజును, ప్రకాశిం పజే  యునటులే ఆత్మ కూడా దేహంద్రి యాలను ప్రకాశింప చేయుచున్నది . ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్ట ముగుచున్నారు. అట్టి విశేష  ప్రేమాస్పద మగు వస్తు వేదో అది యే ' పరమాత్మ' యని గ్రహింపుము. ' తత్వమసి ' మొద లైన వాక్య ము లంద లి ' త్వం' అను పద మునుకు కించిత్ జ్ఞాత్వాది శాశిష్ట మైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము " తత్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞ త్వాది ధర్మములను విదిలి వేయగా సచ్చిదానంద రూప మొక్కటియే నిలుచును. అదియే " ఆత్మ దేహ లక్షణము - లుండుట - జన్మించుట-పెరుగుట- క్షీ ణి౦చుట- చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞా నానంద స్వరూపమే పూర్ణ త్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించాబడి యున్నదో అదియే " ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసిన దే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహంత ర్యామి యగు జీవాత్మ పరమత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలమను భవింప జేసేవాడు పరమేశ్వరుడ నియు, జీవులా కర్మ ఫలమను భావింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై  గురుశు శ్రూష నొనర్చి సంసార సంబంధ మగు ఆశలన్ని విడచి విముక్తి నొంద వలయును. మంచి పనులు తలచిన చిట్టా శుద్దియు, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మ నుష్ట నము చేయ వలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు- అని అంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్ల నెను.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

సప్త ద శా ధ్యాయము- పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.


                                       18 వ అధ్యాయము


స త్క ర్మ నుష్టా న ఫల ప్రభావము

" ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టి దో విశ దీకరింపు"డని ప్రార్ధించెను.

" ఓ ధనలోభా! ణి వాడడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు." అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను.

ఓ ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత డని నాచరించ వలెను? ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి?  విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు'డని కోరెను. అందులకు అంగీ రసుడి టుల చెప్పెను.

" ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి' శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ' అనియు, ఏ వ్రతమునకు, చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన,  దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని  కాన,  ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను".

తొల్లి కృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును, కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి యుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు తెలియ నివాని వలె మంద హాసముతో నిట్లనెను." నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్క ర్మా నుష్టా నములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి కదా? ' అని కుశల ప్రశ్న లడిగెను. అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ నమస్కరించి " ఓ దేవా! ఈ జగంబున ని  వేరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తు లగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడ దనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తి గాక మునుపే  మధ్యలో మని వేయుచున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి  రక్షింపు'మని ప్రార్ధించెను. జగన్నా టక సూత్ర ధారు డ యిన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా తిరుగు  చుండెను. ప్రపంచ మంటను తన దయా వ లోకమున వీక్షించి రక్షించు చున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను. పుణ్య నదులు, పుణ్య శ్రమములు తిరుగు చుండెను. ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యె గ తాళి చేయు చుండిరి. కొందరు " యీ ముసలి వానితో మనకేమి పని" యని

ఊరకు౦డిరి కొందరు గర్విష్టులైరి మరి కొందరు కమార్తులై శ్రీ హరిణి కన్నేతి యైనను చుడకుండిరి. విరందిరిని భక్త వత్స లుడగు శ్రీ హరి గాంచి " విరి నేతలు తరింప జెతునా? " యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణా రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ద్యలం కార యుతుడై నిజ రూపమును ధరించి, లక్ష్మి దేవితో డను, భక్తులతో డను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్య మునకు వెడలెను. ఆ వనమందు తపస్తు చేసుకోను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరు దెం చిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీ మన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మి నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!

విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!

వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం

దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం

త్వాం త్రైలోక్య  కుటుంబిని౦ శర సిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

అష్టా ద శా ధ్యాయము- పద్దె నిమిదో రోజు పారాయణము సమాప్తం.

