Monday 25 June 2018

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం ..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం ..
Image may contain: outdoor
అష్టాదశ శక్తీ పీఠాలలో చివరి శక్తిపీఠం శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం. కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న శక్తిపీఠాన్ని సరస్వతీ పీఠంగా చెబుతారు. కాశ్మీర్ లోని స్థానికులు సరస్వతీ దేవిని కీర్ భవాని అని పిలుస్తారు.
కీర్ భవాని ఆలయం శ్రీనగర్ కు పది కి. మీ దూరంలో ఉంది. శ్రీ సరస్వతీ పరమశాంతమూర్తి, శ్రీ హరిప్రియ, నాలుగు చేతులతో వీణా,పుస్తక జపమాల ధరించి అభయ ముద్రతో ప్రకాశిస్తుంది. కాశ్మీర్ ప్రాంతంలో అనేక శక్తీ పీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీ పీఠంగా చెబుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరం. ఇది హరి పర్వతం పై ఉంది. అమ్మ అద్భుతమైన మౌనశీల రూపంలో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతీ పీఠంగా భక్తులు కొలుస్తారు.
ఈ ఆలయ ప్రాముఖ్యత:
సతీదేవి కుడి చెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ అమ్మవారిని శారికాదేవి అమ్మవారుగా స్థానికులు కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు మౌన శిలలో ఒక మూలానగల గుంటలో నీరు ఉద్బవిస్తుంది. ఆ గుంటలో ఎంత నీరు మనము తీసుకుంటే,అంత నీరు మళ్ళీ పుడుతుంది. భక్తులు ఈ నీటిని తీర్థంగా తీసుకుంటారు. ఆషాడమాసంలో శుక్ల నవమితో కూడిన శనివారం నాడు మౌన చక్రం దర్శనం కోసం అనేక మంది భక్తులు వస్తారు. హరిపర్వతం చేరుటకు బస్సు సర్వీసులు ఉన్నాయి .
ప్రకృతి, వైపరీత్యాలకి సరస్వతీ ఆలయం శిధిలమైనదని ఆదిశంకరాచార్యులవారు ఇక్కడ అమ్మవారి శక్తినీ సువర్ణ శారదాదేవి రూపంలో మరియు యంత్రము లో ఆవాహన చేసి కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారు అని పురాణాలు ద్వారా తెలుస్తుంది.
ఇక్కడ చూడవలసిన ఆలయాలు:
జమ్మూకాశ్మీర్ లో జమ్మూ నుంచి 60 కి. మీ. దూరంలో కొండ గుహ ఉంది. ఇదే వైష్ణవీదేవి నెలకొన్న పుణ్యక్షేత్రం. కాశ్మీర్ శ్రీనగర్ లో ఒక్క డాల్ సరస్సు,మరో పక్క ఆకాశాన్ని అంటుతున్న బ్రహ్మాండమైన 1000 అడుగుల ఎత్తుగా ఉండే శంకరాచార్యా పర్వతం,జ్యేష్టేశ్వరాలయం ఇది గొప్ప శివాలయం. పురమండల్ ఇది జమ్మూకి 50 కి.మీ దూరంలోఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గయ క్షేత్రంగా భావింపబడుతుంది. ఇది దేశిక నది తీరంలో ఉంది. ఇక్కడ స్వామి ఉమాపతి. శుద్దమహాదేవ్ శ్రీనగర్ పోవు మార్గంలో జమ్ముకు 16 కి. మీ దూరంలో ఉంది. ఇక్కడ శుద్దమహాదేవ్ కొలువై వున్నారు. ఇంకా అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
ఓం శ్రీ శారదా దేవ్యే నమః

No comments:

Post a Comment