Monday, 24 February 2020

పుత్ర గణపతి వ్రతం

పుత్ర గణపతి వ్రతం 



               ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి  గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది  గుమ్మానికి తోరణాలుకట్టి పూజామందిరాన్ని అలంకరించాలి.ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా యద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం శరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేన   దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ     పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః   కుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌  రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం  యోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా   రూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపం  కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం   తమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ :

శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో   గణేశ నామా చ భవస్య పుత్రః ।

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా    వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః   కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు  కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।

అగ్రేషు పూజాం లభతేన్యధాచ   వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః   సమం కాంచన కుంభ సంస్థెః ।

జలై స్తథా సావభిషిక్తగాత్రో   రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు   దేవాస్తం గణనాయకం ।

తుష్టువుః ప్రయతాః సర్వే  త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః - 9

శ్లో।। నమస్తే గజవక్త్రాయ  నమస్తే గణనాయక ।

వినాయక నమస్తేస్తు నమస్తే  చండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే   నమస్తే సర్పమేఖహో ।

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।  సర్వదేవ నమస్కారాదవిఘ్నం - కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ :

శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రా    నధనోపి ధనం లభేత్‌ ।

యం యమిచ్ఛేత్‌ మనసా    తం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదా    దేవైర్మహాత్మా గణనాయకః ।

అభిషిక్తస్య రుద్రస్య     సోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా  భక్త్యా గణపతిం నృప ।

ఆరాధయతి తస్యాశు తుష్యతే    నాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రం   యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।

నతస్య విఘ్న జాయన్తే    నపాపం సర్వథా నృప ।। 15


 

No comments:

Post a Comment