                              19 వ అధ్యాయము


చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ

ఈ విధముగా నైమిశా రణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీన బాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రా దులచే సర్వదా పూజింప బడు వాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రు లచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడ వని సర్వ జనుల చే స్తుతింప బడుచున్న ఓ మాధవా! నికివే మా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధార భూ తుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వి కరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్ర ములైన వి. ఓ ద యామయా! మే మి సంసార బంద ము నుండి బైట పడలే కుంటి మి, మమ్ముద్ద రింపుము. మాన వు డెన్నిపురాణములు చ ది వినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనము బడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధ రా! హృ షికే శా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీ సోత్ర వచనమునకు నే నెంత యు సంత సించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞాన సిద్దుడు " ప్రద్యు మ్నా! నేనీ సంసార సాగర ము నుండి విముక్తు డను కాలేక శ్లేష్మమున పడిన యీగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యాన ముండుట నటుల అనుగ్ర హింపుము. మరే ది యు నాక క్కర లేదు " అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు " ఓ జ్ఞాన సిద్దుడా! నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చితిని. అది యునుగాక, మరొక వారము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోక మందు అనేక మంది దురాచారులై, బుద్ది హీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించు చున్నాను. అ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును. సావ ధానుడ వై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశ మిరోజున లక్ష్మి దేవి సహితముగా పాల సముద్ర మున శేషశ య్య పై పవ ళిo తును.

తిరిగి కార్తీక మాసమున శుద్ద ద్వాద శి వరకు చాతుర్మా స్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రితికరము. ఈ వ్రాత ముచేయు వారాలకు సకల పాపములు నశించి, నా సన్నీధ కి వత్తురు. ఈ చాతుర్మా స్యములందు వ్రతములు చెయనివారు నరకకూపమును బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్య మును తెలిసియుండి యు, వ్రతము చేయనివారికి బ్రహ్మ హత్యా ది పాత కములు గలుగును. వ్రత ము చేసిన వారి కి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు భాధ లుండవు. దినికి నియమిత ముగా ఆషాడ శుద్ద దశమి మొదలు శాక ములును, శ్రవణ శుద్ద దశమి మొదలు పప్పుది నుసులను విసర్జిoచవలయును. నా యందు భక్తీ గలవారిని పరీక్షించుటకై నే నిట్లు నిద్రవ్యజమున శ యనింతును. ఇప్పుడు నీ వోసంగి న స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్త శ్రద్ద లతో పరించిన వారు నా సన్నీధ కి ని శ్చయముగా వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధంచి శ్రీమహాలక్ష్మితో గూడి పాలా సముద్రమును కేగి శే షపానుపు మీద పవ్వ ళిoచెను. వశిష్టుడు జనక మహారాజుతో " రాజా! ఈ విధ ముగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్దా మొదలగు మునులకు చాతుర్యస్య వ్రత మహత్యమును ఉపదే శించెను. ఈ వ్రత్తంత మును అంగీర సుడు ధనలో భనకు తెలియచే సెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భే దముల లేదు, అన్ని జాతులవరును చేయవచ్చును. శ్రీ మన్నారయునని ఉపదేశము ప్రకారము ముని పుంగ వులందరూ యీ చాతుర్యా స్యవ్ర తా మాచరించి దంన్యులై వైకుంఠ మున కరిగిరి.

ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిషి ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎకో న వింశో ధ్యాయము -

పందోమ్మి దో రోజు పారాయణము సమాప్తము.


                                 20 వ అధ్యాయము


పురంజయుడు దురాచారుడా గుట

జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయు" డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో " ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశ యందు బుట్టి నావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్ర ముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభ సంభ వా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధ న చేసిన ను, లేక దీ పదానము చేసిన ను గలుగు ఫలితము అపార ము. ఇందుకొక యితిహాసము వినుము. త్రే తాయుగా మును పురంజయుడ ను సూర్య వంశ పురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టభి షి క్తుడై న్యాయముగా రా జ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధ నాశ చేతును, రాజ్యాధి కార గర్వముచెతను జ్ఞాన హినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షి ణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభి యై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులను చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభో జ రాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గ ము వెంట వచ్చి అయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగర మును ది గ్భ౦ధముచేసి యుద్ద మునకు సిద్ద పడిరి.

అయో ధ్యా నగరమును ముట్ట డి ౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దు డై యుండెను. అయిన ను యెదుటి పక్ష ము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భితి చెందక శాస్త్ర సమన్విత మైన రాథ మెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దు డై - న వారి ని యెదు ర్కొన భేరి మ్రోగించి, సింహనాద ము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.

ఇట్లు స్కాంద పురాణాతర్గ త వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి వింశాద్యాయము-

ఇరవ య్యోరోజు పారాయణము సమాప్తము.

