Monday, 7 October 2019

విజయ దశమి వాహన - ఆయుద పూజ విధి విధానం

విజయ దశమి తిధిలో వాహన - ఆయుధ పూజ - యంత్ర పూజ కొరకు ఉదయం శుభ సమయం లో ఆయుధ పూజ చేసుకొనుట శుభ సమయం ,

విజయ దశమి వాహన పూజ చేసుకొని విధానం :

Image result for వాహన పూజ

మొదట వాహనమున లేక ఆయుధం లేక యంత్రాముని జలముతో శుద్ధి చేసుకొని, పిదప పుణ్య జలముని కొద్దిగా వాటిపై జల్లి , అమ్మవారి కి పూజించిన సింధురం,కుంకం, గంధముతో బొట్టు పెట్టి మామిడి తోరణములతో అలంకరించి, ఆచారం బట్టి వాహనముకు బిష్మండ భళి లేదా టెంకాయ భళి లేదా నిమ్మకాయ భళి ( భళి అనగా మనం పూజించే వాటికీ 3 సార్లు చూపించి మద్యలో కోసి సింధూరం లేదా కుంకం తో బొట్టు పెట్టి హారతి చూపించడం అని అర్దము ) సమర్పించి ఒహ్ం శ్రీ మత్రేయ మహా : ఒహ్ం శ్రీ రాజ రాజేశ్వరి మాత శరణం ..ఒహ్ం శ్రీ దుర్గాయణ మహా : అని అమ్మవారిని మనస్సులో స్మరించుకొని నిమ్మకాయలను లేదా టెంకాయ లేదా తెల్ల గుమ్మడికాయ తో మీ వాహనముకి 3 సార్లు చూపించి వాటిని మద్యలో కోసి కుంకముతో మద్యలో బొట్లు పెట్టి హారతి సమర్పించి వాహనం ముందున చుపించావలెను.ఇలా చేసిన పూజ ముగిసిన పిదప భళి చేసిన వాటిని ఎవరు తొక్కకుండా ఏదైనా మొక్క మొదులన వెయ్యవలెను.

No comments:

Post a Comment