సంతాన దోషం / సంతానం ఆలస్యం అవటం - నివారణోపాయాలు
*********************************************************************
1). గ్రహ దోష నివారణకు అంటే ఆయా గ్రహాలు చెడిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు జప, తప, హోమాదులు ఆచరించటం వలన ఆ దోష నివారణ జరిగి సంతానం కలుగుతుంది.
2). పితృ దోష నివారణకు నారాయణబలి ఆచరించటం అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకు బ్రాహ్మణునికి పితరుల పేరున భోజనం పెట్టడం వలన ఈ దోష నివారణ జరుగుతుంది.
3). సర్ప దోషానికి సర్పశాంతి చేపించటం అలాగే సర్ప ఆరాధన చేయటం, శివారాధన చేయటం వలన దోష నివారణ జరిగి సంతానం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి క్షేత్ర దర్శనం, ఆరాధన వలన సంతాన దోషములు, సర్పదోషములు తొలగును.
4). హరివంశ పురాణము పారాయణం చేయుట వలన జాతకములోని సంతాన దోష ఫలితాలు నివారింపబడతాయి. పుత్ర సంతానం కోరుకునే వారికి హరివంశ పారాయణం అత్యుత్తమ మార్గము.
5). శుక్రవారం పిండిలో పన్నీరు కలిపి ఆవుకు తినిపించాలి.
6). ఒక సోమవారం రాత్రి రెండు పిడికెళ్ళు ముడి బియ్యం నానబెట్టాలి(భార్య నానబెట్టాలి). తరువాతి రోజు(మంగళవారం) భర్త ఆ నానిన బియ్యాన్ని శుభ్రంగా రోటిలో దంచి దానికి సమాంతరంగా బెల్లం కలిపి (దీనినే చలిమిడి ముద్ద అంటారు) ఆ బ్రహ్మ పదార్ధాన్ని సుబ్రమణ్యేస్వర స్వామి వారి విగ్రహానికి / వెండి పడగకు పూయాలి. తదుపరి ఆ పదార్ధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలి. ఈ విధంగా 21 వారాలు చేస్తే మీ సమస్య తీరుతుంది.
గమనిక :
నారాయణ నాగబలి విధిని ధనిష్ణాపంచకము మరియు త్రిపాద్ నక్షత్రాలలో చెయ్యకూడదని నిర్ణయసింధు అనే జ్యోతిషమహాగ్రంధము తెలియజేయు చున్నది. - ధనిష్ణా పంచకము అనగా 1. ధనిష్ణా నక్షత్రము-3, 4 పాదాలు 2.శతభిషం 8. పూర్వాభాద్రా 4. ఉత్తరాభాద్రా 5, రేవతి. త్రిపాద్ నక్షత్రములు అనగా 8 1. కృత్తిక 2. పునర్వసు 3. ఉత్తర 4. విశాఖ 5, ఉత్తరాషాఢ 6. పూర్వాభాద్ర. ఈ ఆరు నక్షత్రాలను త్రిపాద్(Tripad) అంటారు. 1. పంచమి, ఏకాదశి తిధులలోకానీ, శ్రవణానక్షత్రంలోకానీ, నారాయణ నాగబలివిధిని జరిపించినట్లయితే పితృశాపం తొలగిపోయి సంతానంలేని వారికి తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది. 2. హస్త, ఆశ్లేషా, మృగశిర, ఆరుద్ర, మూల, పుష్యమి, స్వాతి మరియు మూలా నక్షత్రములు నారాయణనాగబలి ప్రక్రియకు శుభప్రదమైన నక్షత్రములుగా గుర్తించాలి. 