Monday, 25 June 2018

ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.

ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ
దేవాలయం.Image may contain: people standing, sky, outdoor and nature
హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో
ఉన్నట్టు ఇప్పటికే ఋజువులున్నాయి.ఎన్నో ఏళ్ల క్రితమే మన
హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలా ఫరిఢవిల్లింది.న
ాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వ వ్యాప్తం
చేశారు.మన సంప్రదాయాలు, శిల్ప కళా నైపు ణ్యం విదేశాల్లో
ఇప్పటికీ వేనోళ్ళపొగడ్తలందుకుంటూనే ఉంది.హిందూ
దేవాలయ సంప్రదా యం కేవలం మన భారతదేశంలోనే కాకుండా
అనేక దేశాల్లో కూడా వ్యాపించింది.
జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతం బాగా పరిఢవిల్లిం దనడం
అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ కంబోడియా లోని కొన్ని
వం దల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణూదేవు ని
ఆలయం ‘ఆంగ్కోర్ వాట్’. ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని
సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
హిందూ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించే
అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ
ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ
ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాల యం ఆ దేశ జాతీయ
పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి
కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత
కట్టడానికి అంకురా ర్పణ జరిగింది.
క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని
పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం
జరిగి నట్లు చరిత్ర చెబుతోంది.
దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ
దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి
వుంటాయి.
తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ
దేవాలయాల్లో కనిపిస్తాయి.
అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ
ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు
200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన
ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయం తో ఆహ్లాద భరితంగా
ఉంటుంది.మనదేశంలో కూడా లేదు..!భారతదేశంలో కూడా
ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన ఆర్కి టెక్చర్తో
ఈ దేవాలయాన్ని రూపొందించారు.
కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం
ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి
ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ
సంస్కృ తికి దగ్గరగా ఉంటాయి.అత్యత్భుత సాంకేతిక
నైపుణ్యం... ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ
చేసుకునేందుకు అద్భుత మైన టెక్నాలజీని ఉపయో గించారు.
ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట.
అదే టెక్నాలజీని ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. ఇది
అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అందర్నీఆశ్చర్యప
రుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటి న్నర మైలు వెడల్పు
తో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు)
నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.
ఈ రిజర్వాయర్లను వ్యవ సాయ అవసరాలకు కూడా ఉపయోగించే
వారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వా యర్లపై
పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు.
నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారం:
నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధ నలు జరిపిన
సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్అభిప్రా
యాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ
నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా
స్పష్టంగా కనిపించాయట అద్భుతమైన దృశ్యాలు ముఖద్వారం
నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో
అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది.
ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు
దర్శనమిస్తాయి.
ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక
గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా
చెప్పకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం
అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక
నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని
ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు...
ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి
పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించే వరకు అలాగే
ఉండిపోతారు కూడా.ఎటు చూసినా హిందూ పురాణాలే..!
కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు
ఎంతో చక్కగా మలచబడ్డాయి.
ఇక దక్షిణ మండపంలో ఆల యాన్ని నిర్మించిన రాజు రెండవ
సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల
దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు,
మునులు, కిన్నెర కింపురు షాధి అప్సరసల నాట్య
విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక
కళాఖండాలు ఆంగ్కోర్ వాట్ ఆలయ గోడలపై
సాక్షాత్కరిస్తాయి.
ఈ పేరెలా వచ్చిందంటే...ఇదంతా చదివిన తర్వాత భారతీయ
సంస్కృతి ఆనవాళ్లే లేని కంబోడియాలో ఇంతపెద్ద హిందూ
దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే
ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ
దేశం’ అని పిలిచేవారు.
సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు,
కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల
అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో
కంబోడియాగా మారిపోయింది.
కంబ ోడియా చరిత్ర...పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ
సంస్కృతే ఎక్కువగా ఉండేది.
9-15 శతా బ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ
సూర్యవర్మన్తో పాటు అనేకమంది హిందూ రాజులు
కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన
రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు
కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన
ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’
అనే రాకుమార్తెను వివాహం చేసుకుని
ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత
అయిన ‘కాము’తో భరత ఖం డానికి సంబంధాలున్నట్లు
తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతా బ్దాల అనంతరం
భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సం
స్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయా
లుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల
నుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాట్
దేవాలయం ఒకటి.మరో అద్భుతం ఆంగ్కోర్ థోమ్...ఆంగ్కోర్ వాట్
దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో
అద్భుత ప్రదేశం ఆంగ్కోర్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి
చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్ - 6 ఆంగ్కోర్ థోమ్ను
రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక
ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్ సిటీ’ great city అని కూడా
అంటారు.
9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం
జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు
దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది.
ఏను గుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్
లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత.
ఆంగ్కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్
టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయంలో
ఆంగ్కోర్ థోమ్కి ఆకర్షణీయంగానిలుస్తుంది.ఖ్మేర్ నాగరికత
తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ
చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా
హిందూ,బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.
జీవిత కాలంలోకనీసం ఒక్కసారైనా ఇంత పెద్ద విష్ణుమూర్తి
దేవాలయాన్నిదర్శించలనడం అతిశయోక్తి కాదు. ప్రకృతి
ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆంగ్కోర్ వాట్ వంటి
అద్భుత కళాసౌరభం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరకపోవడం
బాధాకరం.