                                   21 వ అధ్యాయము


పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట

ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభో జాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో ను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల డీ కొనుచు హుంకరించు కొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వ వీరత్వ ములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించు కొనుచు, శంఖములను పురించు కొనుచు, ఉభయ సైన్యములును విజయ కంక్షులై పోరాడిరి. ఆ రణ భూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనా వస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల క ళే బరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వము జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానము పై వచ్చిరి. అటువంటి భయంకర మైన యుద్ద ము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభో జాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌ హిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడ కుండా తన గృహానికి పారి పోయెను. బలో పేతు లైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచార ముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీ వద్ద కు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇక నైననూ సన్మార్గుడ వయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లాన లేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందున నే యీ యుద్ద మును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటి కైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాదాన ములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రురాజులను యుద్ద ములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకల దేవి, నాహితో పదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తి కానక్ష త్రాముతో కూడిన పౌర్ణ మిగాన, స్నాన జపాది నిత్యకర్మ లాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధి ని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నర్చినచో నీకు పుత్ర సంత తి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధ ము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్త నుడ వై దుష్ట సహవాసము చేయుట చేతగదా నికి అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీ హరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చెయు" మని హితో పదేశము చేసెను.

శ్లో// అపవిత్ర: పవిత్ర వా నానావ స్దాన్ గ తో పివా

య: స్మరే తుడ రీ కాక్షం స బాహ్యా భంతర శుచి||

ఇట్లు స్కాంద పురనంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహాత్య మందలి

ఏక విశో ధ్యాయము- ఇరవ యెక్క టో రోజు పారాయణము సమాప్తము

                                     22 వ అధ్యాయము


పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట, మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీ మన్నా రాయణుని షోడ శో పచారములతో పూజించి, శ్రీ హరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నాన మాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడ గు ఒక వృద్ద బ్రాహ్మణుడు- మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపెంచి రాజా! విచారింపకుము నువ్వు వెంటనే చెల్లా చెదురై యున్న ని సైన్యము కూడా దిసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రు రాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రు రాజుల సైన్యములు నిలువలె కపోయినవి. అదియును గాక, శ్రీ మన్నా రాయణుడు పురం జయుని విజయానికి అన్ని విధములా సహాయ పడెను. అంతయు శ్రీ మన్నా రాయణుని మహిమయే గదా! ఆ యుద్దములో కా౦ భో జాది భూపాలురు ఓడిపోయి " పురం జయా రక్షింపుము. రక్షింపు" మని కేకలు వేయుచు పారిపోయిరి. పురం జయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీ మన్నా రాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రు భయము కలుగు తుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా " శ్రీ హరి" అని ప్రార్ధించి త్రాగగా అమృత మైనది గదా! శ్రీ హరి కటాక్షము వలన సూర్య చంద్రులు వున్నంత వరకును దృవుడు చిరంజీవి యే గదా! హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మము ధర్మముగా మారును. దైవను గ్రహము లేని వారికి ధర్మమే ఆ ధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మసమంతయు నది స్నాన మొనరించి దేవాలయంలో జ్యోతియిన్ వెలిగించి దీపారదానా చేసినచో సర్వ విపత్తులును పటా పంచలగును. అన్ని సౌఖ్యములు సమ కూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత మాచరించు వారికి యే జాతి వారి కైనా పుణ్యము సమానమే బ్రాహ్మణా జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్య మైనచో శూద్ర కులముతో సమన మగును. వేదా ద్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతా నుష్టన తత్పరుడైన వైష్ణ వోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ౦డును. సంసార సాగాల ముత్తరించుటకు దైవ భక్తి యే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణ నాతితము వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహా ఋషులు - మరెందరో రాజా ధి రాజులూ కూడా విష్ణు భక్తి చె ముక్తి నొందిరి. శ్రీ హరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడు చుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచించ్చి యైనను మరి యొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించ వచ్చును. శ్రీ హరి -భక్తులు అన్యోన్య సంబందికులు అందు వలన లోక పోషకుడు, భక్త రక్షకుడైన అది నారాయణుడు తన భక్తులకు సదా సంపద ల నొసంగి కాపాడుచుండెను.

శ్రీ మన్నా రాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, విరజక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షి యంది డుకొని కాపాడు చున్న అది నారాయణుడు అటువంటి శ్రీ మహా విష్ణువునకు అతి ప్రియమైన కార్తిక మాస వ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీ మహా విష్ణువు లక్ష్మి సమేతుడై వెలయ గలడు. ఆ యిట్లు సిరి సంపదలతో కల కలలాడును. కార్తిక మాసములో శుచియై పురాణ ప టనము చేసినచో పితృ దేవతలు సంతసించెను. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ద్వా వి౦ శో ధ్యాయము- ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము

సీ|| ఎవ్వరి గరుణి ౦ ప నిచ్ఛ యించితి వాని యఖిల విత్తంబు నే సప హరింతు

సంసార గురు మద స్తబ్ధుడై యెవ్వడు దెగడి లోకము నున్న ధిక్కరించు

నత డెల్ల కలంబు నఖిల యో నుల యందు బుట్టుచు దుర్గతి బొందు బిద ప

విత్త వ యో రూప విద్య బలై శ్వర్య కర్మ జన్మ౦బుల గర్వ ముడిగి

గీ|| యేక విధమున విమలు డై యెవ్వడుండు వాడు నాకూర్చి రక్షింప వలయు వాడు స్తంభ లోకాభి మాన సంసార విభవ మత్తుడైన చెడ నొల్లడు మత్పరుండు

                                  23 వ అధ్యాయము


శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట

అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి- కు౦భ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము, శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత, భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధ రు డై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు, సదాచార సత్పు రుషులలో వుత్త ము డై రాణించుచుండెను. అయిన ను తనకు తృప్తి లో దు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా? యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు. నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీ వీ సంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు" అని పలికెను. అంతటా పురంజయుడు అ యశిరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వార ముగా బయలుదేరి మార్గ మద్య మున నున్న పుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జే రుకొనెను. అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శే షశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి, " దామోద రా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషి కేశా! ద్రోపది మాన సంరక్ష కా! ధీ న జన భక్త పొ షా ! ప్రహ్లా ద వ ర దా! గరుడ ధ్వజా ! క రి వ ర దా! పాహిమాం! పాహమాం! రక్ష మాం రక్ష మాం! దాసోహం పర మాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్ర మును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పిత దుపరి సపరి వారు ముగా అయోధ్య కు బయలు దేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులంద రూ సిరి సంపదలతో , పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయో ధ్యానగరము దృఢ తర ప్రకార ములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరు లై, రాజనీ తి గలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలు రై, అప్రమత్తు లై యుండిరి. ఆ నగర మందలి అంగ నామణులు హంసగ జగామినులూ, పద్మ పత్రా యత లోచ నులూ నై విపుల శో ణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీ లవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగర మందలి వెల యాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారద లై, ప్రాఢ లై, వ యోగుణ రూప లావణ్య సంపన్న లై, సదా మోహన హసాలంకృత ముఖిశో భి త లై యుండిరి. ఆ పట్ట ణకులాంగ నలు పతిశు శ్రూషా పారాయణలై సద్గు ణాలంకార భూషిత లై చిద్వి లాస హసోల్లాస పులకాంకిత శరీర లై యుండిరి.పురంజయుడు శ్రీ రంగ క్షాత్ర మున కార్తిక మాసవ్రత మాచరించి సతీ సమేతు డై యింటి కి సుఖిముగా జే రేను. పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాద్య తుర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత: పురమును ప్రవేశ పెట్టిరి. అతడు ధర్మా భి లాషి యై దైవ భక్తి పరాయుణుడై రాజ్యపాలన మొన ర్చుచు, కొంత కాలము గడిపి వృద్దా ప్యము వచ్చుటచే ఐహిక వాంఛ లను వాదులు కొని, తన కుమారునికి రాజ్య భారము వప్పిగించి పట్టాభి షీకూ నిచేసి తను వాన ప్ర స్థా శ్రమ మందు కూడా యే టే టా విధి విధాన ముగ కార్తీక వ్రత మాచరించుచు క మక్ర మముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠ మునుకు పోయెను. కావున, ఓ యగ స్త్యా! కార్తీక వ్రతము అత్యంత ఫల ప్రద మైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించ వలను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.

ఇట్లు స్కంద పురాణాoతర్గ త వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి

త్ర యోవింశో ద్యాయము - ఇర వైమూడో రోజు పారాయణము సమాప్తము


                                 24 వ అధ్యాయము


అంబ రిషుని ద్వాదశి వ్రతము

అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివి చా రించిన నూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు వివరింతును. అలకింపుము. " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన ౦దు వలన ను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానా దు లోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీ మన్నారయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దన ధర్మములు చేయు వారికీ ని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన స త్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యె కాదశి రోజున వ్రతమూ చేయక శు ష్కో ప వాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింప వలయును. దీని కొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పు చున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కాలదు. అతడు పరమ భగవ తోత్తముడు ద్వాదశి వ్రాత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయు చుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయ దలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోప స్వభావు డగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయ వలయు ను గాన, తొందరగా స్నానమున కై రమ్మన మని కోరెను. దుర్వాసుడ ౦దు ల క౦గీ కరించి సమీపమున గల నదికి స్నానమున కై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచి యున్న నూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు నుకొనెను. " ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని . ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణు న కతిధ్య మిత్తునని మాట యిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పొవూ. వ్రాత భంగమగును. ఈ ముని మహా కోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకే మియు తోచ కున్నది. బ్రాహ్మణా భోజన మతిక్రమిం చ రాదు. ద్వాదశి ఘడియలు మించిపో కూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తి ని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును. అదియు గాక, యీ నియమమును నెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మ యందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయ శ్చితము లేదు.

" అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయము లేదు. ఆ భయము ను శ్రీ మహా విష్ణువే బో గట్ట గలదు. కావున నెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిన ను పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వ జ్ఞు లైన కొందరు పంతితులను రావించి వారితో యిట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యే కాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలో నే భుజించ వలసి యున్నది. ఇంతలో నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధుల కాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంట వరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక, వ్రత భ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండ వలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన"దాని కోరెను. అంతట యా ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి " మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కు హరములందు జట రాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్వి ధాన్నమును పచనముగా వించి దేహే౦ద్రి యలకు శక్తి నొసంగు చున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జట రాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షు ద్భా ధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్ని దేవుడు, దేవత లందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆ యగ్ని దేవునందరు సదా పూజింప వలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కదా జాతి వాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు. అందులో నూ వేద వేదాంగ విద్య విశార దుడును, మహత పశ్శలియు, సదా చార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునిని భోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసు నంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాద పరచిరి.

ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి

చతుర్వి ౦ శో ధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

                               25 వ అధ్యాయము


దుర్వాసుడు అంబరి షుని శ పించుట

" అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి. అంత అంబరీ షుడు " ఓ పండి తో త్త ములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాద శీ నిష్ట ను విడ చుట కన్న, విప్రశాపము అధీక మయిన ది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు. ద్వాద శిని విడ చుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపాన ము నోనరించెను. అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారు డై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భో జనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంత టి ధర్మ పరి త్యాగి వి? అతి ధి కి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును. అట్టి అధ ముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజన మునకు బదులు జలపానము చే సితివి. అది భో జనముతో సమాన మైన దే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీ వు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహిం పడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే. నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు. నీ వు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడ వై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమాన పరచి నిర్ల క్ష్యముగా జలపాన మొన రించితివి. అబరి షా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కో పముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరిషుడు, మునికో పమున కు గడ గడ వణుకుచు, ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మ హీనుడ ను, నా య జ్ఞాన ముచే నే నీ కార్యము చే సితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము. మీరు త పోధ నులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు" డ ని అత ని పాద ములపై పడెను. దయాశూన్య డైన దూర్వసుడు అంబరి షుని తలను తన యెడమ కాలితో తన్ని"దోషికీ శాపమీయకుండా వుండ రా దు. నీ వు మొదటి జన్మలో చే పగాను, రెండవ జన్మలో తాబే లుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైద వ జన్మలో వామనుడు గాను,

ఆరోవ జన్మలో క్రూరుడ వగు బ్రాహణుడ వుగాను, యేడవ జన్మలో ముధుడ వైన రాజుగాను యెనిమిద వ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మత స్తు నిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయ లేని బ్రాహణుడ వుగాను పుట్టె ద వుగాక " అని వెనుక ముందు లాలో చించక శపించెను. ఇంక ను కోపము తగ్గ నందున మరల శ పించుటకు ఉద్యుక్త డ గుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణు శాపము వృధా కాకూడ దని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను. కాని దూర్వసుడింక నూ కోపము పెంచుకొని శపించు బో గా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయు నని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగి డేను. మహాతే జుస్సుతో చక్రాయుధ ము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడ మని భూ లో కమున ఉన్న మహామునులను, దేవలో కమున కరిగి దే వేంద్రుని, బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

పంచ వింశో ధ్యాయము - ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్పము

                                 26 వ అధ్యాయము


దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ

ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కో పమువల్ల కలిగిన ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను. ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము, సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము. నీ భక్తు డైన అంబరీ షున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడా ను గాను. ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు . బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పైత నిన్న ను సహించితివి. అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దలమందున్నది. ప్రశాంత మన స్యుడ వై అత నిని రక్షించినట్లే కో పముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీ హరి! నీ చక్రాయుధ ము నన్ను జమ్పవచ్చుచున్న" దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధ మూలా ప్రార్దించెను. ఆవి ధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి " దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు. నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు. నీ వు బ్రాహ్మణ రూపమున బుట్టి న రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగ ముందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి. నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధ ములు దూషించితివి. నీ యెడమ పాద ముతో తన్నితివి. అత ని యింటికి నీవు అతిధి వైవచ్చికుడ, నేను వేళకు రానియెడల ద్వాద శి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీ షున కు చెప్పా వైతివి. అతడు వ్రత భంగ మును కు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జే సెను. అంత కంటే అతడు అ పరాధ ము యేమి చె సెను! చాతుర్వర్ణ ములవారికి భోజన నిషిద్ద ది న ములందు కూడా జలపానము దాహశాంతికి ని, పవిత్ర త కును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్ర మున నాభక్తు ని దూషించి శపించితివి.

