Friday, 30 September 2016

దేవి నవరాత్రులలో నాల్గొవ రోజు శ్రీ అన్నపూర్ణా అమ్మవారిని ఎలా పూజించాలి

 దేవి నవరాత్రులలో నాల్గొవ రోజు శ్రీ అన్నపూర్ణా  అమ్మవారిని ఎలా పూజించాలి

శ్రీ అన్నపూర్ణా దేవి
దసరా ఉత్సవాలలో మూడోరోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.
పూజా విధానము
పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి
పారాయణ: అన్నపూర్ణ అష్టోత్తరము, స్తోత్రములు
అన్నపూర్ణాష్టకమ్
నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
[నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ]
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచర కరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశ మనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గాద్వార కవాట పాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
ఉర్వీ సర్వజయేశ్వరీ జయాకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
దేవి సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ దశా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
చంద్రా ర్కానల కోటి కోటి సదృశా చంద్రాంశు బింబాధరీ
చంద్రా ర్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశాసాంకుశధరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
క్షత్ర త్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షా క్రందకరీ నిరామయకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.
~ మాతా అన్నపూర్ణేశ్వరీ ~
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి
మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్.
~ సంపూర్ణం ~
చవతినాడు అపూపములు దానము చేసిన వాడికి విఘ్నములు తోలుగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :ఆకాశ నీలం రంగు

No comments:

Post a Comment