త్రయంబకేశ్వరాలయము

త్రయంబకేశ్వరాలయము:---
త్రయంబకేశ్వరాలయము, గురించి మరికొంత సమాచారం. ప్రతి శివాలయమునoదు, లింగమునకు ఎదురుగా నoదీశ్వరుడుoట సర్వ సాధారణము. కాని ఇక్కడ లింగమునకు ఎదురుగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఆలయమునందు నందీశ్వరుడు ఉండుట చెప్పుకోదగ్గ విషయము.
కొందరి అభిప్రాయము ఏమనగా, శివుడు సర్వదా ధ్యానమునందు వుంటారు. నంది ఎదురుగా వుండి, తన ముక్కు పుటాలు ఈశ్వరుడు వైపుగా పెట్టుకొని వుంటారు. ఏలన నందివారు, -విడిచి – పీల్చు శ్వాశ, అనగా ఉచ్వాశ నిచ్వాశలు, (సోహం – అసోహం అని కూడా అంటారు) ధ్యానములో నున్న శివునకు ఊయలలాగా పనిచేస్తుoధట. గాలి పిల్చినపుడు-- ముందుకు, విడిచినపుడు-- వెనుకకు, ఊయలలో ఊగినట్లుగా నిరంతరము ధ్యానములో ఊగుతుoటారట. కాని దర్సనార్థము మనము వెళ్ళినపుడు, ఆయనతో మన విన్నపాలు చేసికొనుటకు, ఆయనను మనము ధ్యాన భంగము కావిoచవలె. అందువలన మనము ఆయన కోపానికి గురికావలసి వస్తుంది. అందుకని, ఊయలను క్షణము పాటు ఆపు ప్రయత్నమే, నంది గారి తోక భాగమున ఒక చేతితో స్వల్పముగా, క్రిందికి నొక్కి, ఎక్కడ ఎక్కువగా నొక్కిన శివ ధ్యాన భoగము అగునో అన్న భయముతో, వెంటనే ఇంకొక చేతితో కొమ్ములపైన చేయి వేసి, క్రిందికి నొక్కుతాము. అ ఒక్క క్షణము మాత్రము ఉయాల ఆగినపుడు, మహేశ్వరుడు ధ్యానము నుండి బయటకు వచ్చి, మనలను చూచి, మన విన్నపములు విoదురట.
గోదావరి అక్కడ పుట్టుటకు కుడా ఒక చరిత్ర వున్నది. పూర్వము ఆక్షేత్రమందు, తాపసులు, మునులు, మహర్షులు వారి వారి సతీమణుల తో పాటు వుండేవారట. ఒక మారు అక్కడ క్షామము ఏర్పడినధట, నీటికి చాలా కొరత ఎర్పడినదట. ఆ దుర్బర పరిస్థితిని గాంచిన గౌతమ మహర్షి, తన తపోమహిమచే ఒక సరస్సును సృష్టించినారట. అదిగాంచిన, అహల్యేతరులు, ఈర్శ్యతో, తమకు కూడా అటువంటి పేరు రావాలని, తమ తమ పతులతో, వారిని కూడా ఏదైనా చేయమని అర్తిoచినారట. పతుల పోరు భరించలేక, మునులు వినాయకుడి గురించి తపమాచరింప, గణేషుడు ప్రత్యక్షమై ఏమి కావాలని కోరగా, మాయ పూనిన మునులు, గౌతముడి ఆవును చనిపోవువిధముగా వరము ఇవ్వమని అర్థించినారట. ఆది పాపమని ఎంత చెప్పినా వినని మునుల పట్టుదలను ఆలకించిన వినాయకుడు, అట్లే నని వరమునోసoగినారట.
ఒకనాడు ఆకలి గొన్న ఆవు, పొలములో మేత మేయుచున్న దానిని కుశముతో అదలింప, దానికి గాయము కలిగి తదుపరి మరణిoచినదట. అంత ఆ మునులు, గౌతముడి తో ఆవు మరణము గోహత్యా పాతకమని, ఆపాపము నివారించుకోవాలని, సూచిoచి నారు. అంత, గౌతముండు శివుని గురించి కఠోరమైన, తపమాచరిoప, ఆయన, బ్రహ్మ,విష్ణు, ఆదిపరాశక్తి తో,కూడి ప్రత్యక్షము కాగా, గౌతముడు ఆయనతో గంగను ప్రవహింప చేసి గోహత్య పాతకమును ప్రక్షాళణము గావిoపుమని ప్రార్తించినారట. అంత ఆయన తన తలలో నున్న ఒక సిగను తీసి వేయగా, ఆది వెళ్లి బ్రహ్మ గిరి పై పడినధట. అంత, అచట గంగ ప్రవహిoచినదట. ఆనదికి గౌతమీ నదిగా పేరు వచ్చింది. అదియే ప్రస్తుత గోదావరి నది.
ఈవిధముగా ముమ్మూర్తులు అచట ప్రత్యక్షము అయినందున, వారు ముగ్గురు ఆచటి లింగము పానవట్టమున, మూడు తలలుగా, త్రయంభకముగా వెలసినట్లుగా కూడా చెపుతారు. ఈ ఆలయ ప్రాంగణమున అనేకముకములగు చిన్న చిన్న లింగాలు, ఆలయములు కలవు. ఈ దేవాలయములో పూర్వకాలమునకే స్వర్ణ కళశములు స్తాపించినారట. ఆకాలమునకే ఆకళశములకు అయిన ఖర్చు పదహారు లక్షల రూపాయలట.
పాండవులు నిర్మించిన కోనేరు: గర్భ గుడిలో కల శివలింగమునుండి నిరంతరము నీరు ప్రవహించి, కోనేటిలోనికి వచ్చి ప్రక్కన కల “కుశావర్తనo” అనే సరోవరమును చేరుతూoటుoది. కుశ అనగా దర్భ అని, వర్తo అనగా తీర్థం అని అర్థము. ఇచట 12 సoవత్సరములకు ఒకమారు “ సింహస్త కుంభ మేళ” జరుపుతారు. అనగా, రవి, చంద్ర, గురువు ముగ్గురు కూడ ఓకేసారి సింహ రాశిలో ప్రవేసించినపుడు ఇక్కడ మేళా జరుగును. ఆ మెళాకు హిమాలయలయముల నుండి ఋషులు, మునులు అఘోరాలు వచ్చి స్నానము ఆచరిoచెరదట. ఈ త్రయంబకం జ్యోతిర్లింగాలలో చాలా ముఖ్యమైనధట.
“త్రయంబకం యజామహే!
సుగంధిం పుష్టి వర్ధనం!
ఉర్వారుకమివ బంధనాత్
మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్”
అనగా సుగంధం వెదజల్లువాడును, అందరికి ఆహారం ఇచ్చి పోషించువాడును, త్రినేత్రుడు అయిన శ్రీ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. యే విధంగా అయితే దోసపండు. కాడ నుండి విడి వడిపోబడుతుందో –మనము మరణం యొక్క పట్టు నుండి విడి వడధాo గాక! అనగా ఆత్మ స్థితి నుండి విడివడక ఉందుముగాక. ఓం శాంతి ....ఓం శాంతి.....ఓం శాంతిహి!