అతడు వ్రత భంగ మునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నువ మానించుటకు చేయాలేదె? నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచే య జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేను పుడు రాజ హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదున ని పలికిన వాడి ని నే నే. అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తానూ తెలుసుకోనె స్దితిలో లేదు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీ షుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిర పరా ధి, దయాశాలి, ధర్మత త్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అత నిని నిష్కరణ ముగా శపించితివి. విచారించ వలదు. ఆ శాపమును లో కో పకారమున కై నేనె అనుభ వింతును . అదెటులనిన నీ శాపములో నిది మొదటి జన్మ మత్స్యజన్మ . నే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడ ను రాక్ష సుని జంపుటకు మత్స్య రూపమెత్తు దును. మరి కొంత కాలమున కు దేవ దానవులు క్షి ర సాగర మును మదుంచుటకు మందర పర్వత మును కవ్వముగా చే యుదురు. అ పర్వత మును నీ టి లో మునగ కుండ కూర్మ రూపమున నా విపున మోయుదును. వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మ మెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గ మునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గ మును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళ లో కమునకు త్రొక్కి వేతును. భూ భార మును తగ్గి౦తున. లో క కంటకు ఢ యిన రావణుని జంపి లో కో పకారము చేయుటకు ర ఘువంశమున రాముడ నై జన్మింతును. పిద ప, యదువంశమున శ్రీ కృష్ణు నిగను, కలియుగ మున బుద్దుడుగను , కలియుగాంత మున విష్ణు చి త్తుఢ ను విప్రునియింట " కల్కి" యన పేరున జన్మించి, అ శ్వారూ డు౦డ నై పరి భ్ర మించుచు బ్రహ్మ దేషుల నందరను ముట్టు బెట్టుదును. నీవు అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును. ఇట్లు నా ద శవ తార ములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజే సి వైకుంఠ ప్రాప్తి నో సంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి

ష డ్వి౦ శో ధ్యాయము- ఇరవ య్యా రో రోజు పారాయణము సమాప్తము.

                                     27 వ అధ్యాయము


దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రి మహా ముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేర దీసి యింకను ఇట్లు చెప్పెను. "ఓ దుర్వాస మని! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమై నవే. నేను అవతారము లె త్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను గాన, అందులకు నే నంగి కరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యిం ట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరిఒ వృ తుడై ప్రాయో పవేశ మొనర్ప నెంచినాడు. ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింప బూనెను. ప్రజా రాక్షనమే రాజా ధర్మముగాని, ప్రజా పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింప వలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధను ర్బా ణములు ధరించి ముష్క రుడై యుద్ద మునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించా కూడదు. బ్రాహ్మణా యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించు వాడును హింసింప చేయు వాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయ శాస్త్రములు ఘోషించు చున్నవి. బ్రాహ్మణుని సిగ బట్టి లాగిన వాడును, కలోతో తన్నిన వాడును, విపర ద్రవ్యమును హరించు వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విపర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మ హ౦ తుకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడు ని గురించి - తప శ్శాలియు, విప్రోత్త ముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందు చున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడ నా యితినే- యని పరితాపము పొందు చున్నాడు కా బట్టి, నీవు వేగమే అబరిషుని కడ కేగుము అందు వలన నీవు భయులకు శాంతి లభించును" అని విష్ణువు దుర్వసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి

సప్త వి ౦ శో ధ్యాయము- ఇరవ య్యే డవ రోజు పారాయణము సమాప్తము.

