గృహ ప్రవేశం అనగా ఏమిటి ? గృహప్రవేశం విధి విధానం ?
గృహము నిర్మాణం అయిన తర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ గృహ ప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితు
లకు విందు మొదలైనవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి.
అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విషయం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది.
రిక్త తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమని శాస్త్రం చెబుతోంది. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభకరమైనవి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికి రాదు.
దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి.. గృహ ప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహప్రవేశానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక ఆదివారం, మంగళవారంలో గృహ ప్రవేశం అశుభప్రదమని చెప్పవచ్చు.
చవితి, నవమి, చతుర్దశి తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహ ప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అష్ట దిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తు వరుణ దేవతలకు వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణం ( పసుపు, సున్నము కలిపి వసంతము పోసిన గుమ్మడికాయ ) ఇవ్వాలి. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించాలి. దీనినే గంగపూజ అంటారు. శుభ ముహూర్తాన దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్రధాన గడప దాటవలెను.
అనంతరం పాలు పొంగించి, క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తు పూజకు ముందు వినాయక పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడదు.
గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు :
‘గృహప్రవేశం’ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.
గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం … పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు. కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను … మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి.
గృహము నిర్మాణం అయిన తర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ గృహ ప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితు
లకు విందు మొదలైనవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి.
అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విషయం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది.
రిక్త తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమని శాస్త్రం చెబుతోంది. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభకరమైనవి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికి రాదు.
గృహ ప్రవేశ పూజ సామునులు :
పసుపు = 150 గ్రాములు. కుంకుమ = 250 గ్రాములు.
తమలపాకులు = 2 కట్టలు (పెద్దవి) వక్కలు = 100 గ్రాములు. అరటి పిలకలు = 2 అరటి పండ్లు = 25 అగరవత్తులు = 1 కట్ట (పెద్దది) సాంబ్రాణి = 100
గ్రాములు. నువ్వుల నూనె = 2 కిలోలు ఒత్తుల
కట్ట = 1 (పెద్దది) తెల్ల గుడ్డ బద్దీ ముక్క (కాటన్) = 1/4
మీటరు (అఖండ దీపమునకు) మట్టి మూకుడు (కొత్తది) = 1 వరి ధాన్యము = 1 కిలో విస్తళ్ళు = 12 దేవుళ్ళ పటములు = 5 పూల మాలలు = 20 మూరలు రవికెల గుడ్డలు = 4 (కాటన్ ముక్కలు) (కొత్తవి)
చాకు (కొత్తది) = 1 పూజా బియ్యము = 8 కెజీలు
కుడుములు :
గృహప్రవేశము
అయినాక కుడుముల టిఫిను మూత తీయవలెను. కుడుము ఆవిరి ఇంట్లోకి రావలెను. ముందు
గుమ్మడికాయ మెల్లాలో కొట్టిస్తారు. ఆవును, దూడను, తెచ్చి ఇంట్లోతిప్పి, తీసుకువెళతారు.
గృహప్రవేశము
పీటలమీదకు, ఆకులు 1 కట్ట, వక్కలు 100గ్రా,
ఎండుఖర్జూరము 250గ్రా, పసుపుకొమ్ములు 250గ్రా,
అరటిపండ్లు 12, కొబ్బరికాయలు 2, బియ్యము 4 1/2 కేజి, పీటలమీద తుండు, కట్టుబడి సామాను పెట్టి పూజచేయించెదరు.
పుట్టింటివాళ్ళు
కట్నాలు తీసుకురావాలి. పొంగలి గిన్నె పుట్టింటి వారు ఇవ్వవలెను, ఇత్తడి గిన్నె, గరిట, మూత,
పొంగలి గిన్నె, ఇంటి ఆడవాళ్ళుకాని, ఆడపడుచు కాని పొయ్యి మీద పెట్టవచ్చును. గిన్నెకు పసుపురాసి బొట్టుపెట్టి
పాలుపొంగినాక పొంగలి చేయవలెను. ఆడపిల్లకు బంగారముకాని దక్షిణ కాని ఇవ్వవలెను.
పొంగలిగిన్నె పొయ్యిమీద పెట్టినాక బొట్టు పెట్టి ఇవ్వవలెను. పాతగుడ్డ ఏదైనా,
మసిగుడ్డగా కావలెను. వాస్తుపూజ అయినాక పొంగలి, కుడుములు, అల్లపచెట్ని పెట్టి అందరికి ఇవ్వవలెను.
సత్యనారాయణ వ్రతము చేసి అందరికి భోజనము ఏర్పాటు చేసుకోవలెను. పేపరు ప్లేట్లు,
గ్లాసులు, మంచినీరు ఏర్పాటు చేసుకోవలెను.
జంపకనాలు, కుర్చీలు కావలెను. కొబ్బరికాయ కొట్టటానికి ఒక
గుండ్రాయి ఏర్పాటు చేసుకోవలెను. గుమ్మడికాయకు కళ్యాణం బొట్టు పెట్టవలెను.
ధర్మ సింధు ప్రకారం
ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉంది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేసి బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త
సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహ ద్వారము వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి
దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి
ఊర్ధ్వ పురుషునికి వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో
నింపిన గుమ్మడికాయ బలిహరణము
(ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నము) ఈయవలెను. దీనిని
వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలెను. కలశమున గంగాది తీర్థములను ఆవాహన
చేసి పూజించవలెను. దీనిని "గంగపూజ" అంటారు. శుభ ముహూర్తమున దూడతో ఆవును
ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడికాలు,
ధర్మపత్ని ఎడమకాలు గృహమునందు పెట్టవలెను.
పాలు పొంగించి, క్షీరాన్నమును వండి దానితో వాస్తుపురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు
పొంగించుటకు చేసిన అగ్ని హోత్రమునకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తుపూజకు ముందు గణపతి పూజ చేయవలెను. నవగ్రహ పూజ,
అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణము పెట్టువరకు నూతన గృహమున
ఏమియు వండరాదు.
దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి.. గృహ ప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహప్రవేశానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక ఆదివారం, మంగళవారంలో గృహ ప్రవేశం అశుభప్రదమని చెప్పవచ్చు.
చవితి, నవమి, చతుర్దశి తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహ ప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
గృహప్రవేశం ఎలా..?
నూతన గృహప్రవేశం ఎలా అనే విషయం కూడా ముఖ్యమే. ధర్మ సింధు శాస్త్రం ప్రకారం ఆచరించవలసిన పద్ధతి గమనిస్తే... గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేయాలి. బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయాని కంటే కాస్త ముందుగానే చేరుకోవాలి. గృహ ద్వారం వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారంను పెట్టాలి.అష్ట దిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తు వరుణ దేవతలకు వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణం ( పసుపు, సున్నము కలిపి వసంతము పోసిన గుమ్మడికాయ ) ఇవ్వాలి. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించాలి. దీనినే గంగపూజ అంటారు. శుభ ముహూర్తాన దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్రధాన గడప దాటవలెను.
అనంతరం పాలు పొంగించి, క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తు పూజకు ముందు వినాయక పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడదు.
గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు :
‘గృహప్రవేశం’ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.
గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం … పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు. కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను … మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి.
No comments:
Post a Comment