నేపాల్ లో శ్రీ మహా విష్ణువు యొక్క దివ్య దేశం ముక్తినాథ్

నేపాల్ లో శ్రీ మహా విష్ణువు యొక్క దివ్య దేశం ముక్తినాథ్
ముక్తినాథ్
Image may contain: sky and outdoor
నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ముక్తినాథ్ హిందువులకు ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా(ఒక్కోసారి పొరపాటుగా దీనిని కుడా ముక్తినాథ్ అంటూ ఉంటారు) గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉన్నదని తరువాత బౌద్ధుల ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నరాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. టిబెట్ భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తున్నారు.
------------
ప్రధాన ఆలయం
-------------
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అల్లగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా శ్రీరంగం,శ్రీవైకుంఠం,తిరుమల,నైమిశారణ్యం,తోతాద్రి,పుష్కర్ మరియు బద్రీనాథ్. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తిలు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
శక్తి పీఠం
--------
భారతీయ సంస్కృతిలో హిందూమత పురాణలలో దక్షయఙం మరియు సతీదేవి దహనం గురించి విస్తారంగా ప్రస్తావించబడింది. సతీదేవి దేహత్యాగం పలు శక్తిపీఠాల స్థాపనకు దారితీసింది. శక్తి ఆరాధనకు ఈ శక్తిపీఠాలు తగినంత బలం చేకూరుస్తున్నాయి. పురాణాలలో దక్షయఙం గురించిన వివరణ విస్తారంగా కనిపిస్తుంది. శైవంలో ఇది అతిముఖ్యమైన సంఘటన. సతీదేవి దేహత్యాగం ఫలితంగా పార్వతీ జననం సంభవించింది. శివుడు గృహస్థుగా మారడం గణపతి మరియు సుబ్రహ్మణంలు ఆవిర్భవించడానికి దారితీసింది. శక్తి ఆరాధనకు శక్తిపీఠాలు మూలస్థానాలు. శక్తి పీఠాలు మహాశివుడు సతీదేవి దేహాన్ని భుజానవేసుకుని దుఃఖిస్తూ ఆర్యావర్తంలో సంచరించ సాగాడు. సమయంలో ఇంద్రాది దేవతలు బ్రహదేవుడితో కలిసి మహావిష్ణువును ఈ దిగ్భ్రాంతి నుండి మహాశివుని వెలుపలికి తీసుకురమ్మని వేడుకున్నారు.మహాశివుని ఆ దిగ్భ్రాంతి నుండి వెలుపలికి తీసుకురావడానికి సతీదేవి దేహన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసాడు. సతీదేవి దేహం పడిన ప్రదేశాలన్ని 51 శక్తిపీఠాలు అయ్యాయి. .
పురాణం
--------
టిబెట్ బుద్ధిజం స్థాపకుడైన పద్మసంభవ ( గురురింపోచ్) టిబెట్‌కు వెళ్ళే సమయంలో ఈ ప్రదేశానికి చేరుకుని ద్యానం చేసాడని బుద్ధసంప్రదాయకులు భవిస్తున్నారు. ఈ ఆలయాన్ని హిందూపురాణాలు కూడా పలుమార్లు ప్రస్థావించాయి. విష్ణుపురాణంలో గండకీ నదీ మహాత్యంలో ముక్తినాథ్ గురించి శ్లాఘించబడింది.
ముక్తినాథ్ నుండి ప్రవహిస్తున్న కాలిగండకి శిలామూర్తి లేక సాలిగ్రామశిలలకు ఆలవాలం. ప్రపంచంలో ఎక్కడ విష్ణాలయాలు నిర్మించాలన్నా ఈ శలిగ్రామశిలలు అత్యవసరం. హిందువుల అత్యంత పవిత్రక్షేత్రాలలో గండకీ నది ఒకటి అని భావించబడుతుంది. 108 జలప్రవాహాలు పలు హిందూ విశ్వాసాలకు ప్రాతిపదిక. హిందూ జ్యోతిషంలో రాశిచక్రంలో 12 స్థానాలు ఉంటాయి. అలాగే 9 గ్రహాలకూ అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రాశులను గ్రహాలతో గుణించినప్పుడు వచ్చే సంఖ్య 108. జ్యోతిషంలో నక్షత్రాల సంఖ్య 27, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. ఈ నక్షత్రాలను పాదాలతో లెక్కిస్తే వచ్చే సంఖ్య 108. దేవతల అష్టోత్త్స్రంలో నామాల సంఖ్య 108. ఇలా హిందూ సమాజంలో 108కి ఒక ప్రత్యేకత ఉంది.
శ్రీ మూర్తి మహత్యం
భూమిమీద పంచభూతాలు ఉపస్థితమై ఉన్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే. బౌద్ధ మరియు హిందూ సంప్రదాయకులు అగ్ని, జలం, ఆకాశం, భూమి మరియు వాయువు అనే పంచభూతాలను విశ్వసిస్తారు. ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధరూపాలలో దర్శనం ఇస్తుంటాయి. ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం ఉంది. నదితీరం అంతా సాలిగ్రామశిలలకు ఆలవాలమై ఉంది. ఆళ్వారులు ముక్తినాథ్ ఆయన్ని 108 దివ్యక్షేత్రాలలో ఒకటని శ్లాఘించారు. హిందువులు ముక్తినాథ్ ఆలయసందర్శన మహావిష్ణు తాయారు అమ్మల దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు.
. శ్రీ వైష్ణవ సంప్రదాయం
తిరుమంగై ఆళ్వార్ ముక్తినాథ్‌ను సందర్శించనప్పటికీ శ్రీమూర్తి సమీపప్రదేశాల గురించి తన పాటలద్వారా వర్ణించాడు. పెరియాళ్వార్ తన కీర్తనలలో శ్రిమూర్తిని సాలిగ్రామముడైయానంబి అని కీర్తించాడు. 2009లో జరిగిన మహాయఙం సందర్భంలో తమిళనాడులోని ముఖ్యమైన వైష్ణవవక్షేత్రాలలో ఒకటైన శ్రీవిల్లిపుత్తూరు పూజారి, శ్రీ మనవాళ మునిగళ్ మఠం , శ్రీ శ్రీ శ్రీ శఠగోప రామానుజ జీయర్‌లు ఆండాళ్ (గోదాదేవి), శ్రీరామానుజ మరియు మనవాళ మునిగళ్ విగ్రహాలను పురాతన వైష్ణవక్షేత్రమైన ముక్తినాథ్ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. ఇది పవిత్రమైన ముక్తినాథ్ చరిత్రలో ఒక మైలురాయి అని భక్తులు భావిస్తున్నారు. శ్రీవైష్ణవానికి చెందిన అనేకమంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శించారు. ఈ క్షేత్రంలో శ్రీపరాపధనాథ్ శ్రీ భూమి, నీలా మరియు గోదాదేవిలతో పర్యవేష్టితమై ఉన్నాడు. భౌద్ధులకు ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది. బౌద్ధులు కూడా ముకినాథ్‌లో ఉన్న శ్రీమన్నారయణ మూర్తిని మోక్షప్రదాతగా ఆరాధిస్తున్నారు. ఆలయం చుట్టూ నందిముఖాల నుండి వెలువడుతున్న పవిత్రజలాలు శ్రీరంగం,శ్రీవైకుంఠం మరియు తిరుమల వంటి 108 దివ్యక్షేత్రాల పుష్కరిణికి ప్రతీకలుగా భావిస్తున్నారు.
ప్రయాణ వసతులు
---------------
క్లిష్టమైన వాతావరణ పరిస్తితుల కారణంగా కాట్మండ్ నుండి పోక్రా లోని జాంసం విమానాశ్రయానికి ప్రయాణించి అక్కడి నుండి ట్రక్కులు మరియు జీబుల ద్వారా ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవచ్చు. పరిస్తితులు అనుకూలించినపుడు కొంతమంది భక్తులు హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించి 40 నిముషాలకు ముక్తినాథ్ చేరుకోవచ్చు. హెలికాఫ్టర్‌లో వచ్చేవారిని సిక్నెస్ కారణంగా ఎక్కువసేపు ఉండడానికి అనుమతించబడరు. మౌంటెన్ ఇలా చేస్తుంటారు. రాణిపురా, జాంకర్‌కాట్, చొంగర్, కాగ్‌బెనీ లేక జాంసంలలో యాత్రీకులకు బసచేయడానికి వసతిగృహాలు లభ్యమౌతాయి.
ఓం నమో నారాయణాయ

#7_ప్రశ్నలు_7_పొరబాట్లు_బుద్దుని_సవరణలు*



Image may contain: 1 person
*1. అతి పదునైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది?
శిష్యులు చాలా తెలివిగా ఖడ్గం అని బదులిచ్చారు.
బుద్దుడు ఈ విధంగా తెలిపారు., ఈ ప్రపంచంలోనే అతి పదునైనది మానవుని నాలుక. అతి చాలా సులువుగా ఇతరుల అనాలోచితంగా బాధించగలదు. అందుకే దానికి చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడవలెను.
2. ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా వున్నది ఏది?
కొంతమంది చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అంటూ చెప్పుకొచ్చారు. 
కాని అన్నిటికన్నా దూరంగా వున్నది గతం. కరిగిపోతున్న కాలం. 
మనం ఎవరిమైనప్పటికీ, ఎంత శక్తివంతులమైనా కూడా మనం కాల చక్రంలో ముందుకు పోవడమే తప్పించి వెనుకను మరలలేము కదా. అందుకే వర్తమానమును సమృద్దిగా, బుద్దిగా ఉపయోగించుకునేవాడు శ్రేష్ఠుడు.
3. ప్రపంచంలోనే అతి పెద్ద పదార్ధం ఏది?
పర్వతాలు, భూమి, సూర్యుడు అంటూ సమాధానం శిష్యుల నుంచి. 
బుద్దుని జవాబు: అతి పెద్ద పదార్ధం కామం(కోరిక) 
ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో వున్న అన్నింటికన్నా పెద్ద పరిమాణంలో వుంటాయి. వాటిలోనే మునిగి తేలుతూ.. అవి నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. కనుక అమిత ప్రభావం చూపే ఈ విషయాల పట్ల మితముగా వ్యవహరించుట మంచిది.
4. అత్యంత బలమైనది లేక బరువైనది ఏది?
శిష్యులు ఇనుము, ఏనుగు వంటి సమాధానాలు ఇచ్చారు. 
బుద్దుని సవరణ: ప్రపంచంలో బరువైనది, దృఢమైనది ప్రమాణం లేదా మాట. ఎవరికన్న చాలా సులువుగా ఇచ్చేయగలిగేది కాని నిలబెట్టుకోవడంలో కష్టతరమైనది.
5. మరి అత్యంత చులకన గలది? (తేలికగలది)
దుమ్ము, పత్తి, ఆకులు, గాలి అంటూ పలు సమాధానాలు వినిపించాయి శిష్యుల నుండి. 
కాని బుద్దుడు ఈ విధంగా శెలవిచ్చారు. 
అన్నటికన్నా తేలికైనది వినయం కాని చాలా మంది అది తమకి ఆపాదించుకోలేరు. తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహమును ఆభరణముగా చేసుకుంటారు. కాని అది ఎవరికి ప్రయోజనకారి కాదు కదా.. అది దహించు అగ్ని వంటిది.
6. మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు?
తల్లి దండ్రులు, స్నేహితులు, బంధువులు అంటూ సమాధానాలు వచ్చాయి శిష్యుల నుండి. 
కాని బుద్దుని సమాధానం ఇలా వుంటుంది.
అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు. ఎందుకంటే మరణం తధ్యమైనది. అది ఏ క్షణమైనా మనకు కలుగవచ్చు.
7. ఆఖరి ప్రశ్న!
ప్రపంచంలో అత్యంత సులువైన పని?
నిద్ర, భోజనం, మాటామంతీ చేయడం సులువైనవి కావొచ్చు గురువుగారు అన్నారు శిష్యులు. 
కాని బుద్దుడి సమాధానం ఏమిటంటే..
ఈ అమూల్యమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం కదా అన్నిటికన్న సులువైన పని. నలుగురిని మేల్కొలిపే ఈ సందేశాన్ని తెలుసుకున్న మీరు ఆ పని చేయకుండా వుండలేరని నాకు తెలుసు అన్నారు.

