Friday, 29 June 2018

స్తంభేశ్వర్ మహాదేవుడి ఆలయం,

స్తంభేశ్వర్ మహాదేవుడి ఆలయం,
రోజులో 2మార్లు అదృశ్యమై మరల దర్శనముప్రసాదించే రహస్యమయమైన ఆలయం గురించి తెలుసుకొందామా!
స్తంభేశ్వర్ మహాదేవుడి ఆలయం,
కావి కంభోయ్ గ్రామం, జంభుసర్
గుజరాత్.Image may contain: sky, ocean, outdoor and nature
అరేబియా మహా సముద్రపు, కాంబే ఒడ్డున ఉన్న ఈఆలయం అత్యంత విశిష్టతను సంతరించుకొన్నది.
క్షేత్రమహిమ: పూర్వం శివభక్తుడైన తారకాసురుడనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి, శివుడిని మెప్పించి కేవలం ఆరురోజుల ఆయుష్షు కలిగిన వాడు, ఆరుముఖములు కలిగినవాడు, నీపుత్రుడైన వాడితోనే తన సంహారం జరగాలి తప్ప ఇతరుల చేతిలో మృత్యువాత పడగూడదని వరాన్ని పొందాడు. వరగర్వంతో ముల్లోకాలను జయించి లోకాన్ని పీడిస్తూ ఉండగా, దేవతలు వాడి పీడనుండి విముక్తులను చేయమని మహాదేవుని కోరారు. ఆవిధంగా లోకరక్షణార్థమై షణ్ముఖుడైన కార్తికేయుని జననం జరిగింది. భగవానుడైన షణ్ముఖుని చేతిలో ఆ తారకాసురుడు సంహరించబడ్డాడు. లోకరక్షణార్థం తారకాసురుడిని సంహరించినా, వాడు మహాశివభక్తుడిని తెలుసుకొన్న సుబ్రహ్మణ్యుడు శివభక్తుని చంపినందులకు ప్రాయశ్చిత్తార్థమై చింతిస్తూ ఉండగా, విష్ణుమూర్తి ఆదేశానుసారము వాడిని సంహరించిన ప్రదేశములోనే శివలింగ ప్రతిష్ట చేసినట్లయితే నీ చింత తొలగిపోతుందని సలహా ఇవ్వగా, ఈవిశాఖుడు (సుబ్రహ్మణ్యుడు) ప్రతిష్టించిన శివలింగమే ఈ స్తంభేశ్వర మహాదేవుడి శివలింగం. సముద్రమధ్యలో ఉన్న ఈఆలయాన్ని దర్శించడానికి దేశవిదేశాలనుండి అనేకమంది భక్తులు ఇక్కడకు విచ్చేస్తూ ఉంటారు. ఉదయము సాయంత్రము రెండు సార్లు స్తంభేశ్వరుణ్ణి అభిషేకించడానికి సముద్రుడు ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ఒకరోజు మొత్తం కేటాయించాలి.
స్కాంధపురాణములోను, శివమహాపురాణములోని రుద్ర సంహితలోను మహీసాగర సంగమంలో సుబ్రహ్మణ్యస్వామి చేతులమీదుగా ప్రతిష్టించబడిన ఈస్తంభేశ్వర మహాదేవుడి ఆలయం గురించి చెప్పబడియున్నది.
ఇక్కడి శివలింగం 2 అడుగుల వెడల్పు, 4అడుగులపొడవు ఉన్నది. మహాశివరాత్రి రోజున, ప్రతి అమావాస్యన విశేషంగా ఇక్కడ మేళ జరుగుతుంది. ఈ ఆలయమును ఎఏ తిథిలలో, ఎఏ సమయాలలో దర్శించాలో చూపించే సమయ పట్టికను ఫోటోలో ఇస్తున్నాను.
ఇక్కడికి చేరుకోవడానికి:
రోడ్డు మార్గంద్వారా వడోద్రానుండి 75కా.మీ.దూరంలో ఉన్నది. ప్రైవేట్ కాబ్స్ అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం ద్వారా కావి కంబోయ్ స్టేషన్ ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడకు వెళ్ళినవారు ఎవరైనా మీ అనుభవాలు పంచుకోగలరు.
స్వస్తి.

No comments:

Post a Comment