వివిధ రకముల ఏకాదశి వివరములు మరియు ఏకాదశి వ్రతవిధానం :
ఏకాదశి పండుగలు:
ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు
1.శుక్ల పక్షము ,
2. కృష్ణ పక్షము ...
పక్షానికొక ఏకాదశి చొప్పున ..
ఇరవైనాలుగు ఏకాదశి లుంటాయి .
ప్రతి నెలా ఆమావాస్య కి ,
పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
1.శుక్ల పక్షము ,
2. కృష్ణ పక్షము ...
పక్షానికొక ఏకాదశి చొప్పున ..
ఇరవైనాలుగు ఏకాదశి లుంటాయి .
ప్రతి నెలా ఆమావాస్య కి ,
పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే
ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
*ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని
" బహుళ ఏకాదశి " అంటారు
సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
" బహుళ ఏకాదశి " అంటారు
సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
మాసము/పక్షము/తిథి----- పర్వదినం
చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి..
చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి..
ప్రతి ఏకాదశి నిష్టగా శ్రీవారిని సేవించి తరించండి ..🙏🏻
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలోనున్నవి.
మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి
చైత్రము విష్ణువు కామదా వరూథినీ
వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా
జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ
ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా
శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా
భాద్రపదము-హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా
ఆశ్వయుజము-పద్మనాభుడు పాశాంకుశ రమా
కార్తీకము-దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి
మార్గశిరము-కేశవుడు ధృవ, మొక్షద సఫల
పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా
మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ
ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ
అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
చైత్రము విష్ణువు కామదా వరూథినీ
వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా
జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ
ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా
శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా
భాద్రపదము-హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా
ఆశ్వయుజము-పద్మనాభుడు పాశాంకుశ రమా
కార్తీకము-దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి
మార్గశిరము-కేశవుడు ధృవ, మొక్షద సఫల
పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా
మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ
ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ
అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం:
చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి
చంద్రుడు ప్రభావం మన దేహం పై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. గడ్డి కూడా ఓషధమే, దాన్ని వినియోగించుకొనే క్రమం తెలిస్తే. ఈ భూమి మీద అంకురించిన వాటిలో ఓషధిగా పనిచేయనిదంటూ ఏమీ లేదు అని నిరూపిస్తాడు నాగార్జునుడు అనే వైధ్యశాస్త్రంలో నైపుణ్యం కల ఒక మహనీయుడు. వాటి వల్ల మన శరీరం పెరుగుతూ ఉంటుంది. శరీరానికి అవసరం అయిన ఆయా ఓషధులని ఇచ్చే భూమికి ఆయా ఓషధులని పండించే శక్తిని చంద్రుడు ఇస్తాడు. వాటి వల్ల పెరిగే మన శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో అంగంపై చంద్రుడు ప్రభావితం చేస్తాడు. అంటే మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి ఇలా కొన్ని ఉన్నాయి. చంద్రుడు ఒక్కోక్కరోజు తన కళలను పెంచుకుంటూ పోతాడు పూర్ణిమ దాకా. ఆపై ఒక్కోక్కరోజు తన కళలను తగ్గించుకుంటూ పోతాడు అమావస్య దాకా. ఇక్కడ మనం చెప్పుకునేది గ్రహాల కదలిక వల్ల ఏర్పడే చంద్రుడి కాంతి గురించి కాదు. మనకు కనిపించని విషయాలను శాస్త్రాలు చెబుతాయి. పూర్ణిమ వరకు పెరిగే చంద్రుడు మొదటి పది రోజులు అంటే దశమి దాకా ఒక్కోనాడు ఒక్కో జ్ఞానేంద్రియంపై ఆపై ఒక్కోనాడు ఒక్కో కర్మేంద్రియంపై ప్రభావం చూపిస్తాడు. ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సుపై పదకొండోరోజు ప్రభావం చూపిస్తాడు. పదకొండునే ఏకాదశం అని అంటారు. పన్నెండో నాడు ద్వాదశి, ఆనాడు మనస్సుకు వెనకాతల ఉండి నిర్ణయాన్ని స్థిరపరిచే బుద్ధి మీద ప్రభావం చూపిస్తాడు. ఆ బుద్ధికి వెనకాతల అహంత మరియూ మూల ప్రకృతి అని రెండు తత్వాలు ఉన్నాయి, వాటిపై తరువాతి రెండు రోజులు ప్రభావితం చేస్తాడు. ఆపై ఉన్న తత్వం జీవుడు. పూర్ణిమనాడు కానీ అమావాస్య నాడు కానీ జీవుడిపై ప్రభావితం చూపిస్తాడు.
కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది."ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనల్ని ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లాన్ని బుద్ధి అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృజించాడు. లోని ప్రపంచం వైపు దృష్టి ఉంచడం కష్టమే, అయితే ఆయా ఇంద్రియాన్ని ఎంత వరకు వాడు కోవాలో తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇంద్రియాల్ని నియంత్రించేవే వాటి పైన ఉండే మనస్సు మరియూ బుద్ధి. ఈ శరీరంతో జీవుడి యాత్ర సుఖంగా సాగాలి అంటే మనస్సుని నిగ్రహంగా, బుద్ధిని స్థిరంగా ఉంచాల్సి ఉంటుంది. మనస్సు అనేది ప్రధానమైనది. మనకు మన పైన ఉండే ప్రవృత్తులకు మనస్సే మధ్య ఉండేది. మనస్సే కారణం మనం బాగుపడటానికి కానీ నాశనం అవడానికి కానీ. "మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః" అని మన ఇతిహాస పురాణలు చెప్పాయి. ఈ మనస్సును జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతావి జాగ్రత్తగానే జరుగుతాయి అని అంటారు. మనస్సుని వాడుకోవడం అనేది తెలియాలి. మనస్సుకి వెనకాతల ఉన్న బుద్ధికి భలం బాగుంటే మంచి నిర్ణయాలు జరుగుతాయి. బుద్ధి అంత బాగా లేకుంటే నిర్ణయాలు చెడిపోతాయి. అంటే ఈ రెంటిని ఎట్లా వాడుకోవాలో తెలుపడానికి పద్దతిని సూచించారు, అవే ఏకాదశి-ద్వాదశి.
మనస్సుకి భౌతికమైన చింతన తగ్గాలి, ప్రశాంతత కలగాలి. బుద్ధికి మాత్రం సాత్విక శక్తి పెరగాలి. పట్టుదల అనేది బుద్ధి లక్షణం కాబట్టి అది గట్టిగా ఉండాలి. మనస్సు అనేది జ్ఞానేంద్రియాల ద్వారా అందిన విషయాలవైపు ఎట్లా పడితే అట్లా వెళ్తుంది, దానికి బుద్ధి యొక్క ఆధారం అవసరం. మనస్సు అనేది నిర్ణయం తీసుకుంటే, బుద్ధి వెనకాతల భలపరుస్తుంది. తీసుకున్న నిర్ణయం సరియైనది కావాలంటే, మనస్సు యొక్క లక్షణమైన తమస్సుని తగ్గించాలి. మనం తీసుకొనే ఆహారం భూమినుండి వచ్చిందే. భూమికి తామస గుణం ఎక్కువపాల్లో ఉంటుంది. కనుక మన శరీరానికి ఇచ్చే ఆహారం తగ్గించాలి మనస్సు కోసం. నిర్ణయాన్ని భలపరిచే శక్తి బుద్ధిది కనుక దానికి సాత్విక శక్తి పెంచాలి. అది కూడా మనం తినే ఆహరం వల్ల పెంచాలి. ఏకాదశి నాడు ఆహారం తగ్గిస్తారు, ద్వాదశి నాడు తెల తెలవారే సమయాన్నే ఆహారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే మనస్సు మీద చంద్రుడు పనిచేసేది ఏకాదశి నాడు కనుక ఆహారాదులని ప్రక్కన బెడితే చంద్రుడు తన శక్తిని మనస్సుపై నేరుగా ప్రసరింపజేయగలడు. తమస్సు యొక్క ప్రభావం మనస్సుపై తగ్గుతుంది. వస్తువుల ఉత్పత్తి క్రమాన్ని తెలిపే శాస్త్రాలు మనస్సు అనేది సాత్వికాహంకారం నుండి వచ్చింది అని చెబుతాయి. అందుకనే ఏకాదశి నాడు చేయాల్సినవి ఆహారం తగ్గించడం, భగవన్నామాన్ని అనుసంధించుకోవడం మరియూ మిగతా ఇంద్రియాలని మేల్కొని ఉంచేట్టు చేయడం. ఇవి చేసి మనస్సుకు తామస గుణాన్ని తగ్గించడం అనేది నియమం. తరువాతి నాడు అంటే ద్వాదశినాడు, బుద్ధికోసం తెల తెల వారే సమయానికి అంటే సూర్య దర్శనం అవగానే ఆహారాన్ని అందించాలి. అది ప్రభావితం అవుతుంది. సత్వగుణం కలిగిన మనస్సుకి సత్వ గుణం కల బుద్ధి తోడైతే ఆలోచనలూ సరి అవుతాయి. నిర్ణయాలు సరి అవుతాయి, తద్వారా ఫలితాలు చెప్పనవసరం లేకుండానే మంచివవుతాయి. ఈ రెండు కలిపి ఒక్క వ్రతం అంటారు - ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణం. ఏకాదశి నాడు చేసే ఉపవాసాన్ని ద్వాదశినాడు సమాప్తం చేయడమే పారణం అని అంటారు. రెంటిని వేరు వేరుగా చేయడం కూడా ఫలితమే అని చెబుతారు. అయితే ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి, రెండు సార్లు చేయాలి అనేదే నియమం. సంస్కృతంలో ఒక విషయం చెప్పారు "ఏకాదస్యాం అహోరాత్రాం కర్తవ్యం భోజనత్రయం". మామూలు నాడు రెండు సార్లు భోజనం చేస్తాం, కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అంటే, మూడు సార్లు చేయాలని అర్థం అనుకునేరూ భో-జన-త్రయం అంటే మనుష్యులూ మీరు మూడు పనులు చేయాలి అని అర్థం. ఏమిటవి అంటే ఉపవాసం, హరి గుణ గానం మరియూ జాగరణం. ఈ మూడు కూడా ప్రేమతో చేయాలి. ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది, ప్రేమతో హరి గుణ గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసం అని అంటారు, నిరంతరం తలుస్తూ ఉంటే నిద్ర రాదు, దాన్నే జాగరణం అని అంటారు. ఇది ప్రతి ఏకాదశికి నియమమే.
No comments:
Post a Comment