హిందూ ఆరాధ్య గ్రంధాలు వాటి వివరాలు,సమగ్ర సమాచారం :

హిందూ ఆరాధ్య గ్రంధాలు వాటి వివరాలు,సమగ్ర సమాచారం : 
Image result for హిందూ గ్రందాలు
సనాతన ధర్మం లో వేదాలు ,ఉపనిషత్తులు,రామాయణం ,భారతం ,భగవత్ గీత,పురాణాలు 18 గా వున్నాయి.ఇక 18 పురాణాలు వాటి వివరాలు చూస్తే,
శ్రీ మహా విష్ణువు యొక్క అంశం వల్ల జన్మించిన వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు,వేద విభాగం,బ్రహ్మ సూత్ర రచన,మహాభారత రచనలు చేసాడు.ఈ పురాణాలను రచించినది వ్యాసమహర్శే అయినా అవి లోకానికి తెలియచేసినవారు సూతమహాముని.ఆయన పురాణాలు చెబుతున్న సమయంలో వాటిని శ్రవణం చేసిన వారు మొదటగా శౌనక మహర్షి కాగా,మరో ఎనభై ఎనిమిది వేల మంది(88,000)ఋషులు మరియూ నైమిశారణ్య వాసులు.ఇక వాటి వివరాలను చూస్తే
శ్లో|| మద్వయం భద్వయంచైవ
బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత.||
భావం :
A)"మద్వయం" అనగా మకారం తో రెండు
1)మత్స్య పురాణం 2)మార్కండేయ పురాణం,
😎"భద్వయం"భ కారంతో రెండు
1)భాగవత 2)భవిష్యద్ పురాణం
C)"బ్రత్రయం" "బ్ర"కారం తో మూడు
1)బ్రహ్మ 2)బ్రహ్మ వైవర్త 3)బ్రహ్మాండ
D)"వచతుష్టయం":"వ" కారంతో నాలుగు.1)వాయు 2)వరాహ 3)వామన 4)విష్ణు పురాణం
E)అకారం తో అగ్నిపురాణం
F)నకారంతో నారద పురాణం
G)ప కారం తో పద్మ పురాణం
H)లింకారం తో లింగపురాణం
I)గకారంతో గరుడ పురాణం
J)కు కారం తో కూర్మ పురాణం
K)స్క కారం తో స్కాంద పురాణం గా రచించారు .
పురాణం యొక్క లక్షణం:
పురాణానికి ముఖ్యం గా ఐదు లక్షణాలు ఉంటాయి.
అవి a)సర్గ-అంటే ప్రపంచ సృష్టి
b)ప్రతి సర్గ-ప్రపంచ ప్రళయం
C)వంశం-రాజుల,ఋషుల,దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు-
అవతారాలు.
d)వంశానుచరితం-రాజ వంశాలలో,ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవిత చరిత్రలు e)మన్వంతరాలు- మనువులు,మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి,ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు,ఇలా ప్రతి పురాణం పంచలక్షణాలతో కూడి ఉంటుంది.ఇక ఒక్కో పురాణం గురించి చూస్తే
1)మత్స్య పురాణం:
దీనిలో మొత్తం 14,000/శ్లోకాలు వున్నాయి.ఇది ఈ అవతార మెత్తిన విష్ణువుచే మనువుకు చెప్పబడింది.
ఇందులో కార్తికేయ,యయాతి,సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు,ప్రయాగ,వారణాసి మొదలైన పుణ్యక్షేత్రాల మహత్యాలు చెప్పబడ్డాయి.ఈ పురాణాన్ని సప్తకల్పం లో మనువు కు చెప్పబడింది.
2)మార్కండేయ పురాణం
ఇందులో 9,000/శ్లోకాలు వున్నాయి.ఇది శ్వేతవరాహకల్పం లో మార్కండేయుడు జైమిని మహామునికి చెప్పబడింది.
ఇందులో,శివ విష్ణువుల మహత్యాలు,
ఇంద్ర,అగ్ని,సూర్యుల మహత్యాలు మరియూ సప్తశతి,చండీ హోమం,శత చండీ,సహస్ర చండీ హోమ విధానాలకు ఆధారమైనదే ఈ సప్తశతి.
3) భాగవత పురాణం
దీనిలో 18,000/శ్లోకాలు వున్నాయి.ఇది సారస్వత కల్పం లో విష్ణువు ద్వారా బ్రహ్మకు,తద్వారా వ్యాసునకు,తరువాత ఆయన కుమారుడైన శుకునకు,ఆయన వలన పరీక్షిత్ మహారాజునకు చెప్పబడింది ఇందులో 12 స్కందాలలోని మహావిష్ణు అవతారాలు,శ్రీ కృష్ణ జనన,లీలా చరితాలు వివరింపబడ్డాయి.
4)భవిష్య పురాణం
దీనిలో14,500/శ్లోకాలు వున్నాయి.దీనిని ఇద్దరు అఘోరకల్పంలో బ్రహ్మ ద్వారా మనువుకు, చెప్పబడింది.
దీనిలో సూర్యోపాసనా విధి,అగ్ని దేవతారాధన విధానం,వర్ణాశ్రమ ధర్మాలు,రాబోయేకాలం విశేషాలు ఇందులో చెప్పబడింది.
5)బ్రహ్మ పురాణం
దీనినే ఆది పురాణం లేక సూర్య పురాణం అంటారు.
దీనిని బ్రహ్మ కల్పం లో బ్రహ్మదేవుడు మరీచి మహామునికి బోధించాడు.
దీనిలో 10,000/శ్లోకాలు వున్నాయి.ఇందులో శ్రీకృష్ణ,కశ్యపుల చరిత్రల వర్ణనలు,వర్ణ ధర్మాలు,ధర్మాచరణలు,స్వర్గ-నరకాలను గురించి చెప్పబడింది.
6)బ్రహ్మాండ పురాణం
దీనిని భవిష్యకల్పం లో బ్రహ్మ మనువుకు బోధించాడు.
దీనిలో12,000/శ్లోకాలు వున్నాయి,ఇందులో రాధాదేవి,శ్రీకృష్ణుడు,పరశురామ,శ్రీ రామచంద్రుల చరిత్ర,శ్రీ లలిత,శివ కృష్ణ స్తోత్రాలు,గాంధర్వం,ఖగోళ శాస్త్రం,స్వర్గ నరకాల గురించి చెప్పబడింది.
7)బ్రహ్మ వైవర్త పురాణం
దీనిని రధంతర కల్పం లో సావర్ణి నారదుడికి బోధించాడు.దీనిలో 18,000/ శ్లోకాలు వున్నాయి.దీనిలో స్కాంద,గణేశ,రుద్ర,శ్రీ కృష్ణుల వైభవములు,సృష్టికర్త బ్రహ్మ,సృష్టికి కారణమైన భౌతిక జగత్తు,
దుర్గా,లక్ష్మీ,సరస్వతి,సావిత్రి,రాధ మొదలైన పంచశక్తుల ప్రభావం గురించి చెప్పబడింది.
8)వరాహ పురాణం
దీనిని మనుకల్పంలో విష్ణువు చే భూదేవి కి చెప్పబడింది.దీనిలో 24,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా కలదు,పరమేశ్వరీ పరమేశ్వరుల చరిత్రలు,ధర్మశాస్త్రము,వ్రతకల్పాలు,పుణ్య క్షేత్ర వర్ణనలు వున్నాయి.
9)వామన పురాణం
దీనిని కూర్మ కల్పంలో బ్రహ్మ దేవుడు పులస్త్య మహామునికి బోధించాడు.దీనిలో 10,000/శ్లోకాలు వున్నాయి.పులస్త్య ఋషి నారద మహర్షి కి మళ్ళీ బోధించడం జరిగింది.ఇందులో శివలింగ ఉపాసన,
శివపార్వతుల కళ్యాణం,శివగణేశ,కార్తికేయ చరిత్రలు,భూగోళం-ఋతు వర్ణనలు వివరించారు.
10) వాయు పురాణం
దీనిని శ్వేతా కల్పం లో శివుడి ద్వారా వాయువుకు చెప్పబడింది,దీనినే శివపురాణం అని కూడా పిలుస్తారు.దీనిలో 24,000/ శ్లోకాలు వున్నాయి,దీనిలో శివభగవానుని మహత్యము,కాలమానము,భూగోళం,సౌరమండల వర్ణనము చెప్పబడింది.
11)విష్ణు పురాణం
దీని వరాహ కల్పం లో పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు.దీనిలో 23,000/ శ్లోకాలు వున్నాయి,ఇందులో విష్ణు మహత్యము,
శ్రీకృష్ణ,ధ్రువ, ప్రహ్లాద,భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి.