                               28 వ అధ్యాయము


విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటి వా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను, వెనుక ముందు లాలో చింపక మహాభక్తుని శుద్ధ ని శంకించినాడు కనుక నే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీ షుని కడ కేగి " అంబరీ షా, ధర్మ పాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నా పైగల అనురాగముతో ద్వాద శి పారాయణ మునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజే సి వ్రత భంగ ము చే యించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టి తిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. నేను విష్ణువు కడ కేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦ చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగ మని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి త పశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా, అంబరీ షుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీ కి వే నా మన: పూర్వక వందనములు. ఈ దూర్వా సమహాముని తెలిసియో, తెలియక యో తొందర పాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను. అయిన ను యీత డు బ్రాహ్మణుడు గాన, ఈత నిని చంపవలదు, ఒక వేళ నీ కర్త వ్యమును నిర్వహిం పతలచితి వేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో , అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు. అందువలన నే యీ దుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు, నీ శక్తి కి యే విధ మైన అడ్డునూలేదు. ఈ విషయము లో క మంతటికి తెలియును. అయిన ను ముని పుంగ వునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను. నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీ షుని ప్రార్ద నలకు శాంతించి" ఓ భక్త గ్రే శ్వరా ! అంబరీ షా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లో క ములందు ధర్మమును స్దాపించుచుండును.

ఇది యెల్ల రకు తెలిసిన విషేయమే, ముక్కో పియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలన ని కన్ను లెర్ర జే సి నీ మీద జూపిన రౌద్ర మును నేను తిలకించితిని. నిర పరాధ వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచ వలెన నితరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాత పశ్శాలి. రుద్ర తే జము భులో క వాసుల నందరను చంపగలదుగాని, శక్తీ లో నా కంటె యెక్కువే మియుగాదు. సృషి కర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవ తియగు మహేశ్వరు ని తే జశ్శక్తి కంటెను యెక్కువ మైన శ్రీహరి తేజస్సు తో నిండియున్న నాతొ రుద్ర తే జస్సు గల దుర్వాసుడు గాని , క్ష త్రియ తే జస్సుగల నీవు గాని తులతూగరు. నన్నే దు ర్కొన జాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతు డై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్త మము. ఈ నీ తిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయిన ను తప్పించుకోన గలరు. ఇంత వరకు జరిగిన దంత యు వి స్మరించి, శరణార్ద మై వచ్చిన ఆ దుర్వాసుని గౌర వించి నీ ధర్మ ము నీవు నిర్వరింపు" మని చక్రా యుధ ము పలికెను. అంబరీ షుడా పలుకులాల కించి, " నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును, స్త్రీ లయందును, గౌరవము గలవాడ ను. నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేను నియే నా యభి లాష . కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైన నూ నీ శక్తీ కి, తేజస్సు కూ సాటి రావు. నీవు అట్టి తేజో రాశివి మహా విష్ణువు లోక నిందితుల పై, లో క కంటకుల పై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి, తనకుక్షి యుందున్న ప ధాలుగు లోక ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, ని కి వే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రా యుధ పు పాదముల పై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీ సి గాడాలింగన మొనర్చి " అంబరీ షా! నీ నిష్కళంక భక్తి కి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పరింతురో, యెవరు దాన దర్మములతో పుణ్య ఫలమును వృ ద్ది చే సుకొందురో, యెవరో పరులను హింసించక - పరధ నములను ఆశ పడక- పర స్త్రీ లను చెర బెట్టిక - గో హత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాత క ములు చేయకుందురో అట్టి వారి కష్ట ములు నశించి, యిహ మందున పర మందున సర్వ సాఖ్యములతో తులతూగుధురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాద శి వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్య ఫలము ముందు యీ మునిపుంగ వునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అత ని నాశీర్వదించి, అదృశ్యా మమ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి

అష్టా మి శో ధ్యాయము - ఇరవ య్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

                                29 వ అధ్యాయము


అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పార యణము అత్రి మహా ముని అగస్త్యు వారితో యీ విషముగా- సుదర్శన చక్రము అంబరీషునక భయ మిచ్చి వు భయులను రక్షించి, భక్త కోతికి దర్శన మిచ్చి అంతర్ధాన మైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువ నారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పదముల ఫై బడి దండ ప్రణామము లాచరించి, పదములని కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పై జల్లుకొని, " ఓ ముని శ్రేష్టా! నేను సంసార మార్గ మందున్న యొక సామాన్య గృహస్తుడను నా శక్తి కొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును, ద్వాదశి వ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మ వర్తనుడ నై రాజ్య మేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగ ముండుట చేతనే తమకు ఆతిథ్య మివ్వ వలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృ తార్దు ని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడ నైతిని. మీ రక వలన శ్రీ మహా విష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకరమును మరువ లేకున్నాను. మహానుభావా! నా మన స్సంతో షమచే మిమ్మెట్లు స్తుతింప వలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవ చేసినను యింకను ఋణ పది యుండును. కాన, ఓ పుణ్య పురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేతట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠుల యందును- ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడ నై యుండు నట్లును నన్నాశిర్విదించు " డని ప్రార్ధించి, సహా ప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదముల పై బడి ప్రార్ధించు చున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మ శాస్త్రములు తెలియ జేయు చున్నవి. నివు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడ వైనావు. నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షినము కలుగును.

