Monday 25 June 2018

త్రయంబకేశ్వరాలయము

త్రయంబకేశ్వరాలయము:---
త్రయంబకేశ్వరాలయము, గురించి మరికొంత సమాచారం. ప్రతి శివాలయమునoదు, లింగమునకు ఎదురుగా నoదీశ్వరుడుoట సర్వ సాధారణము. కాని ఇక్కడ లింగమునకు ఎదురుగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఆలయమునందు నందీశ్వరుడు ఉండుట చెప్పుకోదగ్గ విషయము.
కొందరి అభిప్రాయము ఏమనగా, శివుడు సర్వదా ధ్యానమునందు వుంటారు. నంది ఎదురుగా వుండి, తన ముక్కు పుటాలు ఈశ్వరుడు వైపుగా పెట్టుకొని వుంటారు. ఏలన నందివారు, -విడిచి – పీల్చు శ్వాశ, అనగా ఉచ్వాశ నిచ్వాశలు, (సోహం – అసోహం అని కూడా అంటారు) ధ్యానములో నున్న శివునకు ఊయలలాగా పనిచేస్తుoధట. గాలి పిల్చినపుడు-- ముందుకు, విడిచినపుడు-- వెనుకకు, ఊయలలో ఊగినట్లుగా నిరంతరము ధ్యానములో ఊగుతుoటారట. కాని దర్సనార్థము మనము వెళ్ళినపుడు, ఆయనతో మన విన్నపాలు చేసికొనుటకు, ఆయనను మనము ధ్యాన భంగము కావిoచవలె. అందువలన మనము ఆయన కోపానికి గురికావలసి వస్తుంది. అందుకని, ఊయలను క్షణము పాటు ఆపు ప్రయత్నమే, నంది గారి తోక భాగమున ఒక చేతితో స్వల్పముగా, క్రిందికి నొక్కి, ఎక్కడ ఎక్కువగా నొక్కిన శివ ధ్యాన భoగము అగునో అన్న భయముతో, వెంటనే ఇంకొక చేతితో కొమ్ములపైన చేయి వేసి, క్రిందికి నొక్కుతాము. అ ఒక్క క్షణము మాత్రము ఉయాల ఆగినపుడు, మహేశ్వరుడు ధ్యానము నుండి బయటకు వచ్చి, మనలను చూచి, మన విన్నపములు విoదురట.
గోదావరి అక్కడ పుట్టుటకు కుడా ఒక చరిత్ర వున్నది. పూర్వము ఆక్షేత్రమందు, తాపసులు, మునులు, మహర్షులు వారి వారి సతీమణుల తో పాటు వుండేవారట. ఒక మారు అక్కడ క్షామము ఏర్పడినధట, నీటికి చాలా కొరత ఎర్పడినదట. ఆ దుర్బర పరిస్థితిని గాంచిన గౌతమ మహర్షి, తన తపోమహిమచే ఒక సరస్సును సృష్టించినారట. అదిగాంచిన, అహల్యేతరులు, ఈర్శ్యతో, తమకు కూడా అటువంటి పేరు రావాలని, తమ తమ పతులతో, వారిని కూడా ఏదైనా చేయమని అర్తిoచినారట. పతుల పోరు భరించలేక, మునులు వినాయకుడి గురించి తపమాచరింప, గణేషుడు ప్రత్యక్షమై ఏమి కావాలని కోరగా, మాయ పూనిన మునులు, గౌతముడి ఆవును చనిపోవువిధముగా వరము ఇవ్వమని అర్థించినారట. ఆది పాపమని ఎంత చెప్పినా వినని మునుల పట్టుదలను ఆలకించిన వినాయకుడు, అట్లే నని వరమునోసoగినారట.
ఒకనాడు ఆకలి గొన్న ఆవు, పొలములో మేత మేయుచున్న దానిని కుశముతో అదలింప, దానికి గాయము కలిగి తదుపరి మరణిoచినదట. అంత ఆ మునులు, గౌతముడి తో ఆవు మరణము గోహత్యా పాతకమని, ఆపాపము నివారించుకోవాలని, సూచిoచి నారు. అంత, గౌతముండు శివుని గురించి కఠోరమైన, తపమాచరిoప, ఆయన, బ్రహ్మ,విష్ణు, ఆదిపరాశక్తి తో,కూడి ప్రత్యక్షము కాగా, గౌతముడు ఆయనతో గంగను ప్రవహింప చేసి గోహత్య పాతకమును ప్రక్షాళణము గావిoపుమని ప్రార్తించినారట. అంత ఆయన తన తలలో నున్న ఒక సిగను తీసి వేయగా, ఆది వెళ్లి బ్రహ్మ గిరి పై పడినధట. అంత, అచట గంగ ప్రవహిoచినదట. ఆనదికి గౌతమీ నదిగా పేరు వచ్చింది. అదియే ప్రస్తుత గోదావరి నది.
ఈవిధముగా ముమ్మూర్తులు అచట ప్రత్యక్షము అయినందున, వారు ముగ్గురు ఆచటి లింగము పానవట్టమున, మూడు తలలుగా, త్రయంభకముగా వెలసినట్లుగా కూడా చెపుతారు. ఈ ఆలయ ప్రాంగణమున అనేకముకములగు చిన్న చిన్న లింగాలు, ఆలయములు కలవు. ఈ దేవాలయములో పూర్వకాలమునకే స్వర్ణ కళశములు స్తాపించినారట. ఆకాలమునకే ఆకళశములకు అయిన ఖర్చు పదహారు లక్షల రూపాయలట.
పాండవులు నిర్మించిన కోనేరు: గర్భ గుడిలో కల శివలింగమునుండి నిరంతరము నీరు ప్రవహించి, కోనేటిలోనికి వచ్చి ప్రక్కన కల “కుశావర్తనo” అనే సరోవరమును చేరుతూoటుoది. కుశ అనగా దర్భ అని, వర్తo అనగా తీర్థం అని అర్థము. ఇచట 12 సoవత్సరములకు ఒకమారు “ సింహస్త కుంభ మేళ” జరుపుతారు. అనగా, రవి, చంద్ర, గురువు ముగ్గురు కూడ ఓకేసారి సింహ రాశిలో ప్రవేసించినపుడు ఇక్కడ మేళా జరుగును. ఆ మెళాకు హిమాలయలయముల నుండి ఋషులు, మునులు అఘోరాలు వచ్చి స్నానము ఆచరిoచెరదట. ఈ త్రయంబకం జ్యోతిర్లింగాలలో చాలా ముఖ్యమైనధట.
“త్రయంబకం యజామహే!
సుగంధిం పుష్టి వర్ధనం!
ఉర్వారుకమివ బంధనాత్
మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్”
అనగా సుగంధం వెదజల్లువాడును, అందరికి ఆహారం ఇచ్చి పోషించువాడును, త్రినేత్రుడు అయిన శ్రీ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. యే విధంగా అయితే దోసపండు. కాడ నుండి విడి వడిపోబడుతుందో –మనము మరణం యొక్క పట్టు నుండి విడి వడధాo గాక! అనగా ఆత్మ స్థితి నుండి విడివడక ఉందుముగాక. ఓం శాంతి ....ఓం శాంతి.....ఓం శాంతిహి!

No comments:

Post a Comment