12)అగ్నిపురాణం
దీనిని ఈశాన కల్పం లో అగ్నిభట్టారకుడు వసిష్ఠుడికి బోధించాడు,దీనిలో 15,400/శ్లోకాలు వున్నాయి.దీనిలో శివ,గణేశ,దుర్గా,భగవదుపాసన,వ్యాకరణం,ఛందస్సు,వైద్యం,లౌకిక ధర్మాలు,రాజకీయం, భూగోళ,ఖగోళ శాస్త్రాలు,
జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడ్డాయి.
13)నారద పురాణం
దీనిని బృహత్ కల్పం లో పూర్వ భాగాన్ని సనకాదులు నారదునికి భోధించగా,ఉత్తర భాగాన్ని వసిష్ఠుడు మాంధాత కు బోధించాడు.
దీనిలో25,000/శ్లోకాలు వున్నాయి,దీనిలో నారదుడు,సనక,సనందన, సనత్కుమార సనాతన అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పిన పురాణం.ఇది అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివ స్తోత్రము)చెప్పబడింది.ఇందులో వేదాంగములూ,
బదరీ,ప్రయాగ,వారణాసి క్షేత్ర వర్ణనలు చెప్పబడ్డాయి.
14)స్కాంద పురాణం:
దీనిని తత్పురుషకల్పం లో స్కందుడు(కుమారస్వామి) భూదేవి కి బోధించాడు.దీనిలో 81,000/శ్లోకాలు వున్నాయి.ఇందులో శివచరిత్ర వర్ణనలు,స్కందుని మహాత్యములు,ప్రదోష స్తోత్రములు,కాశీఖండము, కేదార ఖండము, రేవా ఖండము,మనము చాలా చూస్తుండే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇందులోనే చెప్పబడింది,
వైష్ణవ ఖండము( వేంకటాచల క్షేత్రము),
ఉత్కళ ఖండము(జగన్నాధ క్షేత్రము),
కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము),
బ్రహ్మ ఖండము(రామేశ్వర క్షేత్రము),
బ్రహ్మోత్తర ఖండము(గోకర్ణ క్షేత్రము,ప్రదోష పూజ),
అవంతికా ఖండము(క్షీప్రానదీ,మహాకాల మహత్యము)మొదలగునవి చెప్పబడ్డాయి.
15)లింగ పురాణం
దీనిని కల్పాంత కల్పం లో పరమశివుడు నారదునికి బోధించాడు.దీనిలో శివుని ఉపదేశాలు,లింగ రూప శివమహిమ,దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతాలు,ఖగోళ,భూగోళ,జ్యోతిష్య శాస్త్రాలు ఇందులో చెప్పబడ్డాయి.
16)గరుడ పురాణం
దీనిని గరుడ కల్పం లో విష్ణువుచే గరుత్మంతునికి బోధించడం జరిగింది.దీనిలో 19,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో మహావిష్ణు ఉపాసన,గరుత్మంతుని ఆవిర్భావ వివరణ,జనన మరణాలు,జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు,శిక్షలు మొదలైనవి చెప్పబడ్డాయి.
17)కూర్మ పురాణం
దీనిని లక్ష్మీ కల్పం లో విష్ణువు పౌలస్త్య ముని కి చెప్పబడింది.దీనిలో 17,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో వరాహ,నారసింహ అవతారాలు,లింగరూప శివారాధన,ఖగోళము,భూగోళంలో వారణాసి,ప్రయాగ క్షేత్ర వర్ణనలు చెప్పబడ్డాయి.
18)పద్మ పురాణం
జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం విన్నంత మాత్రాననే పోగొట్టగలిగేదే ఈ పద్మపురాణం.అన్ని పురాణాలలో కెల్లా అత్యధిక శ్లోకాలు గల పురాణం కూడా ఇదే.దీనిని పద్మ కల్పం లో బ్రహ్మ స్వాయంభువ మనువుకు బోధించడం జరిగింది.దీనిలో 85,000/శ్లోకాలు వున్నాయి.దీనిలో మధుకైటభ వధ,బ్రహ్మ సృష్టి కార్యము,గీతార్ధ సారం-పఠన మహత్యం,గంగా మహత్యం ,పద్మగంధి దివ్యగాథ,గాయత్రీ చరితము,రావి వృక్ష మహిమ,విభూతి మహత్యం, పూజా విధులు-విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో చెప్పబడింది.ఇవేకాక శివపురాణం,కార్తీక పురాణం,మాఘ పురాణం అని మరికొన్ని పురాణాలు కూడా ప్రసిద్ధి చెందాయి.
సశేషం

తమిళ నాడు రాష్ట్రం లోని ఈరోడ్ జిల్లాలో కొడుముడి పట్టణంలో ముఘ్దేశ్వర దేవాలయం

శ్రీ ముఘ్దేశ్వర దేవాలయం 🌼
ఈ దేవాలయం తమిళ నాడు రాష్ట్రం లోని ఈరోడ్ జిల్లాలో కొడుముడి పట్టణంలో వుంది.
సహజంగా ఎక్కడైనా బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులకు వేరువేరుగా దేవాలయాలు వుంటాయి.కానీ త్రిమూర్తులైన వీరు ముగ్గురూ ఒకేచోట కొలువై వున్న దేవాలయం ఈ కొడుముడి ముఘ్దేశ్వర దేవాలయం.
ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు.ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి,వాయు దేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారట.
ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయు దేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం అయిదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట.అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుముడిలో పడి శివలింగ రూపం దాల్చిందట.అదే ముఘ్దేశ్వర శివలింగం.
శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం,దేవ తీర్థం,బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.
💮 విష్ణు మూర్తి :-
ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు.పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాదు రాహు కేతువులకు కూడా పరిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.
Image may contain: sky and outdoor
💮బ్రహ్మ దేవుడు :-
ఇక బ్రహ్మ దేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం.వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాలనాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు.ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు. అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం.ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.
కావేరి నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మొత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉత్సవమూర్తులని రథంపై తిరువీధిలో తిప్పుతారు.నవగ్రహ పూజలకు,నవగ్రహ శాంతి హోమాలకి పేరుపొందిన ఈ ఆలయం నిజంగా చూడతగ్గది ...