3. ఆదివారము, సోమవారము, గురువారములు నారాయణ నాగబలికి అనుకూలమైన వారములుగా శాస్త్రములు పేర్కొంటున్నాయి. త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నారాయణనాగబలి జరిపే విధానం : మహారాష్ట్రలోని నాసిక్లో గల త్రయంబకేశ్వరంలో నారాయణసాగబలి మూడురోజులపాటు జరుపబడుతున్నది. ఈ విధానంలో మొదటిరోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్తంలో స్నానంచేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలను ఇచ్చి ఆపై త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రార్థనలుచేస్తారు. ఆ తరువాత అక్కడకు దగ్గరలో ఉన్న ధర్మస్థల అనే ప్రదేశానికివెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యనదులు సంగమించే ప్రదేశంలో నారాయణనాగబలి ప్రక్రియలను చేయించుకుంటారు. కేవలము పితృదోషం, పితృశాపం ఉన్నవారే కాక ఇతరుల ఉసురుపోసుకున్నవాళ్ళుకూడా (తనకన్నా బలహీనుల్ని దౌర్జన్యంతో లొంగదీసుకుని వాళ్ళ ధన, మాన ప్రాణాల్ని దోచుకుని వాళ్ళకి తీవ్రమైన మానసికవేదన కలిగించినపుడు ఆ అశక్తులైన వారి మనోవేదన ఒక శాపం రూపం ధరించి వారిపై దౌర్జన్యంచేసినవారికి తగులుతుంది. దీనినే ఉసురు పోసుకోవటం అంటారు.
ఇలా ఇతరుల ఉసురుపోసుకున్నవారికి ఎంతోచెడు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆ ఉసురు తరతరాలుగా తర్వాతివారినికూడా పీడించే అవకాశం ఉంటుంది. గతంలో ఎంతోమంది రాజులు, జమిందారులు బలహీనుల ఉసురుపోసుకుని సంతాన నష్టం పొందటం భయంకర రోగాలుపాలుకావటం జరిగింది. ఆ తరువాత వారు తమ పాప పరిహారార్ధం ఆలయాలు, సత్రాలు కట్టించటంతోపాటుగాపండితులచేత నారాయణనాగబలి లాంటి తాంత్రిక పరిహారాలనుకూడా చేయించుకుని ఉసురుబాధ తప్పించుకోవటం జరిగింది.) ఈ నారాయణ నాగబలి ప్రక్రియను చేయించుకోవటం జరుగుతుంది. మొదటిరోజున నదిఒడ్డున ఒక ప్రదేశంలో కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత బ్రహ్మ విష్ణ, రుద్ర, యమ అనే దేవతల్ని ఆరాధిస్తారు. ఆ తరువాత పర్నశార్ అనే ప్రక్రియ జరుపబడుతుంది. ఈ ప్రక్రియలో చనిపోయి అశాంతితో తల్లడిల్లుతున్న పూర్వీకుల ఆత్మలను అక్కడకు రప్పించి వారి ఆత్మశాంతికి తగిన పరిహారాలను చేయటం జరుగుతుంది. రెండవరోజున చనిపోయిన వ్యక్తిపట్ల గౌరవాన్ని సూచిస్తూ సూతకం పాటించి కుశావర్తన్లో స్నానంచేస్తారు. మూడవరోజున త్రయంబకేశ్వర ఆలయంలో పూజలుచేసి నారాయణ నాగబలి ప్రక్రియను తమచేత చేయించిన బ్రాహ్మణ పండితులకు తమశక్తి కొద్ది దక్షిణలు సమర్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే నాగబలిలోను, నారాయణ బలిలోను కూడా కృత్రిమంగా బియ్యంపిండితో తయారుచేసిన ఒక మనిషి బొమ్మకుకాని, త్రాచుపాము బొమ్మకుగాని దహన సంస్కారాలు జరిపి ఆ తరువాత వాటికి శ్రార్ధకర్మలు జరపటం జరుగుతుంది. ఈ నారాయణనాగబలి ప్రక్రియ ఒక మంచి నక్షత్రంలోకానీ, తిధిలోకానీ, వారమునకానీ ప్రారంభించబడి, రెండవరోజు మధ్యాహ్నాన్నికి పూర్తిచేయ బడుతుంది.
No comments:
Post a Comment