అందు చేత నీకు నమస్కరించుట లేదు. నివు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యే కాదశి వ్రాత నిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభావిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్క యితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచ భక్ష్య పరమాన్నములతో సంతృప్తి గా విందార గంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది ఓ అగస్త్య మహాముని! ద్వాదశి వ్రత ప్రభావ మెంతటి మహాత్మ్యము గలదో గ్రహించి తివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీ ర సాగరమందున శేష శయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధ యే కదశి రోజున శు ష్కోపవసము౦ డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పాట పంటలై పోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానరయుణుకు ప్రీతీ కరమైన దినము కనుక ఆ నాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నాను. ఆ ఘడియలు దాటకుండ గానే భుజింప వలెను. ఎవరికైతే వైకుంట ములో స్థిర నివాస మేర్పరచు కొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయ వలెను. ఏ యొక్కటి యు విడువ కూడదు. శ్రీ హరికి ప్రీతీ కరమగు కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశ యింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినా యే కొంచము పుణ్య మైనను, అది అవ సాన కాలమున యమ దూతల పలు కానీ యాక కాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి

ఏ కోన త్రి ౦ శో ధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.


                                  30 వ అధ్యాయము


కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌని కాది మహా మునుల కందరకు సుత మహా ముని తెలియ జేసిన విశ్నుమహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళ కొని యాడిరి. శౌని కాది మునులకుక్ ఇంకను సంశయములు తిరనందున, సుతుని గాంచి" ఓ ముని తిలకమా! కలియుగ మందు ప్రజలు అరి షడ్వర్గ ములకు దాసులై, అత్యాచార పరులై జీవి౦ చు చు సంసార సాగరము తరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణో పాయమే దైన కలదా?ధర్మము లన్నిటిలో మోక్ష సాధనా కుప కరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలో నూ ముక్తి నొంసంగు వుత్తమ దైవ మెవరు?మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫల మిచ్చు కార్య మేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించు చున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు పాయమేమి? హరి నమ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశాయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియ జేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి" ఓ మును లారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి. కలియుగ మందలి మానవులు మంద బుద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లోనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చే కూరును. కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీ కరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటె ఘనమై నదని శ్రీ హరి వర్ణించి యున్నాడు. ఆ వ్రాత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టి కర్త యగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శత్య ము గాదు. అయినను సుక్ష్మ ముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించ వలసిన పద్దతులను జెప్పు చున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్న ప్పుడు శ్రీ హరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయ వలెను. దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింప వలెను. తన కున్న దానితో కొంచమైనా దీప దానం చెయ వలయును . ఈ నెల రోజులు విధవ వండిన పదార్థ ములు తిన కూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమున గాని ఆవు నేతిలో దీపారాధన చెయ వలెను. ప్రతి దినము సాయంకాలము పురాణ పటణము చెయ వలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అను భవింతురు. సూర్యుడు తుల రాశి యందున్న నెల రోజులు యీ విధముగా ఆచరించు వారు జీవన్ము క్తు లగుదురు. ఇట్లు ఆచరించు టకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించు వారలను జూచి యె గ తాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డు పడిన వారును ఇహ మందు అనేక కష్టముల పాల గుటయే గాక వారి జన్మాంత ర మందు నరకములో పడి యమ కింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియే గాక అట్టి వారు నూరు జన్మల వలకు ఛ౦ డా లాది హీన జన్మ లెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి, నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నాన మాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యిహమందు సర్వసుఖములను అనుభ వించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము వుత్త మెత్త మ మైనది. అధికఫలదాయక యైనది. హరి హరాదులకు ప్రితికర మైనది. కనుక కార్తీక మాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రత మాచరించ వలెన నెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ద పౌర్ణ మినాడు అయినను తమ శక్తీ కొలది వ్రత మాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసిన చొ యెప్పటి కినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైన ను బీదవాడైన ను మరెవ్వరైన ను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధ ములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథ ను చదివిన వారికి ని శ్రీ మన్నారాయుణుడు సక లైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి

త్రింశో ధ్యాయము - ముప్పదవ అఖిరి రోజు పారాయణము సమాప్తము

ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు

ఓం సర్వేషాం పూర్ణ౦ భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||