సంగమేశ్వర ఆలయం-ఏడునదులు కలిసే ప్రదేశం-8 నెలలపాటు నీటిలో-4 నెలలు -దర్శనభాగ్యం

సంగమేశ్వర ఆలయం-ఏడునదులు కలిసే ప్రదేశం-8 నెలలపాటు నీటిలో-4 నెలలు -దర్శనభాగ్యం



ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం
జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ... నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.
Image may contain: sky, ocean, outdoor, water and nature
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.
అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.
ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.
ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.
కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

అనారోగ్య సమస్యల నివారణకు ఒడిషా కోణార్క్ సూర్య దేవాలయం ప్రాముక్యత :


ఒడిషా  కోణార్క్ సూర్య దేవాలయం  ప్రాముక్యత :
Image may contain: mountain, outdoor and nature
కోణార్క్ (Konark) భారతదేశములో పేరెన్నికగన్న సందర్శనా ప్రదేశములలో ఒకటి. ఈ క్షేత్రం ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి ఎనభై ఐదు (85) కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది.
సూర్యదేవాలయము
కోణార్కలో సముద్రతీరమున నిర్మించిన సూర్య దేవాలయము ఉంది. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.
స్థల పురాణం
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ విశేషాలు
గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I (క్రీ.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవన మనిఅందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంజన స్త్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. ఒడిషా లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం (పూరి), చక్రక్షేత్రం (భువనేశ్వరం), గదాక్షేత్రం (జాజ్ పూర్), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రంమైనది, ఇచ్చోటనే భక్త కబీరుదాసు సమాధి ఉండెనని అబుల్ఫజల్ యొక్క అయినీ అక్బరీ చెప్పుతోంది. దీనికి నల్ల పగోడా అనికూడా అంటారు.దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
మందిర వర్ణన
ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన రథం లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై ప్రపచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్నె ఇప్పుడు అంతగాలేవు. ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రథాలమందిరము. మందిరంధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైనసూర్యభగవానుడు. దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది. మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును. మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద "నాట్యమందిరం" నిర్మింపబడిఉన్నది. దీనిని కొందరు భొగమంటపమని, మరికొదరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు. అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈపువ్వులనే వాడేవారు.
ఈనాట్యమందిరం దగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడి ఉంది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు.
మొగసాలకు ఉతారంవైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉనాయి. అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు. ఏనుగు పొడవు 9 అడుగులు వెడల్పు 5 అడుగులు, ఎత్తు 9 అడుగులు. మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి. ఇప్పుడవిలేవు. వాటి వీరావేశం, ఉన్మత్తభావాలను చూస్తే దర్శకులు భయపడేవారుట. వీటి పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు.
కోణాల్కులోని పెద్దదేవాలయపు సమ్ముఖంలో అరుణస్తంభముండేది. దానిని మహారాష్ట్రులు పూరీకి తీసుకుపోయి, పూరీ సింహద్వారమందు స్థాపించి యున్నారు. అరునుడు సూర్యుని రథసారథి. చేతులు జోదించి దేవుని ధ్యానిస్తునాట్లు ఉంది. ఈ క్షేత్రానినే ఉల్లేఖిస్తూ శివాజీ ఏకామ్రకాననంలో భువనేశ్వరం "ఉత్కళ దేశం దేవతల ప్రియనికేతన" అని శంఖు పూరించాడు.
ఇక్కడగల రామచండీమందిరమును కోణార్కు అధిషాత్రిదేవీ మందిరము. దీనినే కొందరు బుద్ధుని తల్లియగు మాయాదేవీమందిరము అంటారు. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయమునకు దగ్గరగా ఉన్నా లియాఖియా అనుగ్రామమందు ఉంది.కళాపహడు కోణాల్కముపై దండెత్తి వచ్చినప్పుడు రామచండిమందిరాన్ని ధ్వసం చేయతలచాడు. ఆదుస్థుతిలో దేవీ నీళ్ళుతెచ్చేనేపాన చంకలో బిందె పెట్టుకొని లియఖియాకు పోయింది. కళాపహాడ్ తుదకు నిరుత్సాహుడై దేవిని అన్వేషించుటకు పోయినాడు. లియఖియాలో దేవి తేలి ఉండటం చూసి ఎంతో పిలిచాడు, కాని లాభము లేకపోయింది. తుదకు కళపహాడ్ సిగ్గుపడి ఆమందిరమ్మీద ఇట్లు వ్రాసాడు.
భోలా రామొచొండి, భోలారె
కోళాపహోడుకు దువారె బోసాయి
భోలాపాణి పాంయి గొలారె.
అంటె రామచండి దుడుకుతనంతో తన్ను ద్వారంలో కూర్చుండబెట్టి నీళ్ళకోసం నదికిపోయి తిరిగి రాలేదని విసుగుపడి ఈపద్యం రాసాడు.
ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడవలసినదవి. ఈగ్రహాలు మనుష్యాకారంలో ఝేఏవాఖాలాళూ చిమ్మేటట్లు మెరుస్తున్నాయి. తలలపై ముకుటం, పద్మాసనం వేసినట్లు చక్కబడినవి. ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్తలో శిథిల పడినవి. ఈ మూర్తులన్నిటింకీ ముఖ్యమంది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జెందెం, వాటిలో మువ్వలు, కటిప్రదేశంలో మేఖల, దానికింద గ్రంథిమాల- ఆ ఘటన మనోభావభంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిమనుకూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు. ఈ పుణ్య క్షేత్రంలో మాఘ సప్తమినాడు గొప్పయాత్ర జరుగుతుంది. ఇంకా కొన్ని యాత్రలు పూర్వం వైభవంగా జరిగేవి. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రథయాత్ర, చంద్రభాగాయాత్ర.
మతభేదము
ముఖ్యమైన విషయమేమనగా- ఈకోణార్కము బౌద్ధావశేషమా, కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రుకులు తర్కించి తర్కించి ఎన్నో గ్రంథాలు వ్రాసారు. ఈచోటనే హ్యూయంసాంగ్ యొక్క చెలితోలా లేకా చిత్రోత్పలా అనే బౌద్ధమత కేంద్రమొకటి ఉండేది. బౌద్ధయుంగంలో కళింగ రాజధాని దంతపురము ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులూ, బౌద్ధులూ గొప్ప స్నేహ భావంతో కలసిమెలసి ఉండెవారని హ్యూయంసాంగ్ చెప్పుతాడు. కోణార్కుకి మైత్రేయవనమని పద్మపురాణంలో వ్రాసివున్నది. బుద్ధదేవుని మారుపేరు మైత్రేయుడని, పాళీ భాషలో మైత్రేయుడని ఆక్షేత్రానికి అందుకోసమే మైత్రేయవనమని పేరువచ్చిందటారు. కోణార్కములో అర్కవటము (జిల్లేడు చెట్టు) ఉండేది. దానిక్రింద వటేశ్వరుడు కూడా నేటివరకు పూజింపబడుచున్నాడు. కపిలసంహితను బట్టి ఆచెట్టు క్రింద సూర్యభగవానుడె జపించాడని ప్రమాణం ఉంది. ఆస్థలాన్ని కొందరు బుద్ధిని బోధిద్రుమముండే దంటారు. ఆచెట్టు క్రిందనే బుద్ధదేవుడు 49 రోజులు తప్పస్సు చేసేడంటారు. కొందరు అమరకోశం బట్టి బుద్ధుని మారుపేరు అర్కబధువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోణార్కమైదని అంటారు. నరసింహదేవుని తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోణా కోణా లేదా కోణాకమనము అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమనీ అంటారు. కోణార్కుకు అర్ధమేమంటే కోణ + అర్క = కోణార్క . పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కమునకు బౌద్ధులకు సంబంధమును ఉంది.
నిర్మాణకౌశలము
కోణార్కు నిర్మాణానికి రెండు రకాల గాథలు ఇమకా ఒరిసాలో వాడుకలో ఉన్నాయి. ఒకటి లాంగులా నరసింహదేవుమంత్రి శివాయిసాంత్రా- రామచందీ పరమాన్నాం కథ. ఈకథ మాదలా పంచాంగంలో ఉంది.రెండోది చాలా చమత్కారమైంది. 1200లమంది శిల్పులు 16 సంవత్సరాల కాలంలో ఈ దేవాలయం కట్టిరని, అందులో ఒక ప్రధాన శిల్పి ఈ మందిర నిర్మాణంకోసం ఇంట్లో గర్భవతియగు భార్యను విడిచిపెట్టి కోణార్కమునకు పోయాడు. కొన్ని రోజులయ్యాక ఆశిల్పికి ఒక కురావాడు జన్మించాడు.ఆకుర్రవాడొకరోజు తోడిబాలురతో ఆడుకొనుచున్నాప్పుడు కుర్రవాళ్ళు తా తండ్రిలేని పిల్లడని అతనిని హేళన చేశారు. దానితో వాడు చాలా సిగ్గు పడి కోపంతో తల్లివద్దకు పోయి, తన తండ్రి ఎవరో చెప్పమని నిర్భందిచాడు. తండ్రి కోణార్కు మందిర నిర్మాణంలో పనిచేస్తున్నాడని చెప్పి తల్లి కొడుకుచేతుల్లో పోలి కోశం రేగిపళ్ళు పెట్టి పంపించింది.కుర్రవాడు తండ్రిని వెదుకుతూ కోణార్కమునకు చేరాడు. అప్పటిసరికి 1200 శిల్పులు మందిరమంతా నిర్మించి పూర్తిచేయలేకపోయారు. శిల్పులంతా నిరుత్సాహులై రాజావారి కఠినశాసనంకోసం భయబడ్డారు. ఆరాత్రి అందరూ పడుకున్న సమయం చూసి, శిల్పి బాలుడు స్వయంగా ఆమందిరము యొక్క ధ్వజాన్ని కట్టి పూర్తిచేశాడు. తెల్లవారాక శిల్పులు సంపూర్ణమందిరాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కాని తమ్మందరినీ రాజు చేతకాని వాళ్ళని దూషిస్తాడని, ఆకుర్రవాని తండ్రికిలా ఆజ్ఞాపించారు. "బొరొళొహొ బొడెయిరె దాయీ కీ ఎకా పువొరొ దాయీ". అనగా 1200 శిల్పులు పూచీయు లేక ఒక్క కొడుకు పూచీయా" అప్పుడు తండ్రి చాలా విషయావస్థలో పడి ఏమీ జవాబు చెప్పలేక, కుమారుడను ఆమందిర శిఖిరానికి తీసుకుపోయి అక్కడనుండి క్రిందకు జారవిడిచాడు.
పతనము
కోణర్కపతనము! పతనమంటే గుండె జలదరిస్తుంది. ఆ నిర్మాణకౌశలము, ఆశోభ, ఆకారు కలాపము అదంతా ఎక్కడికి పోయింది? ఆ మొగసాల, ఆ భూషణాదులు, ఆ మందిరాలు ఏవీ? ఇంకా ఉన్నాయి భగ్న దశలో వికృతాకారాన్ని చూపిస్తూ. ఎన్ని గాలి తుపానులో! ఎన్ని భూకంపాలో! ఎన్ని పిడుగులో! దయా దాక్షిణ్యంలేక భారతీయ విజయ స్తంభాన్ని విరుగగొట్టింది. ఇంకా తనివితీరక పరదేశీయులు ఈ గౌరవ స్తంభాన్ని విరుగగొట్టారు. కర్కోటకుడగు కళాపహాడు కూడా వికలాంగు పరిచాడు. మరికొంత మంది మహమ్మదీయ నావికులు కుత్సిత బుద్ధి వినియోగించి ఉత్కలకళామణిని కనుమరుగు పరిచారు. ఇచ్చోటనే భక్త కబీరుదాసు పవిత్రసమాధి ఉమదని మరిచిరి. కాలం కడుపు నిండింది. కోణార్క పతనం పూర్తి చెందిది. హిందూదేవదేవీల దివ్య మందిరము, జాతీయ కాంతి సౌధము పోర్చుగీసుల ఆశ్రయ స్థలము నేడు ముక్కలు ముక్కలై మొండిబ్రతుకింకా బ్రతికే ఉంది. అంతే చాలు. మనకు ఆ జీర్ణ విజయ చిహ్నమే చాలు. ఆ గ్రుడ్డి దీపమే వెలుగు.
ఈ సూర్యదేవాలయములో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి.
ఆలయం రథాకారము కలిగి ఉంటుంది.
ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటుంది.దేవాలయముపైన పద్మము మరియు కలశము ఆకర్షణీయముగా చెక్కబడి ఉన్నాయి.సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.
సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు.
ఓం శ్రీ సూర్య దేవాయ నమః

