Friday 30 September 2016

దేవి నవరాత్రులలో మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ? శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో    మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ? శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి ఎలా పుజించుకోవాలి ?

శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
పాడ్యమి నాడు శ్రీదేవికి నేయి నైవేద్యమొసగి బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు ఆరోగ్యవంతుడగును
దరించ వలిసిన దుస్తుల రంగు :చిలక పచ్చ రంగు

No comments:

Post a Comment