Monday, 24 February 2020

పుత్ర గణపతి వ్రతం

పుత్ర గణపతి వ్రతం 



               ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి  గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది  గుమ్మానికి తోరణాలుకట్టి పూజామందిరాన్ని అలంకరించాలి.ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా యద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం శరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేన   దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ     పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః   కుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌  రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం  యోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా   రూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపం  కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం   తమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ :

శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో   గణేశ నామా చ భవస్య పుత్రః ।

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా    వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః   కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు  కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।

అగ్రేషు పూజాం లభతేన్యధాచ   వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః   సమం కాంచన కుంభ సంస్థెః ।

జలై స్తథా సావభిషిక్తగాత్రో   రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు   దేవాస్తం గణనాయకం ।

తుష్టువుః ప్రయతాః సర్వే  త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః - 9

శ్లో।। నమస్తే గజవక్త్రాయ  నమస్తే గణనాయక ।

వినాయక నమస్తేస్తు నమస్తే  చండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే   నమస్తే సర్పమేఖహో ।

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।  సర్వదేవ నమస్కారాదవిఘ్నం - కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ :

శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రా    నధనోపి ధనం లభేత్‌ ।

యం యమిచ్ఛేత్‌ మనసా    తం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదా    దేవైర్మహాత్మా గణనాయకః ।

అభిషిక్తస్య రుద్రస్య     సోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా  భక్త్యా గణపతిం నృప ।

ఆరాధయతి తస్యాశు తుష్యతే    నాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రం   యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।

నతస్య విఘ్న జాయన్తే    నపాపం సర్వథా నృప ।। 15


 

Thursday, 6 February 2020

గృహం లో సులభంగా పూజ చేసుకొనుట ఎలా ? సంకల్ప పూజ విధానం మరియు శ్లోకాలు :


గృహం లో సులభంగా పూజ చేసుకొనుట ఎలా ? 
సంకల్ప పూజ విధానం మరియు శ్లోకాలు :

శ్రీ మహాగణాధిపతయే నమః | శ్రీ గురుభ్యో నమః |  హరిః ఓం |
శుచిః : తలమీద నీళ్ళను జల్లుకోండి

సంకల్ప పూజ విధానం మరియు శ్లోకాలు :
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||
 Sri janayitri astrology

నమస్కారం చేస్తూ ఇవి చదవండి:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం,  అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
దేవీం వాచమ జనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి |
సానోమoద్రేష మూర్జ॒o దుహనా ధే॒నుర్వాగస్మాను పసుష్టు॒తైతు ||
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా,తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం ||
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ,విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽoఘ్రియుగం స్మరామి ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః,గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః,ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః |
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే,శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ||
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః | ఉమా మహేశ్వరాభ్యాం నమః |,వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః | శచీ పురందరాభ్యాం నమః |
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః | శ్రీ సీతారామాభ్యాం నమః |,మాతా పితృభ్యో నమః | సర్వేభ్యో మహాజనేభ్యో నమః |
ఆచమ్య :
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |  ఓం హరయే నమః  | ఓం శ్రీ కృష్ణాయ నమః |
దీపారాధనం:   దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః | సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ | యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు || పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||
భూతోచ్ఛాటనం :  అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః ,      ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |         యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |
ప్రాణాయామం : ప్రాణాయామం చేయండి
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
సంకల్పం : అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ (*1) నామ సంవత్సరే ___ అయనే(*2) ___ ఋతౌ (*3) ___ మాసే(*4) ___ పక్షే (*5) ___ తిథౌ (*6) ___ వాసరే (*7) ___ నక్షత్రే (*8) ___ యోగే (*9) ___ కరణ (*10) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (మమ ధర్మపత్నీ శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ _____ ఉద్దిశ్య శ్రీ _____ ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార* పూజాం కరిష్యే ||
(ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే |)  తదంగ కలశారాధనం కరిష్యే |
కలశారాధనం :
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | కలశే ఉదకం పూరయిత్వా | కలశస్యోపరి హస్తం నిధాయ |
కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొట్ట్లు పెట్టి, ఒక పువ్వు వేసి, చేయి వేసి ఇది చదవండి:
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః ,           మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ,              ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |    ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరి॑షిచ్యతే |  ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే |
ఆపోవా ఇదగ్‍ం సర్వ॒o విశ్వా భూ॒తాన్యాపః ప్రాణా వా ఆప: పశవ ఆపోఽన్న॒మాపోఽమృతమాపః
సమ్రాడాపో విరాడాప: స్వరాడాపశ్ఛందాగ్స్యాపో జ్యోతీగ్ ష్యాపోయజూగ్ ష్యాప: సత్యమాప:
సర్వా దేవతా ఆపో భూర్భువ: సువరాప ఓం ||
గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ  నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ  భాగీరథీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితాః ||
ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి, దేవతా ప్రతిమ, మీ మీద జల్లుకోండి:
ఆయాంతు శ్రీ ____ పూజార్థం మమ దురిత క్షయకారకాః  ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||
శంఖ పూజా :  శంఖం ఉంటేనే ఇది చేయండి
కలశోదకేన శంఖం పూరయిత్వా ||  శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం |             పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |                  శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |               పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |                      నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||
ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |                 ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖ దేవతాభ్యో నమః |
సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||
ఘంట పూజా
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా | ఘంటదేవతాభ్యో నమః | సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |
ఘంటనాదం : గంటకి బొట్టు పెట్టి, ఇది చదువుతూ గంట వాయించండి
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం | ఘణ్టారవం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంచనం ||
ఇతి ఘంటానాదం కృత్వా ||