Friday 30 September 2016

దేవి నవరాత్రులలో ఏడొవ రోజు శ్రీ సరస్వతీ దేవిని ఎలా పుజించుకోవాలి ?

దేవి నవరాత్రులలో ఏడొవ రోజు  శ్రీ సరస్వతీ దేవిని ఎలా పుజించుకోవాలి ?
Image result for నవరాత్రులు 7 th డే
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది
సప్తమినాడు శ్రీదేవికి గుడ నైవేద్యము చేసి దానము చేసినవాడు శోక రహితుడగును.
దరించ వలిసిన దుస్తుల రంగు :ఆకు పచ్చ రంగు

No comments:

Post a Comment