రధసప్తమి -సూర్యారాధన, స్నానానికే విశేష స్నానాది ప్రాధాన్యత : Saptami Vratham:
మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన డిస నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెపుతున్నాయి మన శాస్త్రాలు.
కాశీ ఖండం శాస్త్ర ఆధారం గా ఏడు జన్మల పాప నాశనం కొరకు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలిట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు,ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.
యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు ! తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ!’
ఏ తజ్జన్న కృతం పాపం యచ్చ జన్నాoత రార్జితమ్ ! మనోవాక్కయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్త సప్తికే ! సప్తవ్యాది సమాయుక్తం హర సప్తమి మే హర !ఏ తన్మoత్ర మాయం జప్వ్తా స్నాత్వా పాదోదకే నరః ! కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మ షో భవేత్
1.ఈ జన్మలో 2,.జన్మాoతరాలలో 3.మనస్సు తో 4. మాటలతో ,5.శరీరంతో ,6.తెలిసీ ,7.తేలిక ..ఇలా అన్ని పాపములు పోవుటకు పై మంత్రం పఠీoస్తు స్నాన కార్యక్రమములు ఆచారించవలెను.
చిక్కుడ కాయలతో రథం.. చిక్కుడు ఆకుల్లో నేవేద్యం :
రథ సప్తమినాడు ఆవు నేతితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలను వెలిగించి పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.
No comments:
Post a Comment