Friday, 15 June 2018

స్త్రీలకు చక్కటి భర్త లబించుటకు రంభా తృతీయ వ్రాత విధానం

స్త్రీలకు చక్కటి భర్త లబించుటకు  రంభా తృతీయ వ్రాత విధానం :


హిందువుల పంచాంగంలో చైత్ర, వైశాఖాల తర్వాత వచ్చే జ్యేష్ఠం మూడవది. ప్రతి నెలకి దానిదైన ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్ఠంలో ముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకించి జ్యేష్ఠ శుధ్ధ తదియ’. దీనిని పంచాంగ కర్తలు రంభా తృతీయ’ , ‘రంభా వ్రతంఅని అంటుంటారు. స్మృతి కౌస్తుభం, పురుషార్థ చింతామణి మొదలైన గ్రంథాలలో దీని ప్రస్తావనను రంభా తృతీయ అని కనుపిస్తుంది. చాలామందికి అసలు ఈ రంభా వ్రతం అంటే తెలియదు. ఎలా చేస్తారు? ఎం దుకు చేస్తారు? అన్నది ధర్మ సందేహమే! పాఠకులలో చాలామందికి పెద్ద పెద్ద పండుగల గురించి తెలిసినట్టుగా ఈ రంభా వ్రతం గురించి అసలు తెలియకపోవచ్చు. చాలా తక్కువమందికే పరిచితమైన రంభా వ్రతం గురించి... స్త్రీ తన జీవితంలో వివాహ యోగానికీ .. సౌభాగ్యానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. వాటి కోసమే ఎన్నో పూజలు చేస్తుంది ... పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక గ్రంధాల ఆధారంగా నోములు .. వ్రతాలను ఆచరిస్తుంది. సాధారణంగా ఈ వ్రతాలలో ఎక్కువగా పార్వతీదేవి ఆరాధనతో .. అనుగ్రహంతో ముడిపడినవిగా కనిపిస్తాయి. అలాంటిది సాక్షాత్తు పార్వతీదేవియే చేసిన వ్రతంగా 'రంభావ్రతం' చెప్పబడుతోంది.


రంభావ్రతం అంటే .. అరటిచెట్టు రూపంలో వున్న సావిత్రీదేవిని పూజించడం. జ్యేష్టమాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం కాగా, జ్యేష్ట శుద్ధ తదియ రోజున సావిత్రీదేవి పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అందువలన ఈ రోజున ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ వుంటారు. అరటి చెట్టుకింద సావిత్రీదేవిని పూజించి .. దంపతులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వవలసి వుంటుంది.
పార్వతీదేవి .. పరమశివుడి మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకుంది. ఆయనని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తన మనసులోని కోరిక నెరవేరడానికి మార్గమేవిటో సెలవీయవలసిందిగా ఆమె భ్రుగుమహర్షిని కోరుతుంది. రంభావ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆయన సెలవీయడంతో, అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించి, స్వామివారిని భర్తగా పొందింది. అందువలన యువతులు ఈ వ్రతాన్ని అంకితభావంతో ఆచరించడం వలన వివాహయోగం కలగడమే కాకుండా .. కలకాలం సౌభాగ్యంతో సంతోషమయ జీవితాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేయబడుతోంది.

ఈ వ్రతానికి సంబంధించిన కథ ఈ విధంగా ఉంది. తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి ఉపచారాలు చేయడానికి పార్వతి తండ్రి హిమవంతుడు తన కుమార్తెను నియమించాడు. ఆమెపైన శివునికి ప్రేమ కలిగించాలని ఆ సమయంలో మన్మధుడు తన మన్మధ బాణాలను సరాసరి శివునిపైనే ప్రయోగించటం చేత రుద్రునికి మనసు చెదిరింది. కోపం వచ్చిన రుద్రుడు ఆగ్రహం పట్టలేక తన మూడవ కన్ను తెరచి మన్మధుని చూచా డు. మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పార్వతీదేవి చిన్న బుచ్చుకుని ఇంటికి రాగా ఆమెను తల్లి ఎదురెళ్లి కౌగలించుకుంది. కన్నీరు కార్చిన గిరిజని ఆమె తల్లి తన భర్త దగ్గరకి తీసుకెళ్లింది. అక్కడ హిమవంతుడు సప్త మహామునులతో కూర్చుని సంభాషిస్తున్నాడు. వారికి ఆయన తన కుమార్తె మనోరథం గురించి చెప్పగా.. అందులో ఒకరైన భృగువు, ‘అమ్మాయి! ఒక వ్రతం ఉంది. అది నువ్వు చక్కగా ఆచరిస్తే ఆ పరమశివుడు నీకు భర్త అవుతాడు!’ అని చెప్పాడు. అందుకు సంతోషించిన పార్వతీదేవి అటులనే మహా మునీ దయతో ఆ వ్రతం ఎట్లా చేయాలో తెలుపవలెనని వినయంగా అడిగింది.
దానికా ముని సంతోషించి, ‘బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు రంభావ్రతం అని అంటారు. అసలు ‘రంభ’ అనగా ‘అరటి చెట్టు’ అని అర్థం. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియనాడు చేస్తారు. ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కనుక అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలని చెప్పాడు.
దానికి పార్వతీదేవి ‘మహాశయా! సావిత్రీదేవి ఎలా అరటి చెట్టుకు అధిష్ఠాన దేవత అయింద’ ని ప్రశ్నించింది. దానికి భృగువు ‘సావిత్రి, గాయత్రి ఇద్దరూ బ్రహ్మదేవునికి భార్యలు. తన సౌందర్యం చూసుకుని గర్వంతో సావిత్రి తాను బ్రహ్మదేవుని వద్దకు వెళ్లటం మానుకుంది. గాయత్రిదేవి ఆమెకు చాలాసార్లు చెప్పి చూసింది. అయినా సావిత్రి వెళ్లలేదు. దానితో తీవ్రంగా కోపించిన బ్రహ్మ మానవలోకంలో బీజంలేని చెట్టుగా పుట్టు.. ఈ లోకం వదిలిపో అని సావిత్రిని శపించాడు.
అంతట తన తప్పు అర్థం అయ్యి పశ్చాత్తాపం చెందిన సావిత్ర ‘బ్రహ్మ కాళ్ళ మీద పడి తనని మన్నించ’ మని ప్రార్ధించింది.కానీ బ్రహ్మకు ఆమె పై దయ కలుగలేదు. ఇక గత్యంతరంలేని సావిత్రి భూలోకానికి వెళ్లి, అరటి చెట్టుగా పుట్టింది. అక్కడ ఆమె ఐదు సంవత్సరాలు బ్రహ్మ గురిం చి తపస్సు చేసింది. అంతట బ్రహ్మ మనస్సు అప్పటికి కరిగింది. అంత ట బ్రహ్మ సావిత్రి ముందు ప్రత్యక్షమైనాడు. ఆనాడు జ్యేష్ఠ శుద్ధ తదియ. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకొని ఉండు, అలా అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు తీరుతాయి’ అని చెప్పి ‘ఇక నువ్వు నాతో మన సత్యలోకానికి రావచ్చు’ అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు. అలా సావిత్రికి శాపవిమోచనం అయిన రోజు కనుక ‘జ్యేష్ఠ శుద్ధ తదియ’ ఒక పండుగగా, పర్వదినంగా అయ్యింది.
అంతట గిరిపుత్రిక ‘స్వామీ! అయితే ఈ వ్రతం సంపూర్ణంగా చేసే నియమాలు దయతో శలవియ్యండి’ అని కోరింది.
‘బిడ్డా! పంచవన్నెల ముగ్గులు వేసిన అరటి చెట్టు కింద ముందు మంట పం వేయవలెను. దానిని రుచికరమైన పదార్ధాలతో నివేదన పెట్టాలి. ఆ అరటి చెట్ల నీడలోనే పద్మాసనం వేసుకుని సాయంకాలం దాకా కూర్చు ని సావిత్ర స్తోత్రము చేస్తూ ఉండాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి. పద్మాసనంలో కూర్చుని పగలు సావిత్రి దేవి స్తోత్రం చేస్తూ రాత్రి అరటి చెట్టు కింద విశ్రమించాలి. ఇలా నెలరోజులు చేసిన తర్వాత ఆ రుచికరమైన పదార్ధాలతో నివేదించిన మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి’ అని చెప్పాడు. ఈ వ్రతాన్ని లోపాముద్ర చేసి భర్తను పొందిందని చెప్పాడు.
అంత పార్వతీదేవి ఆ విధంగానే రంభావ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్ష కు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది ఆ రంభా వ్రత గాథ.
‘కృత్య సారసముచ్చయం’ అను గ్రంథంలో పంచాగ్న సాధన చేయాలి, పద్మాసనం వేసుకుని కూచుని తపస్సు చేయాలి’ అని ఉంది. అసలు పం చాగ్ని సాధన అంటేనే ‘నాలుగు వైపులా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యునివైపు కంటి రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం..’ ఇది చాలా చాలా కఠోర దీక్ష. అలాంటి దీక్షను నియమ నిష్ఠలతో చేయాలి. ఇందులో అరటి చెట్ల ప్రత్యేకతలను గమనిస్తే ఆ నీడను జ్యేష్ఠ శుద్ధ తది య మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకూ దాదాపు నెలరోజు నివసించ డం అనేది చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. ఈ వ్రతం ప్రత్యేకంగా స్ర్తీలకని చెప్పశ్హనవసరం లేదు. వేసవి సమయంలో పగటి పూట అరటి చెట్టు నీడ దాహాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. చలచల్లగా ఉంటుంది.
ఈ రంభా వ్రతం కాక అరటిచెట్టు సంబంధమైనది కదళీ వ్రతం అని మరొక వ్రతం కూడా ఉంది. అది భారతీయులే చేస్తారు. ఆ వ్రతం చేస్తే స్ర్తీలు సౌభాగ్యవతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి. రాజ్య వ్రతం, త్రి విక్రమ తృతీయా వ్రతం మొదలైన ఇతర వ్రతాలు కూడా నేడు చేస్తారని ఉన్నది. కాని అన్నింటిలోకి రంభావ్రతం కొంతవరకూ ఆచరణలో ఉన్నట్టు కనుపిస్తోంది.